Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 33


    "మరేం చేయాలంటావు?"

    "ఏదయినా మంచి పరువంలో వున్న పిల్లను మనమే సెలెక్ట్ చేసుకొని ఆమె వద్దు అంటున్నా వినకుండా రేప్ చేయాలని వుంది...."

    "ఓరి నీ థ్రిల్ పాడుగాను....అదేం కోరికరా....కావాలంటే కావలసినంత పారేసి, ఇష్టమయిన ఆడదాన్ని తెచ్చుకుందాం....అంతే తప్ప రేప్ లు వగైరాలు మనకొద్దు...." అంటూ అతన్ని వారించబోయాడు అశోక్.

    "నువ్వు నోరు మూసుకోరా అశోక్....ఆనంద్ కోరికను మాత్రం ఎందుకు కాదనాలి...." అంటూ అతన్ని సమర్ధించాడు శివరామ్.

    "అవును....ఆ టేస్ట్ కూడా ఎలా వుంటుందో రుచి చూద్దాం" సపోర్టు పలికాడు ఆనంద్.

    "సరే....ఇప్పుడంత అర్జెంటుగా అంత అందమైన పిల్ల మనకు ఎక్కడ దొరుకుతుంది....ఆ...నాకు తెలిసిన ఒక అపరంజి బొమ్మ వుంది....లేత గులాబీ, ఆ లేడి కళ్ళ గులాబీని ఒక్కసారి చూస్తే మీరెవ్వరూ వదిలి పెట్టలేరు....అంత అందంగా వుంటుంది ఆ పూబోణి" అంటూ తన్మయత్వంలో మునిగిపోయాడు చాణక్య.

    "అంత బాగుంటుందా?" ముగ్గురూ అన్నారు ఒకేసారి.

    "బాగుంటుందా....ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది"

    "మరయితే ఇంకేం....ఒక పట్టు పట్టవలసిందే" శివరామ్ ఉత్సాహంగా అన్నాడు.

    "పట్టుపట్టవచ్చు....కాని ఒక చిక్కు వచ్చిపడుతుందే...."

    "ఏమిటది?"

    "ఆ గులాబి వున్నది ఎక్కడోకాదు. మా పిన్నిగారింట్లో...."

    "అయితే ఇప్పుడేం చేద్దాం?....ఆమె మీద ఆశలు వదులుకుందామంటావా?" నీరసంగా అన్నాడు ఆనంద్.

    "ఈ నెల పదిహేడవ తేదీ....అంతే ఇంకొక రెండు రోజులుంది....మా దగ్గర బంధువులింటిలో పెళ్ళికి వెళతారు మా పిన్నివాళ్ళు....ఆమె ఒకతె వుంటుంది ఇంటిలో....అప్పుడు చూద్దాం ఆమె విషయం" ఆలోచించి మరీ చెప్పాడు చాణక్య.

    "అంతేనంటావా....మరి ఈ రెండు రోజులు ఎలా ఎంజాయ్ చేయాలి"

    "మంగతాయారుకు ఫోన్ చేసి ఎవరో ఒకర్ని పంపమని చెబుదాం. ఈ రెండు రోజులు ఎలాగోలా ఎడ్జస్టు అయిపోదాం...." అన్నాడు అశోక్.

    మారు మాట్లాడకుండా ఫోన్ చేసి చెప్పాడు శివరామ్.

    అవతలవైపు నుంచి వినిపించిన సమాధానానికి పెద్దగా నవ్వుకుంటూ నలుగురు విస్కీ గ్లాసులు ఖాళీ చేయడంలో మునిగిపోయారు.


                           *    *    *


    రాణా మనసు మనసులో లేదు....

    ఎంత వెదికినా ఎక్కడా చక్రవర్తి జాడ లభించలేదన్న వార్త అతని గుండెల్లో బడబాగ్నిని రగిల్చింది.

    ఒకవేళ నగరం వదిలిపెట్టి....అసలు ఈ రాష్ట్రాన్నే వదిలి మరొక రాష్ట్రం పారిపోయి వుంటాడేమోనన్న అనుమానం కూడా అతనికి రాక పోలేదు.

    రాణాకు ఎన్నో రాష్ట్రాల ముఠాలతో పరిచయాలున్నాయి. వాటిల్లో కొన్ని చక్రవర్తికి కూడా తెలుసు.... ప్రస్తుతం అలాంటి ముఠాలలో ఏదయినా చక్రవర్తికి ఆశ్రయం కల్పిస్తే....తన గురించిన రహస్యాలు ఆ ముఠా చేతికి చిక్కినట్టే.

    తనతో రహస్య సంబంధాలున్న ముఠాల వివరాలు చక్రవర్తికి తెలుసు కాబట్టి అతని సహాయంతో ఆయా ముఠాల గుట్టు రట్టుచేస్తే పరోక్షంగా  తన బలహీనుడౌతాడు.

    అంటే, తన పతనం ప్రారంభం అవుతుంది.

    అందుకే....

    చక్రవర్తి ఎక్కడకూ దాటిపోకూడదు.

    అతను ఎక్కడున్నా పట్టి అంతం చేయాలి. 

    రాణా ఆలోచనలు ఇలా సాగుతున్న సమయంలోనే అతని దగ్గరకు వచ్చాడు జగపతి.

    "చాలా కాలానికి వచ్చావు జగపతి"

    "ఏమీలేదు రాణాభాయ్....చక్రవర్తి తప్పించుకున్న విషయం తెలిసి వచ్చాను...."

    "వాడికోసం నా మనుషులు వెదుకుతున్నారు. ఎక్కడ దాక్కున్నాడో కానీ ఇంకా ఆ ఎలుక కలుగు వదిలి బయటకు రాలేదు...."

    "నీకు ఆ చక్రవర్తి ఆచూకీ తెలియలేదు. నాకు ఆశ్రీప్రియ ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు...." పళ్ళు కొరుకుతూ కసిగా అన్నాడు జగపతి.

    శ్రీప్రియ పేరు వినిపించగానే రాణాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

    "జగపతీ సమయానికి వచ్చి చాలా మంచి ఐడియా ఇచ్చావు" రాణా ఆనందంగా అన్నాడు.

    "నేను ఐడియా ఇచ్చానా?"

    "ఎస్...."

    "ఏమిటది?"

    "చక్రవర్తి....శ్రీప్రియను ప్రేమించాడు. ఇపుడు జైలు నుంచి అతను ఎందుకోసం పారిపోయి వచ్చినప్పటికీ అతను ఒక్కసారయినా శ్రీప్రియను కలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు....ఎందుకంటే ప్రేమించడమొక్కటే కారణం కాదు. ఆమెవలన అతను జైలుపాలయ్యాడు. కనీసం అలా ఎందుకు చేసిందో తెలుసుకోవడానికయినా ఆమెను కలిసి తీరుతాడు...."

    "నువ్వు అనేదేంటో అర్ధంకావడంలేదు" జగపతి అన్నాడు అయోమయంగా.

    "ముందు శ్రీప్రియ ఎక్కడున్నా పట్టితెచ్చి మనగూట్లో వుంచుదాం....దానికోసం చక్రవర్తి ఎప్పటికయినా తనంతట తనే మనదగ్గరకు రాకతప్పదు."   
 

 Previous Page Next Page