వడయారు కూతురు షిప్పింగ్ కార్పోరేషన్ ప్రారంభిం చకుండా ఏం.వి.అయ్య అడ్డుపడిన విషయం ముఖ్యమంత్రికి తెలుసు. కాని చేపల వెనుక... తనకు తెలియకుండా ఈ పనికూడా.... ముఖ్యమంత్రి తొలి సారిగా మాదల వెంకట్రామయ్యనిఅనుమ్నించాడు. ఏం.వి. అయ్య. అస్టలీస్టేడి టెలిఫోను నంబరు డయల్ చేశాడు.
* * * *
"తంబీ! మన పేపరు చూసిన వాళ్ళంతా బ్రహ్మాండంగా వుందంటున్నారు. రెండువేల కాఫీలే అర్దరిచవెందుకు? దాదాపు పదివేల కాఫీలు అమ్ముడవు టాయి..."పీటర్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది.
ఆ కంపెనీకి అతను చైర్మెన్.
"అవును తంబీ__ బార్లో కూడా ఒకరిద్దరు అదేమాట అన్నారు" వత్తాసు పలికాడు జానీ.
ఆ పేపర్ ప్రింటర్, పబ్లిషర్ అతడే!
"వ్చాలా పొరబడుతున్నారు. రెగ్యులర్ రీడర్స్ ఎవరూ మన పత్రిక కొనరు. అయినా ఒక్కపత్రికకూడా మార్కెట్లో వుండదు."
"..." కోశ్చనుమార్కు ముఖాలుపెట్టారు జానీ, పీటర్.
"ఇప్పటివరకు మన పేపరు గురించి పాఠకులు పట్టించుకునే వారుకాదు. అలాటివారు హఠాత్తుగా ఈ రోజున నీ పేపర్లో ఏ వార్త వచ్చిందని వేదకరు. కాని ఈ పేపర్ని చూడవలసినవారు చూస్తారు. మార్కెట్ లో ఒక్క పేపర్ కూడా లేకుండా వారే కోనేస్తారన్నమాట. రెగ్యులర్ రీడర్స్ మన పత్రిక చూసే అవకాశం లేదు..."
* * * *
తంబి తారుమారు కాలేదు.
ఆ పేపరు మార్కెట్ కి వెళ్ళిందన్న మాటేగాని డని గురించి పట్టించుకున్న పాఠకుడుంటూ లేడు. కానీ ఒక వ్యక్తీ కారులో షాపుషాపుకీ వెళ్ళి పత్రిక కాఫీలన్నీ తీసేసుకున్నారు.
ఆ పత్రిక కాఫీలకోసం రోడ్డునపడ్డాముఖ్యమంత్రి మనుషులకి గాని ఆ పత్రిక కాఫీ అంటూ దొరకలేదు.
* * * *
"తంబి! బజార్లో మన పేపరంటూ లేదు. రెండు మూడు చోట్ల ఎక్వయిరీ చేశాను" లోపలి వస్తూ అన్నాడు.
"నాకా విషయం ముందే తెలుసనీ నీకూ తెలుసు. పేపరు ఇండస్ట్రీ లోపాని చేసే ప్రతివాడూ ఇరవై నలుగు గంటలు ముందుండాలి. రేపటి పేపర్ గురించి డెస్కుదగ్గర వున్నవాడు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది. 'దళిత్ ముస్లిం, మైనారిటీ సురక్షాసంఘ్'అధ్యక్షుడు హాజీ మస్తాన్ ఉత్తర ప్రదేశ్ ప్రవేశంపై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించింది.... ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై హాజీమస్తాన్ కోర్టులో దావావేయడానికి అవకాశం వుంది. అందువల్ల వెంటనే అయన ఇంటర్వ్యూ సాయంత్రం సంచికలో వస్తే బాగుంటుంది. తర్వాత ఒకొక్క దాదా ఇంటర్వ్యూ మన పేపరులోరావాలి. దానివల్ల దాదాల అండ మనకు లభిస్తుంది... పైపెచ్చు ఈ దాదాల గురించి తెలుసు కోవడానికి ప్త్రజలు ఆసక్తి చూపిస్తారు." అని హాజీమస్తాన్ అపాయింట్ మెంట్ తీసుకునే బాధ్యతను జానీకి అప్పగించాడు తంబి.
