Previous Page Next Page 
అభిలాష పేజి 22

                               9
   
    ముద్దాయిని నేరం చేసేవా, చెయ్యలేదా అని కోర్టులో అడుగుతారు. కొంతమండి పోలీసుస్టేషన్ లో యిచ్చిన స్టేట్ మెంట్, తను బలవంతం మీద యిచ్చాననీ, తను నేరం చేయలేదనీ కోర్టులో చెప్తారు. చాలా మండి నేరం చెయ్యలేదనే మొదటినుంచీ వాదిస్తారు. చాలా తక్కువమండి నేరాన్ని పూర్తిగా వొప్పుకుంటారు. అటువంటప్పుడు ప్రాసిక్యూటరు పని టెలికవుతుంది. చిరంజీవి కేసులో ప్రసిక్యూటర్ ఓ సాదిస్తూ కానీ, మంచి చమత్కారినని తనకి తనే అనుకుంటూ వుంటాడు.
   
    అయన నవ్వితే ఎడ్చినట్టూ, ఏడిస్తే భయపడినట్టూ వుంటుంది. ఆయనకోర్తులో వేసే జోకులకు కోర్టు బంట్రోతు కూడా నవ్వాడు.
   
    ప్రాసిక్యూటరుకీ, చిరంజీవికీ మధ్య మధ్య సంబాషణ ఇలా జరిగింది.
   
    ప్రాసిక్యూటరు: మీ పేరు?
   
    చిరంజీవి : చిరంజీవి.
   
    ప్రా.క్యూ : ఓహొ __ ఆ పేరుందనే ధైర్యంతోనేనా మర్డర్లు చేస్తున్నారు.
   
    చిర : నేను పుడ్తున్నప్పుడు నర్సుకి వరుసగా తుమ్ములు వచ్చినాయట, అందుకని నాకా పేరు పెట్టారు.
   
    కోర్టులో నవ్వులు వినబడటంతో ప్రాసిక్యూటర్ ఇరిటేట్ అయ్యాడు. జడ్జి 'ఆర్డర్ ఆర్డర్' అన్నాడు.
   
    "మీరేం చేస్తూ వుంటారు?"
   
    "ఎప్పుడు?"
   
    "ఆఫ్ కోర్స్ పనిచేసేటప్పుడు "
   
    "వెల్. పని చేస్తూ వుంటాను."
   
    "అది తెలుసు. కానీ ఎక్కడ?"
   
    "టేబుల్ ముందు కుర్చిలోకూర్చుని."
   
    ప్రాసిక్యూటర్ మరింత ఇరిటేట్ అయి,"ఎవరు చేసినా అదే చేస్తారు" అని అరిచేడు.
   
    "కాదు నేనప్పుడప్పుడు చెట్టుక్రింద కూడా నిలబడ్తూ వుంటాను" సిన్సియర్ గ అన్నాడు చిరంజీవి.
   
    "నిలబడి ?"
       
    "కస్టమర్లు కోసం చూస్తూ వుంటాను."
   
    "ఎటువంటి కస్టమర్లు?"
       
    "డబ్బులిచ్చే వాళ్ళు."
   
    "ఓహొ __ మోగవ్యభిచారం అన్నమాట. ఎక్కడుంది ఆ చెట్టు?"   
   
   
    "కోర్టు కాంపౌండ్ లో సర్! పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవకముండు మీరునిలబడిన చెట్టు."
   
    కోర్టులో నవ్వులు _జడ్జి "ఆర్డర్ __ ఆర్డర్" అన్నాడు. అతడికి కుర్చీలో కూర్చోవటం దుర్భరంగా వుండి. ఎప్పుడెప్పుడు హియరింగ్ పూర్తీచేసి చాంబర్స్ కి వెళ్ళిపొడమాని వుండి. చాలా సింపుల్ కేస్ యిది. శిక్ష ఏం విధించాలా అన్నదే తేల్చుకోవాలి. మూడు సంవత్సరాలు వేద్దామమ్నుకున్నాడు మొదట.
   
    "మిస్టర్ చిరంజీవి _సుశీల మీకెంతకాలం తెలుసు."
   
    "రెండుసంవత్సరాల్నుంచి."
   
    "మీ రామేని ప్రేమించారా?"   
   
    "ప్రేమంటే ఏమిటో నాకు తెలీదు" జడ్జిగారికి లేచిపోయిన పెద్ద కూతురు జ్ఞాపకం వచ్చింది. మూడు సంవత్ర్సరాల శిక్షని నాలుగుసంవత్సరాల కఠిన శిక్ష చేసేడు ప్రేమంటే తెలీదట__ ఇడియట్.
   
