విక్టోరియా స్ట్రీట్ లోంచి మిమానాశ్రమం ప్రవేశించింది కారు. కారు ఆగగానే ఒక వ్యక్తి వచ్చి విష్ చేసేడు ఎమ్. డి. అతడు మాట్లాడి వెళ్ళుపోతూంటే అర్చన అతడివైపే కూతుహలంగా చూడటం చూసి, " ఏమిటి అలా చూస్తున్నారు?" అని అడిగాడు.
"అతడి నడకని..." సాలోచనగా అంది అర్చన.
"నౌకల మీద ఎక్కువకాలం గడిపిన వారి నడక అలాగే యుంటుంది." అన్నాడు ఎమ్ .డి. కౌంటర్ వైపు నడుస్తూ "పాదాలు విశాలంగా పేట్టి నడిస్తే గరిమనాభి, లంబరేఖ పీఠాన్ని అతిక్రమించకుండా వుంటుంది. నౌక అటూ ఇటూ జరిగినప్పుడు పడిపోకుండా వుండటానికి అలా నడుస్తారు. అదే బైట కూడా అలవాటు అయిపోతుంది."
అర్చన దానిగురించి ఆలోచించడం లేదు. అలాతినడక ఎక్కడో చూసింది. ఎక్కడ ...ఎక్కడ?
అతడివద్ద సెలవు తీసుకుని ఆమె కస్టమ్స్ వైపు నడిచింది. ఆ హడావుడిలో మరి ఆ విషయాన్ని మర్చిపోయింది.మరో గంట తర్వాత ఆమె ఎక్కినా విమానం భారతదేశం వైపు బయల్దేరింది.
సరీగ్గా అదే సమయానికి జస్టిస్ పరశురాముడు తన నాలుగు పేజీల జడ్జిమెంటు చదువుతున్నాడు. కోర్టులో సూదిపడ్తే వినపడేంత నిశబ్ధం వ్యాపించివుండి.
"సుశీల అనే యువతిని చిరంజీవి హత్య చేసేదాన్న విషయం ప్రాసిక్యూషన్ 'బియాండ్ డౌట్ ' నిరూపించగలిగింది. ఈ చిరంజీవి అనే యువకుడిలో ఏ మూలా సున్నితత్వమూ, జాలీ కరుణా లేవనేది నోరూపన అయింది. పైగా ముద్దాయి ఈ హత్య ఏదో కసితోనూ ఆవేశంతోనూ చేసేదాన్న నమ్మకం నాకు కుదరటంలేదు. ఇది చాలాకోల్ద్ బలడేడ్ మర్డర్ అని నేను నమ్ముతున్నాను.
ముద్దాయి ఈ హత్యని తానె చేసేనని స్వయంగా వప్పుకున్నాడు. దురదృష్ట మేమిటంటే,ఈ హత్యపట్ల ముద్దాయి పశ్చాతాప పడ్తున్నాడన్న అభిప్రాయం నాకు అతడి ప్రవర్తనవల్ల కలగటంలేదు. పైగా తనకి ప్రేమంటే నమ్మకం లేదని అతడే వొప్పుకున్నాడు. అతడి ప్రమలోపదిమరిమ్తమండి యువతులు శాలభాల్లా మాడిపోయే ప్రమాదం కూడా వుండి. జైలు జీవితం ఇతడిని రిపారం చేస్తుందని నేనుభావించడంలేదు.
కాపిటల్ పనిష్ మెంట్ రేర్ ఆఫ్ ది రేరేస్ట్ కేసుల్లోనే విధించాలన్న సుప్రీంకోర్టు సూచనని ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నాను. ఈ కేసు మరణశిక్ష విధిస్తున్నాను.
"హివిల్ బి హేంగ్ బై నెక్ హి ఈజ్ డేడ్..."
10
రకరకలా వ్యక్తుల్లో విమనాశ్రమం కళకళలాడ్తూంది. ప్రకటన వినిపిస్తూ వుండగా ఎయిర్ బస పెద్ద శబ్దం చేసుకుంటూ దిగింది. తరువాత ఐదు నిముషాలకి అర్చన విమానం దిగితూ కనిపించింది. సర్వోత్తమరావు జనంలోంచి ఒక్క అడుగు ముందుకేసేరు. ఫ్యాక్టరీ తాలూకు పరివారం ఒక మూలగా నిలబడివున్నారు.
