Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 25

 

    భవానీశంకర్ మాములుగా "ఏ దిల్ దివానా హై , దీవానా దిల్ హైయ్ , దిల్ తో దివానా హాయ్, ఏ దిల్ - దీ- వా- నా" అని పాడేస్తూ పార్కు లోకి ప్రవేశం చేసి, ఫోన్ లో అమ్మాయి చెప్పిన గుర్తుల ప్రకారం మొగలి పొదల గుబురు దగ్గరకు చేరుకొని అక్కడ మెత్తని పచ్చిక మీద కూలబడ్డాడు.
    అమ్మాయి రావడానికి ఇంకో ఐదు నిమిషాల టైముంది.
    హటాత్తుగా ఆ ఆహ్లాదకరమయిన వాతావరణాన్ని చేధిస్తూ 'హయ్' అంటూ అమ్మాయి ప్రత్యేక్షమాయేసరికి ఉలిక్కిపడి లేచి నిలబాడ్డాడు భవానీశంకర్.
    అమ్మాయి అలంకరణ అద్భుతంగా కనిపించేసరికి ఆమె వంక గుడ్లప్పగించి చూస్తుండిపోయాడతను కొద్ది క్షణాల పాటు ! కొత్త అందంతో , కొత్త ఆకర్షణలతో - మతి పోగోడుతుందామె అందం.
    "హయ్! మైడియర్ బ్యూటీ క్వీన్ -" ఆప్యాయంగా అన్నాడతను.
    ఆమె కోపంగా చూచింది "పళ్ళేలా ఉందేమిటి?"
    "ఫర్ ఫెక్ట్ కండిషన్ లో ఉంది డియర్! ఏమయినా సందేహమా?"
    "ఆరోగ్యం ఆ కండిషన్ లో ఉండాలనుకుంటే 'మైడియర్ ,డియర్'  లాంటి పదాలు వాడకండి!"
    "ఓకే డియర్ ! మీకు అభ్యంతరమయితే .....ఇంకో సూటబుల్ పదం ఏదేనా ఉపయిగిస్తాను."
    "అది సరేగానీ ఇప్పుడో సమస్య వచ్చి పడింది!" అందామె కలవరపాటుతో.
    "ఏమిటది?"
    "దీప్ చంద్ నౌఖరు వేషం ,మానేస్తానంటున్నాడు."
    "అదేమిటి? ఎందుకని?"
    'డాడీ తన మొఖం మీద టామాటో పచ్చడి విసిరినందుకు-"
    "కానీ ఆ పచ్చడి మీ డాడీ ఇంకేవరో మీ అతిధి గురిపెట్టి విసిరాడని కేవలం గురి తప్పటం వల్లే - దీప్ చంద్ మొఖం మీద పడిందనీ - అందుకు ఆయనే క్షమార్పణ చెప్పుకున్నారనీ మీరు ఫోన్లో చెప్పారుగా౧"
    "అదే నాకూ అర్ధం కానిది! అయినా కూడా దీప్ చంద్ ఈ వేషం మానేస్తానని పట్టుబట్టాడు. ఇందాక నాలుగింటికి నాకు 'టీ' తెచ్చి సర్వ్ చేసినప్పుడు కూడా - మళ్ళీ అదే మాటా అన్నాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని కలుసుకోమని అతన్తో చెప్పాను.
    "డోంట్ వర్రీ మైడియర్ యాంగ్ బేబీ! ఈ రచయితల వ్యవహారం నాకు బాగా  తెలుసు! వాళ్ళక్కావల్సిందేమిటో తెలుసా? ఇన్ స్పిరేషన్! అది సైకిలు చక్రంలో గాలిలాగా - తగ్గినప్పుడల్లా కొడుతుండాలి! లేకపోతే జావగారిపోతారు - దీప్ చంద్ రానీ! నేను ఫుల్ గా 'ఇన్ స్పెరేషన్పాఠం' ఎక్కించేస్తాను'!...."
