ఆటోమాటిక్ హీతారు లో ఫోటోలు క్షణంలో తడి అరిపోయేయి. వాటినికవర్ లో పేట్టి జేబులో పెట్టుకున్నాడు. అదే కవరులో ఫోటోస్టూడియో రసీదులు కూడా వున్నాయి.
నిశ్శబ్దంగా మెట్లెక్కి మెడపైకి వెళ్ళాడు.
అర్చన గదిముందు నిలబడి __కిటికీలోంచి తొంగి చూసేడు. బల్ల ముందు కూర్చొని మావుహంచేతుల్లో దాచుకుని నిశ్చలంగా కూర్చొని వుండి. చాలా సేపట్నుంఛీఅలానే కూర్చొని వుందని ఆ భంగిమ చెప్తూంది.
అక్కణ్ణుంఛీ నిశ్శబ్ధంగా తప్పుకుని క్రిందకి వచ్చేడు. పార్టికోలో వుండి కారు. ఎక్కి స్టార్ట్ చేసేడు.
అప్పుడు ప్రారంభమయింది వర్షం. ఉన్నట్టుండి గాలికూడా నిశ్చలమైంది. ఒక్క వర్షపుచుక్క మొదట పడింది. అంతే__ కుంభవృష్టి మొదలైంది.
రాష్ట్రాపతి వుంటున్న విశ్రాంతి గృహం నాలుగు కిలోమీటర్ల దూరం వుంటుంది లాసన్స్ హిల్స్ మీదుగా చుట్టి వెళ్ళాలి.
నాలుగింటికే బాగా చీకటిపడిపోయి వీధిలైట్లు కూడా వేసేసేరు.ప్రపంచం అంతా తన గూట్లో చేరి అప్పుడే నిద్ర కుపక్రమించినట్టుంది. విశాలమైన దారి_ తడిమీద లైట్ల వెల్తురు ప్రతిబింబించటంతో అందంగా మెరుస్తూమ్ది. ఎదురుగా ఒక లారీ హెడ్ లైట్లు వేసుకుని కొండమీద నుంచి పల్లంలోకి నెమ్మదిగా దిగుతూంది.
కారు ఎడమపక్కకి తీసి స్లో చేసి, లారీ దాటినా తరువాత మళ్ళీ రోడ్డుమీదకి వచ్చేడు.మలుపు తిప్పగానే హిల్ స్లావువ్ కనబడింది. గేరు మార్చి ఎత్తు ఎక్కించటం ప్రారంభించాడు.
చాలాక్గారీడైనా లొకాలిటీ అది. అక్కడక్కడ విసిరిపారేసినట్టు న్నాయి ఇళ్ళు. పైకి చేరగానే నగరం అంతా__నేలమీద ప్రమిదలు పేట్టి నట్టు అందంగా కనిపిస్తూంది.
వర్షం తగ్గిపోయింది. అద్దందింపేడు. చల్లటిగాలి__ హాయిగా వుండి.
కారు పల్లంలోకి దిగటం ప్రారంభమయింది ఎదురుగా ఇంకో లారీ వస్తోంది. కారు పక్కకితీసి, లారీ వెళ్ళిపోగానే తిరిగి రోడ్డుమీదికి తీసుకురావాతానికి ప్రయత్నించాడు. ఎదురుగా పెద్ద గుంట కనబడింది. బ్రేక్ మీద కాలు వేసేడు. కారు వేగం తగ్గలేదు. బ్రేక్ ఫేయలయిందని అర్ధం అయింది. టపటపా కాలితో నొక్కేడు.కానీ లాభంలేకపోయింది. కారు వేగం హెచ్చింది. గుంట దగ్గరవుతూంది. కారుపక్కకికోసేడు, మరింత ఎడమకి.
అదంతా లోయ.
చక్రం జారటం మాత్రం తెలిసింది. అంటే __డోర్ తీసుకుబయటకి దూకబోయి, తలుపు తెరిచాడు.
__కారు లోయలోకి దొరలుకుంటూ వెళ్ళిపోయింది. అడుగడుగునా ఎక్కడో పెద్ద రాతికి కొట్టుకున్న చప్పుడు. తరువాత అరనిమశానికి మంట ప్రారంభం అయింది. పెట్రోలుతోపాటు ప్కుతున్న మంటని వర్షపు చినుకులు ఆపలేకపోయాయి.
