Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 24

 

    "నేను కూడా ఆ రేటింగ్ చూసి పజిలాయి ఆ రెండు వారాలకు చానెల్ కి సంబంధించిన నాన్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ అన్నీ ప్లే చేసి చూశాను సార్! వాళ్ళు కొత్తగా ఒక ఫీచర్ స్టార్ట్ చేశారు. దాని పేరు "భగవంతుడా - మా సంస్కృతీ రక్షించు-"!  అందులో వారంలో జరిగిన రేప్ కేస్ లే కాకుండా , కాలేజ్ బాయ్స్, గాళ్స్ తాలుకూ సీక్రెట్ సెక్స్ వీడియోలు, సేల్స్ ఫోన్స్ లో ఎవరెవరో రికార్డ్ చేసిన అమ్మాయిల నగ్న రూపాలూ - బాయ్స్ , గాళ్స్ కలిసి ఇంటర్నెట్ కేప్స్ లో జరిపే ప్రణయ కలాపాలూ, అన్నీ చాలా జుగుప్సాకరంగా టెలికాస్ట్ చేస్తున్నారు సార్. మధ్యమధ్యలో సైకాలజిస్ట్ అలాంటి యూత్ మానసిక స్థితిగతుల మీద ఎనలైజేషన్ ఉంటుంది -"  ఎం.డి. ఇబ్బందికరంగా నిట్టూర్చాడు-
    "కొత్తగా ఆ చానెల్ ఇన్ చార్జ్ గా టేకోవర్ చేసిన వాడెవడో చాలా ఇంటేలిజెంట్ అయినా అయుండాలి - లేదా పెద్ద శాడిస్ట్ అయినా అయుండాలి !" అన్నాడు.
    మల్లిక నవ్వింది.
    "శాడిస్ట్ సార్! అనుమానం లేదు. మొన్న ఆ దివ్యా సేన్ ఇంటర్ వ్యూ వ్యవహారంలో అబ్జర్వ్ చేశాను కదా! వాడి మాటలన్నీ శాడిస్ట్ టైప్ లోనే ఉన్నాయ్-"
    "నువ్ గమనించావో లేదో - నాన్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ లో ఆ బృందావనం చానెల్ రేటింగ్స్ మిగతా అన్ని చానెల్స్ కంటే ఎక్కువ వుంటే నేను పట్టించుకునే వాడిని కాదు. కానీ మన నెంబర్ వన్ చానెల్ కంటే కూడా రెండు పాయింట్స్ ఎక్కువుంది !"
    "కానీ ఇదంతా ఒక ఇఫోరియా సార్! పైగా ఇలాంటి సెక్స్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ ని లేడీస్ లైక్ చేయరు - ఏదొక రోజు ఏదొక ఆర్గనైజేషన్ వాటికి వ్యతిరేకంగా అలజడి చేస్తారు. దాంతో చానెల్ మూతపడుతుంది -- " ధీమాగా అంది మల్లిక.
