Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 27

 

    "ఆఫ్ కోర్స్ ......మేము సేఫ్ పిరీడ్ ఫాలో అవుతున్నాం" అన్నాడు సురేష్.
    "దటీజ్ నాట్ సో సేఫ్" చిరాకుగా అంది డాక్టర్.
    'అవునవును......మిగతా పదిహేను రోజులూ డేంజరస్. అందుకే శ్రీకృష్ణుడు అంతమందిని మ్యారెజ్జేసుకున్నాడు. ఎవరికి సేఫ్ పిరీడ్ అయితే వాళ్ళ దగ్గర కంప్లీట్ సేఫ్......."
    డాక్టరు కోపంగా చూసిందతని వైపు.
    "విల్ యూ కన్ పైన్ టు దిస్ సబ్జెక్ట్."
    "ఓ డెఫినెట్ లీ! ప్రస్తుతం వున్న మేధాడ్స్ కాకుండా కొత్తదేదైనా చెప్పగలరా?"
    "సింపుల్ మెధడ్ ఒకటుంది" అందామె కసిగా.
    "ఏమిటది?" ఆత్రుతగా అడిగింది తులసి.
    "రోజుకో యాపిల్ పండు తినాలి . అంతే......"
    "మైగాడ్.......ముందా......? తర్వాతా......?" అడిగాడు సురేష్ ఉత్సాహంగా .
    "ముందూ కాదు - వెనుకా కాదు. దాని బదులు........" నవ్వుతూ అందామె.
    అతనికి అర్ధమయింది. తనను ఎదురు దెబ్బ కొట్టేసింది.
    తులసి ఫీజు కట్టేసింది.
    "ఒకవేళ యాపిల్ మిస్సయితే సిజేరియన్" నవ్వుతూ అన్నాడు లేచి నిలబడి. డాక్టర్ ముఖం వాడిపోయింది.
    "వాట్ సిజేరియన్?"
    "టూ ధౌజేండ్ క్యాష్ డౌన్ ఆపరేషన్. సీజర్ నివాస్ బిల్డింగ్ ఫండ్......."
    "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్?"
    "నెక్ట్స్ టైం చెప్తాను - ఇంకో కేస్ తెచ్చినప్పుడు. బైదిబై .....మీ సిజేరియన్ ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేసుకోకూడదు? కావలసినన్ని కేసులు బుక్ చేసుకోస్తాను.'
    ఇద్దరూ బయటిచ్చేశారు.
    బస్ దిగి ఇంటి వైపు నడుస్తుంటే తులసి పిలిచిందతనిని.
    "సురేష్....."
    "ఎస్ డియర్?"
    "ఎవరా అమ్మాయి?"
    "ఏ అమ్మాయ్?"
    "అదే! నువ్ మొన్న డాక్టర్ కుమారి దగ్గరకు తీసుకెళ్ళిన కేస్?"
    "ఓ నీకు తెలిసిపోయిందన్నమాట! నటాషా.
    "ఎందుకు?"
    "టెర్మినేషన్ కి! ఇదిగో ముందే చెబుతున్నాను నాకేం సంబంధం లేదు తనతో.'
    ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టారు.
    "ఫాదర్ ఎవరు మరి?"
    "చమన్ లాల్, మక్కన్ లాల్ .......ఎవరో నటాషా కే తెలియదు. హాంగోవర్ ట్రాజెడీ...."
    తులసి మంచం మీద కూర్చుంది కొద్ది క్షణాలు నిశ్శబ్దం . హటాత్తుగా ఆమె కాళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్. వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది.
    సురేష్ తుళ్ళిపడ్డాడు. చటుక్కున ఆమె పక్కన కూర్చుని దగ్గరకు లాక్కున్నాడు.
    "తులసీ ఏమిటది? ఏం జరిగింది?"
    "నాకు అబద్దం చెప్తున్నావ్ కదూ?"
