ఆ ఆలోచనలతోనే అతను నిద్రపోయాడు.
* * * * *
సూర్యవంశీకి మెలుకువ వచ్చేసరికి పదకొండు గంటలు దాటింది.
ముందు రూమ్ లో పడున్న డైలీ పేపర్ని అందుకున్నాడు.
నిన్న తనిచ్చిన భువనేశ్వర్ లో మర్డర్ న్యూస్, ఫ్రంట్ పేజీలో బాక్సుతో పబ్లిష్ చేసారు వార్త దినపత్రికలో.
"భువనేశ్వర్ లో జరిగిన హైదరాబాద్ కాల్ గర్ల్ సల్మా మర్డర్ కి, ఇటీవల నగరంలో విచిత్ర పరిస్థితుల్లో చనిపోయిన సీనియర్ రిపోర్టర్ జగన్నాయకులు మర్డర్ కి లింకులున్నాయని, ఈ మిస్టరీ వెనక కొన్ని బలమైన రాజకీయ వర్గాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి..."
న్యూస్ ఐటమ్ లోని, చివరి పేరాని రెండుసార్లు చదువుకుని ఆలోచనలో పడ్డాడు- నిజానికి ఈ రెండు మర్డర్స్ కి మధ్య లింకు ఉన్నట్లు తనకే తెలీదు తేనెతుట్టె కదలాలంటే కొన్ని ఫీలర్స్ అలా వదలాల్సిందే... అప్పుడే ప్రత్యర్ధులు రంగంలోకి దిగుతారు. అలా దిగినప్పుడే తనపని సులభమవుతుంది.
ఇంతకీ సల్మా ఎవరు? కేవలం కాల్ గర్ల్ అంటే నమ్మబుద్ది కావటంలేదు....ఆలోచిస్తూనే లేచి రూమ్ కి తాళంవేసి మెట్లు దిగుతుండగా హౌస్ ఓనర్ పరబ్రహ్మం కన్పించడంతో నిన్నరాత్రి అమ్మాయి గుర్తు కొచ్చింది.
"ఆ పిల్ల, మీ ఇంట్లో తిష్టవేసిందా" నవ్వుతూ అడిగాడు సూర్యవంశీ.
"ఆ పిల్లా.... రాత్రే చెక్కేసింది.... ఆ బాటిల్ నాకే ఇచ్చేసిందనుకో....అది కాదోయ్.... మర్చిపోయాను.... మూడ్రోజుల క్రితం, నీకో కవర్ వచ్చిందయ్యా..." అని ఓ కవర్ని చేతిలోపెట్టి వెళ్ళిపోయాడతను.
బ్రౌన్ కలర్ కవర్ అది.
సూర్యవంశీ అడ్రస్ ఇంగ్లీషులో టైప్ చేసి ఉంది. ఆ కవర్ బరువుగా వుంది.
అలాంటి కవర్ అదే మొదటిసారి తనకు రావటం-
ఆకవర్ని జాగ్రత్తగా ఓపెన్ చేసాడు - లోన ఇంకో కవర్ దానికో రబ్బర్ బాండ్ రబ్బర్ బాండ్ ని తీసి ఆ కవర్ ని ఓపెన్ చేశాడు.
వరసగా అరడజను ఫోటోలు.... గబుక్కున తీసి చూశాడు.
యాదగిరి-బేరర్ యాదగిరి ఫోటోలు...
బస్సు పక్కన యాదగిరి కిందపడుతున్న ఫోటో... పొడవాటి కత్తిని ఒకవ్యక్తి యాదగిరి గుండెల్లో దించుతున్న రెండో ఫోటో.... కింద పడిపోయిన యాదగిరి ఫోటో.
చేతిలో కత్తితో స్కూటర్ ఎక్కుతున్న వ్యక్తి ఫోటో స్కూటర్ నెంబర్ ఫోటో...స్కూటర్ నెంబర్ వేపు ఆశ్చర్యంగా చూశాడు vsp xxx
ఆ ఫోటోల్తోపాటు ఒక లెటర్....
మిస్టర్ సూర్యవంశీ...
