Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 36


    "మరేంలేదు రుత్వీ. నేను అర్జంటుగా యువకుడ్ని అయిపోవాలి. అంటే నీలాంటి యువకుడి లెవెల్లో లైంగిక శక్తి పెరగాలి. ఓ మాటేమన్నా చెబుతావని......"

 

    రుత్వి నవ్వు వినిపించింది అవతలి వైపునుంచి  -

 

    "అంటే మళ్లీ మీ వ్యాపకాన్ని ఉధృతం చేసారన్నమాట"

 

    "మరేం.... అసలు సంగతేమంటే...... " ఫోన్ పెట్టేయబోతూ ఆగింది విజూష.

 

    అది గ్రాండ్ పా ఆ వయసులో చేసే నిర్వాకాల గురించి తెలుసుకోవాలన్న ఆలోచనో -

 

    లేక రుత్వి గొంతు వినాలన్న ఆరాటమో నిలబడిపోయిందగి రిసీవర్ పట్టుకుని.

 

    "ఈ మధ్యనే పరిచయమైన ఓ ఆంగ్లో ఇండియన్ సెటప్ తో హనీమూన్ వెళ్లబోతున్నాను.

 

     డేట్ ఇంకా ఫిక్స్ కాలేదనుకో" ఇంకా ఏదో చెబుతున్నాడు గౌరీనాధం.

 

    విజూష కళ్ళలో విస్మయం.

 

    అరవై ఏళ్లు దాటిన గ్రాండ్ పా జోక్ చేస్తున్నట్టు లేదు.

 

    ఇలా సెటప్స్ ఏర్పాటు చేసుకోవడం, ఎంజాయ్ చేయడం చాలా తరచుగా జరిగేదే అన్నట్లు - పైగా ఓ ఫేమిలీ డాక్టర్ కో, ఫ్రెండుకో చెబుతున్నట్లు రుత్వితో చర్చిస్తున్నాడు.

 

    తాతయ్యకి బ్లూఫిలిమ్స్ వ్యామోహమే  అనుకుంటే, ఇప్పుడు అంతకుమించి మరో విషయం తెలిసింది.


 
    ఘోస్ట్ రైటర్ ఫోన్ కాల్ గురించి మరిచిపోయింది విజూష.

 

    "సో........ మీరు మీ లైంగిక శక్తిపెంచుకోవాలనుకుంటున్నారు" రుత్వి అడిగాడు.

 

    "ఖచ్చితంగా అదొక్కటే కాదు"

 

    గౌరీనాధంగారు చాలా మొహమాట పడిపోతున్నారు.


 
    "వయసు వుడిగినవాడ్నిగా! కాస్తరతి సమర్దతని పెంచుకోవాలనుకుంటున్నాను.


 
    పైగా నేను హనీమూన్ కి తీసుకెళ్లే అమ్మాయి వయసు ముప్పైపైనా, నలభైలోపు."

 

    "ఫ్రౌఢ అన్నమాట" ఆర్దోకిలా అన్నాడు రుత్వి.

 

    ఒక అక్రమ సంబంధం గురించి రుత్వి అలా సమర్దిస్తున్నట్టుగా మాట్లాడడాన్ని విజూష అంగీకరించలేకపోతోంది.
 


     అయినా ఉత్కంఠగా వింది.

 

    "మా మీద మీకున్న నమ్మకానికి ముందుగా నా కృతజ్ఞతలు. అయితే మీరు నేను చెప్పిన మందుల్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పడానికి బాధపడుతున్నాను."

 

    తన మనసులోని భావం గ్రహించినట్లు రుత్వి మాట్లాడటం ఆమెకి చాలా నచ్చింది.

 

    "అప్పుడు మీ తాతయ్య మహర్షి కూడా నన్ను ఇలానే తిట్టేవాడు. అయినా వూరుకునేవాడా.


 
    మంచి స్నేహితుడు కాబట్టి ముందు కాదన్నా ఏదన్నా సమస్య గురించి చెప్పేసరికి టక్కున చిట్కాలు చెప్పేవాడు."

 

    క్షణం విరామం తరువాత అన్నాడు రుత్వి.

 

    "తన్యతే విస్తీర్యతే అహారేణేతి తనుః అన్నారు సర్. ఆహారం చేత విస్తరింపబడేది కాబట్టి తనువన్నారు.


 
    శార్విత ఇతి అంటే నశించునది కాబట్టి శరీరం అన్నారు. అలాంటి శరీరంకన్నా ఇప్పుడు మీ వయసులో మానసికమైన ఉల్లాసానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. పిలసాఫికల్ గా గడపాలి."