    ఆ సమయంలో మొగలి పొదల చాటు నుంచీ ప్రేమికుల జంటలో కుర్రాడి గొంతు వినిపించింది బొంగురుగా.
    "ఇంతకుముందు ఇంకేవర్నయినా ప్రేమించావా దీపా?"
    "......"
    "మాట్లాడవేం దీపా? చెప్పటం ఇష్టం లేదా?"
    "ఇష్టం లేకపోవటం కాదు రాజేష్! లెక్క పెట్టుకుంటున్నాను-"
    భవానీశంకర్ , అమ్మాయ్ బిగ్గరగా నవ్వేశారు.
    దాంతో ప్రేమికుల జంట రెక్కలొచ్చిన పక్షుల్లా అక్కడి నుంచీ ఎగిరిపోయారు.
    "హియర్ కమ్స్  దిగ్రేట్- అల్ టైం - రైటర్ - దీప్ చంద్ -" అన్నాడు భవానీశంకర్. హటాత్తుగా అమ్మాయి తలపక్కకు తిప్పి చూసింది. సర్కస్ లో బోనులోకి - జొరబడే పెద్దపులిలా - అయిష్టంగా కోపంగా, కసిగా మొఖం పెట్టుకుని- నౌకరు గెటప్ లో - పెద్ద పెద్ద అంగలు వేస్తూ వారిని చేరుకుంటున్నాడు దీప్ చంద్.
    "హల్లో మైడియర్ దీప్ చంద్! వెల్ కామ్ - వెల్ కామ్ " ఆప్యాయంగా పిలిచాడు భవానీ శంకర్.
    దీప్ చంద్ మొఖం మాడ్చుకుని వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు.
    "నౌఖరు జీవితం అద్భుతంగా ఉందా బ్రదర్/ అనుక్షణం ప్రియురాలి కనుసన్నలలో మెలుగుతూ, ఆమెని తాకాలనిపించినప్పుడల్లా కప్పు నిండా కాఫీ తీసికెళ్ళి అందించేతప్పుడు ఆమె వెలి కొనలను తాకుతూ, వాళ్ళింట్లో టామీ కి అన్నం తినిపిస్తున్నప్పుడు సోఫాలో కూర్చున్న అమ్మాయి కళ్ళలోకి చూస్తూ -" భవానీశంకర్ వేపు కోపంగా చూశాడు దీప్ చంద్.
    "నేనీ వేషం మానేస్తున్నాను. ఇక చస్తే ఈ ఇంటి కెళ్ళను !" అన్నాడు నేలమీదకు తీక్షణంగా చూస్తూ.
    అమ్మాయి తల కొట్టుకుంటూ భవానీశంకర్ వేపు చూసి "ఇదీ వరుస! డాడీ ఏదో చిన్న పొరపాటు చేసినందుగ్గాను - పెద్ద ఇదిగా ...."
    ఆమె మాట పూర్తీ కాకుండానే కల్పించుకున్నాడు దీప్ చంద్. "చిన్న పొరపాటెం గాదు. నా మొఖం మీద దోసకాయ పచ్చడి విసిరాడు!"
    "దోసకాయ కాదు టమాటో -" సరిజేసిందామె.
    "అదే - ఏదయితేనేం? విసిరాడా లేదా?"
    "పొరపాటునే అన్న సంగతి నీకూ తెలుసు గదా! మహేశ్వరీదేవి మీద విసరాలను కుంటే నీ మీద పడిందది!"
    "అయినా సరే! ఔ డోంట్ లైకిట్ !" ఇంకా  కోపంగా అన్నాడు దీప్ చంద్.
    భవానీశంకర్ ఇంక కల్పించుకోకుండా ఉండలేకపోయాడు.