సరిగ్గా అదే సమయంలో__
హొటల్ థాయ్ లాండ్ రెస్టారెంట్ లో 'ఇండియన్ న్యూస్' అగ్ల దినపత్రిక రిపోర్ట్ రుతో విందు తీసుకుంటోంది కావ్య.
"ఇదంతా రిలయబుల్ ఇన్ ఫర్ మేషనేనా...?" తన ముందున్న ఈ వినింగ్ దై లీ వైపు నుమానంగా చూస్తూ అడిగాడతాడు.
"ష్యూర్....కావలిస్తే పాతిక లక్షల రోపయలు హామీగాఇస్తాను. పోటోలతో సహా ఇన్ ఫర్ మేషన్ ఇచ్చారు. ఈ విషయంలో మీకు ఏదైనా అనుమానం వుంటే ఫలానా పేపరు ఈ విధంగా ఇచ్చింది అని రాయండి. దానివల్ల మీకు రిస్కువుండదు గదా!"
ఆలోచనలో పడ్డాడు మీకు రిపోర్టరు.
"ఈ స్టోరీ కి న్యూస్ వేల్యూలేదని ఆలోచిస్తున్నారా?"
"కాదు...ఒక లోకల్ ఈవినింగ్ డైలీ ఇచ్చిన స్టోరీ ని మేము రీప్రొడ్యూస్ చేస్తే క్రెడిబిలిటీ వుంటుందా...? అని ఆలోచిస్తున్నాను. అంతకు మించి, మిగతా దైలీస్ ఏం చేస్తున్నట్టు?"
"డోంట్ వర్రీ" అంటూ చిన్న కాగితం తీసి అతడి ముందుంచింది.! "ఇది ఆ పేపరు ప్రింట్ ఆర్డరు. ప్రంట్ అయిన పేపర్లన్నిటినీ నేనే కలెక్టు చేశాను. కాంప్లిమెంటరీస్ కూడా టేప్ చేయడానికి ప్రయత్నించి ఫెయిలయ్యాను...పబ్లిక్ మాత్రం ఇంకా ఈ పేపరు చూడలేదు" అన్నది.
"ఈ విషయంలో మీ కింత శ్రద్ధదేనికి? ఆ పేపరు పబ్లిక్ లోకి వెళ్ళకుండా తగుజగ్రాత్త తీసుకుని, నన్ను మా పేపర్లో రాయమనడంలో మీ అంతర్యం?"
"సింపుల్... ఆ పేపరు పబ్లిక్ లోకి వెళితే న్యూస్ స్టీల్ అవుతుంది. రెండువేల సర్క్యులేషన్ గల ఆ పేపరులో పబ్లిష్ అయినందున పర్సాస్ సర్వ కాదు! అందుకే ఆపని చేశాను. ,మూడు లక్షల సర్క్యులేషన్స్ వున్నా మీ పేపర్లో ఈ స్టోరీ రావాలి. ముప్పైలక్షల పాఠకులు ఈ స్టోరీ చదవాలి. అదీ నా యాంబిషన్."
"మీ మీద నమ్మకంతో ఈ ఎస్సైస్ మెంట్ టేకప్ చేస్తున్నాను"
"థాంక్యూ..."
* * * *
మార్కెట్ లో ఒక్క పేపరు అయినా దొరక్కపోవడంతో మాదాలవెంకట్రామయ్య ముందుగా మేల్కొన్నాడనుకున్నాడు ముఖ్యమంత్రి.
అదే విషయం అడుగుదామని ఫోనుచేశాడుగాని ఏం.వి.అయ్య దొరకలేదు. ముంచుకోస్తున్నప్రమాదాన్ని అతడు పసిగట్టలేదు...! ఆ విషయాన్ని ఏ మాత్రం గ్రహించినా ఒక్క టెలిఫోను తో ఆ వార్తను ఆపు చేయించేవాడు... కావ్య ప్రయత్నమంతా బూదిడిలో పోసిన పన్నీరయ్యేది.
* * * *


