Previous Page
Next Page
అమ్మో! అమ్మాయిలు పేజి 33
" ఈ మాట చెమట చుక్కకే వర్తిస్తుందా? అన్ని చుక్కలకి వర్తిస్తుందా?"
" నీ అనుమానం తగ్గలెట్టా, తారలని అంటే సినిమాతారాలు కాదు.ఆకాశంలో తారలు. అంటే నక్షత్రాలు. వాటిని చుక్కలంటారు.
ముగ్గు పెట్టేటప్పుడు చుక్కలెడతారు. అంతేకాదు. వాక్యం పూర్తి కాంగానే చుక్క పెడతారు. కొన్ని గురుల్ని చుక్కలంటారు.
శరీరం మిద చుక్కలుంటాయి. ఇవిగాక తోకచుక్క. తోడేయటానికి చుక్క. ఇంకా..." అబ్బులు మా లావు వుషారుగా చెప్పుకుపోతున్నాడు.
చటుక్కున వ్యాకర్ణ అబ్బులి నోరు మూసి..." నీ చుక్కలు తగలెట్ట నీ మాట ఒప్పుకున్నాను. చుక్క అంటే బిందువే అంటే బిందు.
ఇహ రేఖ సంగతి చూసి తగలడదాం పద" అన్నాడు బోలెడు విసుగు ప్రదర్శిస్తూ.
అబ్బులు కళ్ళు భూతద్దాల్లోంచి మెరిశాయి. వ్యాకర్ణ చేతిని నోటిమిద నుంచి తొలిగించి ఆ చేతిని ముద్దు పెట్టుకొని-
"... నువ్వెంత మంచివాడవమ్మా! నువ్వెంత అందమైన వాడివమ్మా! నువ్వెంత తెలివిగలవాడివమ్మా! నువ్వెంత..."
వ్యాకర్ణ అబ్బులి మాటలకి అడ్డు థగిలిఒ " మరో ముక్క నీ నోటంట వచ్చిందంటే చంపేస్తాను. నన్ను తరువాత ఎత్తేద్దువు గాని నీకేం పుట్టిందో చెప్పు" అన్నాడు.
" చుక్క అంటే బిందు అని కనిపెట్టేశాను. అనుకోకుండా వచ్చిన మాటతో గీతని కూడా లాగేశాను."
" నా నోటంట గీతొచ్చిందా?"
" వచ్చిందా! చిన్నగా అడుగుతావేమిటి? వచ్చింది.
రేఖలు సంగతి చుద్దామన్నావు. గీతలంటే రేఖలు. గీత అంటే రేఖ. చుక్క అంటే బిందు. గీత అంటే రేఖ. ఆ అమ్మాయి పేరు బిందు రేఖ.
అర్ధమయిందిరా! పేరు చూడబోతే వ్యాకర్ణం తెలివి చూడబోతే వ్యా... వ్యా..." అన్నాడు అబ్బులు.
" బిందు రేఖ పేరు బాగుంది. అసలా రేఖ గీతని... బిందుచుక్కాని...ఎలా చెప్పగలవ్!
గీతలోను చుక్కలోను మరో పేరుండవచ్చు కదా?" అన్నాడు వ్యాకర్ణ సందేహం వెళ్ళబచ్చుతూ.
" ఇదిగో ఇలాంటి వెధవనుమానాలు వెలికి తీయకు. ఆ పిల్ల పేరు బిందురేఖే. కాకపోతే ఓడిపోయేది నేను. నీకేం బాధ?"
" ఇందా కేమన్నావ్! నీ ఓడిపోవటం నాకు కూడా అవమానమన్నావు గుర్తుందా?"
" గతం మర్చిపోరా కుంతీపుత్రా!"
" పోతాను. నీదేం పోయింది, మంచయినా చెడయినా నీ తర్వాతే కదా నాకు తగిలేది."
" అలా అన్నావు బాగుంది" అన్నాడు వ్యాకర్ణ.
అబ్బులు వ్యాకర్ణ కలిపి యధాస్ధానంలో పేపర్లు పుస్తకాలు సర్దారు.
ఆ తర్వాత ఆ సాయంత్రం లోపల అబ్బులు లెట్రిన్ కి పదిసార్లు బాత్ రూమ్ కి పాతికసార్లు వెళ్ళొచ్చాడు.
ఆ ఆల్చిప్పల అందమైన కళ్ళు గల అమ్మాయి కనపడుతుందేమో " నీ పేరు బిందురేఖ" అని చెపుదామని.
ఆ పిల్ల మాత్రం అబ్బులి కంటపడలేదు.
పదిసార్లు లెట్రిన్ కి పాతికసార్లు బాత్ రూమ్ కి తిరిగి నందున అబ్బులుకి బోలెడు నీరసం వచ్చింది.
" ఇంత యిది పనికిరాదు ఎంతయినా" అంటూ వ్యాకర్ణ కోప్పడ్డాడు.
రాత్రి భోజనాలయ్యాయి.
కాసేపు జయచిత్రతో బాతాఖానీ యేసోచ్చి నిద్రపోదామని వ్యాకర్ణ, అబ్బులు జయచిత్ర దగ్గరకు వెళ్ళారు. బిందురేఖతో కబుర్లు చెపుతున్న జయచిత్ర వీళ్ళను చూసి " రండి రండి" అని ఆహ్వానించి వరండాలో కుర్చీ లేసింది.
Previous Page
Next Page