***
సంపూర్ణ చానెల్ ఆ ఊరేగింపుని పెద్ద ఎత్తున - మిగతా కార్యక్రమాలన్నింటిని ఆపి లైట్ గా కవరేజ్ ఇస్తూండడంతో - మిగతా చానెల్స్ అన్నీ కూడా అదే పాటపాడటం మొదలు పెట్టాయ్'.
అప్పుడే టీవీ అన్ చేసిన రోజా , జైరాజ్ మొత్తం చానెల్స్ అన్నీ కవరేజ్ ఇస్తున్న ఆ ఊరేగింపుని చూశారు. వాన్ మీద అతి సెక్సీగా ఉన్న ద్రౌపది - ఆమె చీర ఊడ బీకుతున్నట్లు నటిస్తోన్న దుర్యోధనుడు , అతని వీపుకి కట్టిన బృందావనం టీవీ చానెల్ బోర్డూ చూసి షాకయ్యారు.
"నేను చెప్పానా డాడీ! ఇంతకాలం మన డబ్బు పోయిందనే బాధపడుతూ వచ్చాం! కానీ ఈ రాకేష్ వల్ల మన సిగ్గు కూడా పోయింది -" అంది రోజా బాధగా--
"నీ పాయింట్ కొంచెం వీక్ గా ఉన్నది బిడ్డా?"
రోజా ఆశ్చర్యపోయింది. ఇది ఫస్ట్ టైం . తనకూ తండ్రీకి అభిప్రాయాల్లో తేడా రావటం!
"ఎందుకని?"
"రాకేష్ ఒక్కడే తప్పు చేస్తున్నాడనుకొను! మిగతా అన్ని చానెల్స్ కూడా ఎప్పటి నుంచో సెక్స్ ని టూ మచ్ గా ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నాయ్. ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ సీరియల్స్ లోనే అక్రమ సంబంధాలను ప్రాపగెట్ చేస్తున్నాయ్. లేదా వయోలిన్స్ - స్త్రీల మీద శాడిజం , అత్యాచారాలు , మరిది వదినతో సెక్స్ కోసం ప్రయత్నించెడివి, మామ కోడలిని లోబరచుకోడానికి చూసేడిదీ , పెళ్ళామే మొగుడిని ఇంకో లేడీనీ పడగ్గదిలో అప్పగించేదిదీ , బావ మీద రివెంజ్ కోసం మరదలు వాడితో బెడ్ మీద పడు కొనెడిది-
అవన్నీ వదిలేసి పబ్లిక్ కేవలం బృందావనం చానెల్ గురించి గడబిడ ఎందుకు జేస్తున్రు ? ఇందులో ఏదో మతలబ్ కానరావటంలే?"
తండ్రి వాదనలో చాలావరకూ నిజం ఉందనిపించింది రోజాకూ.
"అవునూ ! రాత్రి రాకేష్ ఇంటికి రాలేదేందుకని ?" అడిగిందామె.
"రాకేష్ చాలా జిద్ మనిషమ్మా! ఈ మూడు నెలలు చానెల్లోనే 24 గంటలూ వర్క్ జేస్తా అంకుల్" అని చెప్పాడు.
రోజా ఆశ్చర్యపోయింది.
"ఆ కాండేట్ కింత సీనుందా?"
"ఉందేమో మళ్ళా -- మనకే మెరుక?"
విజయ్ యాదవ్ అండ్ గాంగ్ లేవదీసిన ఆ ఊరేగింపు ఇప్పుడు బృందావన్ చానెల్ ఆఫీస్ స్టూడియోస్ దగ్గరకు చేరుకుంది.
ఆ ఊరేగింపులో పాల్గొన్న లేడీసంతా సెక్స్ వర్కర్స్ కావడంతో -- వాళ్ళ చేష్టలకూ, డైలాగ్స్ కీ జనం అవాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు.
దాంతో బృందావనం చానెల్ చేరుకునేసరికి యాభై మందల్లా నూట యాభై మందయ్యారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని గుమికూడిన జనం మరో రెండు వందల మంది జాయినయారు. దాంతో ట్రాఫిక్ జామ్ తప్పటం లేదు.
అక్కడకు రాగానే విజయ్ యాదవ్ స్లొగన్స్ మార్చేశాడు.
"బృందావనం చానెల్ ఇన్ చార్జ్ రాకేష్- బయటకు రావాలి -"
"రాకేష్ - బయటకు రావాలి !"
"చేసిన తప్పుకి - క్షమార్పణ చెప్పుకోవాలి !"
