అతడంత అనునయంగా చెప్పేసరికి ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె కోసం బాధగా మారింది. "చిరంజీవి లాటివాడు ఇలా చేసి వుంటాడు అంటే నేను నమ్మకుండా వున్నాను" అంది.
అతడికేమో ఒకవైపు నవ్వోస్తూంది. దాన్ని దాచటం సాధ్యంకావటంలేదు. అయినా మోహం సీరియస్ గానే వుండి__ "ఇన్నేళ్ళు క్రిమినాలస్ తో వున్న నా అనుభవంతో నేను తెలుసుకున్న దేమిటంటే__ మనిషి పైకి కనబడటానికీ__ లోపల పరివర్తనకీ చాలా తేడా వుంటుందనీ" అన్నాడు. అలా అంటూ అతడు వెనుదిరిగేసరికి అర్చన అక్కడ లేదు. బైట కారు బయల్దేరిన చప్పుడు వినిపించింది. కాంపౌండ్ లోంచి బయటకి బాణంలా అది దూసుకుపోవటం కనిపించింది.
జైలు అధికారితో మాట్లాడి చిరంజీవిని కల్సికోనేసరికి అరగంట పట్టింది అర్చనకి.
ఆమె రాకని వూహింస్తున్న చిరంజీవి అంతగా ఆశ్చర్యపోలేదు. ఇక్కడ చిరంజీవి పరిస్థితిని గురించి కొంచెం చెప్పాలి. అతడు జైలు దుస్తుల్లో గమ్మత్తుగా వున్నాడు. గడ్డం పెరిగింది. __బయటకన్నా జైల్లో టైమ్ కి తిండి ఉండటంవల్లమోహం మరింత కళగా వుంది.
చిరంజీవి వున్న గదిని కాపలా కాసే సెంట్రీ పేరు విష్ణుశర్మ . పేరులో ఆశ్చర్యంలేదు. పెద్ద పెద్ద బూట్లు టకటకలాడించుకుంటూ తుఫాకి పట్టుకుని గాంభీర్యంగా తిరిగేవాళ్ళ పేర్లు విష్ణుశర్మ, తిమ్మారావు, పినాక పాణి అని వుండకూడదని రూలు లేదుకదా!
చిరంజీవి లాయరుని తెలిసి నమ్రత హెచ్చింది. ఒకే ఈడు వాళ్లవటంతో చనువుకూడా పెరిగింది.
"అబ్బా, ఏం సినిమా సార్! సినిమా అంటే అలావుండాలి. ఒక హీరో __ ఇద్దరు హీరోయిన్లు __హీరోకి క్షయ ..... " అంటూ క్రితంరాత్రి బ్లాక్ లో టిక్కెట్టు కొనుక్కుని చూసిన సెకండ్ షో సినిమా తాలుకూ కథ చెప్పెసేడు.
అర్చన వచ్చేసరికి చిరంజీవి ఇంకా ఆ తెలుగు సినిమా తోనే ఉన్నాడు. అర్చన కళ్ళు వర్షించటానికి సిద్దంగా వున్నాయి. రాగానే ఆవేశాన్ని బలవంతం మీద అణుచుకుంటూ "ఇదంతా నిజమేనా?"అని ఊచలు పట్టుకుని అడిగింది. "కాదని చెప్పు.... చెప్పవూ" అంది బేలగా.
"చేసిన నేరాన్ని కాదనటం నాలుక్కి సాధ్యమౌతుందేమోగానీ మనసుకి సాధ్యం కాదుగా అర్చనా" భారంగా అన్నాడు. చిరంజీవి.
"కానీ నీ మనసు ఇలాటి పనికి వప్పుకోంది?"
అతడి దృష్టి గోడుకున్న సాలెగూడుమీద పడింది. "మనసు సాలె గూడులాంటిది అర్చనా ఆలోచల్ను జూజూళ్ళాటివి. ఎప్పుడు ఏ పగ ఈగ అందులో ప్రవేశిస్తుందోతెలీదు" అన్నాడు కొద్దిగా దగ్గి సినిమాలోలా.
"నిన్ను ప్రేమించిన నేనేమవ్వాలి?"
"మనమధ్య ఈ రోజు అడ్డుగా నిల్చిన ఈ జైలు వూచలు నిజంగా వూచలుకావు. సమాజం నిర్మించిన అడ్డుగోడలు. నన్ను మర్చిపో అర్చనా" అతడి కంఠంవణికింది. "కలకాలం పిల్లపాపలతోవర్ధిల్లు . ఏ లోకంలో ఉన్నా ఈ చిరంజీవి మంచిమనసూ, ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుండన్న విషయం మర్చిపోకు __" అంటూ భుజంమీద శాలువాకోసం __ తడువుకొని, అదిలేకపోయేసరికి చూపుడు వేలుతోనే కల్లుతుడుచుకున్నాడు.
