"నే నోప్పుకోను."
"నీ తరుపున అప్పీలుకి నేను వేడ్తాను."
అతడు నవ్వేడు. "నేను వకాల్తా సంతకం పెట్టాను."
ఆమె నిస్సహాయంగా చూసింది అతడివైపు. మరింత వాదించి అలసిపోయిందే తప్ప అతడు మాత్రం విన్లేదు.
"అంతేనా?"
"అంతే...."
"సరే అయితే..."
"ఇంకో విషయం."
"ఏమిటది?" అడిగింది.
"మరిక నన్ను కలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యొద్దు."
"...ఎందుకు?"
"సుశీల ఆలోచనలతోనే న ఈ చివరిక్షణాలు గడుపుదామనుకుంటున్నాను కాబట్టి."
ఆమె దెబ్బతిన్నట్టూ అతడివైపు చూసింది. క్షణంలో సర్దుకుని, "గుడ్ బై మిస్టర్ చిరంజీవి" అంది.
"గుడ్ బై అర్చనా" అన్నాడతడు.
11
పదిరోజుల తర్వాత సర్వోత్తమరావు చిరంజీవి కలుసుకున్నాడు. అయన చేతిలో కాగితాలున్నాయి.
"హైకోర్టు అనుమతి ఇచ్చేసింది" అన్నాడాయన వస్తూనే.
"తెలిసింది" అన్నాడు చిరంజీవి.
"క్షమాబిక్షవేడుకోవడానికి కొంత టైమ్ ఇస్తారు."
"అక్ఖర్లేదని చెప్పాను" అన్నాడు చిరంజీవి __"ప్రొద్దున్న సెంట్రీ చెప్పాడు. అప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయట.
"ఇంకో మంచివార్తా" అన్నాడు సర్వోత్తమరావు. "ప్రెసిడెంట్ పదిరోజుల సెలవుమీద విశ్రాంతికోసం ఇక్కడికివచ్చి వుంటున్నాడట. ఆమె టైమ్ లో కశిక్ష అమలు జరిపితే మరీమంచిది మనకి. శిక్షని గవర్నరు రద్దు చేయడంకన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రద్దుచేస్తే మరింత పబ్లిసిటీవస్తుంది.. ప్రెసిడెంట్ నాకు బాగా తెలుసు. అయన దగ్గర అప్పాయింట్ మెంట్ తీసుకుంటున్నాను. ఈ లోపులో ఉరితీసేదేప్పుడో తారీఖు కనుక్కోవాలి.
"అది రేపో ఎల్లుండో చెప్తారనుకుంటాను." అన్నాడు. సాధారణంగా ఉరితీసే వారంరోజులముందు ఖైదీకి ఆ విషయం చెప్తారు. పంజాబ్ లాటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నేరస్తుడి మీద దయతో __ అతడిని వరంరోజుల పాటూ బాధపెట్టడం ఇష్టంలేక, ఒక్కరోజుముందుమాత్రం ఆ విషయాన్ని చెప్తారు. 'ప్రేసితెమ్డు క్షమాభిక్ష నిరాకరించాడు. ఉరి తప్పదు' అన్నే విషయం తెలియబర్చగానే చాలామండి మోకాళ్ళమీద స్పృహాతప్పిపదిపోతారు. వళ్ళంతా చేపతలు పట్టి కొంతమంది హిస్తిరిక గా మారతారు.
చిరంజీవి మాత్రం "ఈ సస్ఫేన్సు భరించలేకపోతున్నాను. ఏంట తొందరగా ఆ రోజు వస్తుందా అని వుంది. " అన్నాడు.
అంతలో గుమ్మం దగ్గర అలికిడి వినిపించి ఇద్దరూ తలతిప్పి చూసేరు. సూపరింటే౦డెంట్ ధర్మారావు రావటం కనిపించింది.
ధర్మారావు ఆరడుగుల మనిషి. ఎప్పుడూ గంభీరంగా వుంటాడు.