సర్వోత్తమరావు కోటు జేబులోంచి ఎగిరి బయటపడిన ఫోటోల కవరు కారుపక్కనే పడింది. ముందు పెట్రోలు దాన్ని చేరుకుంది. దాంతోపాటు మంట కూడా నెమ్మదిగా పాకింది. ఫోటోలకి మంట టాకగానే భగ్గున మండిపోయేయి, క్షణంలో బూడిద మిగిలింది.
ముందు సర్వోత్తమరావు వెన్నెముక విరిగినట్టుంది. తల పగిలి స్రవిస్తున్న రక్తం _వర్షపు నీటికి మరింత పల్చబడుతూంది.
అయిదు నిముషాల తరువాత అక్కడ పెద్ద విస్పోటనం జరిగింది. పెట్రోలు టాంకు పెద్ద చప్పుడుతో పేలిపోయింది. ఆ తరువాత కొద్ది సేపటికి మంటని వర్షం జయించింది. కరంతా బగ్గుయిపోయింది.
హైవే మీద వెళ్తున్న లారీ డ్రైవర్ ఒకడు ఈ మంటని చూసేడు. కానీ, క్రీందేవరోచలిమంట వేసుకున్నారని అనుకుని సాగిపోయేడు. మంటలు తగ్గితే మరి పట్టించుకున్న నాధుడే లేడు. చీకటి ఆ పరిసరాల్ని పూర్తిగా మింగేసింది.
అప్పటివరకూ భయంతో, నిశ్శబ్దంగా వుండిపోయిన కీచురాయి తిరిగిమామూలు శబ్దం చేయటం ప్రారంభించింది.
రేండోఅధ్యాయం
______________________________________________
రాత్రి అరయింది. వర్షం మరింత ఉదృతమైంది. గాజు కిటికీ అవతల పెద్ద పెద్ద చెట్లు గాలికి వూగుతూంటే జడలు విరాబోసుకుని దెయ్యాలు నాట్యం చేస్తున్నట్టూ వుంది.
అర్చన కిటికీదగ్గర నిలబడి బయటకు చూస్తూంది. ఆమె మనసక్కడ లేదు. చిరంజీవి చుట్టూ వుంది. అతడికి స్నేహితురాలుందనీ, ఆమె పట్ల అతడు ఘోరమైన నేరం చేసేదనీ తెలిసికూడా అతడి ఆలోచనల నుంచి ఆమె తప్పించుకోలేక పోతూంది అంటే, బహూశా ప్రేమికుడి తప్పుల్ని ప్రేమ సిమెంట్ చేస్తుంది కాబోలు.
ఆమె ఆగలేక జైలుకి ఫోన్ చేసింది. ఆఖరిసారి అతడిని కలుసుకొనే అవకాశం యిమ్మని అడిగింది.
అటుఫోన్ అందుకున్నది ధర్మారావు . సారీ మేడమ్. ఇప్పడిక లాభంలేదు. బయట వాతావరణం కూడా ఏమీ బ్వోలేదు. ఖైదీ మానసిక పరిస్థితి ఈ చివరి సమయమ్లో ఎలావుందో కూడా తెలీదు. ఈ పరిస్థితుల్లో అతడిని కలుసుకోవడానికి అనుమతి ఇవ్వలేను" అన్నాడు.
"గూరూగారూ, నా జీవితంలో మీలాటివారిని చూడలేద్సార్ . ఇంకో పన్నెండు గంటల్లో ఉరికంబం ఎక్కబోతూ మీరిలా త్రుళ్ళుతూ, పేలుతూ ఉన్నారంటే, __అది మీ గొప్పకాదు సార్. మీలాటి ధీశాలిని కన్న మీ తల్లిదండ్రులది."
'పిచ్చివాడా'__ అన్నట్టు నవ్వాడు చిరంజీవి. "నేనెవర్ని అనుకుమ్తున్నావ్?" అమా తాతగారూ అల్లూరి సీతరామరజూ ఒకేకంచంలో తిని ఒక మంచంలో పడుకొనేటంతటి స్నేహితులు."
ఉద్వేగంతో "అమ్మో! అల్లూరి సీత్రామర్రాజే!" అరిచాడు శర్మ.
"అవును, సీతారామరాజు!"