Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 34

 

 

    చెప్పబోయి టక్కున ఆగిపోయాడతను. సహదేవ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయ్.
    ఎవరికి ఏమీ చెప్పకూడదు. తన వుద్యోగం గురించి అది వార్నింగ్.
    "మరేం లేదు ! జీతాలు అవీ కరెక్ట్ గా 'పే' చేస్తారా అని."
    ఆమె నవ్వింది . "పని నచ్చాలే గాని దేని లోటుండదు వాళ్ళ దగ్గర. మరి నేను వెళ్ళనా?"
    "షూర్."
    "రేపు తప్పకుండా వస్తున్నారు కదూ?"
    "తప్పదు కదా! కొంతయినా మీ ఋణం తీర్చేసుకుంటే....."
    రోడ్డు మీద కొచ్చాడు. రాజ్యలక్ష్మి కారులో వెళ్ళిపోయింది. ఎయిర్ కండిషన్ కారు.
    ఎమ్మే సోషియాలిజీ రోడ్డు మీద నడుస్తున్నాడు.
    డేబనీర్ బార్ దగ్గర బోర్డు మీద రాసి వుంది.
    డార్క్ డెవిల్ అండ్ పార్టీ ఆర్కెస్ట్రా - టు నైట్ అండ్ ఎవ్విరి నైట్. లోపలకు తనను వెళ్ళనీరు.
    ఒకవేళ వెళ్ళినా డార్క్ డెవిల్ పుల్ లోడ్ లో వుంటాడు.
    రోడ్ల వెంబడి తిరుగుతూనే గడిపాడతను. ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది.
    తులసి కింద పడుకుంది.
    తనూ పక్కనే పడుకోబోతే లేచి మరో మూలకెళ్ళింది.
    తెల్లారేలోగా ఇద్దరూ ఇల్లంతా తిరగటం అయిపొయింది.
    ఓ పక్క భయం- మరో పక్క - దిగులూ పెరిగిపోతున్నాయి. నిజంగా లక్ష రూపాయలు యింకొద్దీ గంటల్లో తులసి పేర అకౌంట్ లో కొస్తుందా? తన కెందుకో యింకా నమ్మకం కలగటం లేదు.
    డబ్బు వుంది అని బ్యాంక్ వాళ్ళు చెప్పేవరకూ తను నమ్మడు.
    తులసి తనతో మాట్లాడకపోవటం మరింత చిత్ర వధగా వుంది. అడ మగగా కలసి వుండటం ప్రారంభించాక యిది మొదటిరోజు ఇలా మానసికంగా, శారీరకంగా దూరంగా గడపటం.
    క్రమీపీ చీకట్లు విచ్చుకుంటున్నాయ్. నిద్ర, ఆందోళన , విచిత్రమైన పరిస్థితి. తులసికి అప్పుడే నిద్ర పడుతున్నట్లుంది.
    "తులసీ!"
    "ఊ!"
    ఇంకా కోపం పోలేదా?"
    "........ "
    కొంత ధైర్యం వచ్చింది. కొంచెం మెత్తబడిందని అర్ధం.....మౌనానికి.
    ఆమెకు దగ్గరగా జరిగాడు.
    'తులసీ!"
    "........'
    ఆమె కళ్ళల్లో నీళ్ళు మెరుస్తున్న విషయం పూర్తిగా దగ్గరయ్యాక తెలిసింది.
    "తులసి! ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇదంతా మన కోసం చేస్తున్నాను."
    హటాత్తుగా ఉప్పెన వస్తున్నట్లు అతని మీదకు వచ్చిందామే.
    జుట్టు ఇద్దర్ని కప్పేసింది. ఆమె కన్నీరు అతని కళ్ళల్లోకి జారుతోంది.
    అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. టైము పదవుతోండగా స్పృహ లో కొచ్చారు.
    "గంగాభవాని తలుపు తట్టలేదెం ఇవాళ?" అడిగాడు సురేష్.
    "అదే ఆశ్చర్యంగా వుంది."
    తులసి తలుపు తెరచింది. మొక్కల పాదులు తీస్తుందామే. తులసిని చూసి చిన్నగా నవ్వింది.
    ఆమె కళ్ళు జ్యోతుల్లా ఎర్రగా వున్నాయ్.
    "స్వర్గంలో విహరించే రోజిదే గుర్తుంచుకోండి"
    గంగాభవాని విసుక్కోలేదు. కోపగించుకోనూ లేదు. తనలో తాను నవ్వుకుంది.
    అతనికి మతిపోయినట్లయింది.
    ఎప్పుడూ లేనిది ఆమె ఎందుకలా నవ్వింది? ఎందుకు తన మాటలకు రిటార్ట్ చేయలేదు?
    బ్యాంక్ మెట్లెక్కుతుంటే ఆ ప్రశ్నకు సమాధానం మెరపులా మెరసింది.
    రాత్రంతా తనూ, తులసీ దూరంగా గడపటం చూసింది. అదో సంతృప్తి. అందుకే కళ్ళలో ఎరుపు - గుండెల్లో చల్లదనం.
    
