Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 39


    చివరకు వెళ్ళి కూర్చున్నారిద్దరూ. సినిమా మొదలయింది!
    హీరో హీరోయిన్స్ సింగిల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకొంటున్నారు.
    "అబ్బ గట్టిగా నొక్కు" అందామె సూట్ కేస్ మూత అదిమిపెడుతూ.
    "ఎంత నొక్కినా లాభంలేదు."
    "నువ్ మీదెక్కు. నేను గొళ్ళెం వేస్తాను..." అందామె.
    "నువ్వెక్కు నేను వేస్తాను" అన్నాడతను.
    హాలంతా పెద్ద ఎత్తున నవ్వులు_తప్పట్లు_ఈలలు.
    "ముందు నువ్వెక్కు పడుతుందేమో చూద్దాం"
    "ముందు నువ్వెక్కు"
    హఠాత్తుగా అదే సీన్ పాటలోకి మారిపోయింది.
    "ఎక్కుమావా బండెక్కుమావా"
    "ఎక్కనీవే నీబండెక్కనీవే"
    మళ్ళీ అరుపులు, కేకలు.
    ఈసారి డబుల్ మీనింగ్ తోపాటు దానికి తగిన రియాక్షన్ కూడా ప్రారంభమయింది. కామక్రీడల భంగిమలన్నీ వరుసగా చూపిస్తున్నారు ఇద్దరూ.
    శంకర్ చేయి తన నడుముని చుట్టటం అతనివైపు తనను లాక్కోవటం గమనిస్తూనే ఉందామె. కాని అభ్యంతరం చెప్పాలనిపించటంలేదు. అతని వేడి స్పర్శ తనకూ కోరికలు రేకెత్తిస్తూనే వుంది.
    ఎంతకాలం ఈ సముద్రపు అలల్ని ఎదుర్కోవటం?
    "సావిత్రీ?" చెవిలో రహస్యంగా పిలిచాడతను.
    "ఊ" అతనివైపు చూసింది.
    ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి. శరీరం గాలిలో తేలిపోతున్నట్లుంది.
    ముద్దు మరింత గాఢమవుతుండగా స్పృహలోకొచ్చి చటుక్కున వెనుకకు తగ్గింది.
    మొన్న సినిమాహాల్లో అన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది.
    ఎవరయినా తామిద్దరినీ చూస్తున్నారేమో గమనిస్తున్నారేమోనని వెనక్కు తిరిగి చూచింది. వెనుక కూర్చున్న అమ్మాయిలిద్దరూ తమవంకే చూస్తుండేసరికి సిగ్గుతో ప్రాణం పోయినట్లయింది.
    "అయ్యో...ఆ వెనుకవాళ్ళు మనల్ని చూస్తున్నారు తెలుసా?" చిరుకోపంతో అంది.
    "వాళ్ళకి అర్ధమవదులే_ఆ దృశ్యం ముందో, వెనుకమీదో..." నవ్వుతూ అన్నాడతను.
    హీరో, విలనూ ఎదురుపడ్డారు. రిక్షావాళ్ళ భాషలో తిట్టుకోవటం మొదలుపెట్టారు.
    జనం చప్పట్లు...
    హఠాత్తుగా మళ్ళీ సీన్ మారిపోయింది.
    హీరోయినూ, ఆమె తల్లి, అమ్మమ్మా...ముగ్గురూ కలసి పాట పాడుతూ తమ తమ శోభనం నాటి దృశ్యాల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
    హాలంతా ఈలలతో దద్ధరిల్లిపోతోంది.
    "పదండి వెళ్ళిపోదాం__సినిమా అంతా 'బూతు' తప్పితే ఇంకేం కనిపించటం లేదు" అంది సావిత్రి.
    ఇద్దరూ బయటికొచ్చేశారు.
    ఇంటికి చేరుకునేసరికి టెలిగ్రాం తీసుకొచ్చి ఇచ్చాడు బాలకృష్ణ.
    తండ్రికి సీరియస్ గా ఉందిట.
    వెంటనే బయలుదేరడానికి సిద్ధమయిందామె. సూట్ కేస్ తీసుకుని శంకర్ రూమ్ కి చేరుకుంది.
    ఆమెను చూసి ఆశ్చర్యపోయాడతను.
    "ఏమిటి సూట్ కేస్ తో వచ్చారు?"
    "మా ఫాదర్ కి సీరియస్ గా ఉందిట... టెలిగ్రామ్ వచ్చింది..."
    "అయ్యో! అయామ్ వెరీ సారీ__" ఉండండి నేనూ బస్ స్టాండ్ కొస్తాను.
    అప్పటికప్పుడే డ్రస్ మార్చుకుని ఆమెతోపాటు బస్ డిపోకి చేరుకున్నారు.
    బస్ ఒకటి సిద్ధంగా వుంది.
    "పోనీ నన్ను కూడా రమ్మంటారా?"
    కొద్దిక్షణాలు ఆలోచించిందామె. అతను రావాలనే తనకూ ఉందికానీ, అక్కడ తన పరిస్థితి అద్వానంగా ఉంటుందేమో అనిపిస్తోంది.
    "వద్దులెండి! ఈ సమయంలో బావుండదనుకుంటాను."
    "నేనూ అదే అనుకుంటున్నాను..." అన్నాడతను.
    బస్ బయలుదేరింది__
    యింటికి చేరుకునేవరకూ ఆలోచిస్తూనే వుంది తండ్రి గురించి. యింత సడెన్ గా ఎందుకు ముంచుకొచ్చిందో తెలీదు. అతని ఆరోగ్యం చాలా మంచిది. ఏరోజూ మంచం పట్టగా తను చూడలేదు.
    ఇల్లు అంత దూరంలో ఉండగానే అర్ధమయిపోయింది.
    తండ్రి ఇకలేరు తనకు...

                       *    *    *    *

    పదిహేను రోజులు గడిచిపోయాయ్.
    అప్పుడు తెలిసినయ్ సంగతులన్నీ.
    చాలామంది దగ్గర అప్పులు చేసి, పరిస్థితులు విషమించేసరికి ఆత్మహత్య చేసుకున్నారట.
    ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. లేకపోతే పోలీస్ కేస్... పోస్ట్ మార్టమ్... అన్నీ అనవసరమయిన సమస్యలు...
    విషయాలన్నీ శంకర్ కీ, శాంతకీ ఉత్తరం రాసిందామె.
    తన చెల్లెళ్ళిద్దరూ భర్తలతో వచ్చారు. పెద్ద చెల్లెలికి పాప...
    వాళ్ళిద్దరినీ చూస్తుంటే తన మనసు కలిచివేసినట్లయింది. తనూ హాయిగా సంసారం చేసుకుంటూ పిల్లా... పాపలతో...
    "పెళ్ళి చేసుకుంటేనే ఆడదాని జీవితానికి సార్ధకత" అని తననుకోవటం లేదు.

 Previous Page Next Page