'ఆయామ్ రడీ-"
రోజా ఓ క్షణం తాటపటాయించింది.
"అదే మా డాడీ - మీ డాడీ - మాట్లాడుకుంటుంటే విన్నాను -"
"ఏ విషయం ?"
"మనిద్దరికీ మారేజ్ చేసే విషయం -"
భవానీ ఉలిక్కిపడ్డాడు.
"ఏంటి ? నిజంగానా?"
"ఇలాంటి విషయాలు జోక్ చేస్తానా?' సిగ్గుపడుతూ అంది.
"మనిద్దరి అభిప్రాయాలు తెల్సుకోకుండా అంత ఫాస్ట్ గా దూకేస్తున్నారేమిటి?"
రోజా నవ్వింది.
"నేనూ అలా ఫీలయ్యే -- నీతో మాట్లాడాలని వచ్చాను -"
"కానీ చిన్నప్పటి నుంచీ మనిద్దరికీ అస్సలు పడదు కదా! కుదరదని చెప్పేయాల్సింది నువ్వు -"
"ముందు అలాగే అనుకున్నా! కానీ ఆలోచిస్తున్న కొద్దీ నామనసెంటో నాకర్ధమయింది -- నీతో ప్రతిక్షణం పోట్లాడుతుండడానికి కారణం నువ్వంటే నా మనసులో ఏర్పడ్డ ఇష్టమే నని నాకు తెలిసింది.
సైకాలజీ స్టడీస్ లో అపాయింట్ కూడా ఉంది. మనం మరీ ఇష్ట పడే వ్యక్తికీ దగ్గరవడానికి కొంతమంది ప్రతిక్షణం అతనితో గొడవ పడుతుంటారట! నేనా టైపే- పైగా నువ్ బృందావనం చానెల్ ని సింగల్ హండెడ్ గా నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా తీసుకురావటంతో - నీ మీద హీరో ఇమేజ్ ఏర్పడింది -- సారీ -- ఎంటేటో మాట్లాడుతున్నా! అసలు ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని ........."
భవానీ ఇరుకున పడిపోయాడు.
ఏం చెపాలో అర్ధం కాలేదు.
"డాడీ ఒకసారి చెప్పారు. నువ్వెవరో మోడల్ ని లవ్ చేశావనీ, ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనుకున్నావనీ, ఆ విషయంలోనే మీ డాడీతో గొడవపడి అమెరికా నుంచి వచ్చేశావనీ - ఇప్పుడా అమ్మాయిని మర్చిపోయావని కూడా డాడీయే చెప్పారు -"
భవానీ శంకర్ నవ్వాడు.
"యా! చాలావరకూ నిజమే - ఎనీవే - ఆలోచించుకోవడానికి నాక్కొంచెం టైమిస్తావా?"
"ష్యూర్"
"థాంక్యూ-"
"ఒకే - వెళ్తాను - బై " రోజా వెళ్ళిపోయింది.
అప్పుడే విజయ్ యాదవ్ నుంచి ఫోన్ వచ్చింది.
"అన్నా! సక్సెస్ -" అన్నాడు ఉత్సాహంగా.
"అంటే?"
"అదే! ఆ శ్రీరామ్ , శ్రీస్మిత ఖత్రియా హోటల్లో కలుసుకున్నారు. ఆది శివ మొత్తం ఫిల్మ్ తీశాడు-"
'గుడ్ - నువ్ వెంటనే శ్రీరామ్ కి లక్ష రూపాయలిచ్చేయ్-"
"ఒకే అన్నా -' భవానీ హాపీగా విజిల్ వేశాడు.
***
అర్ధరాత్రి పన్నెండింటికీ భవానీ సెల్ మోగింది.
"ఎవడహ- అర్ధరాత్రి మద్దెల దరువ్-"
"రాకేష్ నిరా - ఇడియట్-"
"హాయ్ దోస్త్ - ఇంత లేట్ నైట్ యాద్ కొచ్చానేంటి? మోనికాతో మాంచి ఎంజాయ్ మెంట్ లో ఉన్నావా?"
'భవానీ! ఆయామ్ డూమ్ డ్-"
"డూమ్ డా! ఏమంది బ్రదర్ ? ఎనీ ప్రాబ్లమ్?"
"యస్ -- సీరియస్ ప్రాబ్లం-"
"ఏంటది ?"
"మోనికాకూ నాకూ చెడిపోయింది -"
భవానీ అదిరిపడ్డాడు.
"ఏంటీ - చెడిపోయిందా?"
"అవును - బియాండ్ రిపెర్స్ -"
"ఓగాడ్-"
"పది ఓగాడ్ లేసుకో-"
"ఎలా జరిగింది రాకేష్- వాటీజ్ ది ప్రాబ్లమ్?"
"లాస్ట్ సండే ఒక ప్రపోజల్ పెట్టింది - అదేంటంటే ఒక వారం రోజులు మా ఇంట్లో కలసి ఉందాం అంది -"
'ఓ! ఒండర్ ఫుల్ తెగ ఎంజాయ్ చేశావా?"
"వంకాయెం కదూ! ఎంజాయ్ మెంట్ కోసం కాదు. ఆ వారంలో మేమిద్దరం భార్య భర్తలుగా అన్ని విధాలా సరిపోతామా లేదా అని టెస్టింగంట! ఆ అయిడియా నాకు నచ్చలేదు గానీ అయినా వప్పుకున్నా!"
"నువ్ లార్జ్ హార్టెడ్ - కాబట్టి -"
"యా! మొదటి రోజు హపీగానే గడిచింది. రెండో రోజు ప్రాబ్లం స్టార్టయింది -"
"ఏం ప్రాబ్లెమ్ ?"
"ఏది ప్రాబ్లెం కాదని అడుగు! అన్నిటికీ కిరికిరే! ప్రతి విషయానికీ ఫస్ క్రియేట్ చేయటం మొదలు పెట్టింది -"
"కానీ నీ బిహేవియర్ , అలవాట్లు అన్నీ సూపర్ కదా! ఇంకా ఫస్ ఎందుకు?"
'అదే నాకు మండింది. రోజూ నైట్ లో మీల్స్ తరువాత నేను సిగరెట్ తాగటం అలవాటు కదా! ఆ ఒక్క సిగిరెట్ కూడా తాగడానికి వీల్లెదంట-"
"ఎందుకని ?"
"నా వల్ల తనకి లంగ్ కాన్సర్ వస్తుందంట-"
"ఓ ఇమెచ్యూర్-"
"చైల్డిస్ట్ అన్రా -- ఇడియట్-"
"ఓకే - చైల్డిస్ట్ "
భవిష్యత్తులో తనకి బద్దకంగా ఉన్న రోజున నేను వంట చేయాలి కనుక -- ఇప్పుడు ఒకరోజు వంట ఎలా చేస్తానో చూపించమంది - ఓకే - రీజనబుల్ కదాని మీల్స్ ప్రిపేర్ చేశాను -- నువ్వే జెప్పరా! నేను బోర్న్ కుక్ ననీ ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుందనీ నువ్వేగా అనేవాడివి -"
"అవును మరి -- అది ఫాక్టే కదా -"
"నేను ప్రిపేర్ చేసిన మీల్స్ చూసి ఏమందో తెలుసా?"
"నాకెలా తెలుస్తుంది?"
"అసలు నాకు వంటే రాదంట -"