Previous Page Next Page 
అభిలాష పేజి 21

    "కోట గుమ్మం వీధిలో" అన్నాడు చిరంజీవి. అని, "పోదామా" అన్నాడు.
   
    ఆమె కారు స్టార్టు చేసింది., ఆమె ఇంటి దగ్గర డిగి, రూమ్ కి వెళ్తూ__ వెళ్తూ ఈవినింగ్ ఎడిషన్ పేపరు కొన్నాడు.
   
    చివరి పేజీలో చిన్న అక్షరాలతోపడిందా వార్త__
   
   
                                                               యువతి హత్య
   
    ఊరిచివర సత్రం పక్కనున్న బావిలో ఒక యువతి శవాన్ని పోలీసులు కనుక్కున్నారు. దాదాపు ఇరవై సంవత్సారాలున్న ఈ యువతి గొంతు ఎవరో నులిమి బావిలో పడేసేరని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. మిగతా వివరాలకోసం పోలీసులు వెతుకుతున్నారు.
   
    చదవటం పూర్తీచేసిన చిరంజీవి పెదవుల మీద చిరునవ్వు వెలసింది.
   
                                  8
   
    ఎయిర్ పోర్టు హడావిడిగా వుంది.
   
    సర్వోత్తమారావు, మిగతా పరివారం అంతా అక్కడే వుండి. అర్చన తెల్లటి చీరేలో కొట్టోచ్చినట్టు కనబడుతూంది. చిరంజీవి తన మామూలు ఇన్ ఫీరియారిటీ కాంప్లేక్స్ తో దూరంగా నిలబడ్డాడు.
   
    ఆమె అందర్నీ తప్పించుకుని అతడి దగ్గరకొచ్చి, చిరునవ్వుతో "వెళ్ళిరానా" అంది. ఎందుకో తెలీదుగానిఅతడి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేయి. జీవితంలో అతడిపట్ల అంత ఆప్యాయతా, అతనంటే అంత ఇంట్రస్టూ చూపించిన అమ్మాయి ఆమె నైక్కతే.
   
    "ఇదేమిటి" అందామె.
   
    "విరహం" అన్నాడు కంటినిండా నీటితోనే.
   
    ఆమెకూడా కడలిపోయి, అంతలోనే తమాయించుకుని నవ్వి, "మేనగాళ్ళు ఏడవరు" అంది.
   
    "రివర్సు గేర్ మొన్ననే నేర్చుకున్నాను " మొహంలో ఏ భావమూ లేకుండా అన్నాడు.
   
    ఆమె చిరుకోపంతో "అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది కనీ లేకపొతే ఏం చేసేదాన్నో తెలుసా?"
   
    "తెలుసు."
   
    ఆమె ఆశ్చర్యపోయి "ఏం చేసుండేదాన్ని?" అంది.
   
    "చెంప వ్యగొట్టనంటే చెప్తాను."
   
    "కొట్టను."
   
    "మెడచుట్టూ చేతులువేసి ఫేర్ వెల్ ... చెప్పి వుండేవారు" మాటలు మింగేస్తూ నసిగేడు.
   
    "హౌ డేర్ యూ ఆర్ " గద్దిస్తూ అన్నది.
   
    "ముడ్నాలుగు నెలలు విరహాన్ని కవర్ చేయడానికి ఆ మాత్రం సిమెంట్ కావాలి."
   
    "పేళ్ళవకుండా ముద్దు పెట్టుకుంటే చెడ్డపిల్లలు పుడ్తర్ట మా నాయనమ్మ చెప్పేది."
   
    "పేళ్ళవ్వకుండా ముందు పెట్టుకున్న మొదటి ముద్దు మనవడు పెట్టెదాకా జ్ఞాపకం వుంటుందట__ మాతాతయ్య చెప్పేవాడు."
   
    ఆమె కన్విన్స్ అయింది కానీ చుట్టూ చాలామండి ఉన్నారు.విమానశ్రమం విదేశానిది కాదు.
   
