పడుకుంటారా అనడిగాను.
అవునన్నారు. అని మంచాని కడ్డంగా పడిపోతే సరిగ్గా లాగి పడుకోబెట్టపోయాను.
నన్నూ మీతో పాటు లాక్కున్నారు. అంతే.....! ఎనిమిది గంటలు గడిచిపోయింది."
'అంటే ఇప్పుడు రాత్రి......."
"పదకొండవుతోంది"
సురేష్ కి కొంచెం కొంచెంగా గుర్తుకొస్తోంది. తను డార్క్ డెవిల్ రూమ్ కెళ్ళడం , అతను తనను బలవంతంగా పూల్ గా తాగించడం , అక్కడ్నించి తను బస్ లో అబిడ్స్ చేరుకోవడం, నటాషా కోసం తలుపు తట్టడము - అంతే .....అంతవరకే! ఆ తరువాత తనను విస్కీ లొంగదీసేసుకుంది. దాని ప్రభావంలో తనేం చేశాడో తనకే తెలీదు.
"నటాషా ఏదీ?"
"ఇవాళ స్పెషల్ స్ట్రిస్ టీజ్ షోస్ వున్నాయ్. లక్కీ గాళ్! ఒక్క రోజులో రెండు వేలు సంపాదిస్తుందీవేళ....."
"మీతో ఇలా ప్రవర్తించినందుకు గాను చాలా సిగ్గ్గుగా వుంది."
"నాకు చాలా హాపీగా వుంది....."
అతను తెల్లబోయాడు.
"అబద్దం చెబుతున్నారు కదూ?"
"అలా అనుకునేట్లయితే మళ్ళీ ప్రయత్నించి చూడండి" వళ్ళంతా కొంటెతనం.
"ఇదంతా తాగిన మైకంలో జరిగిపోయింది."
"అయితే మీకు రోజూ నేను తాగిస్తాను....."
సురేష్ మంచం మీద కూలబడిపోయాడు. ఈ పాటికీ తులసి చదువు కోవటం ఆపి పడుకుని వుంటుంది. తన బదులు తలగడను ఉపయోగించుకుని కాసేపు తంటాలు పడి...తనమీద కోపం తెచ్చుకుని ......మళ్ళీ లేచి గదంతా పచార్లు చేస్తూ యింటికి రాగానే తననేలా ఎటాక్ చేయాలా అని రిహార్సల్స్ వేసుకుంటూ........
"ఇప్పుడు ఇంటికేళితే తులసికి ఏం చెప్పాలా అని అలోచ్భిస్తున్నారు కదూ?" కవ్విస్తున్నట్లు అడిగింది.
"నేనాలోచిస్తుందది కాదు! ఇదే మొదటిసారి........తులసితో కాకుండా యింకోకరితో యిలా......."
"నటాషా , మీరు స్కూల్లో చదివేటప్పుడు జరిపిన గేమ్స్ సంగతేమిటి?"
సురేష్ నవ్వేశాడు.
"అది తులసి నా లైఫ్ లోకి రానప్పుడు."
సురేష్ మళ్ళీ తులసి గురించి ఆలోచించాడు.
తులసి కేమని చెప్పటం .........రాక్యలక్ష్మితో గడిపానని చెప్తే .........ఎలా వుంటుంది? పోనీ అబద్దం చెప్తే - నో నెవర్! తామిద్దరి మధ్యా వున్నది అలాంటి బంధుత్వం కాదు.
దీప గదిలో లేనప్పుడు మొట్టమొదటిసారిగా తను తులసిని రీసెర్చ్ చేసేముందు మాట్లాడుకున్నారిద్దరూ.
"నాకో ప్రామిస్ చేస్తావా?"
"ఈ సమయంలో ఏ మగాడయినా సరే లక్ష ప్రామిస్ లు చేస్తాడు!"
'అలాంటివి కాదు. రియల్ ప్రామిస్."
"ఏమిటది?"
"మనం ఈ బంధం ఏర్పరుచుకుంటున్నాం గనుక ఇక నుంచీ మన మధ్య ఏమీ వుండకూడదు."
"నాకూ అదే యిష్టం. బట్టలుంచుకోవటం మీనింగ్ లెస్."
"నేననేది ఆ విషయం కాదు" అసహనంగా అందామె.
"మరి?"
"మనిద్దరి మధ్యా రహస్యాలేమీ వుండకూడదంటున్నాను."
"నేనయితే రీసెర్చ్ కి ఎప్పుడూ రడీయే. నువ్వే అడ్డు చెపుతుంటావ్ లైట్ తీసేయ్యమని."
'అయ్యో" చిరాకు పడిందామే. "సురేష్! విత్ యూ ఎవర్ బి సీరియస్?"
"ఇలాంటి విషయాల్లో నేను చాలా సీరియస్ గా యింటాను. మా ఫ్రెండు ఒకడు. పేరు ....పేరు ఆ! దీపక్ మొఖవాటపడ్డాడు. ఆ అమ్మాయి దగ్గర ఇప్పటికీ పశ్చాత్తాపపడుతుంటాడు."
"పాస్ట్ సంగతి వదిలేద్దాం. భవిష్యత్తులో మన మధ్య కేవలం నిజాలే ఉంటాయ్. మనిద్దరి మధ్యకూ మరొకరు రాకూడదు. ముఖ్యంగా యిలాంటి వాటిల్లో."
"ఓ! అదా. ఇటీజ్ ఓ.కే."
"ఓ.కే. కాదు ప్రామిస్ చెయ్."
"ప్రామిస్"
"అలాక్కాదు. ఒకరి చేతుల్లో ఒకరు."
