Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 39

    ఆమె చెబుతున్నది నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది.
   
    డాక్టర్ విలాస్ కోమలికి భర్త అని నాకు తెలిస్తే ఆమె కారణంగానే అతడలా గయినాడని నేను భావిన్హవచ్చు. లేక ఆమెకు తగిన వాడే భర్తగా లభించాడని అనుకోవచ్చు. నాలో ఈరెండు రకాల భావనలూ తలెత్తడం ఆమె సహించలేదు. ప్రపంచంలో ఎవరు తనను అపార్ధం చేసుకున్నా - రామం ఒక్కడూ తననర్ధం చేసుకోవాలన్నది ఆమె అభిలాష.
   
    నా గురించి కోమలి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. నేనిక్కడ ఉంటున్నట్లూ, కొట్టగా ఇల్లు కట్టుకున్నట్లూ కూడా ఆమెకు తెలుసు. ఆమె ప్రోద్బలం మీదనే డాక్టర్ విలాస్ నావద్దకు వచ్చాడు. మా ఇద్దరికీ వున్నా అనుబంధం గురించి చెప్పకుండా నా గురించిన సమాచారం అతడికి అందించిందామె. ఈ విధంగా నాకు దగ్గరగా ఉంటున్నానన్న తృప్తి ఆమెకు ఉంటుంది. ఆ విధంగా ఆమె అనుకున్నది సాధించింది.
   
    ఆమె నాకు దగ్గరగా ఉండాలనుకున్నండి. మొదట్లో అంతవరకే ఆమె ఆలోచించింది. ఆపైన భర్త కన్ను పద్మినిపై పడడాన్ని ఆమె గ్రహించింది. తన భర్త గురించిన నిజాలు తెలియజెయ్యడం మంచిదనుకుంది. అయితే విలాస్ భార్యగా కాక కోమలిగా నాకామె మొత్తం సమాచారాన్ని అందజేసింది.
   
    కోమలిగానే మళ్ళీ ఆమె నాకోసం ప్రయత్నించి విఫలు రాలయింది. తను చేస్తున్నది తప్పని ఇప్పటికీ ఆమెకు అనిపించడంలేదు, తపన ప్రయత్నాలు మానివేయాలనికూడా ఆమె అనుకోవడంలేదు.
   
    ఇప్పుడామె నాకోసం ఫోన్ చెయాలనిఒ వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి నేనున్నాను ఇంట్లో.
   
    సంకోచిస్తూనే నేనూ ఆమెకు నాకధ చెప్పాను.
   
    "బాప్ రే!" అన్నదామె.
   
    అంటే ఇప్పుడు విలాస్ వేట ప్రారంభించాడన్నా మాట! ఆవేట పద్మిని కోసం.
   
    శ్రీమతి విలాస్నంటూ నిన్నరాత్రి నావద్ద కొచ్చిన ఆమె అతడి భార్య అయుండక పోవచ్చునని నేనెందుకూహించలేక పోయాను? అందులోనూ నాకు విలాస్ కధ పూర్తిగా తెలుసును.
   
    రాజకీయ నాయకులు మోసం చేస్తున్నట్లు ప్రజలకు తెలుసు. ఎన్నికలలో తప్ప వారు తమ ముందుకు రారని వారికి తెలుసు. అయినప్పటికీ రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు కరతాళ ధ్వనులు, ఓట్లు లభిస్తూనే ఉంటాయి.
   
    విలాస్ లో అటువంటి చాతుర్యమున్నదా? లేక పురుషుడికి స్త్రీ ఒక బలహీనత అయుండడం కారణమా?
   
    నీటిలోని చేప మనిషి ఆహారం. దాన్ని గేలంవేసి పట్టడానికి మనిషి దానికి కాస్త ఆహారం ఎరగా చూపిస్తాడు. విలాస్ ఇదే చేస్తున్నాడా?
   
    "బాప్ రే!" అంది మళ్ళీ కోమలి.
   
    "ఏం?" అన్నాను.
   
    "ఎన్నో ఏళ్ళుగా నేను నిన్ను వశపర్చు కోలేకపోతున్నాను. ఆమె ఎవరో గానీ ఒక్క రాత్రిలోనే నీ మనసు లాగేసింది...." అంది కోమలి.
   
