సుష్మా నర్శింగ్ హోమ్ చాలా అందమయిన బిల్డింగ్ లో వుంది.
ఎంట్రెన్స్ పక్కనే ఓ అమ్మాయి కూర్చుని వుంది. టేబుల్ ముందు సింపుల్ గా, అందంగా , వ్యాపార పద్దతిగా మాట్లాడుతూ.
"ఎస్ ప్లీజ్!" అంది సురేష్ ని చూస్తూ ప్రశ్నార్ధకంగా , నటాషా అందం, కాబరే రూపం ఆమెకు వింతగా వున్నట్లున్నాయ్.
"డాక్టర్ కుమారి......'
"ఓ డాక్టర్ కుమారీస్ కేస్"
"వన్ దౌజేండ్ రూపీస్ కట్టండి"
"రైల్వే వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళూ ఇస్తుంటారు. విద్యార్ధులకు కన్పెషన్ అనీ, అలాంటిదేమీ మీ దగ్గర లేదా?"
ఆమె నవ్వుతూ చూచిందతని వేపు.
"మైగాడ్ - మీరు స్టూడెంట్సా?"
"నోనో ప్రస్తుతం కాదనుకోండి! వన్స్ అపాన్ ఏ టైం"
అతను వెయ్యి రూపాయలు, నటాషా ఇచ్చిన డబ్బు ఆమె కొచ్చాడు.
"డాక్టర్ కుమారి 'ఎక్స్ పర్డ్' అని విన్నాను" ఆ యువతి డబ్బు లెక్క పెట్టుకుంటుంటే అడిగాడు.
"మీ ఎక్స్ లెంట్ డాక్టర్! సిక్త్ మంత్ లో కూడా ఈజీగా చేసేస్తుంది. వెళ్ళి ఆ చివర రూమ్ లో కూర్చోండి.'
సురేష్ , నటాషా చివరి రూమ్ లో కొచ్చారు.
అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువతులు కూర్చుని వున్నారు.
"మీరు కూడా డాక్టర్ కుమారి కేసేనా?" ఓ యువతి అడిగింది.
'అవును....." అంది నటాషా.
"డబ్బంటే తెగ ఆశ.......'
నటాషా ఆశ్చర్యపోయింది.
"ఎవరికి?"
"డాక్టర్ కుమారికి!"
"డాక్టర్లందరూ అంతేగా......."
"డాక్టర్ కుమారి అందులో స్పెషలిస్ట్ .......మా అక్కయ్యకు 'సిజేరియన్' చేసేసింది...."
"డెలివరి కష్టమయితే చేయాలి కదా........'
"అదే నేనూ చెప్పేది తేలిగ్గా డెలివరి అయేట్టుందని భయపడి డెలివరి టైం కాకముందే సిజేరియన్ చేసేసింది......."
సురేష్ తుళ్ళిపడ్డాడు.
"ఎందుకిలా చేయటం? స్టాంపులు సేకరించే హావీలా , సిజేరియన్ చేయటం హబీయా?"
"కాదు......సిజేరియన్ కయితే పదిహేను వందలు ఫీజ్ ముడుతుంది కదా....."
"మైగాడ్ ........" అంది నటాషా.
"అందరికి అంతే! కేస్ కంప్లీకేట్ అయేట్లుంది అని అబద్దం చెప్పి సిజేరియన్ చేసేస్తుంది. కేవలం సిజేరియన్ ళ మీదే ఎనిమిది లక్షలు సంపాదించి మారేడ్ పల్లిలో కట్టించిందట.'
"దాని పేరు 'సీజర్ నివాస్" అని పెట్టి వుంటుంది.'
ఓ నర్స్ హడావుడిగా వచ్చిందక్కడికి.
"సురేష్ ఎవరు?"
"నేనే" లేచి నిలబడ్డాడు సురేష్.
ఆమె ఆశ్చర్యంగా మరోసారి తన చేతిలోని పేపర్ చూసుకుంది.
"ట్రీట్ మెంట్ ఎవరికి?"
"ఇదిగో! ఈమె నటాషా"
"ఈమె మీ......"
"కరెక్ట్ .......మన మిసెస్"
ఆమె నటాషా మెడ వేపూ, కాళ్ళ వేపూ చూసింది.
"మీ మిసెసా?"
"అవును! అంటే నేనామె భర్తను" చిరునవ్వుతో అన్నాడు.
"నాతొ రండి"
ఇద్దరూ లోపలి గదుల్లోకి నడిచారు.
ఓ చీకటిగా వున్న రూమ్ లో ఆగిందామె.
"ఈ బెడ్ మీద పడుకోండి."
"ఇద్దరమూనా?"
ఆమె గట్టిగా నవ్వేసింది. "అలా ఆత్రుత పడే ఈ గొడవ నెత్తి మీదకు తెచ్చుకున్నారు."
"మీరు బయట విజిటర్స్ రూమ్ లో -
ఆమె వెళ్ళిపోయింది.
"సురేష్" మంచం మీద కూర్చుంటూ పిలిచింది నటాషా.
"ఎస్ బేబీ!"
"నాకెందుకో భయంగా వుంది"
"ఏదయినా ఫస్ట్ టైం అంతే"
"నువ్వప్పుడే వెళ్ళిపోవద్దు."
"ఓ.కే! డోంట్ వర్రీ - ఇక్కడే వుంటాను. వాళ్ళు వెళ్ళగొట్టే వరకూ.'
నటాషా సన్నగా వణుకుతోంది.
