Previous Page Next Page 
రాగవాహిని పేజి 29

    "ఆడుకోవచ్చు."

    "ఏం అడతావ్?"

    "కొందరు పేకాడతారు. కొందరు టెన్నిస్, కొందరు చెస్."

    "నే నడిగేది నీ విషయం"

    "నేనింతదాకా ముందాట ఆళ్ళేదు."

    పలకలేదు సత్య.

    "మరి వెళ్ళిరానా?"

    "విష్ యు బెస్టాఫ్ లక్!"

    "థాంక్యూ!"

    వెళుతోన్న అతనివైపే చూస్తుండిపోయిందామె.

                                         *        *        *

    "చీర్స్!"

    "చీర్స్!"

    "నన్ను అవమానం చేశాడు బ్రదర్!"

    "ఎవడు బ్రదర్ వాడు!"

    "వాడా? వాడో పెద్ద లక్షాధికారి! డబ్బుంది! హోదా వుంది. అందముంది. అందుకే వాడికి గర్వం."

    "అవన్నీ వున్న వాడికి గర్వం వుండదా బ్రదర్!"

    "అదికాదు బ్రదర్! గర్వం వుండాల్సిందే కాదన్ను నీ గర్వం నీ వరకే వుంచుకో. ఫర్వాలేదు, డోంట్ కేర్! కానీ పదిమంది వర్కర్ల ముందు నా క్రింద పనిచేసే గాడ్దెలముందు నన్ను యిన్ సల్ట్ చేశాడు."

    "ఇన్ సల్ట్! ఇన్ సల్ట్ కి అర్ధమేమిటి గురూ!"

    "అవమానం! భరించలేని అవమానం!"

    మనమేం దుర్యోధనులమా బ్రదర్! అవమానం! భరింపరాని అవమానం అని తెగ బాధపడి పోవటానికి? మనకేం అంగ బలం వుందా? అఫ్ కోర్స్ ఫర్లేదనుకో. అదయినా వాడిని తన్నేసేటం వుందా? నో! నాకులేదు. ఇక మన చుట్టూ దుశ్శాసనుడున్నాడా?"

    "నే నుండలేదా గురూ!"

    "ఉన్నావు గురూ! వున్నావు? ఏం చెయ్యను? అదెవత్తో ఆడది నా బుర్ర పగలగొడితే ఏం చేశావు? దాన్ని బట్టలూడదీశావా? జుట్టుపట్టి లాగేవా ఊహూ! అసలింతకి అదెవతో కూడా కనుక్కోలేదు!"

    "కనుక్కుంటా గురూ! కనుక్కుని నీ కాళ్ళముందు తెచ్చి కట్టిపడేస్తా! నీ ఇష్టం. మానభంగమే చేస్తావో! రేప్ చేస్తావో! నీ యిష్టం.... నీ యిష్టమనుకున్నా! అంతే నీ ఇష్టం."

    "లాభంలేదు బ్రదర్. మనకు కర్ణుడులాంటి పోట్లాడే ఫ్రెండ్ లేడు! ఆలోచన చెప్పే శకుని మామలేడు! మనమేం చెయ్యలేం"

    "అలా అనొద్దు బ్రదర్. మనం చెయ్యాలి. మనమే చెయ్యగలం. శకునులదేం వుంది బ్రదర్. కళ్ళు తెరిచిచూస్తే నీ చుట్టూ మూగేస్తారు కుక్కల్లా! కిరాయికి దొరికే కర్ణుళ్ళు కోకొల్లలు. నీ పగ, నా ద్వేషం రెండూ తీరతాయి బ్రదర్!"

    "నో నాకు నమ్మకంలేదు."

    "నాకుంది గురూ! నువ్వు సాధిస్తావు! నీ పిట్ట ఎక్కడుంది తెలీదు కానీ నా గోల్ మాత్రం రెడీగా వుంది తన్నెయ్యడమే! అంతే."

    మరో గాసు త్రాగేడతను.

    అయినా మాటలు తడబళ్ళేదు.

    "ఇంత పర్సనాలిటీ వుంది. చేతినిండా డబ్బు ఆడటానికి బ్యాంక్ బాలెన్సు వుంది, కారుంది, బొచ్చుకుక్క వుంది. గేటుకి గూర్ఖా ఉన్నాడు. పొడిచెయ్ రా. అంటే పొడిచేసే ఫాలోయరున్నాడు. నీకేం బ్రదర్!"

    "ఎవరు బ్రదర్ ఆ ఫాలోయర్?"

    "నేనే బ్రదర్!"

    "గురూ! నేను తాగేను. బాగా తాగాను! పుల్లుగా తాగాను. ఐతేనేం తెలివి తప్పలేదు. నాకు అబద్ధం చెప్పొద్దు గురూ! నువ్వేం చేస్తావ్? సస్పెండ్ చేస్తే గిరపోయి రిజైన్ చేశావు. నీ రిజైన్ కి వాడేం బెదిరాడు?"

    "హడలి చస్తాడు గురూ!"

    "చావడు గురూ! చచ్చేవాడయితే నిన్నొదులుకోడు. చేయి విదిలిస్తే నీలాంటి కుక్కలు బోల్డొస్తాయిరా ధైర్యంతో నువ్వు ఊ అంటే అచ్చా అన్నాడు. తెగేదాకా లాగకూడదు గురూ! బెదిరించాలి. అంతే. బెదిరింపుకు లొంగుతాడంటేనే ఆ అస్త్రం బయటెయ్యాలి. లేదా తలొగ్గాలి."

    అతను బదులు చెప్పలేదు.

    "లాభంలేదు బ్రదర్! నా కోర్కె తీరదు. నా పగ తీరదు."

    "నిరాశ పడకు బ్రదర్! నా ఉద్యోగం పోయింది. ఐనా పర్లేదు...."

    "నీ ఉద్యోగందేవుంది గురూ! కావాలంటే నే నిచ్చేస్తా. అదికాదు ప్రాబ్లం. వాడ్నెలా పడతావు?"

    "క్లూలు....క్లూలుంటాయి బ్రదర్! ముందు నన్ను థాంక్స్ చెప్పనీ నీకు. నేను యీ క్షణంనుంచీ నీ ఉద్యోగిని నీ శిష్యుడ్ని.... నీ ఫాలోయర్ ని.... నీ పగ తీర్చిపెడతాను."

    "నువ్వు.... నువ్వు.... నా ఎంప్లాయివి? నాతో కూర్చుని తాగుతావా? దిగు. కుర్చీ దిగు. క్రింద కూర్చో దట్సాల్."

    "గురూ"

    "గురూకాదు బాస్."

    "బాస్! బాస్ కాదు. దేవుడు! దేవుడూ! నువ్వు మొగోడివి. నువ్వు మొగోడివి. నువ్వు వీరుడివి.... నీ పగ నే తీరుస్తాను...."

    "దట్సాల్...."

    "థాంక్స్ దేముడూ. థాంక్స్ నువ్వు దేవుడివి. నేను నీ ముందు తాక్కూడదు.... చాలిస్తాను" అని బాటిల్ నోటి కతికించుకుని గటగటా తాగేశాడు.

    "గుడ్"

 Previous Page Next Page