విధిలేని పరిస్థితుల్లో "కరెక్ట్ సార్" అన్నాడు అతను.
"ఆడపిల్లల విషయంలో మగవాడికున్న గొప్ప దుర్గుణం కన్ ఫ్యూజన్. అంటే తికమకపడిపోవడం. ఒక స్త్రీని తను ఎలా కోరుకుంటున్నాడో, ఆమె ఎంతవరకు కావాలో తెలియదు మగవాడికి. అందుకే కనిపించిన ప్రతి ఆడపిల్లనూ గుడ్లు తేలేసుకుని చూస్తాడు. దీన్నే మగబుద్ధి అని స్త్రీలు ఈసడిస్తారు. నిజానికది ఆడపిల్లల మీద మగవాడికున్న యావకాదు, కన్ఫ్యూజన్, అయితే ఆడపిల్లకు మాత్రం కన్ఫ్యూజన్ వుండదు. ఏ మగవాడు ఎలా కావాలో తెలుసు. అందుకే స్త్రీ ఏ మగవాడ్ని ఎక్కడపడితే అక్కడ చూడదు. తనకు కావాల్సిన వాడ్ని, కావాలనుకున్నప్పుడు, అది ఎంత రిస్క్ అయినా రప్పించుకోగలుగుతుంది...." ఆగాడాయన.
విధిలేని పరిస్థితుల్లో "కరెక్ట్ సార్" అన్నాడు అతను.
"ఆడపిల్లల విషయంలో మగవాడికున్న గొప్ప దుర్గుణం కన్ ఫ్యూజన్. అంటే తికమకపడిపోవడం. ఒక స్త్రీని తను ఎలా కోరుకుంటున్నాడో, ఆమె ఎంతవరకు కావాలో తెలియదు మగవాడికి. అందుకే కనిపించిన ప్రతి ఆడపిల్లనూ గుడ్లు తేలేసుకుని చూస్తాడు. దీన్నే మగబుద్ధి అని స్త్రీలు ఈసడిస్తారు. నిజానికది ఆడపిల్లల మీద మగవాడికున్న యావకాదు, కన్ఫ్యూజన్, అయితే ఆడపిల్లకు మాత్రం కన్ఫ్యూజన్ వుండదు. ఏ మగవాడు ఎలా కావాలో తెలుసు. అందుకే స్త్రీ ఏ మగవాడ్ని ఎక్కడపడితే అక్కడ చూడదు. తనకు కావాల్సిన వాడ్ని, కావాలనుకున్నప్పుడు, అది ఎంత రిస్క్ అయినా రప్పించుకోగలుగుతుంది...." ఆగాడాయన.
ఆయన చెబుతున్న దాంట్లో ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో బేరీజు వేసుకోలేకపోయాడు అతను. ఆయన అజ్ఞానో, అన్నీ తెలిసిన జ్ఞానో కూడా బోధపరుచుకోలేకపోయాడు.
"...సో, నువ్వు ప్రేమలో పడ్డావన్న మాట" కాసేపయ్యాక అన్నాడు మారుతీరావు.
అంత ఉపన్యాసం విన్నాక కూడా ఆయనతో అబద్ధం చెప్పలేక వుండలేకపోయాడు.
"ఒకమ్మాయి కోసం తపించి, చిక్కిపోవడముంది చూశావూ అది మగాడికి సిగ్నల్ అన్నమాట. ఆమెతో జతకడితే నీ ఆయుష్ణు హుష్ కాకీ అయిపోతుందని మనకు తెలియజెప్పడమన్న మాట. అది తెలియక మగాడు స్త్రీ పొందు కోసం వెంపర్లాడి చివరకు తన ప్రాణానికే ముప్పు తెచ్చుకుంటాడు" ఈ టాపిక్ ను మారుతీరావు మధ్యలో ఆపరని అతనికి తెలుసు గనుక మరో మాట మాట్లాడకుండా అలా శిలాప్రతిమలా వింటుండిపోయాడు.
"కొన్ని కీటకాల్లో మగది ఆడదానితో కలిశాక ప్రాణం విడిచేస్తుంది తెలుసా?"
ఇలాంటప్పుడు ఏదో సమాధానం చెప్పాలి గనుక "ఎస్ సార్" అన్నాడు అతను.
"అలా సృష్టిలో మగజాతికే తీరని అన్యాయం జరిగిపోయిందన్న మాట. వీర్యం చుక్కను మనం జారవిడుచుకుంటే అరవై చుక్కల రక్తాన్ని మనం పోగొట్టుకుంటున్నామన్న మాట. కానీ కిన్సే నుంచి జాక్ సన్ అండ్ జాక్ సన్ వరకు అదేం లేదని వాదిస్తారు. కానీ వాళ్ళు తప్పు. మన సన్యాసులకంటే ఆ పాశ్చాత్య నవీన సన్యాసులకి ఏం తెలుసు. అందుకే పాశ్చాత్య శాస్త్రజ్ఞులను నేను నమ్మను."
"ఎస్ సార్."
