***
తను అలా భర్త నుంచి విడిపోయిన విషయం -- తన తల్లికి కూడా చెప్పలేదు - అయన అమెరికాలో బిజినెస్ కోసం వెళ్తున్నారు . అందుకని కొద్ది నెలలు ఇక్కడే ఉంటా" అందామెతో.
కానీ రెండో రోజే బృందావనం చానెల్లో తనూ, శివా విడిపోయినట్లూ విడాకులూ తీసుకోబోతున్నట్లూ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసరికి షాకయిపోయింది.
చానెల్ కి ఆ వార్త ఎవరు లీక్ చేసి ఉంటారు. అది ఖచ్చితంగా శివా పనే అయింటుంది.
మరుక్షణంలో శివ కాల్ చేశాడు.
"బ్లడీ బిచ్! నేనే కావాలని నన్నూ మా ఫామిలీని డిఫేమ్ చేయడానికి మన ఇన్ ఫర్మేషన్ చానెల్ కిస్తావా?"
"శివా! యూ ఆర్ మిస్టేకన్- నేనీ విషయం మా అమ్మ క్కూడా చెప్పలేదు -"
"నీకు నీతే లేదనుకున్నా! కానీ ఇంత నీచానికి పాల్పడతావని నాకు తెలీదు. బృందావనం చానెల్ వాళ్ళంతా చెప్పారు. వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకుని ఈ వార్తని అమ్ముకుంటావా! ఇప్పుడిది దేశమంతా తెల్సింది కదా! హాపీగా ఉండు! నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను - కోర్టులో మనోవర్తి ఒక్క పైసా అడిగినా నీ శాల్తీ ఉండదు- గుర్తుంచుకో - నిన్ను నరికి ఆనవాలు తెలీకుండా తగల బెట్టించటం నాకేం కష్టం కాదు -"
ఫోన్ డిస్క'నేక్ట్ అయింది .
***
మల్లిక హాపీగా ఓ లెటర్ తీసుకుని భవానీ రూమ్ లోకి పరుగుతో వచ్చింది.
"రాకేష్ కెన్ యూ బిలీవ్ / శివ నా మీద వేసిన డిఫమేషన్ కేస్ విత్ డ్రా చేసేసుకున్నాడు -"
"నాకు తెలుసు - అలాగే చేస్తాడని -"
"రాకేష్ - నాక్కొన్ని అనుమానాలున్నాయ్- క్లారిఫై చేస్తావా?"
"ఎంటవి?"
"శివ, శ్రీస్మిత డైవర్స్ తీసుకుంటారని నీకెలా తెలుసు ?"
"ఎలాగెంటి ? వాళ్ళిద్దరి మధ్య ముసలం పెట్టింది నేనే కదా!"
మల్లిక షాకయింది.
"ఓగాడ్ -అదెలా ?"
భవానీ అంతా చెప్పాడు .
మల్లిక మూడ్ మారిపోయింది.
"నాకు చాలా బాధగా ఉంది రాకేష్-"
"ఎందుకు ?"
"నాకోసం - వాళ్ళ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టావ్ -"
"లేకపోతే నేను లవ్ చేసినమ్మాయిని ఎవడో జైలుకి పంపిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా?"
"వ్వాట్? నువ్ లవ్ చేసిన ......అంటే .....నువ్ నన్ను ప్రేమిస్తున్నావా?"
"ఏం నన్ను చూస్తె తెలీటం లేదా/ ఊరంతా లౌడ్ స్పీకర్స్ పెట్టి ఎనౌన్స్ చేయాలా?"
మల్లిక మొఖంలో అనందం కనిపించింది.