ఈ ఫొటోలు పట్టపగలు జరిగిన ఒక భయంకరమైన మర్డర్ కి సాక్ష్యాలు ఇందులో బేరర్ యాదగిరిని చంపిన వ్యక్తులున్నారు....పోలీసులు ఇది పాతకక్షల కేసని పక్కన పెట్టేసినా, కాదని నీకు తెలుసు. నిజాన్ని, హంతకుల్ని పట్టుకొనే గుండె ధైర్యం నీకుందని నాకు తెలుసు. సీనియర్ రిపోర్టర్ జగన్నాయకుల్ని చంపిన హంతకుల్ని చూసిన బేరర్ యాదగిరిని చంపడానికి కారణం పాత కక్షలే అని పోలీసులంటే... నమ్మడానికి మనం ఫూల్స్ కాదు....
స్పాట్ లో ఈ ఫోటోల్ని తీసిన ఫొటోగ్రాఫర్, కొన్ని పరిస్థితులకు లొంగిపోయి, రీల్ నెగిటివ్ ని కాల్చేసాడు.... అయినా నేను కష్టపడి ఈ అయిదు ఫోటోల్ని రెండువేలకు కొన్నాను...
నువ్వు ఈ మర్డర్ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నీ ద్వారా ఒక వ్యక్తికి మేలు జరుగుతుందనే ఆశతోనే, నీకీ డిటైల్స్ పంపుతున్నాను.
నీ శ్రేయోభిలాషి.
మళ్ళీ రెండోసారి ఆ ఉత్తరాన్ని చదివాడు సూర్యవంశీ.
ఎక్కడా ఫ్రమ్ ఎడ్రస్ లేదు!
రీల్ ఫోటోస్... ఎవరు పంపారు? ఆ ఫోటోలోని స్కూటర్ వేపు ఆ వ్యక్తులవేపు పరిశీలనగా చూసాడు సూర్యవంశీ.
ముఖాలు పూర్తిగా కనిపించడంలేదు.....
ఫోటోల్ని మళ్ళీ కవరులో పెట్టి, బాక్ సీట్ పక్కనున్న బాక్స్ లో పడేసి, హీరో హోండాని స్టార్ట్ చేశాడు.
మరో అరగంట తర్వాత -
సూర్యవంశీ పనిచేసే వార్తప్రెస్ ఆఫీసులో ఉన్నాడు.
అప్పటికే అతనికి రెండుసార్లు నిరంజనరావు ఫోన్ చేశాడు.
ఆ విషయం తెలిసి, నిరంజనరావుకోసం ఇంటికి ఫోన్ చేశాడు సూర్యవంశీ.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది సూర్యవంశీకి.
ఆ ఆలోచనలతోనే అతను నిద్రపోయాడు.
* * * * *
సూర్యవంశీకి మెలుకువ వచ్చేసరికి పదకొండు గంటలు దాటింది.
ముందు రూమ్ లో పడున్న డైలీ పేపర్ని అందుకున్నాడు.
నిన్న తనిచ్చిన భువనేశ్వర్ లో మర్డర్ న్యూస్, ఫ్రంట్ పేజీలో బాక్సుతో పబ్లిష్ చేసారు వార్త దినపత్రికలో.
"భువనేశ్వర్ లో జరిగిన హైదరాబాద్ కాల్ గర్ల్ సల్మా మర్డర్ కి, ఇటీవల నగరంలో విచిత్ర పరిస్థితుల్లో చనిపోయిన సీనియర్ రిపోర్టర్ జగన్నాయకులు మర్డర్ కి లింకులున్నాయని, ఈ మిస్టరీ వెనక కొన్ని బలమైన రాజకీయ వర్గాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి..."
న్యూస్ ఐటమ్ లోని, చివరి పేరాని రెండుసార్లు చదువుకుని ఆలోచనలో పడ్డాడు-నిజానికి ఈ రెండు మర్డర్స్ కి మధ్య లింకు ఉన్నట్లు తనకే తెలీదు తేనెతుట్టె కదలాలంటే కొన్ని ఫీలర్స్ అలా వదలాల్సిందే... అప్పుడే ప్రత్యర్ధులు రంగంలోకి దిగుతారు. అలా దిగినప్పుడే తనపని సులభమవుతుంది.
