Previous Page Next Page 
రుధిర మందారం పేజి 31

    అక్కడున్న రౌడీలు జేబుల్లోకి చేతులు పోనిచ్చారు. చటుక్కున రివాల్వర్లు బైటికి తీసారు. రెండు రివాల్వర్లు వెంటనే పేలాయి.
    సుందరమూర్తి అబ్బా అని బాధతో గావుకేక పెట్టి తన చేతిలో పిస్తోలు వదిలేసాడు. గుచ్చు నేలమీద ఖంగ్ మంటూ శబ్దం చేసాయి.
    అవి చకచకా రెండు పిస్టల్స్ ని ఒకడు అందుకున్నాడు. ఇంకొకడు రాజారావు కట్లు విప్పాడు. ఇద్దరి చేతుల్లోని రివాల్వర్లు అనంతపద్మనాభ శాస్త్రికి, సుందరమూర్తికి గురిపెట్టబడి వున్నాయి. ఎవరు నీవు ఏమిటి అన్యాయం? అన్నాడు సుందరమూర్తి జరుగుతున్న దేమిటో తెలియక బిత్తరపోయి చూస్తూ వుండిపోయాడు అనంతపద్మనాభ శాస్త్రి.
    రాజారావు బద్ధకంగా ఒకసారి ఒళ్ళు విరుచుకొని కాళ్ళు, చేతులు విదిలించుకుని సరిగ్గా నిలుచున్నాడు. డియర్ ఫ్రెండ్స్ నేను కోడ్ లో చెప్పగానే క్విక్ గా అందుకుని అంతకన్నా క్విక్ గా పనిచేశారు గుడ్. అక్కడున్న వారితో అని సుందరమూర్తి వైపు, అనంతపద్మనాభ శాస్త్రి వైపు తిరిగాడు రాజారావు.
    "అనంతపద్మనాభ శాస్త్రిగారూ! సుందరమూర్తిగారూ! జరిగింది చూస్తుంటే మీకంతా అయోమయంగా వుంది కదూ! రెండు ముక్కల్లో జరిగింది చెప్తాను మీకే అర్ధమవుతుంది వినండి. ఒక రోజు నేను కాకా హోటల్లో టీ తాగుతున్నాను.అప్పుడు నా రూపం నలిగిపోయిన దుస్తులు, పాడిన ముఖం మధ్యరకం సంసారంలో పుట్టిన వాడు చదువురాని నిరుద్యోగిలా వుంటాడే అలా వున్నాను. అదే హోటల్లో టీ తాగటానికి సుందరమూర్తి, నీవు వచ్చావు. అదే పనిగా నన్ను చూడ్డం మొదలు పెట్టావు. తరువాత నన్ను పలకరించావ్. బి.ఏ. ప్యాసై మూడేళ్ళు అయిందని నిరుద్యోగంతో బాధపడుచున్నానని నీతో చెప్పాను. అప్పుడు నీవు నాకు ఉద్యోగం ఇప్పిస్తావని పెద్ద హోటల్ కి తీసుకువెళ్ళి ఆ ఉద్యోగం ఏమిటో చెప్పావు.
    నా మిత్రుడు నన్ను మోసం చేసి ఏ మూలో తల దాచుకుంటున్నాడు.
    నా మిత్రుడు అనంతం పోలికలు నీలో ఉన్నాయి. అతనిలా నిన్ను తయారు చేస్తాను. నడక మాటలు అలవాట్లు అన్ని నేర్పుతాను నీవు చేయవలసిందల్లా నాతోపాటు నేను తిరగమన్న వూరు తిరగాలి. ముందు పదివేలు ఇచ్చి ప్రతినెలా వేయి రూపాయలు ఇస్తానని చెప్పావు నేను సరేనని అన్నాను.
    ఎన్నో ప్రదేశాలు తిరిగాం ఫలితం కనబడలేదు. వున్న వూరు వచ్చాం. అనంతం ఇక్కడే ఉన్నాడు కాబట్టి బయటపడ్డాడు. ప్రతి నిముషం లాంగు కోటు నెత్తిన హేటు నల్ల కళ్ళద్దాలు.
    మారువేషంలో నన్ను నీవు నన్ను అనుసరిస్తూనే ఉన్నావు.
    నాకు సూచనలు ఇస్తూనే ఉన్నావు. అనంతం నేనెవరై ఉంటాను. అని ఆరా తీస్తూ తన దృష్టి నాపై మళ్ళించాడు. సమయం సద్వినియోగం చేసుకుని అనంతం మనుషులని స్థావరాన్ని నీ వశం చేసుకున్నావు.
    అంతేకదా సుందరమూర్తి ఇప్పటివరకు జరిగింది జరిగిన కధ అంతా చెప్పి అడిగాడు రాజారావు.
    "ఇంతకీ నీవెవరవు నేను నియమించిన నీవు నాపై తిరుగుబాటు చేయటమేమిటి" సుందరమూర్తి తీవ్రంగా అడిగాడు.
    వస్తున్నా బ్రదర్ అక్కడికే వస్తున్నా నేను ప్రభుత్వం సి.ఐ.డి. ని. ఇంటలిజెన్ శాఖలో పని ఒక కేసు నిమిత్తం నేను తిరుగుతూ ఉండగా అనంతం పోలికలు కనపడ్డాయి. అవసరానికి నన్ను వాడుకున్నావు. నీ విషయం నీ కధ నాకు అనుమానస్పదంగా తోచి నీ గురించి ఎంక్వయరీ చేసాను. నీవు నా మిత్రుడు గుప్తధనం అని చెప్పావ్ అది గుప్తధనం కాదని మ్యూజియంకు తరలిస్తున్న కొన్ని విలువైన వజ్రాల్ని ప్లాను పన్ని కాజేశారని తెలుసుకున్నాను. నేను నా మిత్రులు రంగంలోకి దిగి అంటే ఇలాగే నీ ప్లానుతో కేసుని నరుక్కొద్దామని దిగాం నీవు నన్ను కలిపెట్టి అనంతం కోసం వుంటే మా వాళ్ళు అటు నిన్ను ఇటు నన్ను వేరేకంట అనంతం కోసం మారువేషాలలో కనిపెడుతూ సమయం ఎప్పుడా అని రెడీగా ఉన్నారు. అనంతం మనుష్యులని నీవు డబ్బుతో వశపరుచుకున్నానని మురిసిపోయి తెలివిగా ఇప్పుడు ఎదురుపద్దావు నీ ప్లానుకి పైప్లాను నిన్ననే మా వాళ్ళు వేశారు.

