ఒక ఆర్తనాదం...
గభాల్న ఉలిక్కిపడి నిద్రలో అంది. లేచాడు రుత్వి అని.
అప్పటికే ఆమె ఫాలభాగం స్వేదంతో తడిసిపోయింది.
చుట్టూ చీకటి.. .అంతటా నిశ్శబ్దం.
బెడ్ మీద ఒంటరిగా తను....
గోడకున్న డిజిటల్ వాచ్ తెల్లావారుజామున రెండున్నర గంటల్ని సూచిస్తుంది.
అంటే ......
ఇంతసేపూ తను కన్నది ఓ పీడకల.
రుత్వికేం కాలేదు. ....
సమీపంలో టీపాయ్ మీద వున్న గ్లాసులోని నీళ్లని గడగడా తాగేసింది.
నిన్న రాత్రి కెనడా సంబంధం గురించి తండ్రి మాట్లాడటం గుర్తుచేసుకుంటూ అంతచ్చేతనలు కలవరం ఓ కలగా తననిప్పుడు కలత పెట్టిందా?"
కలత పెట్టడంకన్నా ఆ కల విజూషని మరింత మొండిదానిగా మార్చింది.
* * * *
"శ్లేష్మం, వాతం పైత్యం అనే మూడు ధాతువులు మానవ శరీరాన్ని పుట్టించి, పాలించి నాశనం చేస్తున్నాయి. ఆరోగ్యానికి, అనారోగ్యానికి కారణం ఈ ధాతువులే, ఈ త్రిదోష సిద్దాంత ప్రాతిపదికపైనే ఆయుర్వేదం మన దేశంలో అవతరించింది.'
ఉదయం పది గంటల సమయంలో వయసుకి మించిన స్థితప్రజ్ఞతతో మాటాడుతున్న రుత్విని చూస్తూ ఇంటి ఆరుబయట అతడితోపాటు కూర్చున్న పత్రికా విలేఖర్లలో ఓ వ్యక్తి అన్నాడు.
"మీరు చదువుకున్నది కంప్యూటర్ ఇంజనీరింగ్, ఓ పెద్ద కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఫేకల్టీగా జాబ్ చేస్తున్నారు.
అయినా ఆయుర్వేదం మీద ఇంట్రెస్టుతో మందులు తయారుచేస్తూ పేదలకి ఉచితంగా ట్రీట్ మెంటిస్తూ ఎందుకింత ట్రబుల్ తీసుకుంటున్నారు?"
"ఐ డోంట్ థింక్ ఇట్ ఏజ్ ట్రబుల్ ఫర్మి" మృదువుగా అన్నాడు.
"నేను దీన్ని శ్రమగా బావించను. మా తాతగారిచ్చినమాటని నిలుపుకుంటున్నందుకు గర్వపడుతుంటాను."
"మహర్షి" పేరుతో ఆయుర్వేద విజ్ఞానాన్ని ఈ దేశానికి అందించిన రుత్వి తాతగారి అసలు పేరు "దివాకర మహర్షి."
దేశంలోనే కాక విదేశాలు పర్యటించి తను శోధించి తెలుసుకున్న ఔషద విజ్ఞానం గురించి అసాధారణమైన ప్రాచుర్యాన్ని అందించారు ఆయన.
అయితే ఈ దేశంకన్నా జర్మనీ, బ్రెజిల్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఆయన ఎక్కువ పేరు సంపాదించుకోగలిగారు.
కారణం........
ఈ దేశంలో జనానికి ఆయుర్వేదంపై వున్న అపనమ్మకం, లేదా ఇంగ్లీషు మందులపై ఏర్పడ్డ నమ్మకం.
"మీ తాతగారు సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆయుర్వేద వైద్య విజ్ఞానం గురించి ప్రజలకు తెలియచెప్పినా, ఈ దేశంలో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయారు. దానికి కారణం చెప్పగలరా?"
