Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 29

 

    "పోనీ ఇవాళ మనిద్దరం కాఫీ తాగుదాం.'
    'ముందు వెళ్ళండి యిక్కడి నుంచి.'
    "ఎందుకు?"
    "మీ ముఖం చూడటం నాకిష్టం లేదు.'
    'అయితే లైటు తీసేద్దాం.'
    ఆమె లోపలికెళ్ళి తలుపులు ముసేసుకుంది.
    సురేష్ యింట్లో కొచ్చేశాడు.
    తులసి తన పుస్తకాలు చదువుకుంటోంది - డ్రస్ మార్చుకోకుండానే.
    ఆమె పక్కనే పడుకున్నాడాతను.
    "ఐయామ్ సారీ తులసి."
    "ఎందుకు?"
    "దట్స్ ఒకే! కానీ త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించకపొతే."
    "నేను సిన్సియర్ గానే ట్రై చేస్తున్నాను తులసి. కానీ .......రాంగ్ క్వాలిఫికేషన్ అయిపొయింది. ఎవ్వరికీ సోషయాలజీ అవసరం లేదు! ఇంకొద్ది రోజులు చూసి క్లినిక్ ఓపెన్ చేస్తాను."
    "క్లినిక్కా?"
    "అవును"
    "ఏం క్లినిక్?"
    "సెక్స్ క్లినిక్. మీకు దాంపత్య సుఖం లోపించిందా? వెంటనే డాక్టర్ సురేష్ క్లినిక్ కి రండి. మీకు పిల్లలు లేరా. డాక్టర్ సురేష్ ని ఒంటరిగా సంప్రదించండి! సుఖ వ్యాధులా- డాక్టర్ సురేష్ క్లినిక్. స్రీలకు ప్రత్యేక వసతి కలదు. సిజేరియన్లు, ఎబార్షన్లు  మా ప్రత్యేకత. విద్యార్ధినులకు కన్సెషన్ రెట్లు . దీపావళి, దసరాలకు యాభయ్ శాతం రిబేట్.........'
    తులసి నవ్వుతోంది.
    "నువ్వు డాక్టర్ ఎప్పుడయ్యావ్."
    "ఇలాంటి క్లినిక్ లకు డాక్టర్ కావలసిన అవసరం లేదు. క్లినిక్ ఓపెన్ చేసి పేపర్లో పబ్లిసిటి ఇవ్వటమే.....క్యూ కడతారు జనం. మన దేశంలో ఇలాంటివెం చేసినా అడిగేవాడు లేడు. తెలివితక్కువ జనానికి లోటులేదు.'    
    అతని చేయి కుచ్చెళ్ళ మీదకు జారింది.
    "వద్దు" అంది తులసి.
    "ఎందుకని?"
    "డాక్టర్ యిచ్చిన మందు పనిచేసింది"
    "ధాంక్ గాడ్! నో టెర్మినేషన్ బిల్! హాహా , లక్కీ సిటిజన్ ఐయామ్ " తులసిని తన మీదకు లాక్కుని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడతను."
    
