Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 30

 

    "థాంక్యూ విజయ్! ఒండర్ పుల్ స్టోరీ! ఈ స్టోరీ మన రాష్ట్రమంతా పెద్ద ఎత్తున సంచలనం కలిగిస్తోంది. ఎందుకంటె అంటూ శివ ప్రజల మనిషి , యూత్ లీడర్! పెద్ద ఫాలోయింగ్ ఉంది. అలాగే శ్రీస్మిత తెలుగు ప్రేక్షకులు అభిమాననటి ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు వెర్రెత్తిపోయిన సెక్స్ సింబల్ - కనుక ఇది మనకు చాలా మంచి హాట్ న్యూస్-"
    "థాంక్యూ అన్నా! ఇంక ఉంటాను -" విజయ్ ఫోన్ పెట్టేశాడు.
    భవానీ రిసీవర్ పెట్టకుండా ఇంకా చెవి దగ్గరే పెట్టుకుని వింటున్నాడు. ఓ సెకండ్ తర్వాత క్లిక్ మన్న శబ్దం వినిపించింది.
    భవానీ నవ్వుకున్నాడు.
    "నాకు తెలుసు మల్లికా! ఈ ఫోన్ టాపింగ్ నీ పనే-"


                            ***

    ఆ మర్నాడు భవానీ నిద్రలేచేసరికి బాగా ఆలస్యం అయిపొయింది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగ్గా ఓ అందమయిన మొఖం కనిపించింది . ఉలిక్కిపడి లేచాడు.
    "హాయ్ రోజా! నువ్వా ? ఇక్కడా?"
    "యా! ఎనీ ప్రాబ్లం-"
    "నేనే ఎవరికయినా పెద్ద ప్రాబ్లం ని డియర్!"
    "డియర్' అన్నందుకు ఈసారి రోజా గొడవపడలేదు.
    "అవునూ! ఈ సోఫాలో పడకేంటి? ఇంటికొచ్చి నీ రూమ్ లో పడుకోవచ్చు కదా!"
    "ఈ ఉద్యోగానికి అంత సీన్ అనవసరం! అవునూ! హెల్త్ టోటల్ గా రికవర్ అయినట్లేనా?"
    "సెంట్ పర్సెంట్! అందుకే నీకు హెల్ప్ ఫుల్ గా ఉండవచ్చని ఆఫీస్ కొచ్చాను -"
    "నువ్ పక్కనుంటే చానెల్ ని ఇంకా ఫాస్ట్ గా ఇరగదీస్తా! కానీ ఒక కండిషన్-"
    "ఏంటది?"
    "రేపిది నెంబర్ వన్నయితే క్రెడిట్ నీకేమీ ఇవ్వను -"
    రోజా నవ్వింది.
    "నాక్కావలసింది క్రెడిట్ కాదు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించటం! ఆ పని ఎవరూ చేసినా ఓకె-"
    "కమాన్ - నీ సీట్లో కూర్చో - నేను ఓ గంటలో రడీ అయివస్తా-"
    బయటకు నడిచాడతను.
    రోజా ఆఫీస్ కొచ్చిందన్న న్యూస్ తెలిసి మొత్తం స్టాఫంతా ఆమె చుట్టూ మూగిపోయారు.
    "మేడమ్ మీర్రావటం మంచిదయింది! ఈ రాకేష్ గారు మనది న్యూస్ చానెలో - ఎంటర్ టెయిన్ మెంట్ చానెలో ఎవరికీ అర్ధం కాకుండా చేసేశారు- " అన్నాడు హనుమంతు.
    "మీరు చూస్తున్నారు కదా మేడమ్! మన సీరియల్స్ అన్నీ చెత్తగా మార్చేశాడు రాకేష్! అన్నీ అక్రమ సంబంధాలే! లేడీస్ అసలు చూళ్ళేకపోతున్నామంటున్నారు- " చెప్పింది రాధ చమేలీ.
    "ఎవరికెలా అనిపించినా మన చానెల్ నెంబర్ టూ పొజిషన్ కొచ్చింది కదా! అదే మనకి ముఖ్యం! అంటే ఇంతకాలం మనం చేసిందంతా రాంగ్! రాకేష్ చేసిందే కరెక్ట్ అని ఫ్రూవ్ అయినట్లేగా."
    వాళ్ళని నోటమాట రాలేదు.
    "యా! ఆఫ్ కోర్స్ - ఆఫ్ కోర్స్- అంటూ వడివడిగా వెళ్ళిపోయింది రాధ.
