Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 26

 

    "తులసీ నాలాంటి అమ్మాయేగా?"
    సురేష్ ఆశ్చర్యపోయాడు.
    "మీరెలా తెలుసు?"
    "కాకపోతే మీరు జీవితాన్ని ఇంతగా ఎంజాయ్ చేయలేదు."
    ఓ ముసలాయన చేతికర్రతో వచ్చాడు ప్రత్యూష దగ్గరకు.
    "లైఫ్ ఆప్టర్ డెత్ గురించి బుక్స్ ఏమైనా వున్నాయా మేడమ్?"
    సురేష్ లేచి నిలబడ్డాడు.
    "సీయూ లెటర్"
    "వాట్ అబౌట్ మై ఆఫర్?" కవ్వింపుగా అడిగిందామె.
    "బాగా లోతుగా వెళ్ళి అలోచించి చెప్తాను."
    ఆమె అతని చేతి మీద గిల్లి బుక్ రాక్ దగ్గరకు వెళ్ళిపోయింది.
    సురేష్ చౌరస్తా చేరుకున్నాడు.
    జనం.......ప్రవాహంలా అన్ని వైపులకు పరుగెత్తుతున్నట్లు నడుస్తూన్నాడు. ఇంకో పావుగంట వుంది తులసి ఆఫీస్ నుంచి రావటానికి.
    "28-20-26' అనుకున్నాడతను మలయాళ్ హెయిర్ స్టయిల్ చూసి
    "ఎస్తూ?" అందామె ఆగిపోయి కోపంగా.
    "అళవు" అన్నాడు సురేష్.
    "ఎస్తు ఆళవు?" మరింత కోపంగా అడిగింది.
    "నీళం, నీతి, పొక్కం......."
    "అల్పన్" అనేసి విసురుగా వెళ్ళి పోయిందామే.
    దీప, తులసి దగ్గర కొచ్చేశాక చూశాడు.
    "హలో .......హలో....దీపాజీ! ఎనీ ప్రొగ్రెస్?" అడిగాడు ఉత్సాహంగా.
    "ప్రోగ్రెసేమిటి?" అనుమానంగా అడిగింది.
    "అదే.....మీ మారేజ్ తాలుకూ ప్రోగేస్ రిపోర్టు."
    ఆమెకు అర్ధమైంది. మొహం మాడ్చుకుని జవాబివ్వకుండా వూరుకుంది.
    "అవసరమనుకుంటే చెప్పండి.....నేను హెల్ప్ చేస్తాను. ఒక్కరు
    చేయలేని పని ఇద్దరయితే తేలిగ్గా చేసేయగలమని మీరు ఎయిత్ క్లాస్ లో చదవలేదూ."
    తులసి నవ్వాపుకోలేకపోయింది.
    "గుడ్ బై" అంది దీప.
    "బై" అంది తులసి.
    ఆమె వెళ్ళిపోయింది.
    బస్ స్టాప్ కొచ్చి నిలబడ్డారిద్దరూ.
    "ఇవాళ లాస్ట్ డే" అంది తులసి.
    అతను నమ్మలేనట్లు చూశాడు.
    "నిజంగానా?"
    "చెక్, టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చేశాడు."
    "ఒండర్ పుల్! ఇవాల్టి నుంచీ డే అండ్ నైట్ హాహా"
    ఆమె కోపంగా చూసిందతని వైపు.
    "బస్ వచ్చింది పద - ఇందులో వెళదాం" అందామె.
    "ఇందెందుకు ? మనింటి వైపు పోదుగా"
    "నాకూ తెలుసా విషయం. త్వరగా ఎక్కు" ఆమె ముందు నుంచి ఎక్కేసింది. అతను పరుగుతో వెళ్ళి పుట్ బోర్డ్ మీద నిలబడ్డాడు.
    బస్ దిగగానే ఆమె పక్కకు పరుగెత్తాడు మళ్ళీ.
    "ఇటేక్కడికి?"
    "డాక్టర్ కుమారి దగ్గరకు"
    "సురేష్ అదిరిపడ్డాడు.
    "డాక్టర్ కుమారా!"
    "అవును - అదివరకేప్పుడోసారి వెళ్ళాం గుర్తులేదూ?"
    "ఆ .....ఉంది....ఉంది......ఉంది.....ఆమె దగ్గరకేందుకిప్పుడు?"
    "నాకేదో డౌట్ గా ఉంది."
    అతనికి చెమటలు పట్టేసినాయ్.
    "అంతేనా? అయితే ఇంకో డాక్టర్ దగ్గర కెళ్దాం ఈమె దగ్గరికి ఎందుకు ?"
    "ఎవరితేనేం?"
    "ఈమె చాలా హరిబుల్ డాక్టర్! సుఖంగా డెలివరీ అయ్యే కేసులు కూడా సిజేరియన్ చేసేస్తుంది."
    "ఎందుకు?"
    "ఫీజు కోసం. రెండు వేలు క్యాష్ డౌన్. అదే ఆర్డినరీ డెలివరీ అయితే వెయ్యి రూపాయలేగా."
    "అబ్బ! డాక్టర్స్ ప్రొఫెషన్ ఎంత దారుణంగా తయారైంది."
    "చాలా.......మనం వెనక్కు తిరుగుదామా?"
    "ఈమె దగ్గరకే వెళ్దాములే. నాది డెలివరీ కేస్ కాదు గదా భయమేముంది."
    "కాకపోయినా సరే. ఈ మధ్య ఒకామేకి ప్రెగ్నెన్సీ లేకపోయినా సిజేరియన్ చేసేసింది."
