సాహితీ సిరి శ్రీశ్రీ
బి. నాగమణి
పల్లవి: సాహితీ సిరి శ్రీశ్రీ
మన మహాకవి శ్రీశ్రీ ||సాహితీ||
చరణం: కత్తికన్న కలమే పదునంటూ
కవనరంగమున ఉరికాడు
కష్టజీవులకు కర్మవీరులకు
ప్రతినిధిగా నినదించాడు ||సాహితీ||
చరణం: శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేదన్నాడు
పీడిత బాధిత జనుల గళాలే
తన కవితకు ప్రాణం అన్నాడు ||సాహితీ||
చరణం: శతవసంత వేడుకలో శ్రీశ్రీ
చిరంజీవిగా నిలిచాడు
ప్రజాకవిగ ప్రజలందరి మనమున
పదిలంగా స్థిరపడ్డాడు
తను పదిలంగా స్థిరపడ్డాడు ||సాహితీ||
(శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ, శతజయంతి విశేష సంచిక 'శ్రీశ్రీ-100' ఏప్రిల్, 2010)
ఆడది మగవాని చేతి / ఆటవస్తువని ఎంచే
పాతబడిన భావాలను / లోతుగ పాతుర వేయగ
కదలిరండి నవభారత / నారీమణులారా!.....
('ప్రజాసాహితి' మానపత్రిక, జనవరి-ఫిబ్రవరి, 1984)