Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 33

 

    ఆ విషయం తను బయటకు చెప్పలేదు. ఎందుకంటె దొంగకు తేలుకుట్టి నట్లయింది గనుక -
    "థాంక్యూ వెరీ మచ్ - ' అంది మల్లిక ఆలోచనల్లో నుంచి బయటపడి.
    "బెయిల్ రాగానే సంబరం కాదు. ఈ కేస్ పెట్టె తిప్పల నుంచి బయటపడే మార్గం  చూడు-'
    మల్లికకు భయం వేసింది.
    ఈ లెక్కలో భరద్వాజ్ తనను టోటల్ గా డోజోన్ చేస్తాడు. అంటే అకేస్ ని తనోక్కర్తే పైట్ చేయాలి !
    కానీ అది ఓడిపోయే ఫైట్ అని తన మనసుకి తెలుసు!
    "ఈ విషయం తెల్సా?" అడిగాడు భవానీ -
    "ఏంటది ?"
    "నీ మీద డామేజేస్ కి కూడా కేస్ ఫైల్ చేయబోతున్నారు -"
    "ఓగాడ్-"
    "ఇంకో పదిసార్లు ఓగాడ్ అంటావ్- ఎంత కేస్తున్నానారో తెలుస్తే -"
    మల్లిక వళ్ళు భయంతో గగుర్పోడిచింది.
    "ఎంత ?" హీనస్వరంతో అడిగింది.
    "యాభై లక్షలు -"
    స్పృహ తప్పతున్న ఫీలింగ్ - అతికష్టం మీద కుప్పకూలి పోకుండా ఉంటానికి ప్రయత్నిస్తోంది - కారు తనింటి దగ్గర ఆగింది - అతనికి తనిల్లు ఎలా తెలుసు? నెమ్మదిగా కారు దిరిగింది.
    "అవన్నీ అలోచించి బుర్రపాడు జేసుకోకుండా - హాపీగా నిద్రపో! పొద్దున్న డిస్కస్ చేద్దాం - ఒకే?"
    అతని మాటలతో మల్లికలో భయం కొంతవరకూ తగ్గిపోయింది. అంటే రాకేష్ తనకు సాయం చేస్తాడా? అతనికి తన మీద ఇంత అభిమానం ఎందుకు కలిగి ఉంటుంది? జాలా? ఏదయినా కానీ ! అతనికి తను రుణపడి ఉంది.
    "ఓకే గుడ్ నైట్ -"
    కారు వెళ్ళిపోయింది .
    తల్లి ఏదేదో మాట్లాడుతూనే ఉంది కాని మల్లిక మనసా మాటలను పట్టించుకోవటం లేదు. పూర్తిగా కన్ ఫ్యూజెడ్ స్టేట్ లో ఉంది.