"అందుకే నేను జీవితాన్ని, జీవించడాన్ని ప్రేమిస్తాను. స్త్రీని ద్వేషిస్తాను. ద్వేషించడమంటే ఒక్క సెక్స్ లోనే. మిగిలినప్పుడు ఒకే. స్త్రీని ఆ విషయంలో దూరంగా వుంచుతాను. భార్యనైనా సరే."
"హతవిధీ" అనుకున్నాడు నరేష్ ఆయన భార్య స్మిత గుర్తొచ్చింది.
ఈవరకు ఆమెను ఎప్పుడూ చూడలేదు అతను. అయితే ఆమె ఎలా వుంటుందోనాన్న కుతూహలం చాలానే ఉంది. కానీ ఆమెను చూసే వీలు చిక్కడం లేదు.
"ఆఁ నీకు చెప్పడమే మరిచాను. నువు మా ఆవిడ ఒకే వూరట కదా. ఆ అభిమానంతోనే నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇమ్మంది. అందుకే నీకు ఉద్యోగం ఇచ్చాను. బాగా పనిచేసుకో, కుర్రాడివి పైకొస్తావ్. బైదిబై స్మిత ఒక్కసారి నిన్ను ఇంటికి రమ్మంది. తన వూరివాడివి కదా బహుశా పుట్టింటి కబుర్లు మాట్లాడాలని రమ్మని వుంటుంది. సాయంకాలం ఆఫీసు పనయ్యాక ఒకసారి వెళ్ళు."
ఆ మాటలు వింటూంటే అతనికి మతి పోయింది. తనది, స్మితగారిది ఒకే వూరేమిటి! నాన్సెన్స్. తన వూరు ఏమిటో తనకే తెలీదు. ఎవరో కన్నతల్లి తనను పురిటిపాపాయిలా అనాధాశ్రమంలోవిడిచి వెళ్ళింది. అంతే తప్ప తనకంటూ ఓ ఊరు లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు తోచింది అతనికి.
అయితే ఈ విషయాన్నంతా అతను మారుతీరావుకి చెప్పలేదు. అబద్ధం చెప్పి తనకు ఉద్యోగం ఇప్పించాల్సిన అవసరం ఆమెకు ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం అతనిని వూపేస్తోంది.
"ఎస్ సార్" అంటూ లేచాడు.
"ఓ.కె. రిపోర్ట్ వారంలో కావాలి."
"ఎస్ సార్."
అతని వెనుక స్ప్రింగ్ డోర్ నిశ్శబ్దంగా మూసుకుంది.
సీట్లో కూర్చున్నాడు గానీ అతనికి పనిమీద మనసు లగ్నం కావడం లేదు. ఆ రోజు ఆరుగంటలకు ఇందిరానగర్ కాలనీలోని గాంధీ బొమ్మ దగ్గరకు జగ్గారావు వస్తానన్నాడు. జగ్గారావుతో అర్జెంటుగా మాట్లాడవలసి వుంది. ఆరుగంటలకు తప్పితే జగ్గారావు మళ్ళీ ఎప్పటికో గానీ దొరకడు. ఆఫీస్ వదిలాక సరాసరి గాంధీబొమ్మ దగ్గరకు వెళ్ళాలని ముందు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మధ్యలో స్మిత తనను చూడాలని స్వయంగా తన ప్రొప్రయిటర్ తో చెప్పి పంపింది. ఆమె ఎందుకు తనకు ఉద్యోగం యిచ్చిందో, తన భర్తతో తమ వూరు ఒకటేనని ఎందుకు అబద్ధం ఆడిందో, తనను ఈరోజే ఎందుకు రమ్మందో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా బలంగానే వుంది. ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడతను.
అవతల మరీ అత్యవసరమైన పని లేకుంటే నరేష్ తప్పకుండా స్మిత దగ్గరకు వెళ్ళుండేవాడు. ఒక స్త్రీ తనను పిలిచిందంటే వెళ్ళకుండా వుండే మగాడు ఈ ప్రపంచంలో వుండడు. అందునా నరేష్ కి ఆ మగబుద్ధి కాస్తంత ఎక్కువే వుంది. అక్కడికెళ్ళాక ఆమె ఏమడిగితే అతని రెస్పాన్స్ ఎలా వుంటుందో అతనికే తెలియదు. ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి ఎదురుకాలేదతనికి. మారుతీరావు చెప్పినట్టు అతనూ ఆడపిల్లల విషయంలో కన్ ఫ్యూజ్ గానే వున్నాడు. అతనికి కన్ ఫ్యూజ్ లేనిది ఒక్క రజని విషయంలోనే.
సాయంకాలం వరకు అన్యమనస్కంగానే ఆఫీస్ లో గడిపాడు. చివరకు జగ్గారావునే కలవడానికి నిశ్చయించుకున్నాడు. ఆపని అంత ముఖ్యం మరి.
ఆఫీస్ వదలగానే సరాసరి గాంధీబొమ్మ దగ్గరకు వెళ్ళాడు.
అప్పటికే జగ్గారావు అతని కోసం అక్కడ వేచి వున్నాడు. పలకరింపులయ్యాక ఇద్దరూ సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు.