"మనం ప్రస్తుతం చాణక్య గెస్టులం....ఈ ఇంట్లో శ్రీప్రియ కన్నా చాణక్యకే ఎక్కువ అధికారం వుంటుంది. కాబట్టి మనవాడు ఏది చెప్పినా ఆమె చేయకతప్పదు."
"అంటే...." శివరాం మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు అశోక్.
"ఏమీలేదు....మనవాడు ఆమెను వంటచేసిపెట్టమని రిక్వెస్టుచేస్తాడు. ఆమె చచ్చినట్టు కిచెన్ రూమ్ లోకి రాకతప్పదు....వండక తప్పదు....తరువాత మనకు వడ్డించకా తప్పదు....సరిగ్గా అదే సమయానికి విసిపిలో బ్లూ ఫిల్మ్ కాసెట్ పెట్టి చూస్తూ వుంటాం...." శివరామ్ చెప్పుకుపోతున్నాడు తన్మయత్వంతో.
"తరువాత...."
"అదికూడా చెప్పాలంటారా....చెప్పడం కాదు....ప్రాక్టికల్ గా చూడడమే...." నలుగురూ విరగబడి నవ్వుకున్నారు.
"చాణక్యా....ముందు ఆమెను ఒప్పించి క్రిందకు తీసుకువచ్చే పూచీ నీది...."
తలవూపి మేడ మెట్లెక్కి వెళ్లాడతను.
అప్పుడే భోజనంచేసి పడుకున్నది శ్రీప్రియ.
ఉదయం భోజనం చేసేటప్పుడు పదార్ధాలను కొద్దిగా మిగుల్చుకుని గిన్నెల్లో వుంచుకొని తన గదిలోకి తెచ్చుకున్నదామె. మళ్ళీ తన ఒక్కగిన్నెల్లో వుంచుకొని తన గదిలోకి తెచ్చుకున్నదామె. మళ్ళీ తన ఒక్కదానికోసం రాత్రిపూట వంట ఎందుకనే ఉద్దేశంతో అలా చేసింది శ్రీప్రియ.
ఎనిమిది గంటలు అవుతుందప్పుడు.
చాణక్య రావడంతో తప్పనిసరిగా లేచి కూర్చున్నది శ్రీప్రియ.
"మీతో చిన్నపనివుండి వచ్చాను...."
"చెప్పండి...."
"నాకు వంట చేతకాదు....మా ఫ్రెండ్స్ ఆకలిమీద వున్నారు. కొంచెం శ్రమ అనుకోకుండా నాకు వంటలో సహాయం చేయగలరేమోనని" మిగిలిన మాటలను పూర్తిచేయలేకపోయాడతను.
శ్రీప్రియ మొహమాటంతో కాదనలేకపోయింది.
అతనితోపాటు క్రిందకు దిగి కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది.
తమ ప్లాన్ సక్సెస్ కాబోతున్నందుకు మిత్రులందరిలోనూ ఆనందము తొంగి చూస్తున్నది.
ముందుజాగ్రత్తపడి తమవెంట తెచ్చిన బ్లూ ఫిలిమ్ కాసెట్ ను విసిపిలో పెట్టి సిద్దంగా ఉంచుకున్నారు.
కిచెన్ రూమ్ లో వంటచేయడం పూర్తిఅయింది.
అప్పటివరకూ శ్రీప్రియకు కావలసినవి అందిస్తూ వంటగదిలోనే వుండిపోయాడు చాణక్య.
"మేడమ్....మీరు బాగా వంట చేయగలరనుకుంటాను"
"చిన్నప్పటి నుంచీ అలవాటు...."
"అయితే మిమ్మల్ని పెళ్ళి చేసుకునే వ్యక్తి ఎవరో కానీ చాలా అదృష్టవంతుడే...."
శ్రీప్రియ మాట్లాడలేదు.
"మా సుహాసినీ మీకు ఎన్నాళ్ళుగా పరిచయం....?"
"చాలా కాలంగా...."
"అంటే....సుమారు ఎంతకాలం నుంచో...."
"దాదాపు పది సంవత్సరాలు...."
"అమ్మో....మీ స్నేహానికి చాలా సీనియారిటీ వుందన్నమాట"
శ్రీప్రియ మౌనం వహించింది.
"అవును మేడమ్....అన్ని ప్రశ్నలు నేనే అడుగుతున్నాను. మీరేమిటి ఒక్క ప్రశ్న కూడా మా గురించి అడగడంలేదు. ఇంటరెస్ట్ లేదనుకుంటాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా?" కావాలనే సీరియస్ నటిస్తూ అడిగాడు చాణక్య.
"నో....నో....అదేం లేదండీ....తలనొప్పిగా వుంది"
"సారీ ఫర్ ది ట్రబుల్ మేడమ్....నాకు తెలుసనుకోండి మీరు చాలా మంచివారని మీరు ఈ సంవత్సరంలో ఏమయినా పెళ్ళి చేసుకునే ప్రయత్నంలో వున్నారా?"
"ఏమో....చెప్పలేను...."
"అంటే...."
"ప్రస్తుతం ఆ ఆలోచన లేదు...."
"అబ్బ....అచ్చం మా సుహాసినికి తీసిపోరండి....ఆమె కూడా ఎప్పుడూ ఇంతే....ఈ సంవత్సరమైన పెళ్ళి చేసుకుంటావా అంటే ప్రస్తుతం ఆ ఆలోచనే లేదంటుంది" చాణక్య గడగడా చెప్పుకుపోతూనే వున్నాడు.
అతను అంతసేపు తన గురించి, తన పెళ్ళి గురించి అలా మాట్లాడడంలో అతని ఉద్దేశం ఏమిటో అర్ధం కాలేదామెకు.
"వంట పూర్తయింది....ఇకనేను వెళతాను...." చేతులు కడుక్కుంటూ అన్నదామె.
"మరి వడ్డించడం....అదీ...."
చాణక్య నీళ్ళు నమిలాడే తప్ప డైరెక్ట్ గా ఆమెను వడ్డించమని అడగలేకపోయాడు.
"సారీ....నాకు తలనొప్పిగా వుందని చెప్పాను....మీరు మరచిపోయినట్టున్నారు....ఆ మాత్రం వడ్డించుకోలేరా ఏమిటి...." అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది శ్రీప్రియ.
"అదిచూసి ఖంగారుగా కిచెన్ లోకి వచ్చేశారు ముగ్గురు మిత్రులు.
"ఏమయ్యిందిరా...."
"ఆమె ఇచ్చిన సమాధానం చెప్పాడు వాళ్ళకు....
"ఇప్పుడేం చేద్దాం...."
"ముందు భోజనం చేసి తర్వాత ఆలోచిద్దాం దాని సంగతి...."