    "ఏమిటా పుస్తకం" అన్నాడుఅమేచేతిలో పుస్తాకాన్ని చూస్తూ .
   
    "చాపమన్స్ రిపోర్టు. ఇర్వింగ్ వాలేన్ ది" అంది. పుస్తకం అట్ట మీద రెండు పెదవుల బొమ్మ వుంది.  అందుకుని __ చూపెడు వేలు ముద్దు పెట్టుకుని, ఆ బొమ్మమీద అద్దేడు.
   
    ఆమె పుస్తాకాన్ని తీసుకుని పరీక్షిస్తున్నట్టూ మోహం దగ్గరకి తీసుకుంది.
   
    ఇద్దరూ చాలా సీరియస్ గా లక్షల బిజినెస్ మాట్లాడుకుంతూన్నారేమో అనుకున్నారు చూస్తున్నవాళ్ళు. వాళ్ళిద్దరిమధ్య సీక్రెట్ గా ముద్దు ట్రాన్స్ ఫ్రాయిపోయిందన్న విషయం గమనించింది సర్వోత్తమారావు రోక్కరే. క్రిమినల్ లాయర్గడా. ఆయనగుబురుమీసాల వెనుక చిరునవ్వుకదలాడింది.
   
    సరీగ్గా పడినిముషాల తర్వాత అర్చన విమానంలోకిప్రవేశించింది. అ తరువాత పది నిముషాలకి విమానం బయలుదేరి వెళ్ళిపోయింది.
   
                                                        *    *    *    *
   
    పోలీసు దర్యాప్తు చురుగ్గా సాగింది.
   
    బావి వందగజాల దూరంలో వున్న హాండ్ బ్యాగ్ రెండురోజుల తర్వాత దొరికింది. చిరంజీవి అనే పేరు చిన్నపిల్లలకి వుంటుందని ముందు హైస్కూళ్ళూ, మిడిల్ స్కూళ్ళూ వెతికారు అక్కడ దొరక్కపోయేసరికి ఫైలు మూసేద్దామా అనుకున్నారు. అంతలో ఇన్ స్పెక్టర్ కి ఈ చిరంజీవి అన్న పేరు ఎక్కడో విన్నట్టుందే అనిపించింది. ఆ రోజు అర్దరాత్రి కలసినవాడు జ్ఞాపకం వచ్చేడు లాయర్ని తెల్సింది. చేతివ్రాత పరిశీలించేరు.అతడిదే అని తేలింది.
   
    రాత్రి తొమ్మిదింటికి నిద్రకుపక్రమిస్తూంటే ఇన్ స్పెక్టర్ వచ్చేడు. "మిస్టర్ చిరంజీవి. ఈ చేతివ్రాత మీదేనా" తలుపుతీసి నిలబడ్డ చిరంజీవిని అడిగేడు.
   
    "నాదే"
   
    "మీరే సిగరెట్లు కాలుస్తారు?"
   
    కాల్చాను అనబోయి, తమాయించుకుని "చార్మినార్ " అన్నాడు.
   
    "యూ ఆర్ అండర్ అరెస్టు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    "చార్మినార్ సిగరెట్లు కాల్చే వారందర్నీ అరెస్టు చేస్తున్నారా?" అడిగేడు చిరంజీవి.
   
    ఇన్ స్పెక్టర్ పళ్ళు బిగించి "సుశీల అనే అమ్మాయిని హత్యచేసినందుకు మిమ్మల్ని సెక్షన్ 366, సెక్షన్ 376, సెక్షన్ 351 ళ క్రింద అరెస్ట్ చేస్తున్నాను."
   
    "సెక్షన్ 302 లేదా" దిగులుగాదిగేడు.
   
    "ఉంది."
   
    "థాంక్యూ ఇన్ స్పెక్టర్" అంటూ వాన్  ఎక్కాడు. వాన్ పోలీసు స్టేషన్  వైపు కదలిపోయిమ్ది కదలిపోయింది.

 Previous Page Next Page