    వాదన సాగూతుంది.
   
    "ఆమెని రాత్రి సత్రానికి ఎందుకు రమ్మన్నారు?"
   
    "పగలు మా రూమ్ కి రమ్మంటే మర్డరు చేయటానికి వీలుండదని." 
   
    నాలుగుసంవత్సరాలశిక్ష ఏడు సంవత్సరాలయింది.
   
    "ఒఇక పెళ్ళికాని అమ్మాయిమిమ్మల్ని నమ్మి,అడవిలోకివస్తే ఆమెని బలాత్కారం చేయడం అమానుషం అని మీరు భావించటంలేదా?"
   
    "ఎలాగూ చంపుతున్నాను కదా అని అసరదాగాబలాత్కారం చేసెను."
   
    ఇతడికి యావజ్జీవ కారాగారశిక్ష సరిఅయింది అనుకున్నాడు జడ్జీ.
   
    "మిమ్మల్ని నమ్మి వివాహం చేసుకోవాలన్న ఆశతో వచ్చిన అమాయకమైన అమ్మాయిని అలా చెయ్యటానికి మీకెలా మనసోప్పింది చిరంజీవి?"
   
    "కావాలంటే ఉంచుకుంటానన్నాను _ వీల్లేదు. వెళ్ళే పెళ్ళే కావాలన్నది. మర్డరు తప్ప మరో మార్గం కనబలేదు.
   
    జడ్జిగారికి __తన కూతుర్నోదేలేసిన అల్లుడనబడే క్క్రిమి జ్ఞాపకం వచ్చేడు. ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఆ ఆతరువాత కొంతసేపు వాదన జరిగింది.పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు ప్రెజెంట్ చేసేడు. హియరింగు వచ్చేవారానికి వాయిదా వెయబడింది.
   
    హియరింగ్ రోజు కోర్టు కిటకిట లాడిపోయింది. అప్పటికే ప్రతికలుఏ వార్తని ప్రముఖంగా ప్రచురించసాగేత్యి. ఒక బాధ్యతా తెలిసిన యువకుడు __లా చదివినవాడు __ ఇమాట విచక్షణా రహిమ్టంగా ప్రవర్తింస్తడా అని ఏడిటోరియల్స్ వ్రాసేయి. సేన్సేషనల్స్ జానికి అలవాటుపడిన పత్రీకాలు మరింత ముందుకేల్లిచిరంజీవి ప్రఖ్యత క్రిమినల్ లాయర్ మేనకోడలైన అర్చనని ప్రేమించాడని, పెళ్ళి ప్రయట్నంకూడా జరిగిందనీ ప్రచురించాయి.
   
    అయితే కొన్ని వేళ మిల్ల దూరంలో వున్న అర్చనకిఏ విషయాలు ఏవే తెలియవు. బ్రిటిషు షిఫ్ బ్రేకింగ్ కంపెనీ మానేజింగ్ డైరెక్టర్ కారులో వాళ్ళిద్దరూ మిమానాశ్రయం వైపువస్తున్నారు.ఓడల్ని బ్రద్దలుకొట్టే పరిశ్రమవిశాఖపట్నంలో స్థాపించాలని ఆమె ప్రయత్నం వల్ల కారు ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ గుండా పార్క్ లేస దాటి హైడ్ పార్క్ మీదుగా వెళ్తూండి. ఇంకో ఇరవై నలుగు గంతల్లోచిరంజీవిని కలుసుకాబోతున్నా నన్న ఆలోచన ఆమెకి ఆనందాన్ని యిస్తూంది. ఒకవైపు ఆలోచానల్లో వుంటూనే ఏమ్. డీ. చెప్పేది వింటూంది. ఓడని డైడాక్ లో తీసుకొచ్చి నీళ్ళు తోదేసిదాన్ని ఎండబెట్టడం గురించి వివరిస్తున్నాడు అతడు.అర్చన విసుగ్గా టైమ్ చూసుకుంది.

    అదే టైమ్ కి ఇద్దరు పోలీసులు వేమ్తరాగాకోర్తులో ప్రవేశిస్తున్నాడు. జనం చూడసాగేరు.వాళ్ళ చూపుల్లో కోపం కూతుహలం అన్నీ మిళితమై వున్నాయి.అతడిప్రవశాంతో కోర్టు ఒక్క సారిగా నిశ్శబ్దమైపోయింది.  

 Previous Page Next Page