"నె చెప్పాను కద్సార్, అందుకే మీకింత ధైర్యం వచ్చింది."
చిరంజీవి నవ్వి వూరుకున్నాడు.
"సీతరామారాజు చనిపోతూ బ్రీటిషువారు తన దేశాన్ని వదిలిపోవాలని వినడం చేశాడు. మరి మీరేం చేస్తారు సార్?"
ఖైదీ ఆఖరి మాటలకి చాలా విలువ వుండి. వాటిలో ఏ మాత్రం గిప్పతనం ఉన్నా రికార్డుచేస్తారు. అఫీశియాల్ గా కాదు. చాలమంది ఖైదీలు మౌనంగా తాడు మెడచుట్టూ పడటాన్ని గమనిస్తారు. కొంతమండి విప్లవం గురించి వినదాలు చేస్తారు. కొంతమండి జోకులేస్తారు. అటువంటివి కొన్ని గమనిద్దాం.
డేలానాక్ అనేవాడు గేలేటైన్ బ్లేడు తన మేడని కట్టిరించబోయే ముందు "ప్రపంచానికి గుడ్‌బై " అన్నమాట ఆఖరుగా అన్నాడు.ఉరికి ముందు అఖ్రుమాతగా 'లేపో' అన్న నాటక రచియిత: "నిన్నర్త్రి ఆడిన న్ న్టకం గురించి ఈ రోజు పేపర్లో పడుతుందో, లేదో."
చావుని చాలా తేలిగ్గా తీసుకున్న జేమ్స్ రీడ్___ "నా ఫ్మ్టు గుండీ సరిగ్గా పెట్టండి ఎవరైనా. నా చేతులు వెనక్కీ కట్టేసి వున్నాయి."
విలియం హార్భారీ అన్న హంతకుడు ఎలక్ట్రక్ కుర్చీలో కూర్చున్న తరువాత ఆఫీసర్ ని చూసి "స్విచ్ నొక్కు, ఏమిటి ట్రబుల్? ఆర్ యూ నెర్వస్?" అన్నాట్ట.
తన చావు చూడటానికి వచ్చిన జనాన్ని గమనించి ఒకడు "జనం అంతా ఇక్కడే వున్నరు. ఈ రోజు మార్కెట లో బిజినెస్ డల్ గా వుండి వుంటుంది."
ఉరితీసే వ్యక్తితో సిపియోర్ అన్న ఫ్రెంచివాడు "నేనే నెవైతే ఇంకొంచెం కాం గా ఉరీతీస్తాను" అన్నాడట.
మేరీ బ్లాండీ : "మరీ ఎత్తుగా లాక్కండి తాడు. చూసేవారికి అంత డీసెంట్ గా వుండడు."
బహుశా ధైర్యం ఇలాటి జోకుల్నే పేలుస్తుందేమో, విష్ణుశర్మ అదే అన్నాడు. చిరంజీవి నవ్వి "చావుధైర్యం ఆఖరి నిముషంలో వస్తుంది. రాత్రినుంచీ వుండదు" అన్నాడు.
"అవున్సార్. నేను విన్నాను కదా, ఆ రాత్రి అసలు తిండే తినారట..." అన్నడు విష్ణుశర్మ. రాత్రంతానిద్ర కూడా పోదు ఖైదీ ఏ మూడింటికో మూగననుగా నిద్రపడ్తుంది. ఈ ఉరి __ఇదంతా కళ అనుకొంటాడు. అకస్మాత్తుగా నాలుగింటికి తలుపు చప్పుడయి మెలకువ వస్తుంది. ఎదురుగా యమదూతల్లా నిలబడ్డ పోలీసుల్ని చూడగానే బ్రతకడం కలాని తెలిసిపోతుంది.ఇంకో అరగంటలో మరణం అని గుర్తురాగానే బోరున ఏడుస్తాడు."
"పిరికిపందలు" అన్నాడు చిరంజీవి. "శుబ్రంగా తినాలి, హాయిగా నిద్రపోవాలి. చావుకి భయపడకూడదు. భయపడి లాభం ఏమిటి? నాన్సెన్స్."