    "నేనా?"
    "అవును! నటాషా తో నువ్వే రేస్పాన్సిబుల్ కదూ?"
    "తులసీ ఐ లవ్ యువర్ బాడీ ఐ లవ్ ఎవ్వరీ పార్ట్ ఆఫ్ యూ - నాకింకో అమ్మాయి అవసరం లేదు. నీకూ తెలుసా విషయం."
    "నాకేం తెలీదు."
    పెదాలు కలుసుకుని పక్కకు జారిపోయినాయ్. ఆమె కన్నీటి బొట్టు  నాలుకతో స్పృశించాడు.
    తులసికి చక్కలిగిలి ఎక్కువయి పోతోంది. అతని తలను లాక్కుని గుండెలకు హత్తుకుంది. అతని చేతులు స్టీరింగ్ లా ఆమెను చుట్టేసుకున్నాయి.
    'అప్పుడప్పుడలా మిగతా అందరు మొగాళ్ళలా అబద్దాలు చెప్పకూడదూ?" కళ్ళు మూసుకుంటూ అడిగింది.
    "నీ దగ్గర చెప్పలేను - వీక్ నెస్!"
    "ఏం వీక్ నెస్?"
    "ఇది" ఆమెతో పాటు వెనక్కు వంగిపోయాడు. ఆ తరువాత చాలా రొటీన్ గా జరిగిపోయింది. మత్తు, ఒగర్సులు, అలుపు.
    "సురేష్!"
    "తులసి!"
    "సురేష్!"
    "తులసి!"
    తలుపులు తెరచుకున్నాయ్.
    ఎదురుగా గంగాభవాని! సిగ్గుతో ముఖం ఎరుపెక్కి పోయి, పెద్దవిగా బండి చక్రాల్లా సాగిన కళ్ళను కుంచించుకోలేక, వెనక్కు తిరగలేక , ముందుకు అడుగు వేయనూ లేక, మాట్లాడలేక, నిశ్శబ్దంగానూ, వుండలేక, అద్భుతావస్థలో ఉక్కిరి బిక్కిరవుతూ-
    సురేష్ ముందుగా తేరుకున్నాడు.
    "రండి ......రండి .......వెల్ కమ్ ...హిప్నాటిజం కమ్ మాజిక్ షో"
    తులసి వంటింట్లోకి పరుగెత్తింది.
    గంగాభవాని బయటకు పరుగెత్తింది.
    "గంగాభవానిగారూ! రండి! తులసి 'ఒన్ బై టూ 'టీ' ఇస్తుంది"
    తులసి నవ్వాపుకుంటూ వచ్చింది గదిలోకి.
    "నీతో ఇదే తలనొప్పి. ఇరుగు పొరుగు ఏమీ చూడవ్."
    'అన్యాయం! రోజుకొకరే అని చెప్పాను కదా ముందే. ఇలా అందరూ ఒకేసారి జోరబడితే నావల్ల కాదు. నేనూ మనిషినే."
    "రేపట్నించి మన సంగతి ఎమాలోచించావ్? నాకో నీకో ఎవరోకరికి ఉద్యోగం దొరక్కపోతే."
    "డోంట్ వర్రీ! అవసరమయితే ఏదొక ఉద్యోగంలో చేరిపోతాను. డాక్టర్ కుమారి దగ్గర సిజేరియన్ సెక్రటరీ లాంటిది.'
    "నేను మహేష్ తో మాట్లాడాను" అంది తులసి.
    సురేష్ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఆమెను తన వళ్ళోకి లాక్కున్నాడు.
    "నిజం చెప్పు - నీ పాపకు తండ్రేవరు?"
    "అలోచించి చెప్తాను!" నవ్వాపుకుంటూ అంది.
    "మహేష్ కదూ?"
    "ఛీ మరి ఇంత సిగ్గులేకుండా పోయింధెం?"