ఇంతకీ సల్మా ఎవరు? కేవలం కాల్ గర్ల్ అంటే నమ్మబుద్ది కావటంలేదు.....ఆలోచిస్తూనే లేచి రూమ్ కి తాళంవేసి మెట్లు దిగుతుండగా హౌస్ ఓనర్ పరబ్రహ్మం కన్పించడంతో నిన్నరాత్రి అమ్మాయి గుర్తుకొచ్చింది.
"ఆ పిల్ల, మీ ఇంట్లో తిష్టవేసిందా" నవ్వుతూ అడిగాడు సూర్యవంశీ.
"ఆ పిల్లా.... రాత్రే చెక్కేసింది.... ఆ బాటిల్ నాకే ఇచ్చేసిందనుకో.....అది కాదోయ్... మర్చిపోయాను.... మూడ్రోజుల క్రితం, నీకో కవర్ వచ్చిందయ్యా..." అని ఓ కవర్ని చేతిలోపెట్టి వెళ్ళిపోయాడతను.
బ్రౌన్ కలర్ కవర్ అది.
సూర్యవంశీ అడ్రస్ ఇంగ్లీషులో టైప్ చేసి ఉంది. ఆ కవర్ బరువుగా వుంది.
అలాంటి కవర్ అదే మొదటిసారి తనకు రావటం-
ఆ కవర్ని జాగ్రత్తగా ఓపెన్ చేసాడు - లోన ఇంకో కవర్ దానికో రబ్బర్ బాండ్ రబ్బర్ బాండ్ ని తీసి ఆ కవర్ ని ఓపెన్ చేసాడు.
వరసగా అరడజను ఫోటోలు.... గబుక్కున తీసి చూశాడు.
యాదగిరి-బేరర్ యాదగిరి ఫోటోలు....
బస్సు పక్కన యాదగిరి కిందపడుతున్న ఫోటో.... పొడవాటి కత్తిని ఒకవ్యక్తి యాదగిరి గుండెల్లో దించుతున్న రెండో ఫోటో.... కింద పడిపోయిన యాదగిరి ఫోటో.
చేతిలో కత్తితో స్కూటర్ ఎక్కుతున్న వ్యక్తి ఫోటో స్కూటర్ నెంబర్ ఫోటో....స్కూటర్ నెంబర్ వేపు ఆశ్చర్యంగా చూశాడు VSP XXX
ఆ ఫోటోల్తోపాటు ఒక లెటర్...
మిస్టర్ సూర్యవంశీ...
ఈ ఫోటోలు పట్టపగలు జరిగిన ఒక భయంకరమైన మర్డర్ కి సాక్ష్యాలు ఇందులో బేరర్ యాదగిరి ని చంపిన వ్యక్తులున్నారు......పోలీసులు ఇది పాతకక్షల కేసని పక్కన పెట్టేసినా, కాదని నీకు తెలుసు. నిజాన్ని, హంతకుల్ని పట్టుకొనే గుండె ధైర్యం నీకుందని నాకు తెలుసు. సీనియర్ రిపోర్టర్ జగన్నాయకుల్ని చంపిన హంతకుల్ని చూసిన బేరర్ యాదగిరిని చంపడానికి కారణం పాత కక్షలే అని పోలీసులంటే....నమ్మడానికి మనం ఫూల్స్ కాదు....
స్పాట్ లో ఈ ఫోటోల్ని తీసిన ఫోటోగ్రాఫర్, కొన్ని పరిస్థితులకు లొంగిపోయి, రీల్ నెగిటివ్ ని కాల్చేసాడు.... అయినా నేను కష్టపడి ఈ అయిదు ఫోటోల్ని రెండువేలకు కొన్నాను...
నువ్వు ఈ మర్డర్ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నీ ద్వారా ఒక వ్యక్తికి మేలు జరుగుతుందనే ఆశతోనే, నీకీ డిటైల్స్ పంపుతున్నాను.
నీ శ్రేయోభిలాషి.
మళ్ళీ రెండోసారి ఆ ఉత్తరాన్ని చదివాడు సూర్యవంశీ.
ఎక్కడా ఫ్రమ్ ఎడ్రస్ లేదు!