తను అలాగే చేశాడు. "ఇలాంటి ఓత్ టేకింగ్ సెరిమనీ నేనెక్కడా చూళ్ళేదు. ఇంక రడియేనా?"
"రడీ" అంది తులసి.
అతను లేచి నిలబడ్డాడు.
"ఏకపత్నీ వ్రతులన్నమాట" హేళనగా అంది రాజ్యలక్ష్మి.
"మిగతా వ్రతాలన్నీ ముందే అయిపోయాయ్ గనుక!"
'అయితే జరిగింది మర్చిపోదాం."
"అదే మంచిదనుకుంటాను. వెళతానిక."
"ఇంత రాత్రిలోనా?"
"తులసి నా కోసం ఎదురు చూస్తుంటుంది."
"రోజునా?"
"రోజూ వుండాల్సిందే"
'ఆమె తలుపు తెరిచింది.
సురేష్ బయటికి వచ్చాడు.....
నూట యాభయ్ గదులూ నిశ్శబ్దంగా వున్నాయి. లాస్ట్ బస్ ఆగకుండా వెళ్ళిపోయిందని ఎవరో ఆర్టీసీని బూతులు తిడుతున్నాడు.
"పోనీలే వూరుకోండి.....తిట్టకండి" అంటోంది వాళ్ళావిడ ఆ పక్కనే నిలబడ్డ కానిస్టేబుల్ వేపు భయంగా చూస్తూ.
నడిచి యింటికి చేరుకునేసరికి ఒంటిగంటయిపోయింది.
గంగాభవాని ఇంట్లో డిమ్ లైట్ వెలుగుతోంది.
గేటు తీయడానికి ప్రయత్నించాడు.
లోపల తాళం......
కొంప ముంచింది ప్రొడ!
డోర్ బెల్ మీట నొక్కాడు. లోపల టక్కున లైటు వెలిగింది. తలుపు తెరచుకుని బయటకు తొంగి చూసింది గంగాభవాని. లైటు సురేష్ మీద పడుతోంది.
"ఎవరు?"
"నేనే!"
"నేనే అంటే......"
"సర్వ్ డిపార్ట్ మెంట్."
బయటకొచ్చి తాళం తీసింది.
"ఇంత రాత్రిళ్ళు వస్తే ఎలా? పది తాళం వేసేస్తానని చెప్పానుగా!"
"తాళం చెవి మన దగ్గరే వున్నప్పుడు భయమేముంది?"
ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకోబోయినట్టు నటించాడు.
ఆమె వెనక్కు గెంతింది రెండడుగులు.
"ముట్టుకున్నారంటే మద్యడగా వుండదు"
"ష్! గట్టిగా అరవకు తులసి నిద్రపోయింది?"
"ఇప్పటివరకూ గడపలో కూర్చుని యిప్పుడే పడుకుంది. ఎక్కడ తిరుగుతున్నారింతసేపు?"
"అనుకోకుండా మా ఫ్రెండ్ ఒకమ్మాయి యింట్లో గొడవయిపోయింది."
"ఏమయింది?"
"కాంప్ కేళతానని వెళ్ళకుండా వాళ్ళాయన తిరిగి వచ్చేశాడు.'
"ఇంట్లో దొరికిపోయింది నువ్వే కదూ?"
"కాదు మా ఫ్రెండ్."
"మరి ఆ లిప్ స్టిక్ ముద్ర నీ షర్ట్ మీదేందుకు వచ్చింది?"
సురేష్ అదిరిపడ్డాడు. అవును - షర్ట్ మీద స్పష్టంగా కనబడుతున్నాయి పెదాలు - మగాడి సుఖశాంతుల్ని సర్వనాశనం చేసే గుర్తుల్లో రెండవది.
మొదటిదీ కుంకుమ లేక తిలకం.
రాజ్యలక్ష్మి - టు - హెల్ విత్ యూ........
"నేనే మా ఫ్రెండనుకుని ఆ అమ్మాయి."
"నేనిచ్చిన యాభయ్ రూపాయలు దీని కోసమా!"
"నో ప్లీజ్! అలా అభాండాలు వేయకండి. నిజం చెప్తున్నాను. నేను మీ కెప్పుడూ దోహం చేసి యింకో అమ్మాయి దగ్గర కెళ్ళాను."
"నాకూ ద్రోహం మేమిటి? మీరెక్కడికెళితే నాకెందుకు?"
"థాంక్ యూ! అందరు అమ్మాయిలూ మీలాగా అనుకుంటే దేశం సుఖ శాంతులతో కలకలలాడిపోతుంది."
ఆమె లోపలకు వెళ్ళి తలుపు వేయబోయింది.
అడ్డుపడి తనూ లోపలికొచ్చాడతను.
"లోపలికెందు కోస్తున్నారు?"
"అబ్బా! యుగయుగాలుగా మగాడికీ ప్రశ్న తప్పటం లేదు. దీనికి సమాధానం లేదు" ఆమెను చటుక్కున దగ్గరకు లాక్కుని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె విడిపించుకుని చెంప మీద కొట్టింది గానీ చెంపను తాకే సమయానికి చేతిలో విసురు తొంభై శాతం తగ్గిపోయింది.
"ముందిక్కడనుండి వెళతారా లేదా?"
"ఒక సహాయం చేస్తే......"
"ఏమిటది?"
"మీ అయన షర్టు కావాలి."
గంగాభవానికి అర్ధం కావటం లేదు.
"అలా చూడకండి. మీ అయన వాడిన షర్ట్స్ ఏమీ లేవూ? ఏదొకటి ఎంత పాతదయినా సరే....."