                                                          *    *    *    *

    "ఇంకా ఆఫీస్ కి బయల్దేర లేదేం?" తులసిని అడిగింది గంగాభవాని.
    "ఉద్యోగం పోయింది.'
    'అయ్యో! మరిప్పుడెలా?" సానుభూతిగా అంది.
    "తులసి ఇంట్లో వున్నా ఫర్వాలేదు. మనకేమీ అడ్డు చెప్పదు. అదంతా నేను మాట్లాడి సెటిల్ చేశాను" అన్నాడు సురేష్. గంగాభవాని అతనిని లెక్కచేయలేదు.
    "మళ్ళీ ఉద్యోగం కోసం తిప్పలు పడక తప్పదు" అంది తులసి.
    "చెట్టంత మగాడి నుంచుకుని కూడా పాపం - మీకు ఉపయోగం లేదు" హేళనగా సురేష్ వంక చూస్తూ అంది గంగాభవాని.
    "ట్రయిల్ రన్ వేయకుండానే ఉపయోగం లేదన్నారంటే బావుండదు. గ్యారెంటీ స్టఫ్! బాగోకపోతే చెప్పండి. మనీ రిఫండ్!" అన్నాడు సురేష్.
    గంగాభవాని ముఖం మాడ్చుకుని వెళ్ళిపోయింది.
    సురేష్ బయల్దేరాడు.
    "బెస్టాఫ్ లక్ " అంది తులసి బయట వరకూ వచ్చి.
    "బెస్టాఫ్ లక్కా? ఇంకేదో అన్నావనుకున్నాను" నిరాశగా అన్నాడతను.
    విన్సంట్ ఆఫీస్ హిమాయత్ నగర్ లో వుంది.
    కొద్ది క్షణాలు రూమ్ బయట వున్న నేమ్ ప్లేట్ వంక చూశాడు సురేష్.
    వెళ్ళాలా - వద్దా?
    ఫిలోమినా అతని భార్య కాబట్టి - తను ఫిలోమినా గురించి అలా మాట్లాడాడు కాబట్టి - ఎనీ గ్యారెంటీ?
    ఏదేమయినా ప్రస్తుతం ఉద్యోగం అవసరం.
    ట్రయల్ కాస్ట్స్ నధింగ్.
    ఫ్యున్ అతనిచ్చిన కాగితం తీసుకెళ్ళి అర నిమిషంలో తిరిగి వచ్చాడు.
    "రమ్మంటున్నారు"
    లోపలకు నడిచాడు.
    'గుడ్ మాణింగ్!"
    "హలో - హలో - కమిన్ - సిడౌన్."
    గొంతులో అయిష్టం తెలిసిపోతూనే వుంది. తులసి చెప్పింది నిజం.
    అంతా స్పాయిల్ చేసుకున్నాడు తను.
    "వాట్ ది హెల్ యూ హావ్ డన్ సురేష్? దొరుకుతున్న ఉద్యోగాన్ని చేజేతులా ఫిలోమినా బాటక్స్ వల్ల చెడగొట్టేశావ్!"
    కుర్చీలో కూర్చున్నాడు.
    'అయ్ ధింగ్ ఆయామ్ ఇన్ టైం! షార్ప్ టెన్.'
    "ఎస్ ఇన్ టైమ్ ఆఫ్ కోర్స్."
    నిశ్శబ్దం!
    "డూ యూ లైక్ టూ హావ్ కాఫీ?"
    "నో అయ్ లైక్ టూ హావ్ జాబ్."
    "ఓ జాబ్ యస్ ఆయామ్ సారీ మిస్టర్ సురేష్. మాణింగ్ పర్సనల్ ఆఫీసర్ తో మాట్లాడాను. నిన్నే ఒకతనిని వనాఫ్ ది డైరెక్టర్స్ నేవ్యు - అపాయింట్ చేసుకున్నారు.
    చాలా కాజువల్ గా పిస్టల్ తో కాల్చినట్లు.....
    ఇదే ఇంకొక చోట అయితే తన 'స్లో' మొదలయ్యేది. కానీ ఇప్పుడు - దినీజ్ నాట్ ది టైమ్. తులసి కోసం ఏదొక జాబ్ అవసరం తనకు. ఎంత చిన్నది, ఎంత క్రూరమైనది అయినా సరే.
    ఎనీవే - స్టిల్ దేరీజ్ పాజిబులిటీ - మరో అయిదారు నెలల్లో అతను వేసిన గాయానికి బాండేజ్ కట్టే ప్రయత్నం.
    'ఆయామ్ తియల్లీ సారీ.'
    "మీతో ఓ నిజం చెప్పాలి" అన్నాడు సురేష్.
    "ఎస్! వాటిజిట్?"
    "నిన్న నా హాబీ గురించి మీతో చెప్పాను గుర్తుందా/ రోజూ ఫిలోమినా అనే అమ్మాయి బటక్స్ మీద చాచి కొట్టేవాడినని! నిజానికి అది రోజూ కాదు. చాలా సార్లు కాదు. చాలా తక్కువ సార్లు, మహా అయితే రెండు మూడు సార్లనుకుంటాను."
    "ఐసీ!"
    "ఇంకో అబద్దం కూడా చెప్పాను. అలా కొట్టడం ఫిలోమినా ఎంజాయ్ చేసేదని! ఇన్ ఫాక్ట్ - ఆమె ఎంతో ద్వేషించేది.'
    "కాని ఆ విషయం నాకెందుకు చెపుతున్నారో....."
    "జస్ట్ ఫర్ యువర్ యిన్ ఫర్మేషన్ - నా జాబ్ గురించి - ప్రస్తుతానికి - చిన్న జాబ్ అయినా సరే ఇప్పిస్తే.'
    సురేష్ కి తెలిసిపోతూనే వుంది. తను టైమ్ వృధా చేస్తున్నాడు. విన్సెంట్ వుద్యోగం యివ్వడు గాక యివ్వడు.
    "ప్లీజ్! డోంట్ ప్రెస్ మీ - నధింగ్ ఎట్ ప్రెజెంట్.......'
    సురేష్ బయటికొచ్చేశాడు.
    మొదటిసారిగా భయం వేసింది. ఇప్పుడేమిటి చేయటం? ఏ ఉద్యోగం దొరక్కపోతే ఇల్లు గడవటం ఎలా? తులసి ఇబ్బందుల పాలవటం తను చూడగలడా? ఊహు తన వల్ల కాదు! తను చేయలేని పని అదొక్కటే. తులసి సుఖంగా, ఆనందంగా వుండటం కోసం ఏమైనా చేస్తాడు ఎనీ డాం ధింగ్!
    ఎదురుగా కొంతమంది స్త్రీల ప్రోసేషన్ వస్తోంది నినాదాలు చేసుకుంటూ.
    పుట్ పాత్ మీద నిలబడ్డాడు సురేష్.
    ఏభయ్ మంది స్త్రీలుంటారు ఆ వూరేగింపులో.
    ముందు నడుస్తున్న వాళ్ళ చేతిలో బానర్ - అందులో ఓ అమ్మాయి అందంగా - సేక్సీలా -
    సురేష్ కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు . మైగాడ్!
    తులసి..
    అవతలి వైపు దీప అంతా వాళ్లఫీసు వాళ్ళే.
    "మానేజ్ మెంట్ డౌన్ డౌన్."
    "ప్రభుత్వం - రక్షణ కల్పించాలి ."
    తుఅసి తనను చూడలేదు. సెక్రటేరియట్ వైపు వెళ్ళింది. ప్రోసేషన్. వెనుకే నలుగురు లేడీ కానిస్టేబుల్స్-
    సురేష్ హోటల్లోకి నడిచి 696 రూమ్ నేం బటన్ నొక్కాడు.
    నటాషా తలుపు తెరచింది!
    "ఓ- వచ్చావా! నీ గురించే ఆలోచిస్తున్నాను. అంతులేడేమిటా అని.'
    'హౌ ఆర్ యూ?' లోపలికి నడిచి సోఫాలో కూర్చున్నాడు.

 Previous Page Next Page