ఇద్దరు అమ్మాయిల్నీ మానసికంగా మరింత అంతర్మధనానికి గురి చేసి తన ప్రయాణంలో మరో అడుగు ముందుకేశాడు రుత్వి ఇక్కడే.
* * * *
"ప్లీజ్ డాళింగ్... ఇంకా ఎంత సేపు?"
అప్పటికే అర్దనగ్నంగా మార్గరెట్ స్వరం చిన్న రాపిడికే అంటుకునే భాస్వరంలా వుంది.
జూబ్లీహిల్స్ సమీపంలోని మాదాపూర్ గెస్ట్ హౌస్ బెడ్ రూంలో మార్గరెట్ కి అభిముఖంగా నిలబడ్డ గౌరీనాధం మూడ్ లోకి ఇంకా రాని మహర్షిలా వున్నాడు.
"చెబుతున్నది నీకే"
రాత్రి ఎనిమిది గంటల సమయంలో మార్గరెట్ గొంతులోని ఆర్తి రగులుకుంటున్న కోరికల అగ్నిపర్వతాన్ని గుర్తుచేస్తూ పొట్టేలు ఢీకొన్నా చాలు ఫెటేల్మని ఎగురుతానని చెబుతున్నట్లుగా వుంది.
ఇలా ఇప్పటికే గౌరీనాధం తన గెస్ట్ హౌస్ లో మార్గరెట్ తో అయిదారుసార్లు కలిసాడుగానీ ఈ సారి కాస్త జంకుగా వుంది. ఫోన్ లో మాట్లాడేటప్పుడు విజూష విందన్న భయమో లేక ఈ వయసులో ఎవరన్నా చూస్తే ఎలాగన్న ఆందోళనో క్రేన్స్ సాయం తీసుకున్నా కోర్కె తీరేట్టుగా అనిపించడంలేదు.
"వచ్చిన పది నిముషాలలో అటు ఇటుగా అయినా ఉత్సాహం చూపించేవాడివి.
ఈవేళ నీకేమైంది ఓల్డ్ మేన్" కాస్త చిరాకుని ప్రదర్శించింది మార్గరెట్.
మూడునెలల క్రితం ఓ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో గౌరీనాధాన్ని కలుసుకున్న మార్గరెట్ ముందు అతడెవరన్నది తెలుసుకుంది.
ఓ పెద్ద ఇండస్ట్రియలిస్టుగా ఆయనకున్న ప్రశస్తి తెలుసుకున్నాక అతడితో పరిచయాన్ని పెంచుకుని ప్రతిసారీ అతడు ప్రదర్శించే సెన్సాఫ్ హ్యూమర్ కి మరింత దగ్గరయి ఓ రాత్రి దూరాన్ని పూర్తిగా చెరిపేసుకుంది.
అయితే ఈ రోజు గౌరీనాధంలో ఆ హ్యూమర్ లేదు. ఏదో ఆలోచించడం మాత్రం కాదు.
ఏదీ చించడం చేతకాని చేతుల్లేని వికలాంగుడిలా అనిపిస్తున్నాడు.
ఇక ఆ జాప్యాన్ని తట్టుకోలేనట్టు ఒంటిమీద మిగిలివున్న బ్రానీ, పాంటీనీ వూడదీసి బెడ్ మీదకి విసిరేసింది.
వెల్లకిలా పడుకుని కర్లాన్ బెడ్ పై కిందకీ మీదకీ వూగడం ప్రారంభించింది.
అప్పటికి కాస్త చలనం వచ్చిందేమో గౌరీనాధంగారు అడిగారు.
"ఏంటిదీ?"
"నీకు మూడ్ రప్పించాలన్న తాపత్రయం"
మృదువుగా నవ్వాడు.
నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచి బయట చీకటిలోకి చూస్తూ "ఓడల్లో పనిచేసే నావికుల గురించి నీకు తెలుసుగా మార్గీ" అన్నాడు.
ఉన్నట్టుండి గౌరీనాధం "నావికుల' గురించి టాపిక్ ఎందుకు తెచ్చాడో అర్దంకాక -
"తెలుసు అయితే?" అంది అసహనంగా.
"ఓ రోజు షిప్ వైజాగ్ పోర్టుకి వచ్చాక నావికులంతా వైజాగ్ లోని ఓ సినిమా ధియేటర్ కి వెళ్లారు. పాపం సముద్రం మీద వారాలపాటు ప్రయాణం చేసి వుంటారుగా. "
"విషయమేంటో తొందరగా చెప్పు డాళింగ్" బెడ్ మీదనుంచి లేచింది.