    "నో నో నో ! ఇది స్పోర్ట్స్ మన్ లక్షణం కాదు మిస్టర్ దీప్ చంద్! స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అంటే ఏమిటి? భీమారావ్ గారు మీ మొహాన్ని పచ్చడి కొట్టినప్పుడు మీరు చిరునవ్వు నవ్వాలి! నెమ్మదిగా భీమారావ్ దగ్గర కెళ్ళి అయన భుజం ఆప్యాయంగా తట్టాలి! తట్టి - ఏం ఫర్లేదు సార్!" పొరపాటు జరిగిందని నాకు తెలుసు! అయితే ఇక నుంచీ పచ్చళ్ళు విసిరేప్పుడు గురి చూసి విసరండి! కావాలంటే ముందు మన గార్డెన్ లో ప్రాక్టీస్ చేయండి!" ఇలా ప్రేమగా, ధైర్యంగా ...."
    "స్టాపిట్! " మళ్ళీ అరిచాడు దీప్ చంద్ ."నేనింక చస్తే అక్కడి కెళ్ళను. అంతే!" ఖండితంగా చెప్పేశాడతను.
    "భవానీశంకర్ గారూ! మీరే చెప్పండి! నౌఖరు వేషం అన్నాక చిన్న చిన్న ఇబ్బందులుంటే ఉండవచ్చు! అంతమాత్రాన ఇలా బెదిరిపోతే ఇంక 'ప్రేమ' కు అర్ధం ఏమిటి?" దీనంగా అంది అమ్మాయ్.
    "యస్ మైడియర్ దీప్ చంద్! షి ఈజ్ సెంట్ పర్సంట్ కరెక్ట్! ప్రేమ అమర ప్రేమగా నిలిచి పోవాలంటే సవాలక్ష సమస్యలు తప్పవు! డూ యూ నో కే. కె. ప్రసాద్ రావ్ ? అమీర్ పేటలో తనూజ అనే అమ్మాయిని ప్రేమించాడు! కేవలం ప్రేమ కోసమే ఇల్లరికం కూడా వెళ్ళాడు. ఆ తరువాతేమయింది? అతను నిద్ర పోతుంటే తెల్లవారుజామున అతని అత్తగారోచ్చి కూర గరిటెతో మోకాలి చిప్ప పగిలేలా కొట్టేది! కె..కె. ప్రసాద్ రావ్  కేవ్వుముంటూ అరచి ఒక్క దూకు దూకి ఆ గదిలోంచి హాల్లోకి పరుగెత్తేవాడు. అక్కడ వాచిపోయిన మోకాలు చూచుకొంటుండగా తలుపు చాటున నక్కిన మామగారు స్టీలు గ్లాసుతో నెత్తి పగలకొట్టేవాడు. కె.కె. ప్రసాద్ రావ్ మళ్ళీ వెర్రికేక వేసి వంటింట్లో దూరి తలుపులు వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చుని నెత్తి తడుముకుంటుండేవాడు. అయితే అత్తగారు అప్పటికే డైనింగ్ టేబుల్ కింద దాక్కుని ఉండటం వల్ల రుబ్బురాయి తీసుకుని అతని కాలివేళ్ళు పచ్చడి చేసేది. అతను ఇల్లెగిరేలా అరచి తలుపు తీసుకుని పెరట్లోకి పరుగెత్తి తనూజ వెనుక దాక్కునేవాడు! కె.కె. ప్రసాద్ రావ్ ఇన్ని బాధలెందుకు అనుభవించాడు? నీకూ నీ ఇంటికీ రాం రాం అని తనూజతో ఎందుకనలేదూ? కేవలం ఆమె మీదున్న అపారమైన ప్రేమవల్ల - వారి ప్రేమ అమర ప్రేమగా చరిత్రలో నిలిచి పోవాలనే కోరికవల్ల!"
    "కానీ ఆ అత్తమామలెందుకలా కొట్టేవారు?" అనుమానంగా అడిగాడు దీప్ చంద్.  