"నాకు తెలీదు -- నన్ను నువ్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడేసిన రోజు నుంచే నీమీద ప్రేమ కలిగింది. కానీ నా ప్రేమ వన్ వే ట్రాఫిక్ గానే మిగిలిపోతుందనుకున్నాను - అదీ గాక నువ్వూ రోజా లవ్ లో ఉన్నారనుకున్నాను-"
"రోజా రిచ్ గాళ్ - నేను పూర్ గై- అంచేత ఆధాటే రాదు మనకి -- అది సరే కమ్ విత్ మీ -- అర్జంటుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశా-"
"షూర్-"
ఇద్దరూ బయటకు నడుస్తుంటే వెనుక నుంచీ అతని భుజం తట్టింది మల్లిక.
"హలో - వన్ సెకండ్ -"
"ఏంటి ?" వెనక్కు తిరిగాడతను.
చటుక్కున అతని పెదాల మీద ముద్దు పెట్టుకుందామె-
"ఇందుకే అపా! థాంక్యూ-"
"అంటే నువ్ లవ్ చేసిన వాళ్ళందరినీ ఇలా ముద్దులు పెట్టుకోవటం అలవాటా?"
ఆమె నవ్వేసింది - "యా ఆ అలవాటు ఇప్పుడే మొదలయింది -"
***
ఇద్దరూ బయటికొచ్చే సరికి విజయ్ యాదవ్ వెయిట్ చేస్తున్నాడు.
"అన్నా! ప్లానంతా ఒకే! షూటింగ్ కూడా అయిపొయింది. ఇవాళ సాయింత్రం నుంచే బ్రేకింగ్ న్యూస్ స్టార్ట్ - " హాపీగా చెప్పాడు.
"థాంక్యూ తంబీ! మన బాచ్ అంతా ఎక్కుడున్నారిప్పుడు ?"
"ఇంకాసేపట్లో చానెల్ కొస్తారన్నా-"
"అందరూ ఇక్కడే ఉండండి- ఇవాళ్టి నుంచీ డూ ఆర్ డై - వార్ బిగిన్స్ -"
"డై అనే ప్రసక్తే లేదన్నా! గెలుపే -"
***
భవానీశంకర్ ఒకసారి ఆ హల్లో కూర్చున్న తన సిబ్బంది అందరి వేపూ చూశాడు. అర్జంటుగా ఆ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాడో ఎవరికీ అర్ధం కాలేదు. అంతా సైలెంట్ గా అతనేం మాట్లాడతాడా అని చూస్తున్నారు.
"డియర్ ఫ్రెండ్స్! " అన్నాడు భవానీ!
"నేను బృందావనం చానెల్ కొచ్చి సుమారు మూడు నెలలు పూర్తి కావొస్తోంది! ఈ మూడు నెలలో మీ అందరూ చేసిన కృషి వల్ల మన చానెల్ అట్టడుగు నుంచి లేచి జూలు విడల్చుకుని నెంబర్ టూ స్థానానికొచ్చింది. అంతేకాదు నెంబర్ వన్ చానెల్ అయిన సంపూర్ణతో ఇంచుమించుగా సమానం అయింది. కానీ నాక్కావలసింది అదికాదు .
సంపూర్ణ చానెల్ నెంబర్ టూ స్థానానికి పడటం!
ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవటానికి నాకున్న గడువు కేవలం - ఒకే ఒక్కవారం!
అది సాధించగలుగుతే మనం గెలిచే మొత్తం ఎంతో తెలుసా?
ఇరవై కోట్లు! ఆ ఇరవై కోట్లు నా జేబులో కొస్తుందని మీరనుకుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకోటి లేదు.
ఎందుకంటె ఆడబ్బు మన చానెల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా చెందుతుంది.
ప్రస్తుతం మన చానెల్లో రెండు వందల ముప్పయి మంది సిబ్బంది ఉన్నారు.
అంటే ప్రతి ఒక్కరికి సుమారు 8 లక్షల రూపాయలు వస్తుంది - ఆ మాట విని ఎవ్వరూ ఎగ్జయిటవలేదు -
భవానీ నవ్వాడు -


