Previous Page Next Page 
అభిలాష పేజి 31

    "ఇది మీ ఆఖరీభోజనం సార్" సిన్సియర్ గా బాధపడ్తూ అన్నాడు.
   
    "అవును __జైల్లో ఆఖరి భోజనం" అంటూ మళ్ళీ తినటానికి ఉపక్రమించాడు. తింటూ__
   
    "టైమెంతయిందోయ్" అని అడిగాడు.
   
    "ఏడుంపావుగిరూగారూ."
   
    చిరంజీవి మొదటిసారి ఉలిక్కిపడ్డాడు. ఏడుంపావు....నిజమే బైట బాగా చీకటి పడింది. అది మబ్బు పట్టడంవల్ల అనుకున్నాడు ఇంతసేపూ, టైమ్ గురించి ఆలోచననే రాలేదు. భోజనం కూడా అయిపోయింది.
   
    అరున్నార్కల్లా వాళ్ళు రావాల్సిందే. ఎందుకు ఆలస్యం అవుతూందేమో! ఏది ఏమైనామారావు గంట.....
   
    "ఎన్ని గంటల వరకోయ్ నీ డ్యూటీ?"
   
   
    "రాత్రి పన్నెండింటి వరకూ సార్?"
   
    "పక్క సేల్స్ లో యేవరున్నారు?"
   
    డెత్ సేల్స్ అన్నీ బర్సుగా వున్నాయి.ఒక్కొక్కరికి ఒక్కొక్కటి_ మామూలు జైలు గడుల్లా కాకుండా ఇవి కొంచెం విశాలమైనవి. ఒకమూల నీళ్ళపైపు కూడా వుండి. వెల్తురు కూడా బాగానే వస్తుంది.
   
    "అన్నీ సేల్స్ ఖాళీగానే వున్నాయి. మీ రోక్కరే ఇందులో వున్నరు. అందుకే నేను వరండాలో ఎక్కువుగా తిరగనక్కర్లేదు."
   
    "చూడవోయ్ శర్మా! నీ కళ్ళముందు ఏదైనా అద్భుతం ___మాట వరసకి __ఇంకో అరగంటలో జరుగుతాయ్ సార్?"
   
    "జరిగిందే అనుకో__"
   
    "జరగదు సార్. ఖైదీ పరిపోవటం ఒక్కటే జరుగుతుంది. అది మాకు అద్భుతం కాదు. ఎందుకంటే రెండు మూడు నెలల్లో పోలీసులు యోలాగూ వాడిని పట్టుకుంటారు."
   
    "అబ్బా, పారిపోవటం కాదయ్యా ! ఇంకేదైనా అద్భుతం__"
   
   
    "నా జీవితంలో అద్భుతాలెం జరుగుతాయి గురువుగారూ?"
   
    చిరంజీవి విసుక్కుని __ " నీ జీవితంలో కాదు__ న జీవితంలో...." అన్నాడు. శర్మ నోరు సగం తెరచి విస్మయంతో చూసేడు. చిరంజీవి చిరునవ్వుతో __ "ఉదాహరణకి ఇప్పుడు మీ ధర్మారావ్ గారోచ్చి_ 'ఇంత కాలం నిన్ను బంధించినందుకు సారీ చిరంజీవి. నిన్ను వదిలేస్తున్నాం' అన్నారానుకో. అది అద్భుతం కదా" అన్నాడు.
   
    "పొంది సార్. ఇదేమైనా సిన్మానా, అలా అనటానికి__"
   
    చిరంజేవి నవ్వూతూనే వున్నాడు. శర్మ మళ్ళీ గస్తీ తిరగటం మొదలుపెట్టాడు. అటు చివరకువెళ్ళి వెనక్కీ తిరగబోతూ__ గవాక్షంలాంటి కిటికీలోంచి బయట మైదానంలో దృశ్యాల్ని చూసి ఆగాడు.
   
    సుబ్బులు విచ్చుకుంటున్నాయి. వెన్నెల తడిసిన నేలమీద మెరుస్తూంది. శర్మ చూస్తూంది మెరిసే వెన్నెల్ని కాదు. మైదానం మధ్యలో నిలబడివున్న ఉరికంబాన్ని, ఇద్దరు వ్యక్తులు అక్కడ పని చేస్తున్నారు. నిచ్చెనలాటి స్టూలు వేసుకుని, పైకర్రని పరీక్షిస్తున్నాడు యాదగిరి.వంగి లివరులో నూనె పోస్తున్నారు ఇంకొకరు.
   
    వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తూంది.
   