సాలోచనగా అన్నాడు -
"సూటిగా చెప్పాలీ అంటే ఒకనాడు వలస రాజ్యంగా బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో వుండడం మొదటి కారణం-"
క్షణం ఆగాడు.
"ఇది అతిశయోక్తి కాదు. ప్రాచీన భారతదేశంలో వేద విజ్ఞానం నుంచి అవతరించిన ఆయుర్వేదంలో ప్రకృతి వనరులతో మనిషి ఆయువుని పెంచడం అన్న దిశగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సరాల మధ్య ఎందరో వైద్యులు ముఖ్యంగా ధన్వంతరీ,చెరకుడు, శుస్రుతుడులాంటి ప్రముఖులు శస్త్ర చికిత్సదాకా వెళ్లారు. ఆ రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు దాఖలాలు వున్నాయి. అయితే ఆ వివరాలకి కావలసినంతగా పబ్లిసిటీ ఇవ్వలేకపోయింది మన తరానికి చెందిన మేధావి వర్గం."
చాలా ఆసక్తిగా వింటున్నారు జర్మలిస్టులంతా.
"పరదేశీయుల పాలనలో వుండటం మూలంగా మనకి న్యూటన్, ఐన్ స్టీన్ వంటి ప్రముఖల పేర్లు తెలిసేట్టుగా విద్యాభోదన జరిగింది తప్ప మన పూర్వీకుల చరిత్రకి అంత ప్రాముఖ్యత యివ్వబడలేదు. అలా అని నేను న్యూటన్, ఐన్ స్టీన్ లను తక్కువ చేయడం లేదు. ఈ ప్రపంచానికి మేలు చేసిన ఆ మేధావులు చిరస్మరణీయులే. కానీ అంతటి ఇంపార్టెన్స్ మన ధన్వంతరి లాంటి వైద్యులకి ఇవ్వలేదూ అంటున్నాను."
చుట్టూ కలియచూశాడు.
"కారణం అనూహ్యం కాదు. బానిసత్వంలో మగ్గిన ఈ దేశంలోని విద్యాసంస్కృతిలాంటివి బ్రిటిష్ పరిపాలకుల మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుని న్యూటన్ లాంటి వాళ్లని మనకి దగ్గరచేసి శుశ్రుతులాంటి మేధావుల్ని దూరం చేశాయి"
"కానీ ఇప్పుడు జర్మనీ, అమెరికాల్లాంటి దేశాల్లో ఆయుర్వేద విశ్వ విద్యాలయాలు స్థాపించబడుతున్నాయి."
ఓ విలేఖరి గుర్తుచేశాడు.
"అంటే ఆయుర్వేదమన్నది అక్కడ పుట్టి పెరిగిందని అర్దంకాదు. మన వేదాలలోంచి పుట్టిన ఈ ఆయుర్వేదం మనకి దురదృష్టవశాత్తు దూరమైంది విదేశీ దండయాత్రల్లో."
ఉత్కంఠగా చూస్తున్నారంతా.
"ఒకనాడు మన దేశంపై దండెత్తిన విదేశీయులు ఎంత దోచుకున్నా గానీ అన్నిటికన్నా మనం కోల్పోయిన విలువైన సంపద గ్రంధాలయాలు"
క్షణం ఆగి అన్నాడు.
"భారతీయులకి ఉపయోగపడే ఎన్నో విషయాల్ని తాళపత్ర గ్రంధాలలో మన పూర్వీకులు పొందుపరిస్తే అవి దోపిడీకి గురయ్యాయి. అలాగే ఆయుర్వేద విజ్ఞానం కూడా విదేశీయుల హస్తగతమైంది."
అదిగో అప్పుడు సమీపంలో ఏదో కలకలం వినిపించింది.
విలేఖర్లంతా చూస్తుండగా ఓ జంట ఏడుస్తున్న రెండేళ్ళ పసిబిడ్డని తీసుకొచ్చారు.
నిజానికి అది ఏడుపు కాదు.