    "వెరీ బ్రిలియంట్ క్వొశ్చన్ మైడియర్ దీప్ చంద్! ఎంతో గొప్ప మేధావి రచయితలయితే తప్ప ఇంత క్లిష్టమయిన ప్రశ్నలు వేయలేరు! మరేం లేదు! వాళ్ళిద్దరికీ కొంచెం పిచ్చి! అమ్మావాస్యకీ- పౌర్ణమి కి- అలా ట్రబుల్ చేసేవారు గానీ మిగతా రోజుల్లో వాళ్ళు పూర్తీ దేవతలు !"
    "కె.కె. ప్రసాద్ రావ్ గ్రేట్ లవర్! ప్రేమంటే నిజంగా అది! అంది అమ్మాయ్ ఆనందంగా. "ఇంతకూ అతనేక్కడున్నాడిప్పుడు ?" అడిగిందామె.
    "పిచ్చాసుపత్రిలో!' చెప్పాడు భవానీశంకర్. "ఆఫ్ కోర్స్ - అది వేరే కధనుకోండి!"
    "మీరేన్నేనా చెప్పండి! నేనింక ఈ విషం వేయలేను!" అన్నాడు దీప్ చంద్ మొండిగా .
    అమ్మాయికి కోపం ముంచు కొచ్చింది.
    "అంతేనా ?" అంది రోషంగా.
    దీప్ చంద్ జవాబివ్వలేదు. లోలోపల అమ్మాయి తనను 'ఛీ' కొట్టేస్తుందేమో అన్న భయం పట్టుకుంది. ఇలా అమ్మాయిలు రోషంగా , కోపంగా ఉన్నప్పుడు ప్రియుడు పూర్తిగా రాజీ కొచ్చేయాలని రచయిత గ్రిస్టన్ క్రిస్ట్ ఫర్డ్ "నేటి పిచ్చాల్లె రేపటి ప్రేమికులు" పుస్తకంలో క్లియర్ గా రాశాడు.
    అతను జవాబివ్వకపోయేసరికి అమ్మాయి లేచి నిలబడింది.
    "సరే! నీ యిష్టం వచ్చినట్లు చేసుకో! నేను వెళ్తున్నాను!" అని వెళ్లిపోబోయింది.
    దీప్ చంద్ ఇంక ఆలశ్యం చేయలేదు.
    "అమ్మాయ్! ప్లీజ్ వెళ్ళకు!" అన్నాడు ఖంగారుగా.
    "యస్ మైడియర్ గాళ్! ప్రేమలో తొందరపాటు పనికిరాదు! మా ఫ్రెండ్ సిస్టర్ దుర్గ ఇలాగే తొందరపడితే ఏమయింది? ప్రేమించిన వాడితో పెళ్ళయి పోయింది! ఆ తరువాత ఎంతో పశ్చాత్తాపపడింది గానీ ఏం లాభం? కనుక దీప్ చంద్ మాటలు సీరియస్ గా తీసుకోకూడదు !" సర్ది చెప్పాడు భవానీ శంకర్.
    అమ్మాయి శాంతించింది.
    "ఇంకెన్నో రోజులు అక్కర్లేదు దీప్ చంద్! నెలా, రెండు నెలలు చాలు! డాడీకి నీమీద మంచి అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఈ రెండు రోజులకే నువ్వంటే ఎంత లైకింగ్ ఏర్పడిపోయిందో తెలుసా?" భూప్ చంద్ నిజంగా ఒండర్ పుల్ సర్వెంట్" అన్నారు నాతొ!" ఉత్సాహంగా  చెప్పిందామె.
    "అవును మిస్టర్ దీప్ చంద్! మీమీద అభిమానం పట్టలేక మిమ్మల్ని అయన కౌగలించుకుని బావురుమని ఏడ్చే రోజు ఏంతో దూరం లేదు. ఈలోగా నౌఖరు వేషంలో మీరు పొందబోయే అనందం ఒక్కసారి ఊహించుకోండి. దృశ్యం - ఒకటి - శ్రుంగారరసం!

 Previous Page Next Page