అర్చన దగ్గరకు రాగానే "హౌ ఆర్యూ బేబీ...." అన్నాడు. అమెచిరునవ్వుతావు "వ్బావున్నారా అంకుల్" అన్నది. ఆమె కళ్ళు అటూ ఇటూ వెతుకుతున్నాయి. కావాల్సిన వ్యక్తి అభినందనలు తెలపడం మొదలు పెట్టారు. ఆమె అస్యమస్యకంగానే వరితో మట్లాడుతూ వుంటే ప్రక్కనో కారు వచ్చి ఆగింది.
అందులోంచి ప్రకాష్ దిగేడు. అతడి చేతిలో పూలగుత్తి వుండి. చిరునవ్వుతో ఆమెకి దాన్ని అందిస్తూ "కంగ్రాచ్యులేశంస్ " అన్నాడు. ఆమె దాన్ని అందుకొని "థాంక్స్" అంది. అయితే ఆ మాటల్లో పెద్ద సంతావుశంలేదు. ఆమె వళ్ళు మండిపోతూంది. ఇన్నాళ్ళ తరువాత కలుసుకావుబావుతూ వుంటే_ఇక్కడికి రాకుండా ఈ మహానుభవుడు ఏంరాచకార్యం వెలగాబేడ్తున్నాడు?
ఆమె కారు సీటు వెనక్కీవాలి,కళ్ళు మూసుకుని మావయ్య అడిగిన ప్రశ్నలకి అన్యమస్కంగా సమాషణం ఇవ్వటం ప్రారంభించింది. కారు ఇంటికి చేరుకుంది.
ఆమె తన రూమ్ కి వెళ్ళి, అయిదు నిముషాల్లో తయారై క్రిందకి వచ్చి, డైనింగ్ టేబిల్ ముందు కూర్చుంది.
మళ్ళీ అదే నిశ్శబ్దం.
రామయ్య మఒహమ్లొఎ భావమూ లేకుండా వడ్డిస్తున్నాడు. బైరాగి ఆమెని గాజుకళ్ళతో ఒక్కసారి చూసి, గదితలుపు వెనక్కీ తప్పుకున్నాడు.
ఆ వాతావరణంలో ఆమెకి ఏదో కొత్తదానం కనబడింది. శబ్దానికి : నిశ్శబ్దనికీ వున్న తేడా అది.
అందరూ తనవైపు చిత్రంగా చూస్తున్నారన్న భావం, అందర్లోనూ ఏదో చెప్పాలన్న తపన. చివరికి, ఎప్పుడూ నిర్లిప్తిమ్గా వుందే రామయ్య మొహంలో అదోలాటి ఉద్విగ్ధత ?
ఎందుకు?
ఆమె దాని గురించి మరి పట్టించుకోలేదు. చాల పంలున్నాయి. తనులేని ఈ సమయంలో వీళ్ళు ఎంత తీసేసేరో ముందు పట్టుకోవాలి.
సామాన్లన్నీ తెచ్చి పైన పెట్టాడు. డ్రైవరు. ఆమె వాటిని విప్పిఅందులోంచి ఒక పాకెట్ తీసింది. అది పట్టుకుని మావయ్య గదిలోకి వెళ్ళింది.
"ఇదిగో అంకుల్ _నీ గురించి తెచ్చాను" అని అందించింది. చాలా చిన్న టెలిఫోను, వైరు అవసరంలేనిది. కాలిక్యూలేటర్ లా వుండి. దాన్ని ఇచ్చి, తిరిగి తన గాడికి వస్తూంటే మాట్లాడితే, మామూలు టెలిఫోను ఆ మాటల్ని అందుకుని కావాల్సినచోటికి పంపుతుంది. ఆమె ఆయనకి దాన్ని ఇచ్చి, తిరిగి తన గాడికి వస్తూంటే రంగమ్మ కనబడింది. పని తగ్గించటంకోసం కొన్న ఆటోమాటిక్ క్లీనర్ ఆమె కిచ్చింది. రంగమ్మ మోహం చటంతయింది.
చివరగా_ ఆమె తన గాడికి వచ్చి సూట్ కేస్ పై అరలోమ్చి చిన్న పెట్టె తీసింది. అగ్గిపెట్టేలా వుందది. విప్పితే , ముఖముల్ గుడ్డ మధ్య రాయి మిలమిలా మెరుస్తూ చిన్న ఉంగరం మధ్యలో పొదగబడివుంది. ఆమె ఉంగరాన్ని చేతుల్లోకి తీసుకుని రాయిని కదిపింది. ఉంగరం రాయి క్రింద చిన్న గడియారం వుండి. ఆమె రాతిని మామూలుగా సర్దింది తన ఉంగరపువేలు పక్కనే దాన్ని పేట్టి చూసుకుంది.