Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 38

 

    నేనయితే ఊరుకునే వాడిని కాదు -"
    "నేను మాత్రం ఊరుకున్నానేంటి? నాకు వంట నేర్పిన చెఫ్ మందిరా మేడమ్ ని తీసుకొచ్చి మోనికా ఎదురుగ్గా నిలబెట్టా! రాకేష్ వంట చేసినంత టేస్టీగా ఇంకెవ్వరూ చేయలేరని చెప్పింది మందిరా!"
    "దెబ్బకి సైలెంటయిపోయి ఉంటుంది మోనికా!"
    'అలా సైలెంటయేదయితే వ్యవహారం ఇంత దూరం ఎందుకొస్తుంది?"
    "రాదు -"
    "ఫైనల్ గా మొన్నో రాత్రేం జరిగిందో తెలుసా? కౌగలించుకుని కిస్ చేస్తుంటే ఒకతోపు తోసి యూ ఆర్ లేజీ లవర్" అంది -"
    "టూ మచ్-"
    "నేనేం చేశానో తెలుసా? నా పాత గాళ్ ఫ్రెండ్ సోనీ ఉంది కదా! వెంటనే సోనీని పిలిపించి మోనికా ఎదుట నిలబెట్టా! సోనీ ఏం చెప్పిందో తెలుసా? - నా లవర్స్ అందరిలోకి రాకేష్ బెస్ట్ లవ్ మేకర్ - అంది -"
    భవానీ తప్పట్లు కొట్టాడు.
    "ఒండర్ ఫుల్! షాకయి ఉంటుంది -"
    "షాకయింది గానీ -- దాంతో నాకూ సోనీకీ సంబంధం ఉందని మండి పడి - నీకూ నాకూ రాం రాం' అని చెప్పేసి అప్పటికప్పుడే వెళ్ళిపోయింది -"
    "రెండ్రోజుల తర్వాత అదే సర్దుకుంటుంది బ్రదర్ -- డోంట్ వర్రీ -"
    "నేనూ అలాగే అనుకున్నా! కానీ తను అల్ రెడీ ఇంకోడిని వెంటేసుకుని తిరగటం మొదలు పెట్టింది."
    "ఓ - వెరీ బాడ్ సిట్యూఎషన్-"
    "చెప్పు తీసుక్కోడతా ఆమాటంటే-"
    "అదేంటి?"
    "నా సంగతి తెలిసి కూడా అలాంటి డైలాగ్ కొడతావెంటి ? నా ప్రేమను ఇన్సల్ట్ చేసిన గాళ్ ని నేనూ కేర్ చేయను -- అందుకే నా లిస్ట్ లో నుంచి మౌనికా పేరు తీసేశాను -"
    "నేనేమనాలిప్పుడు?"
    "చాలా అద్భుతమయిన పని చేశావ్ అనాలి -"
    "అదే అందామనుకున్నా-"
    "గుడ్ - ఇదంతా నీతో చెప్పాక నాకు చాలా రిపీఫ్ గా ఉంది -"
    "నాకు చాలా టెన్షన్ గా ఉంది -"
    "ఎందుకు?"
    "రోజాకీ, నాకూ -- అంటే నీకూ మారేజ్ చేసేయాలని మీ ఇద్దరి పేరెంట్స్ డిసైడ్ చేసేశారంట!"
    "ఒ౧ లేటెస్ట్ డెవలప్ మెంట్ అన్నమాట-"
    "అవును! రోజా వచ్చి అమేటర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? అంటూ కోశ్చేన్ చేసింది -"
    "ఓకే అనాల్సింది -"
    "అలా అంటే రెండు కొంపలు మునుగుతాయ్-"
    "ఎవరి కొంపలు ?"
    "నేను రాకేష్ కాదనేది ఒకటి - నేను లవ్ చేసిన మల్లిక కొంప ఇంకోటి -"
    "ఓ! కొంచెం కాంప్లికేటేడే-"
    "యా కొంచెం కాదు - మెడల్లోతు-"
    "డోంట్ వర్రీ ! నేను వచ్చి సెటిల్ చేస్తా-"
    "వ్వాట్ నువ్ వస్తావా?"
    "యా-"
    "నిన్నీ మిస్ నుంచి సేవ్ చేయాలి కదా-"
    "కానీ నిన్ను చూస్తే వాళ్ళంతా గుర్తుపడతారు కదా-"
    "నిన్ను రాకేష్ అని నమ్మిన వాళ్ళు ఇంక నన్నేం గుర్తుపడతారు ? డోంట్ వర్రీ -"
    "కానీ ఇక్కడకు ఎలా వస్తావ్- అయ్ మీన్ నువ్వేవరివని అడిగితె -"
    "నా పేరు భవానీ శంకర్ - నీ ఫ్రెండ్ ని - ఇడియట్ . ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా?
    భవానీ విజిల్ వేశాడు.
    "అయిడియా టెంపరరీగా ఓకే గానీ - పెద్ద సునామీ తప్పెట్లు లేదు -
    "బై" ఫోన్ పెట్టేశాడు దినేష్.  

