Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 26

 

    ఇలాంటి ఆకృత్యాలను ఉతికి అరేయడానికే "ఈ రేప్ ల సంస్కృతీకి ఇప్పుడో చిన్న బ్రేక్ " అనే ప్రోగ్రాం ని మేము ప్రారంభించాం!
    అందులో రాష్ట్రం లోనూ , దేశంలోనూ జరుగుతోన్న రేప్ కేస్ ల గురించి , రేప్ చేయబడిన స్త్రీల గురించి - వీడియోతో పాటు - వాళ్ళ ఇంటర్ వ్యూలు చూపిస్తున్నాం-
    ఎందుకంటే మరెంతో మంది అమాయక స్త్రీలు అలాంటి అవాంతరాల నుంచి తమను తాము రక్షించుకోవటం కోసం! అలాంటి దుర్మార్గానికి పాల్పడ్డ మానవ మృగాల మీద పోలీసుల ఏం చర్య తీసుకున్నారో ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేయటం కోసం -
    అలాగే చాలామంది స్త్రీలు లైంగిక వేధింపులకు గురి కావటం మనందరికీ తెలుసు. కానీ అలాంటి వేధింపులకు గురి చేస్తున్న మగాళ్ళ గురించి ప్రపంచానికి ఎట్లా తెలియజేప్పాలో తెలీక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోవటం మాకు తెలుసు.
    అలాంటి స్త్రీలు ధైర్యంగా , తమ ఆవేదనను వెలిబుచ్చుకోడానికి ఏర్పాటు చేసిన ప్రొగ్రాం " ఈ వేధింపులకు అంతం లేదా?"
    ఇక అన్నీ టీవి చానెల్స్ లోనూ సెక్స్ అండ్ క్రైమ్  గురించి చూపిస్తున్నారు.
    కానీ మేము వాటిని మా చానెల్ వ్యూయర్ షిప్ కోసం వాడు కోవటం లేదు.
    అందుకే సినిమాల్లో చూపిస్తోన్న సెక్స్ అండ్ వయోలెన్స్ వల్ల మన సమాజానికి యెంత నష్టం జరుగుతోందీ రోజూ రాత్రి పదకొండు గంటలకు ఈ సినిమాలు సమాజాన్ని నాశనం చేయటం లేదా?" అనే ప్రోగ్రాం లో చూపిస్తున్నాం.
    అలాగే ఎయిడ్స్ గురించి ఏమాత్రం అవగాహన లేని మా ప్రేక్షకులలో అవేర్ నెస్ కలిగించటం కోసం "కొత్త కోణం' అనే ప్రోగ్రాం లో ప్రారంభించాం. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా మేమీ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నాం. కేవలం మన తెలుగు ప్రజలంతా అలాంటి అవాంచనీయ ధోరణులకు - బలి కాకూడదని ! ఇలాంటి యుద్ధం మొదలెపెట్టినందుకు నా చానెల్ ని పేల్చి వేస్తామని కొందరు ఫోన్లు చేస్తున్నారు. నా ప్రాణాలు తీస్తామని ఇంకొకరు బెదిరిస్తున్నారు -- కానీ నేను భయపడను. సంతోషంగా ప్రాణాలు ధారపోస్తాను గానీ మన తెలుగు ఆడపడుచులకు అన్యాయం జరగనివ్వను !
    మీరిప్పుడు చెప్పండి! ఇలాంటి ప్రోగ్రామ్స్ అవసరం మన సొసైటీ కుందా లేదా? ఇంకే చానెల్ కూడా చేయలేని ఈ యజ్ఞాన్ని మేము కొనసాగించాలా వద్దా! మీరేం చెప్తే అదే మాకు వేద వాక్కు- చెప్పండి ! మా ప్రోగ్రామ్స్ కి మీ అంగీకారం ఉందా? లేదా?"
    జనమంతా స్పెల్ బౌండ్ అయిపోయారు. కొద్ది క్షణాలు నిశ్శబ్ధం తర్వాత విజయ్ యాదవ్ ముందు కొచ్చాడు.
    "సార్! ఈ ప్రోగ్రామ్స్ వెనుక మీరింత పెద్ద యుద్ధం డిక్లేర్ చేశారని మాకు తెలీలేదు. సార్ - ఈ క్షణం నుంచీ మేమెంతా మీ చానెల్ కి సైనికులమవుతాం! మీరు చేస్తున్న యుద్దాన్ని మేము కంటిన్యూ చేస్తాం! మీ చానెల్ అధ్వర్యంలో మన రాష్ట్రంలో ఎక్కడే అశ్లీల శక్తులు కనిపించినా వాటిని రూపు మాపుతాం-" అన్నాడు ఆవేశంగా. దాంతో మిగతా అందరూ కూడా బృందావనం చానెల్ జిందాబాద్ -- రాకేష్ మాస్టర్ జిందాబాద్ - బృందావనం చానెల్ యుద్ధం- గెలుపొందాలి -' అంటూ నినాదాలు ప్రారంభించారు.
    అప్పటికప్పుడే కొంతమంది స్త్రీలు అరుగు ఎక్కి నృత్యాలు ప్రారంభించారు. సంపూర్ణ చానల్ ని చూస్తోన్న మల్లిక ఒక్కసారిగా పరిస్థితి అంతా రివర్స్ అయిపోయే సరికి షాకయింది.
    తన బాస్ అన్నట్లు ఈ రాకేష్ ది పర్ వర్దేడ్ ఇంటెలిజెన్స్! అనుకుందామే.

