Previous Page Next Page 
దావాగ్ని పేజి 33


    తల అడ్డంగా తాటించాడు ప్రొఫెసర్ రామనాధం.

 

    "నాకు డబ్బు అవసరం చాలావుంది. కానీ డబ్బుకు అమ్ముడుపోయే మనిషిని కాను నేను. రిపోర్టు జెనరల్ భోజా సెక్రెటేరియట్ కి పంపి తీరాల్సిందే: అది తప్పదు" అన్నాడు.

 

    "అయితే మీ ఇష్టం నేను ఇంక చెప్పేదేమీ లేదు" అన్నాడు బాబూజీ ముక్తసరిగా.

 

    సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు రామనాధం.

 

    వెళుతున్న రామనాధం వైపే చూస్తూ వుండిపోయాడు బాబూజీ.

 

                         *    *    *    *

 

    చీరెవిప్పెయ్య మనగానే నిర్ఘాంతపోయి నిల్చున్న వినీలతో అన్నాడు ప్రతాప్.

 

    "ఏజెంట్లు రోజూ రొటీన్ వర్కే చేస్తూ ఉంటారనీ, అది చాలా బోర్ గా వుంటుందనీ చెప్పాను నీకు. కానీ అప్పుడప్పుడు అత్యంత సాహసోపేతమైన పనులు కూడా చెయ్యడం తప్పదు. ఈ క్లోక్ అండ్ డాగర్ బిజినెస్ లో.

 

    నువ్వు దీనిని అదృష్టంగా భావిస్తావో, దురదృష్టంగా భావిస్తావో తెలియదుగాని. నువ్వు చెయ్యబోయే పనులు మాత్రం ఫాంటసీలను గుర్తుతెస్తాయి" అన్నాడు.   

 

    మౌనంగా చూస్తూ నిలబడింది వినీల.

 

    "అయితే ఇప్పుడు నేను చెప్పినదానికీ, నువ్వు చీరె విప్పెయ్యడానికీ సంబంధం ఏమిటనుకుంటున్నావా? సంబంధం వుంది."

 

    "ఏమిటది?" అంది వినీల వినీవినబడనట్లు.

 

    "ఏజెంట్లు తమ శిక్షణలో భాగంగా ఒక విషయం నేర్చుకోవాలి అంటే సిగ్గు వదిలెయ్యటం నేర్చుకోవాలి."

 

    "ఎందుకు?"

 

    గొంతు సవరించుకొని చెప్పడం మొదలెట్టాడు ప్రతాప్ "మొగాళ్ళకన్నా ఆడవాళ్ళకి సహజంగానే శారీరక పరమైన సిగ్గు చాలా హెచ్చుగా వుంటుంది. ఏదైనా ఒక అవాంతర పరిస్థితి ఎదురయిందనుకో: ఉదాహరణకి ఒక అసైన్ మెంటు చేస్తున్నప్పుడు నీ బట్టలు అంటుకున్నాయి కానీ ఆ కారణంగా అసైన్ మెంటు సగంలోవదిలెయ్యడానికి వీలులేని పరిస్థితి - ఎలాగైనా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి.... లేదా, వంటి మీద బట్టలులేని స్థితిలో ఒక పనిని నిర్వర్తించవలసి వచ్చిందనుకో, అలాంటి సిచ్యుయేషన్స్ లో మొగాడు. ప్రవర్తించినంత చొరవగా ఆడది ప్రవర్తించలేదు... అలా ఉన్నవాళ్ళు టాప్ ఏజెంట్లు కాలేరు.

 

    కాబట్టి లెసన్ నెంబర్ టూ: స్ట్రిప్:"

 

    "ఇప్పుడే? ఇక్కడేనా?" అంది వినీల మొహమాటంగా.

 

    స్థిరంగా అన్నాడు ప్రతాప్-

 

    "అవును"

 

    "మీ ఎదురుగానా?"

 

    "నేను ఒక మొగవాడినని మర్చిపో...: దటీజ్ ద పార్టీ ఆఫ్ ద ట్రైనింగ్:"

 

    అతను నిజంగానే చెబుతున్నాడో, లేదా వేళాకోళం ఆడుతున్నాడో అర్థం కాలేదు వినీలకి.

 

    కానీ అతను వేళాకోళాలు ఆడే మనిషిలా కనబడటం లేదు.

 

    అది కాకపోతే... అతనికేమన్నా దురుద్దేశం వుందా?

 

    "డోన్ట్ వేస్ట్ టైం: స్ట్రిప్" అన్నాడు ప్రతాప్.

 

    తన మాటకి తిరుగులేదన్నట్లు వుంటుంది అతని గొంతు.

 

    తన పాతికేళ్ళ జీవితంలో ఇంతటి విపత్కర పరిస్థితి యెప్పుడూ ఎదురు కాలేదనిపించింది వినీలకి. దేముడి మీద భారంవేసి, వంటి మీద బట్టలు ఒక్కొక్కటీ తీసి పక్కన పడెయ్యటం మొదలెట్టింది.

 

    అలా చెయ్యవలసి వచ్చినందుకు సిగ్గుతో కుంచించుకుపోతోంది తను.

 

    నిర్వికారంగా, నిర్నిమేషంగా ఆమె నగ్నదేహంవైపు చూస్తున్నాడు ప్రతాప్.

 

    నేల చూపులు చూస్తూ నిలబడివుంది వినీల.

 

    కొద్దిసేపటి తర్వాత ఆమెకి అనిపించింది అతను ఒక పురుషుడు చూసినట్లు తనని చూడటం లేదు.

 

    ఒక డాక్టరు పేషెంటు శరీరం వైపు చూసినట్లు క్లినికల్ గా చూస్తున్నాడు.

 

    లేదా -

 

    ఒక ఆయుధాల నిపుణుడు తను ప్రయోగించదలుచుకున్న సరికొత్త ఆయుధాన్ని పరిశీలించి చూసినట్లు చూస్తున్నాడు.

 

    అంతే:

 

    అలా అనిపించిన తర్వాత ఆమెకు కొద్ధిగా ధైర్యం వచ్చింది. సిగ్గు జారిపోవడం మొదలెట్టింది.

 

    "నాభికింద నయాపైస అంత పుట్టుమచ్చ:" అన్నాడు అతను స్వగతంలా. "అదొక్కటే నీకు ఐడెంటిఫికేషన్ మార్కు.... వెనక్కి తిరుగు."                   

 Previous Page Next Page