"అన్నట్లు మీకు పరిచయం లేదు కదూ ? ఈమె నా మిసెస్ ఉమారాణి!" అంటూ తన భార్యను పరిచయం చేశాడు.
"నమస్తే" అందామె.
"నమస్తే" అన్నాడు సురేష్.
"ఇతను మా ఫ్రెండ్ ఆనంద్.....తులసితో పాటు ఆనంద్ కూడా కాలేజీలో చదివాడు."
"ఓ గ్లాడ్ టూ సీయూ......."
"అతని మిసెస్ కల్పన......."
ఆమె నమస్కారం చేసింది.
అందరూ సోఫాల్లో కూర్చుని విన్సెంట్ కోసం ఎదురు చూడసాగారు.
"మీ గురించి నిన్నే చెప్పాను విన్సెంట్ గారితో! ఒకే. అన్నారు" చెప్పాడు మహేష్.
"సో కైండాఫ్ యూ" అన్నాడు సురేష్.
"మీరు రీసెంట్ గా మళ్ళీ ఏమైనా రాశారా?" అతనిని అడిగింది తులసి.
"ఒకనాటి వెన్నెల అనే సీన్ రాశాను......ఆఫ్ కోర్స్ పెయిర్ చేయలేదింకా."
'ఓ! వినిపిస్తారా?' ఉత్సాహంగా అడిగిందామె.
'పదండి! నా లైబ్రరీ కెళదం" అన్నాడతను సురేష్ తో.
"నో థాంక్స్! అంతవరకూ ఓ ఓల్డ్ న్యూస్ పేపరేదయినా చదువుకుంటాను.'
"తనకి ఇలాంటివేమీ నచ్చవ్" అంది తులసి నవ్వుతూ.
'అయ్ గాట్ సమ్ ఇంట్రెస్ట్ " అన్నాడు నవ్వుతూ.
ముగ్గురూ మేడ మెట్లు ఎక్కారు.
ఉమారాణి లోపల్నుంచి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చింది అందరికీ.
"వీళ్ళేరీ?" అడిగింది సోఫాలో కూర్చుంటూ.
"వెన్నెల్లో కెళ్ళారు."
ఆమె ఆశ్చర్యంగా కిటికీ లోంచి బయట చీకటి వేపు చూసింది.
'ఆహా - ఇప్పటిది కాదులెండి ! ఒకనాటి వెన్నెల."
"ఓ! అయన పోయిట్రీయా! మరి మీరు వెళ్లలేదెం?" సురేష్ ని అడిగిందామె.
"నాకు ఊహల కంటే యాక్షన్ యిష్టం."
"నాకు తెలుగు సరిగా రాదు. ఇంగ్లీషు మీడియం యూ నో' అంది కల్పన.
ఉమారాణి నవ్వింది. "నాకు పోయిట్రీ అంటే ఆసక్తి వుండదు.'
"ధాంక్ గాడ్! నాకు తోడున్నారు. పోయిట్రీ లైక్ చేయనివాడిని నేనొక్కడ్నే అని తులసి ఎప్పుడూ హేళన చేస్తూంటుంది నన్ను."
"మీకేం ఇష్టం మరి?" అడిగింది ఉమారాణి.
"గేమ్స్" అన్నాడు సురేష్.
"ఓ! అయ్ టూ లవ్ గేమ్స్!" అంది కల్పన.
"నాకూ అవే ఇష్టం! మీరే మేం గేమ్స్ అడతారు?"
"ఇన్ డోర్ గేమ్స్."
"అయ్ టు లవ్ ఇన్ డోర్ గేమ్స్" అంది కల్పన.
"నాకు టేబుల్ టెన్నీస్ అంటే యిష్టం! మరి మీకు?" అడిగింది.
"నాకూ టేబుల్ టెన్నీస్ యిష్టం! రోజూ రాత్రి పన్నెండింటి వరకు ఆడతాం నేనూ తులసి."
"మైగాడ్! ఏ క్లబ్ లో."
"క్లబ్ లో కాదు ఇంట్లోనే"
"మీ ఇంట్లో టేబుల్ టెన్నిస్ వుందా?"
"టేబుల్ ఇంకా కొనలేదు. ప్రస్తుతానికి బెడ్ ఉపయోగిస్తున్నాం.'
"బెడ్ మీదా?" నమ్మలేనట్లు అడిగింది కల్పన.
'అవును"
కల్పనా, ఉమారాణి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
కొద్ది క్షణాలకు గాని ఇద్దరికీ తెలీలేదు. ఇద్దరి మొహాల్లోకి రక్తం వేగంగా ప్రవహిస్తోంది సిగ్గుతో పాటు. కల్పన మేడమీదకు పరుగెత్తింది. ఉమారాణి వంటిట్లోకి కెళ్ళిపోయింది.
బయట కారు ఆగింది. వెంటనే హారన్ మోగింది. విన్సెంట్ ఠీవిగా కారు దిగి లోపలికొచ్చాడు.
అందరూ హల్లో కొచ్చారు హడావుడిగా.
"వెల్ కమ్" అన్నాడు మహేష్.
"గుడీవినింగ్ ఎవిరిబడి" అన్నాడు విన్సెంట్.