"ప్రేమిస్తే మర్చిపోవటం అంత సులభమా చిరంజీవి."
"ప్రేమే లవ్వు! లవ్వే ప్రేమ అర్చనా!"
ప్రేమే లవ్వేమిటిఅని అర్చన అతడివైపు విస్తుబోయి చూసిన నిజంగా ఇతడు సైకిల్ గా మారేడా,అనుకుంది. చిరంజీవి మాత్రం కళ్ళు మూసుకునే వున్నాడు.
ఆమె మాట మారుస్తూ "సుశీలేవరూ?" అని అడిగింది.
"చాలాకాలం నుంచీ నా స్నేహితురాలు. కానీ నాకు నీతో స్నేహమయిందని తెలిసి పెళ్ళికి తొందర పెట్టింది..." ఆమె మొహంలో మారుతూన్న భావాలు గమనిస్తూ అన్నాడు. "నిన్ను వదలిపెట్టటం నాకు ఇష్టం లేకపోయింది. తన అడ్డు తొలగించుకావాలనుకున్నాను."
"అమ్డుకనిఅమేని సత్రానికి రమాన్నావా?" నమ్మలేనట్టు అడిగింది.
"అవును" అన్నాడు. అతడికి పభ్లిక్ ప్రాసిక్యూటర్ మాటలు జ్ఞాపకం వచ్చే. (అమాయకంగా నిన్ను నమ్మింత రాత్రి అక్కడకు వచ్చిన అమ్మాయిని దారుణంగా రేఫ్ చేసి) చిరంజీవికి నవ్వోచ్చింది. నవ్వుతోపాటు హుషారోచ్చింది. ... "మంచిగా అడిగిచూసేను. కవాలంటుమ్చుకుంటానన్నాను. వినలేదు. మర్డర్ చేసెను__ ఎలాగూమర్దర్ చేస్తున్నా కదా అని రేఫ్ చేసెను...."
ఎక్కడో సున్నితమైన బంధం తెగిపోయినట్టయింది ఆమెకి.
"ఐయాం సారీ ఫార్ లవింగ్ యూ" అంది ఇంగ్లీషులో. అప్పటికే ఆమె మామూలుఅర్చన అయిపోయింది. పూర్వపు వేదన __దుఃఖం లేవు. ఆ స్థానాన్ని కోపం ఉక్రోషం చోటుచేసుకున్నాయి. "పైకి కనబడేదంతా నిజంకాదని నా జీవితం చిన్నప్పుడే పాఠం చెప్పింది. కానీ ఇన్నాళ్ళకి అది అసత్యమని నిరూపిమ్చాతానికి నువ్వు కనిపించే వనుకున్నాను.... నా చుట్టూ పైకి ఒకరకంగా, లోపల వేరోరకంగా ప్రవర్తించే వ్యక్తుల్లో విసిగిపోయిన నేను __ నీ పట్ల అందుకే వెంటనే ఆకర్షిటురాలినయ్యాను. కానీ నువ్వూ నన్ను మోసం చేశావు బ్రూటన్."
అతడు మ్ట్లాడలేదు. కనీ ఆమె భాదని చూసి కదిలిపోయేడు. అంతా చెప్పేద్దామా అనుకున్నాడు. మళ్ళీ అగ్రిమెంట్ గుర్తొచ్చింది. దాంతో మౌనం వహించదు. ఆమె మౌనం వహించేడు. ఆమె వేళ్ళోస్తానంటే 'మంచిది' అన్నాడు.
ఆమె రెండు అడుగులు వేసి ఆగింది. గుండె అడుగుపొరల్లో ఏదో అలజడి. ఆమె సందిగ్ధసతితిని అతడుగుర్తింస్తున్నాడు. గుర్తించేకొద్దీ అనందం వేస్తూంది. ఇంత తప్పుచేసినా ఆమె తననిఇమ్కా ప్రేమిస్తూనే వుందన్న భావం ఆమె ప్రవర్తనలో స్పష్టమై __ అది అతడికి ఆనందాన్ని ఇస్తోంది.
ఆమె వెనుదిరిగి అన్నది,"నీలో ఇంకొంచెం మంచితనం వున్నదనటానికి నిదర్శనం నీ తప్పు నువ్వు వప్పుకోవటం ."
అతడు తలెత్తి చూసేడు.
"ఆ ఒక్క కారణంగా నీ శిక్ష తగ్గించే ప్రయత్నం చేయొచ్చు."
అతడు కంగారుపడ్డాడు. అనుకున్నంతా అవుతూంది.
"పైకోర్టుకి అప్పీలు చేద్దాం. మావయ్య స్నేహితుడివైనందుకు ..." ఆమె తడబడింది. "ఈ మాత్రం సాయం నా ధర్మం."