Previous Page Next Page 
అభిలాష పేజి 24

     ఆమె వెలికి ఉంగరం చిరంజీవి గోల్డు మెడల తో చేయించింది! ఆమె మనసు అదోలాటి తృప్తితో నిండిపోయింది. ఆ క్షణం చిరంజీవి కనబడితే ఎయిర్ పోర్టు కి రానందుకు క్షమించి వుండేదికూడా.
   
    ఆమె రెండు ఉమ్గారాల్ని చూస్తూ వుండగా తలుపు దగ్గర అలికిడి అయి, తల పైకెత్తి చూసింది.
   
    గుమ్మం దగ్గర బైరాగి నిలబడి వున్నాడు. ఒకశావాన్ని తలుపుకి నిలబెట్టినట్లూవుండి అతడి ఆకారం. అమెవేన్నేముకలోమావుదలైన చలిఒక్కసారి శరీరాన్నివణికించింది. కానీ అంతలోనే సర్దుకుని "ఏం కావాలి" అంది.
   
    అతడు  మాట్లాడలేదు. ఆ గాజు కళ్ళని పైకెత్తి ఆమెవైపు చూసి, ఆమె తననే చూస్తుందని గమనించి చప్పున తలదించుకున్నాడు. ఏదో అడగాలనుకున్నట్టూ అతడి నోరు కదలి అస్పష్టమైన శబ్దం చేసింది. ఆమె అతడివైపే చూస్తూంది. అరచేత్తో అతడు రొమ్ముదగ్గర రాసుకున్నాడు. ఆ చేతిని పైకెత్తి చప్పిడి దవడలమీద పెరిగిన గడ్డాన్ని గోక్కున్నాడు. "నాకు.... నాకు..." అన్నాడు. "నాకేం తెచ్చారు?"
   
    ఆమె స్థాణువై౦ది. అతడు అలా అడుగుతాడని వూహించలేదు అయితే అలా అడగటానికి అతడెంతో కొట్టుమిట్టు లాడేడనీ, ఎన్నోరిహల్సేల్స్ వేసుకున్నాడనీ అతడి ఆకారం చెబ్తూనే వుండి. విదేశాల్లో ఆమె సమరుతిపథంలో ఓ బైరాగి ఎక్కడో మెదిలి వుమ్ద్టాడని అతడి ఆశ అయితే ఆశ దురాశే ఆమెకి అతడోకడున్నాడనే గుర్తురాలేదు. ఆమె తన గిల్టీ కాన్షస్ నేస్ ను కప్పిపుచ్చుకోవటానికి __ కొంచెం తడబడి తన సామాన్లవైపు చూసి __ అందులోంచి ఏం ఇవ్వాలా అని అలోచించేలోపులో అతడు అక్కణ్ణుంచివెళ్ళిపోయాడు.
   
    ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అమెకిబైరాగి అంటే భయం! అతడి చేష్టలంటే అసహ్యం! ఆ ఫేటిసిస్ట్ని ఇంకా ఇంట్లో వుంచినందుకు ఆమెకి మావయ్యమీద కోపంకూడా వుంది.
   
    ఆలోచనని బలవంతంగా పక్కకి నెట్టి _ఆమె చిరంజీవి రూమ్ కి వెళ్ళడానికి బయల్దేరింది. అతడి కోసం తెచ్చిన బహుమతిని చుట్టానికి బల్లమీద వున్న పేపరు తీసుకుని చిపుతూంటేఒక మూల పెద్ద అక్షరాల్లో కనబడింది, ఒక వార్త__
   
                                యువతి హత్యకేసులో ముద్దాయికి శిక్ష!
                                                 లాయర్ చిరంజీవికి ఉరి.
   
    సుశీల అనే యువతిని హత్య చేసినందుకు లాయర్ చిరంజీవికి ఉరిశిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జిపరుశురాముడు ఈ రోజు తీర్పుయిచ్చారు. చిరంజీవి ప్రసిద్ధి క్రిమినల్ లాయర్, సర్వోత్తమారావు మేనకోడలికి కాబోయే భర్త అన్న రూమరు ప్రచారం కావటంతో ఈ కేసుకి చాలా ప్రముఖ్యాత వచ్చింది. శిక్ష ఉరి కాబట్టి ఈ జడ్జిమెంట్ హైకోర్టు అనుమతి పొందవలసి వుంటుంది.  ఈ లోపులో ముద్దాయి కావాలంటే అప్పీలు చేసుకోవచ్చు. కానీ క్రింది కోర్టులోనే నేరాన్నివప్పుకున్న ముద్దాయి, అప్పీలుకోసం హైకోర్టుకి వెళ్తాడనిఎవరూ వప్పుకున్న ముద్దాయి, అప్పీలు
కోసం హైకోర్టుకి వెళ్తాడని ఎవరూ భావించటంలేదు. ఈ సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూతర్ మాట్లాడుతూ వ్చిరంజీవి లాయరై ఆ వృత్తికే మచ్చ తీసుకొచ్చాడని అన్నాడు. కుమారి అర్చన విదేశాల్లో వున్నట్టు తెలుస్తూంది.
   