                           ***

    డివిడీ లో శివ ప్లే చేస్తున్న వీడియో చూసి స్మిత షాకయింది.
    తను సీక్రెట్ గా ఆటోలో వెళ్ళి ఖత్రియా హోటల్ దగ్గర దిగటం -- లాంజ్ లో కెళ్ళి శ్రీరామ్ కలుసుకోవటం - ఇద్దరూ లిప్ట్ లో రూమ్ లో కెళ్ళి తలుపు వేసుకోవటం -
    అంతవరకూ చూసేసరికి ఆమెకు దుఖం పొంగుకొచ్చింది.
    శివ నవ్వాడు.
    "చాలా! రూమ్ లో మీరిద్దరూ జరిపిన సెక్స్ క్రీడలు కూడా చూద్దామా?" అడిగాడతను.
    "ప్లీజ్ - చాలు -" అంది రాలిపోతున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ .
    "చాలా బాడ్ గా ఉందానీకు?"
    "అయామ్ సారీ! అతనితో ఒకప్పుడు ఎఫైర్ ఉండేది , ఇప్పుడు లేదు -"
    "నేను నిన్ను ఎక్స్ ప్లనేషన్ అడగటం లేదు. నా డిసిషన్ చెప్పడానికి పిలచాను-"
    ఆమె ఊపిరి బిగపట్టివింటోంది . తప్పదు - ఎలాంటి డెసిషన్ అయినా ఫేస్ చేయాల్సిందే-
    "మనం ఎలా కలుసుకున్నామో - అలాగే విడిపోదాం - మీడియాకి ఏమాత్రం తెలీకూడదు -- అంతా సీక్రెట్ గా జరగాలి. అలా జరుగుతే నీకు ఇంతకాలం నా భార్యగా ఉన్నందుకు పది లక్షలిస్తాను - అదీ మన డైవర్స్ వ్యవహారం అంతా అయిపోయాక - ఇంకో గంటలోగా నువ్ నీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి -"
    స్మిత ఆఖరి ప్రయత్నం చేసింది.
    "ఈ ఒక్కసారి క్షమించలేవా?"
    "లేను -- కమాన్ - గెట్ రడీ - ఇంకో విషయం - మా పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కీ కూడా ఈవిషయం తెలీకూడదు . ఓకే-?"
    ఆమె మౌనంగా తలూపింది.
    అతను వెళ్ళిపోయాడు.
    స్మిత తన బట్టలు సర్దుకోసాగింది.
    తన తల్లి ఎప్పుడూ అంటుండేది" ఈ సినిమా జీవితాలు కూడా సినిమా లాగానే ఉంటాయ్ - అని -"
    సూట్ కేస్ తీసుకుని బయటికొచ్చేసరికి కారు సిద్దంగా ఉంది -

 Previous Page Next Page