బాబూజీకి తనమీద ఎందుకో కోపం వచ్చిందనుకున్నాడు వర్క్స్ మేనేజరు. తనవల్ల ఏదో తప్పిదం జరిగిపోయిందనుకున్నాడు. అతని కాళ్ళు వణకడం మొదలెట్టాయి.
అంతేగానీ అతను రామనాధాన్ని అసలు గమనించలేదు. వర్క్స్ మేనేజర్ కాదు - అక్కడున్న ఎవరూ రామనాధాన్ని గమనించలేదు... గమనిస్తే వాళ్ళలో ఎవరికయినా కొద్దిగా అనుమానం తోచి వుండేదే.
కానీ అక్కడున్న అందరి కళ్లూ బాబూజీ మీదే వున్నాయి.
కార్లో కూర్చున్నాడు బాబూజీ. రామనాధం కూడా కూర్చున్నాడు. బాబూజీ పక్కన కూర్చున్నాడు రామనాధం.
అదే వర్క్స్ మేనేజరుగానీ, మరో ఆఫీసరుగానీ అయితే, బాబూజీ పక్కన కూర్చోవడానికి సాహసించలేకపోయేవారు. ఎవరయినా ఒరిగి డ్రైవరు ప్రక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉండేవారు.
సున్నితమయిన మర్యాదలన్నీ ప్రొఫెసర్ రామనాధానికి తెలియవు. అతనికి తెలిసిందల్లా సైన్సు:
అంతే:
అది రోల్స్ రాయిస్ 'సిల్వర్ యస్ట్' కారు కస్టం మేడ్: బాబూజీ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నది, వెనక రెండు సీట్లూ రెండు పెద్ద సోఫాలలాగా ఉన్నాయి. అక్కడే ఫోలింగ్ చెయ్యడానికి వీలుగా వున్న చిన్న రైటింగ్ ప్లాంక్ ఉంది వైర్లు అవసరం లేని రెండు టెలిఫోన్లు ఉన్నాయి చిన్న టీవీ ఉంది. ఏసీవల్ల చల్లగా ఉంది కారు. ముందు సీట్లనీ, వెనక సీట్లనీ కవర్ చేస్తూ దళసరి అద్దంతో బేసిన పార్టీషన్ వుంది. వెనక కూర్చున్న వాళ్ళ మాటలు ముందుకూర్చున్న వాళ్ళకి వినబడవు... వినబడాలంటే, ఒక చిన్నమీట నొక్కాలి లేదా ఆ అద్దాన్ని పక్కకి జరపాలి.
తమ మాటలు డ్రైవరుకి వినబడవని తెలిసినబాబూజీ రామనాధంతో యధాలాపంగా అన్నాడు. "ప్రొఫెసర్: ఇంకా నయం: ఇందాక ఆ పిల్ల కాకిగాడు విసిరిన రాయి ఏ కంటికో తగిలి వుంటే కన్నుపోయి వుండవలసిన మాట"
తనకు తెలిసిన విషయాన్ని కడుపులో దాచుకోలేక సతమతమైపోతున్న ప్రొఫెసర్ రామనాధం వెంటనే అన్నాడు "అవున్సార్; గొప్ప అదృష్టం: అంతకంటే అదృష్టమేమిటంటే..." అని ఆగి చిల్లపెంకులా వున్న ఆ రాతిని జేబులోనుంచి తీశాడు ప్రొఫెసర్.
ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు బాబూజీ.
"సరి: ఇదేమిటో చూశారా? ఇది మామూలు రాయి కాదు. ఇది క్వార్ట్:"
"అంటే... ఇందులో బంగారం వుందా?" అన్నాడు బాబూజీ ఎగ్జయిటెడ్ గా.
"అంతకంటే విలువైనదే అని నా అనుమానం U308 ఉంది సర్ దీనిలో:"
"అంటే?"
"అంటే అది యురేనియమ్ దొరికే ముడిపదార్థం."
పైకి చాలా సాదాగా కనబడుతున్న ఆ రాతివంక చూశాడు బాబూజీ.
"ఎలా చెప్పగలుగుతున్నారు మీరు?"
"ఈ చుక్కలవల్ల అలా అనిపిస్తోంది. ఇప్పుడే నిశ్చయంగా చెప్పలేను. కానీ... నా అంచనా ఎప్పుడూ తప్పలేదు సర్:"
ఉద్వేగాన్ని ఆపుకుంటూ అన్నాడు బాబూజీ. "వెల్: ఎప్పుడు చెప్పగలరు మీరు ఖచ్చితంగా?"
"ఇప్పుడు నన్ను లాబరేటరీలో దింపెయ్యండి. సాయంకాలానికల్లా తేల్చి చెప్పేస్తాను."
"సరే: కానీ మీ పరిశోధన వివరాలు ఇప్పుడప్పుడే ఎవరికీ చెప్పకూడదు ప్రొఫెసర్ రామనాధం: మీకు తెలుసు యురేనియం అంటే ఎంత ప్రమాదకరమైన ఖనిజమో:"
"అవునవును" అన్నాడు రామనాధం.
రామనాధాన్ని కంపెనీ లాబొరేటరీ దగ్గర దింపి, ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు బాబూజీ...
యురేనియం:
పెద్దగా కేకపెట్టింది అతని మనసు.
యురేనియంకి మిలటరీ ప్రాముఖ్యం చాలా వుంది. యురేనియంతో ఆటంబాంబు తయారు చేయవచ్చు.
అందరూ చెయ్యలేరు. అటంబాంబు చెయ్యటానికి అత్యంతఆధునికమైన టెక్నాలజీ వుండాలి.
ఆ టెక్నాలజీ వుండి, యురేనియం, హార్ట్ వాటరూ ఉంటే, ఆటంబాంబు చెయ్యొచ్చు.
యురేనియం అతి అరుదైన ఖనిజాలలో ఒకటి. అది దొరకడం దాదాపు దుర్లభం:
అలాంటి యురేనియం ఈ వెనుకబడ్డ పీతబొక్కలాంటి దేశంలో దొరుకుతోందా?
దీనివల్ల తను లాభం పొందడం ఎలాగ?
అసలు ఇంతకీ అది యురేనియమేనా? లేకపోతే రామనాథం భ్రమపడి వుండవచ్చా?