"గుడీవినింగ్ . మీట్ అవర్ గెస్ట్ మిస్టర్ సురేష్ -మిసెస్ తులసీ సురేష్ - ఆనంద్ - కల్పనానంద్ యూ నో ఉమా"
అందరితో కరచాలనం చేశాడతను.
భోజనాలు ప్రారంభమయాయ్.
అందరూ ఓవర్ లాఫింగ్ లో మాట్లాడుతున్నారు.
"మీరు స్కూల్లో చేసిన అల్లరి పనుల గురించి తులసి చెప్పిందో సారి " అంది ఉమారాణి మధ్యలో."
"మీరు చేసిన అల్లరి పనుల గురించి కూడా నాకు తెలుసు" అన్నాడు సురేష్.
"ఏం తెలుసు?" అనుమానంగా అడిగిందామె.
"హాస్టల్లో"
ఆమె గాబరాగా చూసింది.
అతనామే చెవి దగ్గరకు వంగి వాక్యం పూర్తీ చేశాడు.
ఆమె ముఖంలో రక్తపు చుక్క లేదు. ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడాలెదామె.
"మీ హాబీస్ ఏమిటి?" అడిగాడు విన్సెంట్ సురేష్ తో.
"లావుగా వున్న ఆడపిల్లలను వెనుక నుంచి బాటక్స్ మీద లాగి కొట్టటం!"
విన్సెంట్ పగలబడి నవ్వాడు.
'ఒండర్ పుల్ హాబీ!"
"ఎస్! అందరామ్మాయిలూ తిరగబడ్డారు గానీ ఒకే ఒక్క అమ్మాయి ఎంజాయ్ చేసేది. నా హాబీని ఒక్కసారి కూడా అభ్యంతర పెట్టలేదు."
'ఒండర్ పుల్ గాళ్ - ఎవరా అమ్మాయ్?"
"హైస్కూల్లో మా క్లాస్ మేట్. అమ్మాయి పేరు ........పేరు.....ఫిలోమినా!"
విన్సెంట్ పగలబడి నవ్వాడు. కొద్ది క్షణాలు నవ్వాక హటాత్తుగా నవ్వు ఆగిపోయింది. ముఖంలో సీరియస్ నెస్ చొచ్చుకొచ్చింది.
"వాటీజ్ హర్ నేమ్?"
"పిలోమినా"
"మీరెక్కడ చదివారు?"
"గుంటూరులో"
కొద్ది క్షణాలు అతను నిశ్శబ్దంగా వుండిపోయాడు.
ఉమారాణి గట్టిగా నవ్వుతూ మాట్లాడుతోంది. మిగతా వాళ్ళందరూ ఆసక్తితో వింటున్నారు.
"బై చాన్స్ - మీరు చదివింది గవర్నమెంట్ హైస్కూల్లో కాదు గదా."
సురేష్ ఆశ్చర్యపోయాడు.
"అవును! మీకెలా తెలిసిందా విషయం?"
"ఐ నో - ఐ నో" అన్నాడు విన్సంట్.
ఉమారాణి కబుర్లయిపోయాయ్.
"సోలాంగ్" అన్నాడు ఆనంద్.
విన్సెంట్ అందరితోనూ కరచాలనం చేశాడు మళ్ళీ.
"సి యూ టుమారో ఇన్ మై ఆఫీస్" అన్నాడు సురేష్ తో.
"షార్ప్ టెన్.'
"ఎస్ షార్ప్ టెన్ "
సురేష్ , తులసీ యింటికి బయల్దేరారు.
"నువ్వు అంతా స్పాయిల్ చేస్తావని నాకు తెలుసు" అందామె కోపంగా.
"ఎందుకు?" నేనేం చేశాను?"
"విన్సెంట్ తో ఏమి మాట్లాడావ్?"
"హాబీ అడిగితే చెప్పాను"
"అదే తెలివి తక్కువతనం"
"అడిగితే హాబీ చెప్పడమా? అలాంటి హాబీ వుండటమా?"
"రెండూనూ"
"ఇప్పుడేమైంది?"
"విన్సెంట్ భార్య పేరు ఫిలోమినా!"
"సో వాట్?" అని గతుక్కుమన్నాడు. "అంటే - అంటే-"
"అవును!"
"సెమ్ ఫిలోమినా?"
"సెమ్ ఫిలోమినా! నీ హబీకి అభ్యంతరం చెప్పని ఫిలోమినా!"
"మైగాడ్!"
"ఇంకో రెండు సార్లను "మైగాడ్' అని."
కొద్ది క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా నడిచారు.
"అయితే నాకింకా వుద్యోగం.......'
"నువ్వే ఆ పొజిషన్లో వుంటే యిస్తావా?"
"వాడి భార్య మీద అదే హాబీ రివెంజ్ తీసుకుని తరువాత యిస్తాను.'
తులసి నవ్వేసింది.
* * * *
గంగాభవాని బయటే కూర్చుని హండ్రెడ్ క్యాండిల్స్ వెలుగులో మాగజైన్ చదువుతోంది సురేష్ ని చూడగానే లేచి నిలబడింది.
తులసి తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెడుతుంటే గంగాభవానిని పలుకరించాడతను.
'ఇంకొంచెం కాఫీపొడి కావాలా?"
'అవసరం లేదు.'