Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 38


    ఉదయం పది గంటలు....

    శివరామ్ ఆరోజు తొందరగా రడీఅయి మిత్రుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు తారీఖు పదిహేడు.

    చాణక్య లేడికళ్ళ సుందరాంగిని చూపిస్తానన్న రోజు....

    సిగరెట్ వెలిగించి అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తుండగా వచ్చారు అతని మిత్రబృందం ముగ్గురూ. చాణక్య, ఆనంద్, అశోక్.

    "ఎంతసేపటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?"

    శివరామ్ కోపాన్ని ప్రదర్శించాడు.

    "ఇదిగో....ఈ ఇద్దరినీ మేలుకొలిపి తీసుకువచ్చేసరికి ఈ టైమ్ అయింది...." ఆనంద్ చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు.

    "సరేలే....ఇంతకూ ఆ కొత్త తాంబూలం విషయం ఏమైంది?"

    శివరామ్ ఆత్రంగా అడిగాడు.

    "సక్సెస్....ఆ ఇంటిలో ఆమెతప్ప ఎవరూ లేరు. కాకపోతే ఒక్క షరతు."

    "ఏమిటది?" అశోక్ ఆరాటం తొంగి చూస్తున్నది.

    "ఆ అమ్మాయితో మన శృంగారం రాత్రికైతే బాగుంటుంది."

    "అమ్మో....రాత్రి దాకానా....నేనుండలేను?" శివరాం విసుగ్గా అన్నాడు.

    "తప్పదు....వుండాలి" ఆనంద్ ఉండబట్టలేక ప్రశ్నించాడు.

    "ఆ అమ్మాయి అంత తేలికగా లొంగేరకం కాదు. మనం బలవంతం చేయక తప్పదు. అందుకే రాత్రి అయితే బాగుంటుందని."

    చివరకు మిత్రులంతా చాణక్యమాట ప్రకారమే వాళ్ళ ప్రోగ్రాంను రాత్రికి వాయిదా వేసుకున్నారు.

    చీకటిపడే సమయానికి చాణక్య పిన్నివాళ్ళింటికి చేరుకున్నారు. చాణక్య చూపెడతానన్న తాంబూలం....

    శ్రీప్రియ!

    చాణక్య పిన్ని ఎవరో కాదు....సుహాసిని తల్లి.

    శ్రీప్రియ తలుపు తెరిచి ముగ్గురినీ చూసి మొదట ఆశ్చర్యపోయింది. చాణక్య ఎవరో ఆమెకు తెలుసు. అతను తరచూ ఆ ఇంటికి వస్తుంటాడు. అంతకుముందే సుహాసిని అతనిని శ్రీప్రియకు పరిచయం చేసి వుండడం వలన ఆమెకు వాళ్ళను అనుమానించే ఆస్కారం లేకపోయింది.

    శివరాంతోపాటు  మిగిలిన ఇద్దరూ ఆమె అందచందాలను ఆబగా చూస్తున్నారు.

    శ్రీప్రియ పాతికేళ్ళు ఉన్నట్టుగా కనిపించదు. ఆమె మేనిచాయలో మెరుపు వున్నది. ముఖంలో సమ్మోహనాన్ని కలిగించే కళ వుంది. ఎంతటి మగవాడినైనా ఉర్రూతలూగించగల పరువం ఆమెది....ఎంతటి మగవాడినైనా కవ్వించగల రూపం ఆమెది....

    చూడగానే అమాంతం కౌగిలించుకోవాలనిపించే ఆ సౌష్ఠవ రూపాన్ని చూస్తూ నాలుకలు తడిచేసుకున్నారు ముగ్గురూ.

    "సుహాసిని లేదా?" చాణక్య అడిగాడు.

    "లేదు...."

    "మరి....మా పిన్ని...."

    "ఎవ్వరూలేరు...."

    "ఎక్కడకు వెళ్ళారు?"

    "మ్యారేజ్ కు...."

    "అయ్యో....పెద్దచిక్కే వచ్చిపడిందే...."

    శ్రీప్రియ మాట్లాడలేదు వాళ్ళ చూపులను చూడగానే ఏదోలా అనిపిస్తున్నదామెకు.

    "వీళ్ళు నా ఫ్రెండ్స్....చాలా దూరం నుంచి వచ్చారు. మా యింట్లో మా డాడీకి, నాకు చిన్నగొడవ వచ్చింది. వచ్చిన గెస్టులను ఎక్కడో హోటల్ లో వుంచడం బాగోదు. ఈ రాత్రికి యిక్కడ వుంచవచ్చని తీసుకొచ్చాను. మీకేమైనా అభ్యంతరమా?"

    చాణక్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

    శ్రీప్రియకు అది తనసొంత ఇల్లుకాదని తెలుసు.

    చాణక్య ఎవరో కాదు. సుహాసినికి దగ్గర బంధువు....కనుక అతనిని అభ్యంతరం పెట్టే అధికారం తనకులేదు.

    "ఫరవాలేదు....ఉండండి"

    "థాంక్యూ మేడమ్....థాంక్యూవెరీమచ్" క్రిందహాల్లో తిష్టవేసారు మిత్రబృందం.

    "అరేయ్....అదేంటిరా....పైకివెళ్ళిపోయింది" అశోక్ అన్నాడు ఓపికపట్టలేక.

    "అది సరే....ముందు ఫిగర్ నచ్చిందా?"

    "అదిరింది బాసూ నీ సెలక్షన్...." శివరామ్ మనస్పూర్తిగా మెచ్చుకున్నాడు.

    "ముందు ఆమెను క్రిందకుదించే మార్గం ఆలోచించండి...." ఆనంద్ కల్పించుకుంటూ అన్నాడు.

    "మనమే పైకివెళితే పోలా...." శివరామ్ ధీమాగా అన్నాడు.

    "వద్దొద్దు మనం పైకివెళితే బెదిరిపోతుంది. ఆడపిల్లను మల్లెపూవులా చూసుకోవాలి. నలిపి ప్రయోజనం లేదు....గుభాళించదు" చాణక్య ఛలోక్తి విసిరాడు.

    "వాడిమాటలకేంగాని పోదాం పదండిరా...."

    "ఆగండిరా....చాణక్య చెప్పినదాంట్లోనూ నిజంలేకపోలేదు. ఆడదానిని రేప్ చేయడంలో వుండే థ్రిల్ కన్నా తనంతటతానే అన్నీ అర్పించుకోవడంలో వుండే థ్రిల్ ఎక్కువగా ఉంటుంది" అన్నాడు ఆనంద్ ఏదో గ్రహించిన వాడిలా.

    "ఏం చేద్దామంటావు...." అన్నట్టు ఇద్దరూ శివరామ్ వైపు చూసారు. 
 

 Previous Page Next Page