    లివర్ నొక్కగానే ప్లేటు కిందకి వెళ్ళిపోతుందా, లేదా అని పరీక్షా చేస్తున్నారు. చాలా కలాని కొకసారిగానీ ఉరికంబానికి పనిరాదు. అందువల్ల అన్నీ సరిగ్గా వున్నాయా, లేదా అని జాగ్రత్తగా చూసుకోవాలి.
   
    శర్మ చూస్తూ వుండగానే సోమయ్య మైదానంలోకి రావటం కనబడింది. ఆరడుగుల ఎత్తూ పెద్ద పొట్ట __చాలా భయంకరంగా వుంటాడు.సోమయ్య, పొట్టేళ్ళు తలను ఒక్క వేటుతో సరికే కసాయివాడిలా.
   
    అతడే ఉఇరి తీసేది.
   
    పైకి అలాకనబడతాడేగానీ,మనసు చాలా మంచిది. అయినా తనపనిలో ఎక్కడా లోపం రానివ్వడు. ఖైదీ తలమీద ముసుగు కప్పగానే ఆలస్యం చేయకుండా ఉరి బిగిస్తాడు.ఆసమయంలో ఖైదీని ఎక్కువసేపు వేదన __ ఉద్వేగం వేదాంతం అన్నీ కలసిన భావాలతో సతమత చెయ్యటం మంచిదికాదని బహుశా అతడి అనుభవం అతడికి చెప్పిందేమో. 
   
    ఆఖరి క్షణంలో ఖైదీ ఇబ్బందికి గురికాకుండా వుండటంకోసం తనే స్వయంగా అన్నీ పరీక్షించుకోవటం సోమయ్య అలవాటు. అలాగే పరీక్షిస్తున్నాడు.
   
    జైలు గంటలు వినిపించసాగాయి.
   
    చిరంజీవి వాటిని లెఖ్ఖపెట్టడం మొదలుపెట్టాడు.
   
    ఎనిమది .....ఎనిమిది గంటలయింది.
   
    ఆరింటికల్లా వస్తానన్న సర్వోత్తమరావు ఎనిమిదింటివరకూ ఎం చేస్తున్నాడు"?
   
    చిరంజీవి వల్లుఎమ్డుకావు తెలీదుగానీ__ఒక్కసారి జలదరించినట్టయింది.....మొదటిసారి.
   
                       *    *    *    *
   
    ఎనిమిదిన్నర అవుతూవుమ్డగా అర్చన మెడమీద నుంచి క్రిందికొచ్చింది. డైనింగ్ టేబుల్ పక్కనే రామయ్య నిలబడి వున్నాడు. ఆమె కూర్చోగానే మౌనంగా వడ్డించటం మొదలుపెట్టాడు.
   
    గడియారం చప్పుడు తప్ప __ ఆ హాలంతా నిశ్శబ్దంగా వుంది. ఆమె రెండు ముద్దలు కన్నా ఎక్కువ నోట్లో పెట్టుకోలేకబోయింది. చెయ్యి కడుక్కుని లేచిపోయింది.
   
    ఆమె వెళ్ళినవైపే నిర్లిప్తంగా చూస్తూ నిలబడ్డాడు రామయ్య.
   
    అర్చన తన గదిలోకి  వచ్చి పక్కమీద వాలిపోయింది పూర్తిగా దుఃఖమొచ్చినా బావుణ్ణు అదీ రావటం లేదు. ఏదో తెలియని ఉద్వేగం, ఎవరిమీదో తెలీని కసి.
   
    ఆమె లేచి మావయ్య గదిలోకి వెళ్ళింది.  అల్మైరా తెరచి అందులోంచిసీసా తీసుకుని తెల్లటి మాత్రలు ఓ నాలుగు వంపుకొంది తన గదిలోకి, వచ్చి వాటిని వేసుకుని నీళ్ళు తాగింది.
   
    పది నిముషాల్లో ఆమె కళ్ళు మూతలు పడసాగేయి. ఆమెకి సంతోషంవేసింది.ఇంకేమీ పర్వాలేదు, రేపొద్దున్నకళ్ళు తెరిచేసరికల్లా అంతా అయిపోయి వుంటుంది. అవుతుందీ, అవుతుందీ అన్న టెన్షన్ కన్నా__ అయిపోయిందీ అన్న నిర్లిప్తత మంచిది. మరో అయిదు నిముషాల్లో ఆమెకినిద్ర పెట్టేసింది. అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవటంవల్ల చాలా కొద్దిసేపట్లనే అది గాఢనిద్రగా మారింది.
   
                        *    *    *    *   

 Previous Page Next Page