"అందరూ మీ అంత ధైర్యవంతులు వుండరు కద్సార్."
"టైమెంతయిందూయ్?"
"ఆరున్నర సార్."
"ఫస్టు షో బిగిన్ అయివుంటుంది వూళ్ళో . ఏ సినిమాలు అడ్తున్నాయ్!"
"రాత్రికిరా, రాతిరాత్రి రహస్యం,కరాటే వీరుడు, బురద రాముడు...."
"సినిమా చూడాలని వుందోయ్ శర్మా."
"చివరి కోర్కెగా అలాటివి కోరితే తీర్చారు సార్."
"మంచి భోజనం ఏర్పాటు చేస్తారని విన్నాను."
"అం! అది చేస్తారు మీకేదైనా కావాలంటే చెప్పండి. స్పెషల్ గాచేయిస్తారు. తెల్సినవారున్నారు."
"మువ్వంకాయ కూర మండించు. కొంచెం మసాలా ఎక్కువుగా దట్టించమను."
శర్మ థ్రిల్లై పోతున్నాడు. "సార్ ___ మీరేమి అనుకోకపోతే పుట్టబోయే అబ్బాయికి మీ పేరు పెట్టుకుంటాను సార్."
తెలియనట్టూ "ఎందుకోయ!" అన్నాడు చిరంజీవి మనసులో ఆనందపడి.
"ఎంత ధైర్యం! ఎంత నిగ్రహం!! నిజంగా మీలా తాయారవటంకన్నా ఏంకావాలో సార్ మ అబ్బాయికి."
"ఎన్నేళ్ళోయ్ మీ అబ్బాయికి"
శర్మ సిగ్గుపడి "నాకింకా పెళ్ళి కాలేద్సార్" అన్నాడు.
ఈ లోపులో వరండా దగ్గర ఆపరేటస్, మేడలో స్టేత్ ఉన్నాయి.
"గుడ్ ఈవినింగ్ డాక్టర్ " అన్నాడు.
డాక్టరు పేరు రంగానాథాచార్యులు ఆయనకి లో బి.పి అసలాయనే ఉరికంబం ఎక్కేవాడిలా వణికిపోతూ వుంటాడు. చాలా నెమ్మదిగా ఆగిఆగి మాట్లాడుతూ వుంటాడు.
"ఏవోయ్ __ ఎలా __వున్డీ" అని అడిగాడు.
"అ విషయం మీరే చెక్ చేసి చెప్పాలి."
ఈ లోపులో పోలీసు వచ్చి తాళం తీసేడు. ముగ్గురూ వేరే రూమ్ లోకి వెళ్ళారు. డాక్టరు స్టేత్ తో పరీక్షించటం మొదలుపెట్టాడు.
"బైట వాతావరణానికి బాగా తుమ్ములొస్తున్నాయి" అన్నాడు చిరంజీవి వెళ్ళకిలా పడుకుని .
"తుమ్ములోస్తూంటే ఉరి ఫోస్ట్ ఫోన్ చెయ్యరోయ్ . పెద్ద జ్వరంగానీ, పక్షపాతం కానీ రావాలి" జోకువేసేడు ఆ పాపం మీకే చుట్టూకుంటుంది కదా." కౌంటరు జోకు వేసేడు చిరంజీవి.
ఆచార్యులు గతుక్కుమని సర్దుకుంటూ, బి.పి. సరిగ్గానే ఉందోయ్ " అన్నాడు స్టేత్ తో రొమ్ములు చూసి, బి.పి సరిగ్గా వుందంటాడేమిటి అనుకుని మళ్ళీ "గవర్నమెంట్ డాక్టరుకదా" అని సరిపెట్టుకున్నాడు.
డాక్టరు వెళ్ళిపోయాక, చిరంజీవి అతడి సెల్ కి చేర్చబడ్డాడు.
* * * *
"మువ్వంకాయ కూర బావుందోయ్ శర్మా" అన్నాడు చిరంజీవి తింటూ. శర్మ మాట్లాడలేపోయేసరికి తలెత్తి చూసి, "ఏమిటిలా చూస్తూన్నావ్?" అని అడిగేడు.