వచ్చి సర్వోత్తమరావుని విష్ చేసి, చిరంజీవివైపు తిరిగి ఇంగ్లీషులో "నేను చెప్పటానికి చాలా విచారిస్తున్నాను. కానే చెప్పక తప్పదు. మీ ఉరి విషయంలో ఫైనల్ ఆర్డర్లు వచ్చాయి. ఎల్లుండి తెల్లవారుఝామున మిమ్మల్ని ఉరి తీస్తారు." అన్నాడు.
చిరంజీవి, సర్వైత్తమరావు మావుహమావుహాలు చూసుకున్నారు. ఇద్దరి మోహాలలోనూ నవ్వు కనబడింది. ధర్మారావు అది చూసి విభ్రాండయ్యాడు. అతడి ముప్ఫైఏళ్ళ సర్వీసులోనూ __ ఆ వార్తా చెప్పగానే నవ్వినా మొదటి ఖైదీ చిరంజీవి!
ధర్మారావు వెళ్ళిపోయాక సర్వోత్తమరావు చిరంజీవికి ఒక కాగితాల కట్ట ఇచ్చాడు.
"ఏమిటిది?"
"ఉరి రద్దుకోసం తాయారుచేసిన నోట్సు. జైలునుండి బయటకొచ్చేటప్పుడు విలేక్ఖర్లకు పంచిపెట్టాలి. కొన్ని కాఫేలుపార్ల మెంటుకు కూడా పంపుదాం. చదివి వుంచు "అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
* * * *
అయన వెళ్ళిన అరగంటకి ఎస్సేయ్ స్పూర్తి చిరంజీవిని కలుసుకోవటానికి వచ్చాడు. అతడి గెడ్డం పెరిగివుండి. మనిషి సగం చిక్కిపోయాడు.
"ఏమిటలా అయిపోయావ్ ! ఎవరన్నా చూస్తె నీకే ఉరిశిక్ష పాడిందనుకుంటారు. " అన్నాడు చిరంజేవి. స్పూర్తి మాట్లాడలేదు. కళ్ళనిండా స్నేహితుణ్ణి నింపుకుని చూస్తూ వుండిపోయాడు.
"అలావున్నావేమిటి గురూ?"
స్పూర్తికి ఇక దుఃఖం ఆగలేదు. అది చూసి కంగారుపడ్డాడు చిరంజీవి. "ఏమైంది? ఎవరైనా పోయారా?" అని అడిగాడు.లేదన్నట్లు తలూపేడు.
"మరి ఇంటిగలాయాన రూము ఖాళీ చెయ్యమన్నాడా?"
స్పూర్తి ఆశ్చర్యంగా చిరంజీవివైపు చూసేడు. చిరంజీవి విసుగ్గా "చెప్పకుండా ఏడుస్తే నేను నీ దుఃఖంలో ఎలా పాలుపంచుకోగాలను ! ముందు చెప్పు " అన్నాడు. ఈసారి స్పూర్తి నిజంగానే బిత్తరపోయేడు. చిరంజీవి మానసిక పరిస్థితి పట్ల అనుమానం కూడా వేసింది. "నువ్వు.... నువ్వు... ఎల్లుమ్డీ పాటికి..." అన్నాడు, ఆ తరువాత భోరున ఏడుపోక్కటే తరువాయి.
చిరంజీవి వేదాంతిలా నవ్వేడు. "నీటి బుడుగలంటి జీవితంపట్ల క్షణికమైన బంధాలు పెంచుకోవటం అనవసరం. బ్రతుకు బుద్బుదమైనది అది తెగిన గాలిపటం లాంటిది. .ఎగిరివెళ్ళి ఏ ముళ్ళపొదల్లో పడుతుందో __ ఏ మహావర్ణాన్ని చేరుతుందో ఎవరూ చెప్పెలేరు" అన్నాడు.
స్పూర్తి అతడి వేదాంతాన్ని మరోలా అర్ధం చేసుకున్నాడు. జాలినిండిన కంఠంతో "ప్రతిరోజూ భగవద్గీత చదువుతున్నావా చిరంజీవి అన్నాడు భాధగా.
"లేదు. శర్మ అని సెంట్రీ ఒకడున్నాడు. సినిమాల పిచ్చి వున్నవాడు ప్రతిరోజూ ఒక సినిమా చెబ్తాడు. అది విని నాకీ వేదాంత భావం అలవడింది."