    "ఎందుకు?"
    "అలావాటు చొప్పున ఫీజు కోసం"
    "నీకెలా తెలుసు ఇదంతా?"
    సురేష్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    తులసి డాక్టర్ కుమారి డిస్పెన్సరీలోకి నడిచింది.
    వెనకే తనూ నడిచాడతను.
    డాక్టర్ లోపల గదిలో ఎవరితోనో మాట్లాడుతొండటం వినబడుతోంది.
    "మీకు శుభవార్త! తల్లి కాబోతున్నారు"
    "ఆ.....అలాగా ......కానీ ........కానీ నాకింకా పెళ్ళి కాలేదండీ"
    'అయితే దుర్వార్త! రెండువేలు ఫీజవుతుంది...."
    మాటలు నెమ్మదయి వినిపించకుండా పోయినాయ్.
    "ఎల్లుండి పొద్దున్నే సుష్మా నర్శింగ్ హోమ్ కొచ్చేయండి"
    ఆ యువతి బయటికొచ్చింది.
    "నెక్ట్స్ " అంది డాక్టర్.
    తులసితో పాటు లోపలకు నడిచాడతను.
    అతనిని చూస్తూనే డాక్టర్ ఆశ్చర్యపోయింది.
    "మళ్ళీ వచ్చాడేమిటి? ఎనీ ప్రాబ్లమ్?"
    "నా ప్రాబ్లమ్ చాలా ఈజీగా అయిపొయింది."
    "ఏమిటది?" అర్ధం కాక అడిగిందామె.
    "అదే" అంటూ తులసి వైపు చూశాడతను.
    తులసి వాళ్ళిద్దరి వంకా చూస్తోంది అయోమయంగా.
    "మళ్ళీ అంటున్నారేమిటి?" అడిగింది డాక్టర్ని.
    సురేష్ చప్పున కల్పించుకున్నాడు. "అదివరకోసారి మనిద్దరం వచ్చాం కదా."
    "ఓ .....చాలా కాలమయిందిగా ఇంకా గుర్తున్నానా......?" అడిగింది తులసి.
    "నో -నో .......మీరు కాదు . దట్ జెంటిల్మాన్ అండ్ హిజ్ వైఫ్ ."
    తులసికి మతిపోతోంది.
    "నేనే అతని భార్యను."
    "మీరు అతని భార్యా.......?' డాక్టర్ ముఖంలో చిరునవ్వు మాయమైంది.
    సురేష్ కి తెలిసిపోయింది పరిస్థితి చేజారిపోతోందని. వెంటనే కల్పించుకున్నాడు.
    "ఎస్! ఈమె నా భార్య! నేనీమే భర్తను........! ఇద్దరం పరస్పరం భార్య భర్తలం."
    "కానీ మొన్న మీతో వచ్చినామే....."
    "నాతోనా! నెవర్! నేనెపుడూ మీ దగ్గరకు రాలేదు."
    "ఆర్ యూ ష్యూర్?"
    "క్వయిట్ షూర్....! పెళ్ళయిన దగ్గర్నించీ ఒక భార్యతోనే మానేజ్ చేస్తున్నాను."
    "యూ ఆర్ లయింగ్" అంది డాక్టర్ కోపంగా.
    "అప్ఫ్ కోర్స్ ....లయింగ్ " పొజిషన్ తర్వాతేగా మీ అవసరం కలిగేది....'
    డాక్టర్ ముఖం ఎర్రబడింది.
    "మొన్న తీసుకొచ్చిన అమ్మాయి మీ భార్య అని ఎందుకు చెప్పారు.'
    "ఆ రోజు మేమిద్దరం భార్య భర్తలుగా వున్నాం కనుక. అదీకాక కాదంటే మీరు ఫీజు పెంచేస్తారని కూడా.
    "యూ ఆర్ మాడ్" అందామె కోపంగా.
    "కరెక్ట్....! ఆ కాసేపు నిజంగా పిచ్చి ఎక్కినట్లే ప్రవర్తిస్తానని ఇంకొకామె కూడా చెప్పింది."
    డాక్టర్ కి అతనితో మాట్లాడాలనిపించలేదు.
    "వాటీజ్ ది ప్రాబ్లం?" తులసి నడిగిందామే.
    "డిలే అయ్యింది"
    "మీకు పెళ్ళయిందా?"
    "చాలా వరకూ అయింది? సురేష్ చెప్పాడు. తులసి అతని వైపు చురచురా చూసింది.
    "ఎస్! మారీడ్"
    "మరెందుకు భయం?"
    "అతనికి జాబ్ లేదింకా"
    "అందుకే ఈ జాబ్" నవ్వుతూ అన్నాడు.
    "ఎన్ని రోజులయింది?"
    "ఓన్లీ వన్ వీక్"
    "ఓన్లీ వన్ వీక్"
    "ఎస్ ఓన్లీ వన్ వీక్......"
    "ఓ.కే ! ఈ టాబ్ లెట్స్ వాడిన తర్వాత రండి......." టాబ్ లెట్స్ రాసిచ్చిందామె.
    తులసి కాగితం తీసుకుంది.
    "అయినా మీరేమైనా మేధాడ్ ఉపయోగించాలి గానీ మాట్లాడితే ఇలా డాక్టర్ దగ్గరకు....."

 Previous Page Next Page