"ఫైన్- థాంక్యూ! ఇంకో వారం రోజుల్లో మళ్ళీ డాన్స్ చేయగలననుకుంటాను."
"షూర్!"
"మాములుగా భోజనం, వాకింగ్, నిద్ర .........అన్నీ చేసేయచ్చు కదూ?"
"ఒకటి తప్ప!" అన్నాడు సురేష్.
"ఏమిటది?" అడిగిందామె.
"నో మోర్ హాంగోవర్ ట్రాజెడీస్.'
"ఓ షూర్! దాని లోటేమిటో నాకిప్పుడు తెలిసివచ్చింది" నవ్వుతూ అందామె.
రాజ్యలక్ష్మి మంచం మీద పడుకున్నదల్లా కళ్ళు సగం తెరచి సురేష్ వైపు చూసింది.
'గుడ్ మాణింగ్!" అంది చిరునవ్వుతో మత్తుగా.
'గుడ్ మాణింగ్!" నటాషాతో బుక్కయిపోయింది - కావాలంటే గుడివినింగ్ చూద్దాం" అన్నాడతను.
"కాఫీ తీసుకుందామా?" అడిగింది నటాషా.
"ఓ - ఎస్."
ఆమె ఫోన్ తీసుకుని కాఫీ ఆర్డర్ చేసింది.
"నువ్వు కాఫీ తీసుకో. నేను కోర్టు కెళ్ళి వస్తాను.' అందామె.
"కోర్టుకా?"
"అవును."
"ఎందుకు?"
"స్ట్రీస్ టీజ్ చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు నా మీద - ఇవాళ అటెండ్ అవ్వాలి."
"అదేమిటి రోజూ చేస్తూనే వుంటారుగా అది."
"ఇన్స్ పెక్టర్ కొత్తవాడు. మరీ యంగ్! సడెన్ గా 'స్ట్రీస్' లో స్త్రీ ని చూసేసరికి కన్ ఫ్యూజ్ అయిపోయి అరెస్ట్ చేశాడు. - వెళ్తాను. రేపు రాకూడదూ? ఐ విల్ బి ఫ్రీ."
"మైగాడ్ ! నువ్వు ఫ్రీగా దొరికే రోజు ఒకటుంటుందన్నమాట. నేనింకా అన్ని రోజులూ కాష్ డౌన్ అనుకుంటున్నాను.'
అతని కాలర్ పట్గ్తుకుని పెదాల మీద ముద్దు పెట్టుకుని వెళ్ళి పోయిందామే.
బేరార్ కాఫీ తీసుకొచ్చాడు. సురేష్ ముందుంచి వెళ్ళిపోయాడు.
"ఒన్ బై టూ చేసుకుందామా?" అడిగింది రాజ్యలక్ష్మి లేచి కూర్చుంటూ.
"టూ బై వన్ నా కిష్టం!"
"ఈ మధ్య కనిపించటం లేదేం?"
"వెరీ బిజీ - తులసి పగలు కూడా ఇంట్లోనే వుంటుంది కదా - ఇద్దరు మనుషుల హార్డ్ వర్క్."
"ఎందుకని?"
"ఉద్యోగం పోయింది?"
"మైగాడ్! మరేట్లా?"
"జాబ్ కోసం వేట ఎక్కువ చేశాను. అయ్ మస్ట్ గెట్ ఇమీడిఏట్లీ."
"ఏ జాబ్ అయినా చేస్తారా?"
"ఏదయినా సరే - మీరు క్యాబరే చేసేప్పుడు - విసేరే బట్టలు పట్టుకోవలన్నా రడీయే."
ఆమె లేచి తనే కాఫీని సగం సాసర్లో వంచి తాగసాగింది.
'ఆర్ యూ సీరియస్?"
"బట్టల విషయంలోనా?'
"జాబ్ విషయంలో."
"వాడ్డూ యూ మీన్ సీరియస్? వెంటనే ఏదో ఒకటి దొరక్కపోతే నేను, తులసి పస్తులుండాలి - అది నడిరోడ్డు మీద."
"కెన్ ఐ హెల్ప్ యూ?" అతను రిలాక్స్ వటం చూసి అడిగిందామె.
సురేష్ ఆశ్చర్యంగా చూశాడు.
"అంటే ........మీరు .......జాబ్ యిప్పించగలరా?"
"ఐ థింక్ సో" బద్దకంగా వళ్ళు విరుచుకుంటూ అందామె.
"రాజ్యలక్ష్మిగారూ! వెంటనే జాబ్ కావాలి నాకు! ఈ సహాయం చేశారంటే - మీ ఋణం వుంచుకొను. శరీర కష్టం చేసి తీర్చుకుంటాను.'
ఆమె పగలబడి నవ్వసాగింది.
"యూ ఆర్ రియల్లీ మార్వలెస్" నవ్వపుకున్నాక అంది.
"మాటల్లోనే కాదు - కావాలంటే తులసి నడగండి."
"అల్ రైట్ - నెక్స్ట వీక్"
"తులసినడగటమా?"
"నో! మీకు జాబ్ యిప్పించటం."
సురేష్ నమ్మలేకపోతున్నాడు.
'ఆర్ యూ రియల్లీ సీరియస్?'
"ఎస్! వైనాట్ - అప్ట్రాల్ - ఒక రాత్రంతా స్పృహ లేకుండా గడిపినవాళ్ళం.
"ఎక్కడ - జాబ్?"
"నాకు తెలిసినతను. సహదేవ్ అనీ - హి కెన్ హెల్ప్ యూ - బిగ్ షాట్ యూ నో.'
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు సురేష్.
"ప్లీజ్ హెల్ప్ మీ - చెప్పాను కదా! ఐయాం డెస్పరేట్."