                         ***

    మర్నాడు సంపూర్ణ చానెల్ ఆఫీస్ కి చేరుకుంది మల్లిక.
    భరద్వాజ్ అటో ఇటో తెల్చుకోదానికే వచ్చిందామే.
    కానీ బయట సెక్యురిటీ వాడు అపేసరికి నిర్ఘాంతపోయింది.
    "మిమ్మల్ని లోపలకు రానీయవద్ధన్నారమ్మా సారు-"
    "ఏ సారూ?"
    "భరద్వాజ్ సార్-"
    "ఎందుకని?"
    "తెలీదు-"
    "ఇంటర్ కమ్ ఫోన్లో మాట్లాడించు -"
    "సారీ మేడమ్-"
    మల్లికకు అవమానంతో కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    వెనక్కు తిరిగి ఇంటికి బయల్దేరింది -
    ఇల్లు చేరుకునేసరికి 'బృందావనం' చానెల్ కారు కనిపించింది.
    "రాకేష్ గారు మిమ్మల్ని తీసుకు రమ్మన్నారు మేడమ్-"
    మల్లిగా హాపీగా ఫీలయింది.
    తను ఒంటరిది కాదు. ఎంత రిలీఫ్ కలిగిస్తుందీ ఫీలింగ్?
    భవానీ తన స్టాఫ్ తో మీటింగ్ లో ఉండగా లోపలి కొచ్చిందామే-
    "రా ! కూర్చో-" అన్నాడు భవానీ.
    "బయట వెయిట్ చేస్తాను - మీ స్టాఫ్ మీటింగయాక వస్తాను -"
    "నువ్వూ ఇవాళ్టి నుంచి మా స్టాఫే! కూర్చో -"
    షాకయింది.
    "ఏంటితను?
    తను అతనిని రెండు మూడు సార్లు ఇన్సల్ట్ చేసినా --- ఇంత హెల్ప్ చేస్తున్నాడు? మీటింగ్ మధ్యలో మల్లికను స్టాఫ్ కి ఇంటడ్యూస్ చేశాడు.
    "షి ఈజ్ మల్లికా! మన చానెల్ కి క్రియేటివ్ హెడ్ గా ఇవాళ్టి నుంచీ జాయినయింది."   
    మల్లికకు అయోమయంగా వుంది. లోలోపల ఆనందంగానూ ఉంది.
    భరద్వాజ్ తనను అంత హీనంగా , దారుణంగా ట్రీట్ చేశాక - అసలీ లైఫ్ - మీదే విరక్తి కలిగింది.
    అలాంటి మానసిక స్థితిలో ఉన్న సమయంలో తనకు మళ్ళీ అంత పెద్ద రెస్పన్సీ'బులిటీ ఇవ్వటం - అతని గ్రేట్ నెస్! మల్లిక లేచి నిలబడి అందరికీ విష్ చేసింది.
    "రాకేష్ గారు నాకిలాంటి ముఖ్యమయిన పదవి ఇవ్వటం - నాకెంతో అనందం కలిగించింది. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి - నిన్నటివరకూ నేను సంపూర్ణ చానెల్ కి క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేశాను కానీ నేను చేసిన ఒక తప్పు వల్ల పోలీస్ కేస్ లో ఇరుక్కున్నాను. దాంతో నా జాబ్ పోయింది. సో - మానసికంగా నేను డిప్రేసేడ్ పొజిషన్ లో ఉన్న సమయంలో రాకేష్ నాకీ జాబ్ ఇవ్వటం -- నిజంగా నాకిది - మోరల్ బూస్టర్ గా వర్క్ చేస్తుంది. ఇంతవరకూ చేసిన పొరబాట్లు ఇకముందు చేయకుండా బృందావనం చానెల్ నెంబర్ వన్ చానెల్ అవడానికి నావంతు ప్రయత్నం నేను చేస్తాను."
    ఆమె మాటలు ఇంకా పూర్తవకుండానే రాధా చమేలీ కోపంగా లేచి నిలబడింది.
    "ఆమె అపాయింట్ మెంట్ ని నేను అబ్జెక్ట్ చేస్తున్నా -" అంది ఆవేశంగా . అందరూ ఆశ్చర్యపోయారు.
    "అబ్జెక్ట్ సంగతి తర్వాత - ముందు సబ్జెక్ట్ ఏమిటో చెప్పు - " అన్నాడు రాకేష్.
    "నేను ఈ చానెల్ కి క్రియేటివ్ హెడ్ గా - చానెల్ స్టార్టయినప్పటి నుంచీ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సడెన్ గా నా ప్లేస్ లో రేపో మాపో జైలు కెళ్ళ బోయే మల్లిక నేస్తారా? నేను కోర్టు కెల్తా-"
    "హలో - చానెల్ స్టార్టయిన దగ్గర్నుంచీ ఇవాళ్టి వరకూ నువ్ ఈ చానెల్ కి క్రియేటివ్ హెడ్ గా పనిచేశానంటున్నావ్- మన చానెల్ నీవల్ల మూతపడే స్టేజ్ కొచ్చిందని చెప్పటంలా! నువ్విచ్చిన స్టేట్ మెంట్ ఒక్కటి చాలు నిన్ను ఉద్యోగంలో నుంచి పీకేయడానికి! కానీ పీకటంలా! ఎందుకో తెలుసా? తన వల్ల నీ ఉద్యోగం పోయిందని మల్లిక ఫీలవుతుంది. నువ్ ప్రొడ్యుసర్ గా ఏదొక ప్రోగ్రాం చేసుకో! ఇష్టం లేకపోతే రిజైన్ చేసేయ్!"
    "నేను రిజైన్ చేస్తాను -"
    "వెల్ కమ్ ! మా చానెల్ కి కావలసింది నీలాంటి దూరదర్శన్ టైప్ థింకింగ్ ఉన్నవాళ్ళు కాదు. ఇంటెలిజెంట్ అండ్ ఎగ్రేసివ్ క్రియేటివ్ హెడ్ కావాలి - ఆ క్వాలిటీ మల్లికకుంది - అందుకే సంపూర్ణ చానెల్ నెంబర్ వన్ అయింది - ఇంక పో-"   

 Previous Page Next Page