 

    "ఇదేం బాగోలేదు రుత్వీ ఇలా అయితే ఇహముందు నీతో మాట్లాడను"

 

    గౌరీనాధం గారి కోపాన్ని అర్దం చేసుకున్నట్టు నవ్వేశాడు రుత్వి.

 

    "ఘృత భ్రష్టో దుగ్దమాషపాయసో వృ,స్య ఉత్తః, దధ్నస్వయం శరచ్చంద్ర సన్నిభందోష వర్జితమౌ."

 

    "ఒక్క ముక్క అర్దమైతే ఒట్టు" అన్నాడు గౌరీనాధంగారు.

 

    "నేతిలో వేయించిన మినపప్పుని ఆవుపాలలో వేసి పంచదార కలిపి పాయసంగా చేసుకుని తాగితే శరత్కాల చంద్రుడిలా సెక్స్ లో ఉధృతంగా రెచ్చిపోవచ్చన్నది  ఆ శ్లోకానికి అర్దం."

 

    "గుడ్" అభినందించారాయన.

 

    "ఇప్పుడు మంచబ్బాయివనిపించుకున్నావ్. కానీ మనపట్టు తినగానే పైత్యంతోపాటు వేడి చేస్తుంది నాకు."

 

    "అలాంటప్పుడు ఒకటి రెండు స్పూన్స్ అడవి తేనే తాగితే ఆ బాధకి విరుగుడుగా పని చేస్తుంది"

 

    పదిలిప్తల వ్యవధి తరువాత రుత్వి అన్నాడు మళ్లీ.


 
    "ఓకే.. మరో ఆల్టర్నేటివ్ చెబుతాను. జాజికాయ జాపత్రి పచ్చికర్పూరం అయిదుగ్రాములు చొప్పున దీసుకుని కలిపి మెత్తగా దంచి శనగ గింజంత మాత్రలు చేసుకుని రోజూ రాత్రిపూట మాత్రలు వేసుకుని పాలు తాగండి"

 

    "కుర్రాడ్నయిపోతానా?"

 

    "అఫ్ కోర్స్" కాన్ఫిడెంట్ గా చెప్పాడు రుత్వి.

 

    "కుర్రాడిగా మీరు అవుతారో లేదో నేను చెప్పలేనుగానీ భవిష్యత్తుల లైంగిక సమర్దత తగ్గకుండా కుర్రాళ్లు సైతం అనుసరించాల్సిన వైద్యం ఇదని చెప్పగలను.

 

    అలాగే కందిపప్పుకట్టు కాసి తాగినా అది ఉబ్బసం, దగ్గు జలుబు తగ్గటంతోపాటు వీర్యపుష్టికి కారణమవుతుంది.

 

    ఈ రెండు మార్గాలు మాత్రమేకాదు. గ్లాసుడు ఆవుపాలలో మూడు తులాల  ఇప్పపువ్వు కలిపి యిస్తే నపుంసకత్వంలాంటి సమస్య పోతుందంటుంది ఆయుర్వేదం"

 

    "చాలు" ఉత్సాహంగా అన్నారాయన.

 

    "ఇన్ని ఆల్టర్నేటివ్స్ చెప్పావు కాబట్టి ఏదో ఓ రూట్ లో దూసుకుపోతాను"

 

    "కాని అసలయిన ఓ సమస్య  గురించి మీరు అడగలేదు."

 

    "ఏమిటి?"

 

    "మీ హనీమూన్ తరువాత ఎయిడ్స్ లాంటిది వస్తే ఏం చేయాలీ అని."

 

    తెల్లమొహం వేసుకుని నిలబడిపోయారు గౌరీనాధం.

 

    రుత్వి అలా ఎయిడ్స్ గురించి మాట్లాడి యిబ్బంది పెట్టినందుకు కాదు.

 

    విజూష ఆయనకి అభిముఖంగా నిలబడి వుంది, రెప్పలార్పకుండా తననే చూస్తూ.

 

    పరాయి ఆడదానితో పడగ్గదిలో  రెడ్ హేండెడ్ గా దొరికిపోయినట్టు స్థాణువైపోయాడు.

 

    ఫోన్ క్రెడిల్ చేసాడు.

 

    "ఎ. ఎ...... ఎంతసేపైందమ్మా వచ్చి?"

 

    "కుర్రాణ్నయిపోతానా? అని నువ్వడుగుతున్నప్పుడు గ్రాండ్ పా.

 

    ముచ్చెమటలుపోశాయి.

 

    మనవరాలి కళ్లలోకి చూడలేకపోయాడు.

 Previous Page Next Page