ఆమె చేతిని వెనక్కు లాక్కుంది.
"ఓ.కే .....వచ్చే సోమవారం మాణింగ్ నైన్ కి రండి.'
"ఎయిట్ కే వచ్చేస్తాను."
"మీ యిష్టం......" నవ్వుతూ అందామె.
'ఇంక వెళ్లిరానా?"
ఆమె అతనితో పాటు తలుపు వరకూ వచ్చింది.
ఫోను మోగటం వినిపించింది . సురేష్ కి నవ్వు వచ్చింది.
"ఓ పాట గుర్తుకొస్తుంది" అన్నాడు.
"ఏమిటది?"
"ఫొనయినా కాకపోతిని మీ వేడి వూపిరి తాకగా.'
ఆమె తలుపు మూసివేసింది నవ్వుతూ.
"ప్లేన్ అరగంట లేట్" అంది నటాషా. వెయిటింగ్ లాంజ్ లో నుంచి మళ్ళీ అతని దగ్గరకొస్తూ.
"మళ్ళీ ఎపుడు బాంబే నుంచి రావటం?"
"ఏమి? నేను వచ్చేసరికి నువ్వు ఎక్కడో జాబ్ చేస్తుంటావనుకుంటాను."
"డెఫినెట్. కుక్క బిస్కెట్లో, బ్రాసరీ లో ఏదో ఒక సేల్స్ మేన్ గానయినా చేరిపోతాను.'
నటాషా నవ్వింది.
"కాసేపు మాట్లాడు .........నాకింకా యిరవై అయిదు నిమిషాల టైం వుంది."
"ఏం మాట్లాడను?"
"మీ పిన్ని ఎలా వెళ్ళిపోయింది/ ఆమె భక్తురాలు కదా. ఎప్పుడూ పూజలూ, వ్రతాలూ, చేస్తుండేది. ఇంకా నమ్మలేకపోతున్నాను.'
"ట్రూత్ తెలుసుకోవాలని రామాయణం , భాగవతాలు చదివింది. తరువాత చర్చి కెళ్ళింది. నెల రోజులు ఫాదర్ తో డిస్కషన్స్ జరిపాక ఓ రోజు చర్చి కెళ్ళటం మానేసేసరికి ఫాదరే ఆమె కోసం వచ్చాడు. ఆ తరువాత ఫాదర్ ఆమె కోసం రోజూ యింటి కొచ్చేవాడు. యిద్దరూ డాక్టర్ దగ్గర కెళ్ళినప్పుడూ సంగతి తెలిసి ఫాదర్ పారిపోయాడు. ఆ తరువాత ఆత్మ పరమాత్మల విలీనం గురించి తెలుసుకోడానికి స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళింది. ఇద్దరూ మర్నాడు పొద్దున్న ఆశ్రమం వెనుక గార్డెన్ లో పరమాత్మలో లీనమయి, ఆశ్రమం వూడ్చే భక్తులకు కనిపించారు ఆ తరువాత ఆశ్రమం స్వామీజీ అసిస్టెంట్ హేండోవర్ చేసుకున్నాడు.
స్వామీజీ ఇప్పుడు చెరుకురసం తీసే బండి పెట్టుకున్నాడట. నాగార్జున సాగర్ దగ్గర."
నటాషా నవ్వాపుకుంది.
"ఇందులో చాలా భాగం కధ కదూ?"
'ఆత్మ, పరమాత్మ సంగతి వదిలేస్తే మిగతాది ఫాక్ట్."
"నువ్వెందుకిలా తయారయ్యావ్?"
"నా కయితే ఒకే ఒక్క కారణం కనబడుతోంది.'
"ఏమిటది?"
"మా ఫాదరూ, మదరూ పెళ్ళి చేసుకునేసరికి అలస్యమయిందట- మా పెద్దనాన్న చెప్తుండగా విన్నాను.'
ఎనౌన్స్ మెంట్ వినబడసాగింది.
నటాషా టైం చూసుకుంది.
"సురేష్ అయ్ వాంట్ టు టెల్ యూ సమ్ థింగ్."
"ఎస్!"
"రాన్రాను క్యాబరే డాన్స్ ళ మీద పోలీసుల గొడవ ఎక్కువయిపోతోంది. అందుకని మారేజ్ చేసుకుని సేటిలవ్వాలని ఆలోచిస్తున్నాను. బహుశా యిదే లాస్ట్ ట్రిప్ కావచ్చు.'
'అంటే.....?"
"ఎస్! సేన్ గుప్తా అనీ దుబాయ్ నుంచి చాలా డబ్బు తెచ్చాడు. బాంబేలో నాకు ప్లాట్ కొనిస్తానన్నాడు. పెళ్ళికి ఒప్పుకున్నాను."
ఆమె మళ్ళీ కనిపించదనేసరికి సురేష్ మనసంతా అదోలా అయిపొయింది.
"అయ్ మిస్ యూ నటాషా!" దిగులుగా అన్నాడతను.
"నాట్ ఫరేవర్!" నవ్వుతూ అని వెళ్ళిపోయిందామే.
ఇంటికి చేరుకునేసరికి తులసి వంటింట్లో టీ తయారు చేస్తోంది. ఆమె వెనుకే పూర్తిగా ఆమెను స్పర్శిస్తూ నిలబడ్డాడతను.
"ఎనీ లక్?" అడిగిందామె.
"రేపో చాన్స్ వుంది."
"నా దగ్గర డబ్బంతా అయిపొయింది" కాజువల్ గా చెప్పిందామె. సురేష్ బ్లడ్ ప్రెజర్ పెరిగిపోయింది.
మొదటిసారి యిలాంటి పరిస్థితి రావటం.
ఇందుకు భాద్యతంతా హటాత్తుగా తన మీద పడిపోయింది.