    "ఆఫ్ కోర్స్! అలా జరుగుతే బావుండునని నీకనిపిస్తోంది -- కానీ రియాలిటీ వేరు మల్లికా! మన లేడీస్ ఇప్పుడు అడివరకటి లేడీస్ కాదు. మగాళ్ళతో సమానంగా సెక్స్ కాంటెంట్ ని పాట్రనైజ్ చేస్తున్నారు. ఎనీవే - యూ ఆర్ ది బెటర్ జడ్జ్! మన సంపూర్ణ చానెల్ సింగిల్ హండెడ్ గా నీ తెలివి తేటల్తో నెంబర్ వన్ గా చేశావ్ -- కనుక నీ ఎనాలిసిస్స్ కరెక్టవచ్చేమో-
    "ఇక నుంచీ నేను కూడా ఈ బృందావనం చానెల్ ని ఒక కంటకని పెడుతూంటాను సార్-"
    "దట్స్ గుడ్ -" అన్నాడు ఎండి.
    మల్లికి అక్కడి నుంచి వచ్చి తన చాంబర్ లో కూర్చుంది. ఆమె పైపైకి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా లోలోపల కొంచెం అనీజీగానే ఉంది. కేవలం రెండు వారాల్లో అలాంటి రేటింగ్స్ సాధించాడంటే ఆ రాకేష్ సామాన్యుడు కాదు. ఎదురుగ్గా ఉన్న టీవీ రిమోట్ తీసుకుని బృందావన్ చానెల్ అన్ చేసింది మల్లిక. అందులో వ్యతిరేకంగా నినాదాలు ప్లేకార్డ్స్ తో స్త్రీ సంఘాల వాళ్ళ ఊరేగింపు - ఒక్కసారిగా ఆమె సంతోషంతో పొంగిపోయింది. తను ముందే ఊహించింది ఏదొక రోజు ఇలా జరుగుతుందని! ఆ రాకేష్ నిజంగా ఒక పర్ వర్టేడ్ ఫలో! లేకపోతే బృందావనం చానెల్ కే వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళ'నని తనే లైవ్ గా వాళ్ళ చానెల్లో నే చూపిస్తారా / ఎంత తెలివి తక్కువ వాడయితే అలాంటి పని చేస్తాడు ?
    ఆ రాకేష్ కి చావు దెబ్బ కొట్టాలంటే ఇదే మంచి అవకాశం! వెంటనే ఆ ఊరేగింపుని లైవ్ గా తమ చానెల్లో కూడా చూపించాలి! దాన్నే రోజంతా హైలెట్ చేయాలి. స్క్రోలింగ్ లో తాము కూడా బృందావన్ చానెల్ లో చూపుతున్న అశ్లీల దృశ్యాల గురించి తూర్పార బట్టాలి. ఆ ఊరేగింపు జరిగినంత సేపూ కొంతమంది స్త్రీ హక్కుల సంఘం వాళ్ళనూ,  రాజకీయ నాయకులనూ, పేరు ప్రతిష్టలున్న లాయర్లకూ , అందర్నీ వేదిక మీదకు ఆహ్వానించి బృందావనం చానెల్లో అశ్లీలం గురించి చర్చ జరిపించాలి. అంతే! దాంతో బృందావనం లాక్!
    వెంటనే కవరేజ్ వాన్ ని ఆ ఊరేగింపు లైవ్ గా కవర్ చేయడానికి పంపించింది మల్లిక.
    