    "మరి మహేశం నువ్వూ ఎందుక్కల్సుకున్నారు?"
    "జాబ్ విషయం మాట్లాడానికి."
    "తన జాబే తను సరిగ్గా చేయలేడు . ఇంక"
    "తనకు తెలిసన ఓ ప్రేవైట్ కంపెనీలో ఇప్పిస్తానన్నాడు. టెంపరరీగా.
    "సినిమా హలో రెండు గంటలు పక్కన నీలాంటి అందాల దేవత నుంచుకొని ముద్దు పెట్టుకోటానికి భయపడినవాడు నాకు ఉద్యోగం చూడటమా! నో! అంత చేతకాని స్టేజ్ కి దిగజారలేదు నేను."
    "రేపు సాయంత్రం వాళ్ళింటికి మనం డిన్నర్ కేలుతున్నాం. మహేష్ ఫ్రెండ్ - అదే - ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ని కూడా ఇన్ వైట్ చేస్తున్నాడు మన కోసం. అక్కడ పరిచయం చేసి నీ ఉద్యోగం విషయం " సురేష్ చేతులు ఆమెని చుట్టేసినాయ్ మళ్ళీ. "రేపు సంగతి ఇప్పుడెందుకు కమాన్" తులసి అతనిని వదిలించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. గంగాభవాని తలుపు వరకూ వచ్చి అనుమానంగా చూసి వెనకకు తిరిగింది.
    తులసి సురేష్ ని వదిలించుకుని పరుగెత్తింది బయటకు.
    "రండి" అంది గంగాభవానితో.
    గంగాభవాని డేగ కళ్ళతో సురేష్ ని గమనిస్తూ లోపలికొచ్చింది.
    "కాఫీ పొడి కావాలి కొంచెం."
    "ఓస్ దాని కోసమా - నేనింకా నా కోసం వచ్చారను కున్నాను' అన్నాడతను.
    తులసి లోపలికెళ్ళింది నవ్వుతూ.
    "కొంచెమైనా సిగ్గుండాలి" అంది గంగాభవాని అసహనంగా.
    "సిగ్గుపడితే మానవజాతి ఎప్పుడో హరించిపోయేది."
    "ఇలా బరితెగించే వాళ్ళకంటే అదే నయం"
    "మీ ఇష్టం! మీకు పిల్లలు వద్దంటే ఏదో ఒక పద్దతి అవలంభిద్దాం."
    ఆమె అదిరిపడింది.
    "ఆ మాటేవరన్నారిప్పుడు?"
    "మీరేగా పాప్యులేషన్ పెరగకుండా చూద్దామన్నారు"
    తులసి కాఫీ పొడితో తిరిగి వచ్చింది. అది అందుకుని విసవిసా వెళ్లిపోయిందామె.
    డిన్నర్ పెద్ద ఎత్తునే ఏర్పాటు చేశాడు మహేష్.
    అతని ఫ్రెండ్ ఆనంద్, అతని భార్య కల్పన కూడా వచ్చారు.
    "ఇతనే మహేష్" అంటూ సురేష్ కి పరిచయం చేసింది తులసి.
    "హలో - హౌ డూ యు డూ!" అన్నాడు మహేష్ కరచాలనం చేస్తూ.
    "ఇన్ ఏ డిఫరెంట్ వే" అన్నాడు సురేష్.
    తులసి అతని డొక్కలో మోచేత్తో పొడిచింది.
    "తులసి మీ గురించి చాలా చెప్పింది" అన్నాడు మహేష్.
    "ఆ విషయాలు కూడానా?"
    మహేష్ టాపిక్ మార్చక తప్పలేదు.
    "నాకు పోయిట్రీ అంటే చాలా యిష్టం! నేను కూడా రాస్తుంటాను- షి లైక్స్ మై పోయిట్రీ."
    "ఐ లైక్ ప్రాక్టికల్స్" అన్నాడు సురేష్.

 Previous Page Next Page