ముఖంలో, కళ్ళలలో భయం స్పష్టంగా కనబడుతోంది. సురేష్ ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు చల్లగా, ఐస్ లా వున్నాయవి.
"హలో నటాషా"
"ఊ!"
"చీరప్ మాన్! చీరప్ - నవ్వు! అలా భయపడకూడదు. అన్ని వందల్ మంది ఎదురుగ్గా డాన్స్ చేసి నిషా ఎక్కించే క్యాబరే గాళ్స్ అలా భయపడతారా ఎక్కడయినా .......కమాన్ చీరప్."
నటాషా బేలగా చూసిందతని వేపు.
"ఇప్పుడే కాదు ........చిన్నప్పటి నుంచి నాకు ఇంజక్షన్ అంటే భయం"
అతనికి జాలి వేసింది.
"అల్ రైట్ .......నీ భయం పోగొడతానుండు.....ఆ రోజు మనం సైన్స్ టీచర్ రాని రోజున ..గురుందా .......వన్.....టూ.......త్రీ........."
నటాషా చిన్నగా నవ్వింది . "పిచ్చి పనులు......."
"ఇంకోసారి .......మన క్లాస్ వాళ్ళందరినీ ఇంగ్లిస్ సినిమాకు తీసుకెళ్ళిన రోజున .......మనిద్దరం డబ్బుల్లేక స్కూల్లోనే వుండిపోయాం గుర్తుందా.......అప్పుడు స్కూల్ గార్డెన్ లో తేడాలు తెలుసుకుంటుంటే......
నటాషాలో టెన్షన్ పూర్తిగా పోయింది. కిలకిల నవ్వేయసాగింది.
"తోటమాలి వచ్చి పట్టుకునేసరికి నువ్ పరుగెత్తటం బాగా గుర్తుంది. అబ్బ.....అంత నవ్వు నేను జన్మలో నవ్వలేదు" అందామె మళ్ళీ తలుచుకుని తలుచుకుని నవ్వుతూ.
"వాడికి దొరికితే హెడ్మాస్టారు దగ్గరకు లాక్కేల్తాడని కదా మరి..... అందుకని ......నిక్కరు ఓ చేత్తో పట్టుకుని........
ఇద్దరూ నవ్వేశారు."
'ఆర్ యూ అల్ రైట్ నౌ?" అడిగాడు సురేష్.
"ఓ.కే!" అంది నటాషా.
"డాక్టర్ తో పొరబాటున మనం భార్య భర్తలు కాదని చెప్పావంటే కొంప మునుగుతుంది."
"ఫీజ్ పెరుగిపోతుంది."
"చెప్పనులే"
డాక్టర్ వచ్చింది స్టేతస్కోప్ మెడలో వేసుకొని, ఆమె వెనుకే నర్స్.
"ఓ.కే! ముందిదే చేస్తాను" సుర్తేష్ తో అందామె.
సురేష్ బయటికొచ్చి కూర్చున్నాడు. ఆ యువతి అక్కడే కూర్చుని వుంది.
"అయిపోయిందా?" అడిగింది కుతూహలంగా.
'ఇంకా లేదు"
"ఐ హెట్ దిస్ నాన్సెన్స్ అందామె హటాత్తుగా"
"ఉచ్ నాన్సెన్స్?" ఆశ్చర్యంతో అడిగాడు సురేష్.
"ఇదే పనిష్మెంట్ గాళ్స్ కి రావటం......మగాడికే ప్రాబ్లమూ వుండదు."
"ముందు లేబర్ సంగతీ?" సీరియస్ గా అడిగాడు సురేష్.
ఆమె కోపంగా చూసింది. "నధింగ్ బట్ మేల్ చవనిజమ్"
"మీ పాబ్లం కూడా అదేనా?"
"వాడ్డూ యూ మీన్? మా సిస్టర్ డెలివరీకి వచ్చింది. ఎలాగూ డాక్టర్ సిజేరియన్ చేయకుండా వదలదని మా బావ సిద్దాంతి దగ్గర కెళ్ళాడు.
"ఎందుకు?"
"సిజేరియన్ అన్నాక ఎలాగూ మనక్కావలసిన సమయంలో పాపాయి పుడుతుంది గనుక మంచి రాశి నక్షత్రాలు చూసి - ఏ రోజు ఏ టైం కి పాపాయి పుట్టాలో డాక్టర్ కి చెప్పాడు - అప్పుడే పాపాయి పుడుతుంది ."
"ఆ పాపాయి అద్భుత నక్షత్రాలలో పుడుతుంది. గనుక బ్రహ్మాండమయిన తెలివితేటలూ అదృష్టం అబ్బి - డాక్టర్ కోర్స్ లో సీట్ దొరికి గైనకాలజీ అ=చదివి మళ్ళీ సిజేరియన్ లు వద్దన్నా చేసేస్తూ 'సీజర్ నివాస్' బిల్డింగ్ లు కడుతూ-"
ఆమె నవ్వేసింది.
"మీరు ఫన్నీగా మాట్లాడతారు."
"అడ్రసిస్తాను.......ఫన్ కావలసినప్పుడు మీరు కాంటాక్టు చేయవచ్చు.'
"అవసరం లేదు" కఠినంగా అందామె.
సురేష్ లేచి మళ్ళీ నటాషా రూమ్ బయటికొచ్చి నిలబడ్డాడు.
నర్స్ బయటికొస్తూ అతన్ని చూసింది.
"బయట విజిటర్స్ రూమ్ లో వుండమన్నాను కదా?"
"మా మిసెస్ కెలా వుందో కనుక్కుందామని......"