"ముర్దాబాద్ రాకేష్ మాస్టర్ - ముర్దాబాద్ -- ముర్దాబాద్"
చాలాసేపు కేకల తర్వాత బృందావనం చానెల్ - ఇప్పుడు చానెల్ ఆఫీస్ లో జరుగుతోన్న మీటింగ్ ని కవరేజ్ ఇవ్వటం మొదలుపెట్టింది.
న్యూస్ రీడర్ రంభ సెక్సీ డ్రస్ లో నిలబడి మీటింగ్ రూమ్ లో ఉన్న జర్నలిస్ట్ శ్యామ్ తో మాట్లాడుతోంది.
"శ్యామ్ ! బయట ప్రజలు చేస్తున్న ధర్నా విషయంలో మానేజ్ మెంట్ ఎలా స్పందిస్తుంది! రాకేష్ గారేమంటున్నారు? ప్రజల కోరిక మేరకు బయటకొచ్చి పబ్లిగ్గా క్షమార్పణ చెప్పే ఆలోచనలో ఉన్నారా?"
"రంభా! ప్రజలు బృందావనం చానెల్లో సెక్స్, అశ్లీలం దృశ్యాలు మితిమీరాయని శాంతియుతంగా జరుపుతున్న ధర్నా గురించి ప్రస్తుత చానెల్ సిఈఓ రాకేష్ గారు ఎమర్జెన్సీ చానెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో అయన ప్రసంగించటం మన ప్రేక్షకులు చూడవచ్చు -- ' అంటుండగానే మీటింగ్ లో మాట్లాడుతున్న భవానీ కనిపించాడు.
".......చానెల్లో ప్రసారమవుతోన్న అశ్లీలాలకు వ్యతిరేకంగా ప్రజలు జరుపుతోన్న ధర్నా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే వారందరితోనూ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. ఎందుకంటె ఈ టీవీ ప్రేక్షకులే మా చానెల్ పాలిట దేవుళ్ళు!" అంటూ చానెల్ బయటకు నడుస్తొంటే కెమెరా అతనిని ఫాలో అయింది.
బయట నినాదాలు చేస్తోన్న జనమంతా భవానీనీ చూడగానే ఇంకా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భవానీ మైక్ ముందు కొచ్చాడు.
"తమ తమ మనసులోని భావాలను -- తమ ఫీలింగ్స్ ని బృందావనం చానెల్ కి తెలియజెప్పటానికి ఇంత శ్రమపడి వచ్చిన మా ప్రేక్షకులందరికీ నా గౌరవ నమస్సులు. మీలోనా అక్కలున్నారు- చెల్లెళ్ళు న్నారు- తమ్ముళ్ళున్నారు - అన్నలున్నారు - మీ అందరి కోరికనూ గౌరవించడం నా విధి! అందుకే మీ కేదురుగ్గా భక్తీ ప్రవత్తులతో వచ్చాను -- ముందుగా మా బృందావనం చానెల్ చేపట్టిన నూతన కార్యక్రమాల గురించి మీరొక్కసారి పున్హ పరీశీలన చేయవలసిందిగా కోరుతున్నా - మొదటిది "భగవంతుడా ! మా సంస్కృతీని రక్షించు!" అనే కార్యక్రమం! ఇందులో మేము చూపిస్తోందంతా మన పిల్లలు కాలేజీల్లో చేస్తోన్న అసాంఘిక కార్యక్రమాలే ! మన భారత దేశ సంస్కృతిని మర్చిపోయి బాయ్ ఫ్ర్రెండ్స్, గాళ్ ఫ్రెండ్స్ అంటూ అక్రమా సంబంధాలేర్పరచుకుని, పాశ్చాత్య సంస్కృతీకి బానిసలయి బార్లలో తాగి అసభ్యకరమయిన నృత్యాలు చేస్తూ, హోటల్ రూముల్లో డ్రగ్స్ కి అలవాటుపడుతూ - ఈ ధోరణిలో మన పిల్లల భవిష్యత్తు ఎటు వేపు ప్రయాణిస్తోంది? మన సమాజానికే ఒక ఛాలెంజ్ గా మారిన ఈ విష వృక్షాన్ని ఎవరు చేధించాలి? ఎవరికి వారే మనకెందుకులే అని ఊరుకుంటే పిల్లి మెడలో గంట కట్టే దేవరు? అందుకే మా బృందావనం ఆ ఛాలెంజ్ ని ఎదుర్కోవాలని డిసైడ్ చేసుకుంది! అందులో భాగంగానే ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించాం! మన సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువయి పోయాయ్. యాసిడ్ దాడులు ఎక్కువయిపోయాయ్. రావణాసురుడి టైప్ లో తనను ఇష్టపడని గాళ్స్ ని కిడ్నాప్ చేసే దుర్మార్గులేక్కువయిపోయారు.