"అక్కడికే వస్తున్నా"
మార్గరెట్ ని క్షణం చూసి చెప్పాడు.
"థియేటర్ లో పిక్చర్ రన్నవుతుంటే ఈ కుర్రసన్నాసులు ఊరుకోవాలిగా. సముద్రం మీద ఓడలా అటూ ఇటూ వూగుతున్నారట సీట్లమీద నుంచి."
విస్మయంగా చూసింది మార్గరెట్.
ఆ నావికుల వెనుక వరుసలో మనలాంటి ఓ జంట కూర్చుని వుంది. ఈ కుర్రాళ్ళు అటూఇటూ ఊగుతుంటే సినిమా సరిగా కనిపించక ఆ జంట చాలా యిబ్బందిపడింది. ఇక భరించలేకపోయాడు ఆ ముసలి మొగుడు. ఓ సైలర్ నెత్తిమీద తట్టి వెనక్కి పిలిచాడు. సైలెంట్ గా సినిమా చూడక ఆ వూగుడేమిటి అన్నాడు. అప్పుడా అబ్బాయి నెలల తరబడి సముద్రంమీద ప్రయాణాలు చేస్తుంటాం కాబట్టి అలా వూగితే తప్ప వుండలేం అన్నాడట. దానికి ఆ ముసలాయన ఏమన్నాడో తెలుసా?
"చెప్పు"
"నలబై ఏళ్లుగా మా ఆవిడతో నేను కాపురం చేస్తున్నాను. మరి నేను ముందుకీ వెనక్కీ వూగుతూ థియేటర్ లో జనాన్ని యిబ్బంది పెడుతున్నానా?" అన్నాడు.
ఫకాల్న నవ్వింది మార్గరెట్.
ఇదే గౌరీనాధంలోని ఈ సెన్సాఫ్ హ్యూమర్ ఆమెకు నచ్చేది. బాగా మాట్లాడే మగాడి స్నేహాన్ని కోరుకునే చాలామంది తనూ ఒక తెగా అనుకోవడానికి ఆమెకు అభ్యంతరం లేదు.
"యూ నాటీ" బెడ్ మీదకు లాక్కుందాయన్ని.
"మొత్తానికి మెంటల్ గా అయినా రిలీఫ్ నిచ్చావు."
"ఇకముందు ఫిజికల్ గా రిలీఫ్ ఇవ్వకూడదనుకుంటున్నా" అన్నాడు సీరియస్ గా.
"అదేం" కంగారుగా చూసింది మార్గరెట్.
"ఈ రోజు నుంచి మందు మగువ లాంటి వాటికి అతీతుడుగా వుండాలనుకుంటున్నాను. ఒక్క అలవాటుకి తప్ప."
మార్గరేట్ చిరుకోపంగా అడిగింది "నువ్వు మానలేని ఆ అలవాటేమిటో?"
"అలా అబద్దం చెప్పటం"
ముందు అర్దం కాలేదు.
అర్దమయిన వెంటనే ఆయన్ని అల్లుకుపోయింది మార్గరెట్ "యూ ఆర్ గ్రేట్ గౌరీ - ఐలవ్యూ అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు వెంటనే అడిగింది "ఓ ప్రశ్న జవాబు చెప్పాలి. మరేంలేదు. ఒకప్పటిహిందీ హాస్యనటుడు ఐ ఎస్ జోహార్ తెలుసుగా?"
"ఇప్పుడు హఠాత్తుగా ఆ పెద్దమనిషి ఎందుకు గుర్తుకొచ్చాడు?"
సశ్య అడిగిన ప్రశ్నగా ఆమె చెప్పలేదు. చెప్పడం ఆమెకు యిష్టం లేదు కూడా. తాను ఒక ఎంప్లాయిగానే మార్గరెట్ ఆయనకి పరిచయం చేసుకుంది తప్ప తానుండేది సశ్యనే ఓ ఎన్నారై అమ్మాయితే అనిగానీ, సశ్య తల్లికి నగరం పొలిమేరల్లో వున్న ద్రాక్షతోటల్ని, రెండు ఫాంహౌసుల్ని చూసే మేనేజర్ ననిగానీ ఎప్పుడూ చెప్పుకోలేదు."