    నేను సిగ్గుపడ్డాను. కోమలి ముందు నా బలహీనత ఒప్పుకున్నాను. ఆమెకు నిజం చెప్పకుండా వుండాల్సింది. కానీ ఆమె ముందు నిజం దాచలేకపోవడం నా బలహీనత.
   
    "నాకూ ఆశ్చర్యంగానే వుంది..." అన్నాను.
   
    "నాకు ఆశ్చర్యంగా లేదు" అంది కోమలి.
   
    "ఏం?"
   
    "ఆడది తలుచుకుంటే శ్రీరామచంద్రుడినయినా వశ పర్చుకోగలదు నేను తలచుకోలేదు. నిన్ను వెడుకున్నాను" అంది కోమలి.
   
    "అంటే?"
   
    "నేను నిన్ను రెచ్చగొట్టడానికి ఎక్కువ ప్రయత్నించలేదు-నిన్ను బ్రతిమాలుకున్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను తప్ప కామించడం లేదు"
   
    "నేనొప్పుకోను" అన్నాను-
   
    కోమలి కిసుక్కున నవ్వింది- "నువ్విలాగనడంలో తప్పులేదు. ఎందుకంటే నిజానికి నువ్వు నన్ను ప్రేమించడం లేదు. కామిస్తున్నావు."
   
    ఉలిక్కిపడ్డాను. కోమలి ఏమన్నది? నేను ఆమెను కామిస్తున్నానా? ఇంతకంటే దారుణమైన అబద్దం ఏమైనా వుంటుందా?
   
    "అలా చూస్తావేం-నేనన్న మాట నీకు నచ్చలేదా?" అంది కోమలి- "నీవు నన్ను నిజంగా ప్రేమించి వుంటే-నన్ను తిరస్కరించి వుండేవాడివి కాదు-నీకు నీ ఆశయాలు, నీ ఆదర్శాలు ముఖ్యమనుకున్నావు. నేనడిగితే కామాన్ని వాటి సాయంతో అణగద్రొక్కుకున్నావు"
   
    "అబద్దం!" అన్నాను.
   
    "నీ గుండెమీద చేయి వేసుకొని చెప్పు- మనసులో నీకు నాపైన కోరిక లేదని..." అంది కోమలి. ఆ మాటలను ఆమె నాపై సవాలుగా విసిరింది.
   
    "నాకు అబద్దం చెప్పటం ఇష్టంలేదు. అందుకే సవాలు మీద పైసవాలు విసిరాను- "నీవు నన్ను కమించడం లేదనీ, ప్రేమిస్తున్నాననీ నీ గుండెమీద చేయి వేసుకుని చెప్పు..."
   
    కోమలి ముఖం గంభీరంగా అయిపోయింది. "రామం! నీవు ఆఫ్టరాల్ మగాడివి. నేను ఆడదాన్ని. అందమైన దాన్ని. ఇంకా చెప్పాలంటే శృంగారకళ గురించి ఎన్నో మెళకువలు తెలిసిన ప్రౌఢను నేను. నాకు నీపైన ప్రేమ ఉంది. నిన్ను నాకు దాసుడిగా చేసుకోగల శక్తి నాకు వుంది. ఆ శక్తిని నేనుపయోగించుకోలేదు. నీకై నువ్వే నన్ను వరించాలన్నది నా కోరిక. అదీకాక తాత్కాలిక ఆవేశంతో నీవు నాకు లోబడినా ఆ తర్వాత జీవితాంతం నువ్వు విచారిస్తూ కూర్చుంటావు-నిన్ను ఆ స్థితికి గురి చేయడం ఇష్టం లేదు నాకు. అందుకే నేను నీకు దగ్గరగా వచ్చేబదులు- నీవే నా దగ్గరకు వచ్చేలా ప్రయత్నిస్తున్నాను. ఇంకా నీ నిగ్రహమంటావా-ఆలోచించుకో-ఒక అపరిచిత యువతి శ్రేమతి విలాస్ నంటూ నీ వద్దకు రాగానే ఆమెకోసం ఇంట్లో దొంగ తనంగా జొరబడ్డావు-ఇదీ నీ విషయం."

 Previous Page Next Page