                                                                                            (మనవిలేకరి)
   
    చదవటం పూర్తీచేసిన అర్చన నిశ్చేష్టురాలై అలాగే నిలబడి పోయింది. చెవుల్లో హొరు. అది షాక్ కూడా కాదు. అంతకన్నా పెద్దదైన స్థితి. ఆమె అంతకుముందు ఎన్నో విషమ పరిస్థితుల్ని ఎదుర్కోంది. ఇంతకన్నా విషమ పరిస్థితుల్ని ఎంతో చాకచక్యంతోసరిచేసింది. అయితే ఈ సారి మాత్రం స్రీ సహజమైన భయంతో __వేదనతో వణికిపోయింది.
   
                                                        *    *    *    *   
   
    తన స్టడీ రూమ్ లో చదువుకుంటూన్న సర్వోత్తమారావు __ గాలిలా దూసుకొచ్చిన అర్చనని ముందు ఆశ్చర్యపోయినా, ఆమె చేతిలో పేపరుచూసి జరిగింది గ్రహించాడు. ఆమె మోహం ఎర్రగా వుండి.పెదవులు కంపిస్తున్నాయి.
   
    ఎప్పుడూ చాలాపెద్ద మనిషిలా గంభేరంగా వుండేతన మేనకోడల్ని ఈసారి నిజమైన అమ్మాయిలా చూడటంతో అతడి మొహంలో క్షణం పాటు నవ్వు కదలాడింది. కానీ దాన్ని దాచిపేట్టి వెంటనే సీరియస్ అయిపోయి"ఏమిటమ్మా" అన్నాడు.   
   
    ఆమె పేపర్ చూపిస్తూ__ "ఇది ... ఇది ..." అన్నది. ఆ తరువాత ఆవేశంతో మాట రాలేదు. "నువ్వు మాట్లాడదల్చుకున్నది చిరంజీవిహత్య గురించా" తాపీగాడిగేడు. అమె అవునన్నట్టుమట్లాడలేదు.  అయన కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకి వెళ్ళి చేతిలో పైపులేదు కాబట్టి పెన్సిల్ ని అలా పట్టుకుని గంభీరంగా, "చూడమ్మాయ్ __ నువ్విక చిరంజీవిని మర్చిపోవాలి, తప్పదు" అంటూ జరిగిందంతా చెప్పాడు. అది వింటూంటే ఆమె మొహంలో రంగులు మరసాగేయి. అతడు చెప్పటం పూర్తీచేయగానే ఆ గదిలో నిశ్శబ్దం. అలుముకుంది. అంతా విని ఆమె. "చిరంజీవి ఈ హత్య చేశాడంటే నువ్వు__ నువ్వు నమ్ముతున్నావా అంకుల్?" అంది వణికే
కంఠంతో  . అయన మాట్లాడలేదు.  ఆమె "అతడు నాకేంట దగ్గరో తెలిసి కూడా నవ్వు ఈ కేసు ఎందుకు టేకాఫ్ చేయలేదంకుల్?" అడిగింది బాధగా.
   
    "నేను కేసి తీసుకుని వుంటే అతడికి ఈ శిక్ష పడకపోవును.కానీ అతడు చేసిన నేరం చాలా గోరం,ఐన దమ్మాయ్. దానికితోడు అతడే ఆ నేరాన్ని వప్పుకున్నాడు. అందువల్ల నేను ఉత్సాహం  చూపించలేదు.ఇక్కడ సమస్య అతడికి ఉరి సరి అయినదా యావజ్జీవ కారాగారం చాలా అన్నది కదమ్మా. ఎంత క్రిమినల్ లాయరైనా నాకూ కొన్ని నియమాలిన్నాయి. అతడో కోల్ట్ బ్లాదేడ్ మర్డర్ అని తెలిసీ అతడి  తరుపున వాదించటం ఆత్మవంచనే అవుతుంది. ఇంత అయినాసరే, అతడు  నీ స్నేహితుడని అతడి దగ్గరకి వెళ్ళాను. నా మనసూ, నా నియమాలు పక్కన పేట్టి నీ కోసం _కేవలం నీ కోసం అతడి కేసు తీసుకుంటాడని చెప్పాను సర్వోత్తమరావు లాటి లాయరు తనంతట తను అడుగుతే ఎగిరి గంతేయవలసింది పోయి, అతడు నిరాకరించెడు. నీ కోసం అతడిని  బ్రతిమిలాడేను. అయినా వినలేదు. నా వుద్దేశ్యం ఏమిటంటే __ అతడో సైకిల్ తయరయెడని..."       

 Previous Page Next Page