రీల్ ఫోటోస్.... ఎవరు పంపారు? ఆ ఫోటోలోని స్కూటర్ వేపు ఆ వ్యక్తులవేపు పరిశీలనగా చూసాడు సూర్యవంశీ.
ముఖాలు పూర్తిగా కనిపించడంలేదు....
ఫోటోల్ని మళ్ళీ కవరులో పెట్టి, బాక్ సీట్ పక్కనున్న బాక్స్ లో పడేసి, హీరో హోండాని స్టార్ట్ చేశాడు.
మరో అరగంట తర్వాత-
సూర్యవంశీ పనిచేసే వార్తప్రెస్ ఆఫీసులో ఉన్నాడు.
అప్పటికే అతనికి రెండుసార్లు నిరంజనరావు ఫోన్ చేశాడు.
ఆ విషయం తెలిసి, నిరంజనరావుకోసం ఇంటికి ఫోన్ చేశాడు సూర్యవంశీ.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది సూర్యవంశీకి.
నిరంజనరావు విశాఖపట్నం ప్రయాణం విషయం.
గోడ గడియారంవేపు చూశాడు.
3-30 నిమిషాలు దాటింది.
నాంపల్లి స్టేషన్ కి వెళ్ళి, నిరంజనరావుకి, తనకొచ్చిన ఫోటోలు గురించి చెప్పాలి.
గబగబా రిపోర్టర్స్ రూమ్ లోంచి బయటికొచ్చి, వెహికల్స్ పార్కింగ్ వేపు నడిచాడు సూర్యవంశీ.
వెహికల్ స్టార్ట్ చేసి, గేటు దాటుతుండగా సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్ చప్పట్లు కొట్టి పిలిచాడు.
"సార్ మీకు ఫోన్...."
ఇంజన్ ఆఫ్ చేసి, స్టాండ్ వేసి, సెక్యూరిటీ రూమ్ వేపు నడిచి, ఫోన్ అందుకున్నాడు సూర్యవంశీ.
* * * * *
"హలో.... రిపోర్టర్ వంశీ...
ఒక్క క్షణం మౌనం.
"మిస్టర్ వంశీ..." ఆ గొంతు భీకరంగా ఉంది- ఆ గొంతు రఫ్ గా ఉంది.
"మిస్టర్ వంశీ.... చెప్పింది విను మాట్లాడకు.... ప్రశ్నలు వెయ్యకు జగన్నాయకుల్ని ఫ్లాన్డ్ గా మర్డర్ చేసింది మేమే- బేరర్ యాదగిరిని రోడ్డుమీద బ్రూటల్ మర్డర్ చేసింది మేమే - మార్చురీలో ఉన్న మొండెం వెనకున్న మిస్టరీని క్రియేట్ చేసిందీ మేమే సల్మాని చంపింది మేమే...."
అపరిచిత వ్యక్తి, గొంతులోంచి వస్తున్న మాటకు, సూర్యవంశీ నరాల్లోని రక్తం వేగం పెరగడం ప్రారంభించింది.....
"ఇంతకీ నువ్వు..." కోపంగా అడిగాడు సూర్యవంశీ.
"డోంట్ ఫుట్ క్వశ్చన్స్ - ప్రశ్నలువేసే వాళ్ళంటే నాకసహ్యం- సో.....చెప్పింది విను.... ఇవాళ పేపర్లో - న్యూస్ వేశానని ఇన్వెస్టిగేట్ చేసానని సంబరపడిపోతున్నావేమో... పిచ్చిపిచ్చిగా తెలివితక్కువ పనులు చేసేవాళ్ళన్నా, చేయించేవాళ్ళన్నా నా కసహ్యం - అందుకే ఫైనల్ గా నీకు వార్నింగిస్తున్నాను...నీ పని నువ్వు చూసుకో... ఓకే... ఇంకో విషయం నీ గురువు ఎ.సి.పి. నిరంజనరావుని వైజాగ్ తరిమేసిందీ మేమే... ఎందుకో తెలుసా.... అది నీకు తెలియడానికి, ఇంకో ఇరవైనాలుగు గంటల టైమ్ పడుతుంది.....అంతవరకూ ప్లీజ్ వెయిట్ యంగ్ మేన్... ఓ.కే.... ఇది చెప్పడానికే.... ఫోన్..."