                                                   *    *    *    *

    సేవింగ్ బ్యాంక్ కౌంటర్ దగ్గర కళ్ళ జోడమ్మాయ్ చిరునవ్వుతో ప్రశ్నార్ధకంగా చూసింది.
    "9689 బ్యాలెన్స్ ఎమౌంట్ ఎంతుందో చెప్తే......"
    "మీరెవరు?"
    "తులసి ఫ్యూచర్ హబ్జెండ్ ని"
    'అంటే ఇప్పుడు......."
    "టెంపరరీ హబ్జెండ్ ని, ఇంకా కన్ ఫర్మేషన్ అనలేదు"
    ఆమె ముఖంలో చిరునవ్వు ఆరిపోయింది.
    లేడ్జర్ తెరచి చూసింది.
    "ఒక లక్షా అయిదు రూపాయలు"
    సురేష్ కి చెమటలు పట్టినాయ్. కళ్ళు తిరిగుతున్నట్లనిపించి కౌంటర్ గట్టిగా పట్టుకున్నాడు.
    "వన్ లాక్ " తన కలలో కూడా పొందలేని మొత్తం. భయం శరీరమంతా రక్తంతో పాటు పాకుతోంది.
    "ధా.....థాంక్యు....." అనేసి బయటకు నడిచాడు. అడుగులు తేలిపోతున్నట్లున్నాయ్. తులసి బయట కూల్ డ్రింక్ షాప్ దగ్గర నిలబడి వుంది.
    "ఏమయింది అడిగిందామె.
    "వన్ లాక్ బ్యాలెన్స్"
    ఆమె ఏమీ మాట్లాడలేదు. తన బ్యాగ్ లోంచి ఓ చెక్కు తీసి అతని కిచ్చింది.
    మళ్ళీ బ్యాంక్ లో కెళ్ళి ఐదువేలు క్యాష్ తీసుకొచ్చాడు. ఇద్దరూ హోటల్ కెళ్ళారు.
    "ఇది మన మొట్టమొదటి ఖరీదయిన అనుభవం తులసీ! లెటజ్ ఎంజాయ్ టు ది మాక్సిమమ్" ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ అన్నాడు.
    సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారిద్దరూ. గంగాభవాని చీకట్లో నిలబడి వుంది.
    "కరెంట్ పోయింది. కాండిల్స్ తెచ్చిస్తారా ఆ షాప్ కెళ్ళి" సురేష్ నడిగిందామే.
    "మనకు లైటు అవసరమా?"
    ఆమె ఇంట్లో కెళ్ళిపోయింది జవాబివ్వకుండా.
    అతను రోడ్డు మీదకు వచ్చాడు.
    రోడ్డంతా కూడా చీకటే. ఓ పక్క అనందం, మరో పక్క భయం.
    చాలా అనీజీగా వుంది. హటాత్తుగా నిద్ర వస్తున్నట్లనిపించసాగింది అతనికి.
    బహుశా రాత్రంతా నిద్ర లేకపోవటం వల్లనేమో.
    అయినా గానీ ఇంత మత్తు యింత హటాత్తుగా ఎందుకొస్తుంది? కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మెదడు మొద్దు బారిపోతోంది.
    "ఏం జరుగుతోందో తనకు?
    ఎందుకిలా అవుతోంది?"
    అతనికి అర్ధమయింది - తనింక నడవగ;గలగడం అసంభవం.
    
                                                          *    *    *    *

    చల్లని వాతావరణం.
    వెచ్చని దుప్పటి........
    మెత్తటి పరుపు......
    చిక్కని నిశ్శబ్దం....
    పల్చని వెల్తురు.
    ఎక్కడున్నాడు తాను? చుట్టూ చూశాడు సురేష్. రెండు వేపులా నిలువేత్తున్న కర్టేన్స్. మిగతా రెండు వేపులా పాలరాతి గోడలు.
    ఆ రంగులోనే కలిసిపోతూ ఓ తలుపు.
    కొంపదీసి  మళ్ళీ రాజ్యలక్ష్మి రూమ్ లో .....కంగారుగా తన పక్కన చూశాడు. హమ్మయ్య! విశాలమైన ఆ మంచం మీద తనొక్కడే వున్నాడు. అంచేత యిది హోటల్ మరిది కలా? లేక హోంగోవరయినా అయుండాలి.
    డార్క్ డెవిల్ ని కలుసుకోలేదు గనుక హోంగోవర్ కి ఆస్కారం లేదు. కనుక కలే అయుండాలి.
    కళ్ళు నులుముకున్నాడతను. కలలాగా అనిపించటం లేదు.
    "నైన్ మిలాకర్ చైన్ చురానా కిస్ కా హైయ్ కాం ------
    అరె హమ్ సే పూచో హమ్ కో పతా హై ఉస్ జాలిమ్ కా నామ్"
    అంటూ తన కిష్టమైన పాట పాడాడు. అక్కడా తెలిసిపోతోంది కల కాదని. జరుగుతున్నది కాలో నిజమో తెలుసుకోవడానికి చాలా సార్లు తులసిని మీదకు లాక్కునేవాడు. ఆ రగిలే వేడిలో రుజువయేది కలో నిజమో. పరుపంతా మరోసారి కలియచూశాడతను. ఖాళీ! తులసి లేదు. అంటే యిది తన ఇల్లు కూడా కాదు.
    కొంచెం గా భయం మొదలయింది. ఎందుకో తెలీదు. హటాత్తుగా గుర్తుకొచ్చిందతనికి తను వప్పుకున్న ఉద్యోగం , లక్ష రూపాయలు తులసి ఎకౌంట్ లోకి వచ్చింది. అది నిజామా కాదా అనేదే తెలీటం లేదు. అది కూడా కలేనేమో నని అనుమానం. అవునూ తనూ, తులసి కలసి బ్యాంక్ కెళ్ళారు కదా! లక్ష రూపాయలు ఆమె ఎకౌంట్ లో వుందని బ్యాంక్ క్లర్క్ చెప్పింది. మరి ఆ తరువాతెం చేశాడు తను?
    లేచి మంచం దిగబోయాడు సురేష్. కళ్ళకు స్లిప్పర్స్ చల్లగా తగిలాయ్. ఆశ్చర్యంగా వాటి వైపు చూశాడు. కొత్తవి........ తనవి కానేకావు.

 Previous Page Next Page