    అనంతం స్థావరం ఆక్రమించి రెడీగా ఉన్నారు. ప్లాను మీద ప్లాను పన్ని అందరూ మారువేషం మనుషులుగా మారారు. ఇహ అసలు వేషాలుకి మరి మా కర్తవ్యం మేం నిర్వహిస్తాము. ప్రభుత్వాన్ని మోసగించి మ్యూజియంకు వస్తున్న విలువైన వజ్రాలను దొంగిలించినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాం. తంతే ఎగిరి గారెల బుట్టలో పడ్డట్టు అని ఒకసామెత వుంది. ఒక కేసులో తిరుగుతున్న నా దగ్గరకు విధి నన్ను తన్ని పడేట్లు చేసింది.

    ఇది గారెల బుట్టకాదు అంతే నవ్వుతూ అన్నాను. రాజారావు పేరుతో నటించిన నేను.
    సుందరమూర్తి తల వాలిపోయింది. అనంతపద్మనాభ శాస్త్రి ముఖం దించుకున్నాడు.
    ఇన్ స్పెక్టర్ అక్కడున్న వారిద్దరికి బేడీలు తొడిగా
    నా నిజం పేరు ఓ కేసు సక్సెస్ చేసి ఆ వేషంలో వస్తుంటే వాళ్ళకి తారసపడటం నేను వాళ్ళకి వివరించలేదు. ఏ విషయం అయినా మా డిపార్టుమెంటు వరకూ తెలియవచ్చుకాని, హంతకులకి అగంతకులకి మా వివరం పూర్తిగా చెప్పటం మా వృత్తి ధర్మానికే విరుద్ధం.

    ఓ వారంలో ఈ కొత్త కేసు పని చూశాను. మిగతా విషయం అంతా ఇన్ స్పెక్టరే చూసుకుంటాడు.
    అందుకే.
    ఇన్ స్పెక్టర్ ఘనమైన విందు ఇస్తానన్నా మరోసారి వస్తానని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాను.
    రాజారావు పేరుతో ఒకటికి రెండు కేసులు సాధించాను.
    చాలు ఈ తృప్తిచాలు.
    వచ్చిన పని అయిపోయింది. దిగ్విజయంగా తిరుగుముఖం పట్టాను.
                                          29
    రాజారావు కేసు అంటే ఆ పేరుతో నేను పూర్తి అయిన తర్వాత నాకింకా కొత్త కేసులు లేకపోయాయి. మరో కేసు వచ్చిందాకా ఫ్రీ హాయిగా తిరగవచ్చు. కాని నేను రుధిర మందారాన్ని మరిచిపోలేదు.   

 Previous Page Next Page