    
                             ***

    బృందావనం చానెల్లో సిబ్బంది అంతా గుమికూడి ఆ ఊరేగింపు గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కేదురుగ్గా బృందావనం చానెల్ ని బూతులు తిడుతూ సాగిపోతోందా ప్రోసేషన్ టీవీలో -
    "రాకేష్ తిక్క వదిలిపోయింది. మనం బూతు, అశ్లీలం జోలికి పోవద్దు సార్ అంటే విన్నాడా? పైగా 'నేను చెప్పింది చెయ్- లేకపోతే నీ ఉద్యోగం గోవిందా అంటాడా?" అన్నాడు హనుమంతు కసిగా.
    "పైగా మన సీరియల్స్ లో కూడా అన్నీ అక్రమ సంబంధాలు , లవ్ ట్రాయంగిల్స్ -  అంటూ సర్వనాశనం చేశాడు. నేనంటునే ఉన్నా' ఇలాంటివి లేడీస్ చూడరు సార్ అని! ఇప్పుడు కళ్ళు తెరచుకుంటయ్ వాడికి -" అంది రాధా చమేలీ.
    "దేనికయినా ఒక లిమిట్ ఉంటుంది? మూడు నెలల్లో దీన్ని నెంబర్ వన్ చానెల్ చేస్తాడంట ఈ మొఖం ! తన ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోమను -" అంది సంగీత.
    'అద్దంలో చూసుకునే వచ్చా! ఇంత కూడా తేడారాలా! నీ ఫేస్ లో మాత్రం చాలా తేడా వచ్చింది. దౌజేండ్ వాట్స్ బల్బులా వెలిగిపోతుంది ' ఓ పెద్ద స్వీట్ బాక్స్ తో ఎంటరవుతూ అన్నాడు భవానీ శంకర్.
    అందరూ ఉలిక్కిపడ్డారు.
    తమ కామెంట్స్ అతను విన్నాడేమో అని భయపడ్డారు గానీ భవానీ వాటిని పట్టించుకోలేదు.
    "మీరిలాంటి దిక్కుమాలిన మీటింగ్ పెడతారని ముందే అనుకున్నా! అందుకే డైరెక్ట్ గా లోపలకు రాకుండా ఆపక్కన నిలబడి మీ కామెంటరీ అంతా విని అప్పుడు వచ్చా! అవును రాధా చమేలీ! అక్రమ సంబందాలంటే అంత అలర్జీయీ నీకు?"
    రాధా చమేలీ కంగారు పడింది.
    "నేను మాట్లాడింది మన సీరియల్స్ లో సంగతి ......" అంది సమర్ధించుకుంటూ -
    "నేనడిగేది రియల్ లైఫ్ సంగతి-"
    ఆమె షాకయింది.
    "అంటే?"
    "చూడు - అక్రమ సంబంధం , సక్రమ సంబంధం అంటూ కేటగిరీ లేం లేవు. లైఫ్ లో మనకు వచ్చిన వాళ్ళందరితోనూ ఫ్రెండ్ షిప్ చేస్తాం! ఆ ఫ్రెండ్ షిప్స్ లో ఒకోసారి అనేక పరిస్థితుల కాంబినేషన్ న్ని బట్టి సంబంధాలేర్పతాయ్! అంతే గానీ సమాజం రూల్స్ బట్టి మనుష్యులు ప్రవర్తించరు! కాకపొతే ఆ రూల్స్ ని ఫాలో అవుతున్నట్లు నటిస్తారు-"
    రాదాచమేలీ కేదో అనుమానం వచ్చింది.
    కొంప దీసి తన కాలేజ్ డేస్ గురించి అతనికే మయినా ఇన్ ఫర్మేషన్ దొరికిందా?
    "ఓకే ఫ్రెండ్స్ ! ఇంత కాలానికి మన చానెల్ కి ప్రజల్లో ఒక అద్భుతమయిన గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు పాజిటివ్ దారిలో వచ్చిందా, లేక నెగెటివ్ వె లో వచ్చిందా అనేది మన కవసరం! అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గుర్తింపు ఉందొ ఒసామా బిన్ లాడెన్ కి అంతకంటే ఎక్కువ పాపులారిటీ ఉంది. అలాగే - ఒక చానెల్ నెంబర్ వన్ పొజిషన్ లోకి రావాలంటే ఏదొక గుర్తింపు కావాలి! ఆ గుర్తింపు పొందడానికి మొదటి మెట్టు ఆ ఊరేగింపు! మన చానెల్ ని వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే అంత ఫేమస్ అవుతాం మనం! నన్ను ఇవాళ దుర్యోధనుడితో పోలుస్తేనే ఇంత సరదాగా ఉంది - రేపు రావణాసురిడితో పోలుస్తే ఇంకెంత ఫేమస్ అయిపోతానో  చ్గూసుకోండి - ఎనీవే - ఈ శుభసందర్భంలో మీరందరూ నోరు తీపి చేసుకోవాలి-" అంటూ అందరికీ స్వీట్స్ పంచి పెట్టాడు. హనుమంతు మెల్లగా రాధా చమేలీతో అన్నాడు.
    "వీడు మెంటలా? మనం మేంటలా?"

 Previous Page Next Page