Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 3

    "రాణి లేదు. రాజు లేడు. రేపు ఎల్లాగు శనివారం. శనివారం సినిమాకి వెడితే ఆదివారమంతా హాయిగా రెస్టు తీసుకోవచ్చు పగలల్లా"
    "సంతోషించాం నీ తెలివికి-రేపు ఆదివారంనాడు స్పెషల్ డ్యూటీ వుంది. ఆఫీసరుగారి వెంట ఎక్కడికో వెళ్ళిరావాలి. అందుకే యీ ప్రోగ్రాం"
    నిశ్చలంగా అంది. "అయినాసరే నేనురాను."
    తిక్కరేగి అన్నాడు "నేవేడతాను"
    జవాబివ్వకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చేసరికి ఆఫీస్ డ్రెస్ మార్చుకుని పంచె కట్టుకుని షర్ట్ వేసుకుంటున్నాడు మాధవ్.

    కప్పుని అందివ్వబోతు అంది. "అయితే వెడుతున్నారన్నమాట- పోనీ కాఫీ అయినా తీసుకోండి"
    ఆమె ముఖంలోకి చూసి అందుకుని సిప్ చేసి టేబిల్ మీద పెడుతూ అన్నాడు.
    "ఇవాలా బావుంది శ్రీదూ"
    "థెంక్స్"
    షర్ట్ బటన్స్ పెట్టుకుని వాచీ పట్టుకుని కప్పు అందుకుని కాఫీ తాగేసి అన్నాడు.
    "నిజం, చాలా బావుంది."
    ఖాళి కప్పు అందుకోబోతున్న ఆమెని ఆపి, దగ్గరగా తీసుకుంటూ అన్నాడు "కోపం వచ్చిందా?"
    ఆమె పలుకలేదు.
    "అదికాదు శ్రీదూ.....మధ్యాహ్నం అర్జంటుగా మా ఆఫీసర్ తో పనిబడి ఓ పెద్ద మనిషి వచ్చి నా వద్ద కూచుని భాతఖాని వేసి చివర నన్ను అయన వద్దకి తీసుకెళ్ళి తనపని పూర్తి చేయించుకుని వద్దంటున్న వినకుండా స్వీట్స్ అవి యిప్పించాడు......అందుకని భోజనానికి రాలేదు. అందుకనే బావుందంటున్నా నీ టిఫిన్ తినలేదు."
    "పోనివండి......ఏం చేస్తాం? లంచం వున్నంత తీయగా యింట్లో పదార్ధాలు వుండవులెండి."
    బిత్తరపోయి కౌగిలిని కొద్దిగా సడలించి అడిగాడు "అదేం మాట. నేను లంచం పుచ్చుకుంటానా?"
    బాధగా అంది. "కాదు లెండి. తమరు లంచం మారుగా స్వీట్స్ తీసుకుంటారు."
    ఆమె వేదనని అర్ధం చేసుకుని అన్నాడు ప్రేమగా "తప్పిలే- నిజంగా తప్పే. బలవంతంగానయితేనేం విషం పుచ్చుకుంటామా? ఔను తప్పే నన్ను క్షమించు శ్రీ"
    అతని కంఠసరంలోని నిజాయితీని గమనించి సున్నితంగా అతని నోరు మూస్తూ అంది "అలాంటి మాటలు అనకండి. భార్య భర్తల తప్పొప్పులు వారిలోవారు దిద్దుకోకుంటే ఎలా?"
    ఆ చేతిని అలాగే అదిమిముద్దుడికుని లాలనగా ఆమెని దగ్గరకు తీసుకుని మెల్లగా చుంబించి అన్నాడు "అబుభవ రసికో విభానాతి"
    సిగ్గుతో తలవంచుకుని అంది ముసిముసిగా నవ్వుతూ "చీ పొండి ఏమిటామాటలు."
    "నవ్వుతూ అన్నాడు "నిజం చెప్పొద్దూ మరి."
    తర్వాత ఓ క్షణం ఆగి ప్రసన్న అయిందనుకుని ప్రేమగా మళ్ళీ అడిగేడు.
    "చూడు శ్రీ ఇంకా ఆరు కాలేదు. పద డ్రస్ చేసుకుని రా పో"
    "ఉహూ నాకివాళ వెళ్ళాలనిపించటం లేదు"
    "అయితే రావా?"
    "ఆ మాట అన్నానా?"
    "మరి ఇంకేం పోదాం పద"
    "వస్తా నన్నానా?"
    చిరాగ్గా కోపం నటిస్తూ అన్నాడు "అయితే నే వెళతాను" చురుగ్గా చూసి "బెదిరిస్తారా" అంది.
    "బెదిరింపా? అబ్బో నీవాబెదిరేది?"
    "కాకపోతే"
    ఇహ రాసభాసం అవుతుందని నిగ్రహించుకుని "మాటకి మాట తెగులు. వస్తావా? రావా?" అన్నాడు.
    "రాను"
    రేచ్చిపోబోతూ , బ్రతిమాలినట్టుగా అడిగాడు. "అది కాదు వచ్చి తీరాలి"
    కనుబొమ్మ లెగరేస్తూ "ఏం అర్దరా?"
    "అవును"
    "అయినా రాను. రానన్నాకరాను. మీ యిష్టప్రకారం ఆడే బొమ్మ ననుకున్నారా. రమ్మంటే అజ్ఞ పాలించి అక్కర్లేదంటే ఆగిపోవటానికి"
    నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి కోపం నిగ్రహించుకోలేక "అయినా మనిషికొమాట...."
    మాధవ్ మాటని పూర్తిచేయకముందే యింటి ముందు ఓ రిక్షా ఆగటం గమనించి లోపలికి వెళ్ళింది శ్రీదేవి.
    రిక్షా నుంచి ఓ అమ్మాయదిగి లోపలికి వస్తూ "హలో! మాధవ్-మీరింకా తయారవలెదూ?" అని ప్రశ్నించింది.
    అడకత్తెరలో పోకలాగా "రండి రమాదేవి , రండి. ఇదిగో తాయారయ్యాను. ఒక్క నిమిషం?"
    "మరి ఆవిడ"
    అసంపూర్తిగ వదిలేసినా ఆ ప్రశ్నకి నవ్వుతూ సమాధనం యిచ్చేడు మాధవ్.
    "ఆవిడ కూడా......."
    అతని మాట పూర్తికాకుండానే లోపలి నుంచి వస్తూ "లేదండి నా వంట్లో బావులేదు.
    నేను రాబోటం లేదు" అంది తలకి అమృతాంజనం రుద్దుకుంటూ.
    "ఏమిటండి అనారోగ్యం? మాధవ్ ని ప్రశ్నించింది రమాదేవి.
    తడబడుతూ అన్నాడు "మా ఆవిడకి కడుపోచ్చిందట.......సారీ కడుపునొప్పి వచ్చిందట."

 Previous Page Next Page