                                        ***

    ఒక్క సంఘటనతో బృందావనం చానెల్ వ్యూయర్ షిప్ విపరీతంగా పెరిగి పోయింది.
    రాకేష్ అనేవాడు తన ప్రాణాలకు తెగించి మన సంస్కృతీని నిలబెట్టేందుకు చేస్తున్న పోరాటానికి తెలుగు ప్రజలంతా మద్దతు తెలుపుతున్నాం! ఈ ధర్మ యుద్దంలో బృందావనం చానెల్ విజయం కోసం మేమంతా మా ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉన్నాం - ఇట్లు తెలుగు ప్రజల సంస్కృతీ సంరక్షణ సమితి అంటూ రాష్ట్రంలో చాలా చోట్ల వాల్ పోస్టర్స్ వేలిశాయ్.
    ఆ తరువాత భవానీ ప్రారంభించిన కొత్త ప్రోగ్రాం ఇంకా పెద్ద హిట్టయింది. గాళ్స్, బాయ్స్ తీసిన ప్రైవేట్ వీడియోస్ అన్నీ " ఓ చూపు చూస్కో' అనే కార్యక్రమంలో టెలికాస్ట్ చేయటమే ఆ కార్యక్రమం!
    ఆ వీడియోలో ఏమయినా ఉండవచ్చు. ఎలాంటి డాన్స్ లయినా చేయవచ్చు. ఆ వీడియో రన్ అవుతున్నంత సేపూ ఆ అమ్మాయి పేరు, క్వాలిఫికేషన్, సెల్ నెంబర్ , హాబీలు , అభిమాన సినిమా హీరోల పేర్లూ -- ఎలాంటి క్వాలిటీస్ ఉన్న బాయ్స్ ని తను లైక్ చేసేది - అన్నీ స్క్రోల్ల్ అవుతుంటాయ్.
    ఆ ప్రోగ్రాం లో కనబడటం కోసం బాయ్స్ , గాళ్స్ వెర్రెక్కి పోయినట్లు వీడియోలు తీసి పంపటం మొదలు పెట్టారు.
    అలాంటి కార్యక్రమాల్లోకి క్రమీపీ సెక్స్ వర్కర్స్ కూడా జొరబడతారని భవానీకి ముందే తెలుసు.
    ఎందుకంటే మిగతా చానెల్స్ లో చాలామంది చేస్తున్న పనదే! వేశ్యలకూ విటులకూ మధ్య బ్రోకర్స్ లాగా ఎవరికి ఎవరు కావాలో -- ఏ టైమ్ కి ఏ లాడ్జ్ దగ్గర కలుసుకోవాలో - అన్నీ స్క్రోలింగ్ లో వస్తూనే ఉంటాయ్. రోజాకి భవానీ మీద ఉన్న చెడ్డ అభిప్రాయం స్లోగా మారిపోసాగింది. ఎవరి నోట వెంట చూసిన బృందావన్ చానెల్ మాట వినబడుతోంటే , ఆమె కన్ ఫ్యూజన్ లో ఉంది.
    తను చేసి ప్రోగ్రామ్స్ ప్రేక్షకుల కెందుకు వచ్చలేదు? రాకేష్ చేస్తున్న చెత్త ప్రోగ్రామ్స్ ఎందుకు నచ్చుతున్నాయ్?
    ఒకవేళ ఈనాటి యూత్ కి అనే కావాలేమో! స్త్రీలు కూడా ఎక్ స్ట్రా మారిటల్ ఎఫైర్ ఉన్న కధలే కోరుకుంటున్నారేమో-
    వారం వారానికీ రేటింగ్ పెరిగిపోతోన్న బృందావనం ప్రోగ్రామ్స్ చూస్తుంటే ఆమెకు మతిపోతోంది.
    ఈ లెక్కన అతను మూడు నెలల్లో బృందావనాన్ని నెంబర్ వన్ చానెల్ చేసేయగలడేమో! అదంత తెలికకాదని తనకు తెలుసు. కానీ రాకేష్ కూడా సామాన్యుడు కాదు -

                             ***

    ఆ తరువాత భవానీశంకర్ చేసుకున్న లోఫాయికారీ డీల్ వల్ల బృందావన్ చానెల్ డిగ్నిటీ పెరిగిపోయింది.
    వచ్చే ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడానికి అవకాశాలున్న ప్రముఖ రాజకీయ పార్టీ ఈతరం పార్టీతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం - వాళ్ళు ఆ చానెల్ కి పదికోట్ల రూపాయలు విలువ గల పొలిటికల్ యాడ్స్ ఇస్తారు. అందుకు ప్రతిఫలంగా ఆపార్టీ బృందావన్ చానెల్ని వచ్చే ఎలక్షన్స్ లో తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకుటుంది. ఆ పార్టీకి చెందిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా బృందావన్ చానెల్లో యాడ్స్ రిలీజ్ చేస్తారు.
    ఒక్కసారిగా బృందావన్ చానెల్లో పెరిగిపోయిన యాడ్స్ చూసి మల్లిక జెలసీ ఫీలయింది.

 Previous Page Next Page