    "నాకు ముందే అనిపించింది మేడమ్! రాకేష్ గారు ఒక పెద్ద జీనియస్ అని ---" అంటూ ప్లేటు ఫిరాయించాడు హనుమంతు -- ఎదురుగ్గా ఉన్న టీవీలో సంపూర్ణ చానెల్ అన్ చేసింది రోజా.
    "స్క్రీన్ అంతా బ్రేకింగ్ న్యూస్" అన్న అక్షరాలతో నిండిపోయింది. దాని వెనుకే అక్షరాలు ప్లాష్ అవుతూ న్యూస్ -- మాజీ ముఖ్యమంత్రి కొడుకు, యూత్ లీడర్ శివ - అతని భార్య ఫేమస్ సినీస్టార్ శ్రీస్మిత మారేజ్ ప్లాష్! త్వరలో విడాకులు కోసం కోర్ట్ కెక్కనున్న నూతన దంపతులు!
    వరకట్న వేధింపులే శ్రీస్మిత నిర్ణయానికి కారణమా? ఆ న్యూస్ తో పాటే మధ్యమధ్యలో శ్రీస్మిత సినిమాల క్లిప్పింగ్స్ - వాటి మధ్యలో శ్రీస్మిత , శివల మారేజ్ సీన్లు -- ఇంకొద్ది సేపట్లో పూర్తీ వివరాలు --
    రోజా షాకయింది.
    ఆ మారేజ్ కి తను కూడా హాజరయింది. ఇంత త్వరగా ఆ మారేజ్ ఫేయిలవటం చాలా దారుణం! మిగతా అన్ని చానేల్సూ చెక్ చేసిందామె. ఆ న్యూస్ ఇంకే చానేల్లోనూ కనిపించలేదు.
    భవానీ విజిల్ వేసుకుంటూ రూమ్ లో కొచ్చాడు.
    "ఆ న్యూస్ చూశావా రాకేష్?" అడిగింది రోజా. భవానీ సంపూర్ణ చానెల్ చూశాడు. ఇంకా బ్రేకింగ్ న్యూసే వస్తోంది.
    "వావ్! ఈ న్యూస్ మన వాళ్ళు ఎందుకు కాచ్ చేయలేక పోయారు?" ఆశ్చర్యంగా అన్నాడతను-
    "మనమే కాదు! ఇంకే చానెల్ కూడా ట్రేస్ చేయలేకపోయారు - అందుకే సంపూర్ణ నెంబర్ వన్ చానెల్ అయింది" అంది రోజా.
    "యా! మనం యాక్సెప్ట్ చేయాల్సిందే" అన్నాడు భవానీ-
    సంపూర్ణ చానెల్ తాలుకూ ఫోన్లన్నీ ఎడతెరిపి లేకుండా రింగవుతుంటే మల్లిక ఎగ్జయిటయిపోతూ కూర్చుని ఉంది. ఆఫీస్ లో.
    "ఈ మధ్య కాలంలో ఇంత సెన్సేషన్ న్యూస్ దొరకటం ఇదే మొదటి సారి" అంటున్నారు సిబ్బంది.
    అప్పుడే ఆ గదిలో కొచ్చిన భరద్వాజ్ మల్లికకు అభినందనలు తెలియజేశాడు.
    'చాలా అద్భుతం మల్లికా! హాట్సాఫ్ టూ యూ! ఇంకే చానెల్ కీ దొరకని ఆ సూపర్ న్యూస్ నీకెలా దొరికిందో అర్ధం కావటం లేదు -' అన్నాడతను.
    "మన స్టేట్ లో ఏం జరిగినా ఏ కార్నర్ లో జరిగిన ముందు నాకే తెలిసేట్లు ఏర్పాట్లు చేశాను సార్!" అంది గర్వంగా.
    "అయ్ నో! యూ ఆర్ కేపబుల్-"
    "థాంక్యూ" అంది మల్లిక!
    కానీ లోపల్లోపల ఆమెకు గిల్టీగా ఉంది.
    నిజానికి ఈ న్యూస్ బృందావన్ చానెల్ ది! ఫోన్ టాపింగ్ ద్వారా తను కాజేసింది. అయినా ఇవన్నీ ఈ ఫీల్డ్ లో తప్పదు. ముందు న్యూస్ బ్రేక్ చేసేవాడికే పట్టాభిషేకం! చప్పున టీవీ బృందావనం చానెల్ కి మర్చిందామే.
    అదే రోజు కొత్తగా రాకేష్ స్టార్ట్ చేసిన రియాలీటీ షో టెలికాస్ట్ అవుతోంది.
    ఆ కాన్సెప్ట్ చూసి స్టన్నయింది మల్లిక.
    యూత్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసే షో అంది.
    లాటరీ వచ్చిన ఓ లేడీ స్టూడెంట్ నీ, ఓ బాయ్ స్టూడెంట్ నీ ఒకటే రూమ్ లో 24 గంటలు ఉంచుతారు. ఆ 24 గంటలూ వారు బయటకు రావటానికి వీల్లేదు.

 Previous Page Next Page