Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 21


    సురేష్ ఇంకో గ్లాసు తెచ్చిచ్చాడు.
    "బాస్టర్డ్! మా నాన్నగారు వాడి మీద జాలిపడి పుట్ పాత్ మీదున్న వాడిని తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టి సగం ఆస్తి ఇచ్చినందుకు మాకే ద్రోహం చేస్తాడా? ఒరేయ్ సురేష్! అసలు మా పాధర్ కి హార్ట్ ఎటాక్ ఎందుకొచ్చిందో తెలుసా? వాడు చేసిన ద్రోహం కనిపెట్టడం చేత" హటాత్తుగా డార్క్ డెవిల్ లో ఆవేశం తగ్గిపోయింది. గొంతు గద్గదమైంది. కాళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయి.
    "సురేష్! మా మమ్మీ ఎందుకు చనిపోయిందో తెలుసట్రా? పూలు అమ్మిన చోట కట్టేలమ్మలేక, కోటీశ్వరుడయిన తన కొడుకు తెల్లారేసరికల్లా పుట్ పాత్ మీద నిలబడటం చూడలేక. అందుకే ఆత్మహత్య చేసుకుందిరా.'
    సురేష్ అతని భుజం తట్టాడు ప్రేమగా.
    "టేకిట్ ఈజీ"
    అతని చేతిని విదిలించికొట్టాడు డార్క్ డెవిల్.
    "ఏమిట్రా! నాకు మా ఫ్యామిలిని సర్వనాశనం చేస్తే టేకిట్ ఈజీ యా? నెవర్! వాళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలం యిక్కడే యిప్పుడే అనుభవించాలి. కమాన్! లెటజ్ సెలబ్రేట్ ఓల్డ్ బాస్టర్డ్ డెత్."
    ఇద్దరి గ్లాసులూ మళ్ళీ పుల్ అయ్యాయి.
    "ఇంకోద్దురా- తులసి......"
    "లేట్ హర్ గో టూ హెల్! నీ ఫ్రెండ్ కంటే బ్లడీ తులసి ఎక్కువై పోయిందా? కమాన్! డ్రింక్."
    సురేష్ మాట్లాడకుండా తాగాడు. డార్క్ డెవిల్ గ్లాస్ ఖాళీ చేసి మంచం మీద వాలిపోయాడు.
    "ఓ హసీనా! జుల్ఫోంవాలీ జానే జాహ....."
    పాట ప్రారంభమై పోయింది.
    సురేష్ బలవంతం మీద గ్లాసు ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
    శరీరమంతా ఎక్కడో తేలిపోతోంది. కళ్ళు మూసుకుపోతున్నాయ్. మనసు తూలుతూ ఎక్కడెక్కడో విహరిస్తోంది.
    ఇంతగా ఎప్పుడూ తాగలేదు. ఇదే ఫస్ట్ టైం.
    హటాత్తుగా కోపం ముంచుకొచ్చింది సురేష్ కి. తనను ఎన్నయినా తిట్టవచ్చువాడు. పుల్ పవర్స్ వున్నాయ్ వాడికి తన మీద. కానీ తులసి మీద ఎవడికి అధికారం వుండటానికి వీల్లేదు. తులసి తన సొంతం. తన సొంత స్పెషల్ పాపర్టీ.
    లేచి నిలబడ్డాడు. అడుగులు తడబడుతున్నాయ్. తూలుతూ వెళ్ళి మంచం దగ్గర నిలబడ్డాడు. "ఏమిట్రా తులసి నన్నావ్? బ్లడీ తులసా? బాస్టర్డ్' డార్క్ డెవిల్ కాలర్ పట్టుకుని మంచం మీద నుంచి లేవదీశాడు.
    "లేట్ హర్ గో టు హేల్లా? రాస్కెల్! మళ్ళీ అను"
    డార్క్ డెవిల్ నీరసపడిపోయాడు.
    "షారీ బ్రదర్! అయామ్ రియల్లీ షారీ......! తులాషితో ఈ ఒక్క సారికి డార్క్ డెవిల్ ని షమించమని చెప్పు. తులాషి నిజంగా ఒక డాల్. ఆ డాల్ ని సంతోషపెట్టు. కన్నీరు రానీకు . నెవర్" అతని కోపం అంతా కరిగిపోయింది. డార్క్ డెవిల్ ని కౌగలించుకున్నాడు.
    "ఒరేయ్......ఇదిగో ......ఇంకొంచెం మిగిలింది షిషాలో ఇద్దరికీ చెరో సగం. స్ట్రిక్ట్ లీ ఫిప్టీ........ ఫిప్టీ... డోంట్ రేఫ్యుజ్ ......ఇది మాత్రం డార్క్ డెవిల్ హెల్త్ కోసం."
    ఇద్దరి గ్లాసులు పూర్తిగా నింపాడతను.
    చీర్స్ అంటూ గ్లాసులు కలపడానికి రెండు నిమిషాలు తంటాలు పడ్డారు. ఆఖరికి "టంగ్' మని కలుసుకున్నాయ్.

                                                        *    *    *    *

    చీకటి........
    ఏమీ కనిపించడం లేదు. దానికి తోడు నిశ్శబ్దం. కళ్ళు నులుముకుని చూశాడు. మసక మసకగా వుంది.
    సన్నగా నెమ్మదిగా రహస్యంగా వినబడసాగింది.
    చెవులు రిక్కించి విన్నాడు.
    "టక్ - టక్ , టక్ - టక్, టక్ - టక్, టక్ - టక్, టక్ - టక్.
    ఏమిటది? గడియారమా/ అవును అలారం టైమ్ పీస్! ఎక్కడుందది? మరోసారి చుట్టూ చూశాడు.
    అలారం గడియారం! రేడియం ముళ్ళు మెరుస్తున్నాయ్. అవును! అదేక్కడి నుంచి వచ్చింది? తను ఇంట్లో లేదు కదా?
    అసలిది రాత్రా? పగలా/ మరోసారి రేడియం ముళ్ళ వైపు చూశాడు. చుక్కలు కనబడుతున్నాయ్. అప్పుడు వినిపించింది.
    "పక్కనే ఉచ్చ్వాస నిశ్వాసాల శబ్దాలు బరువుగా, సన్నగా ....."
    సురేష్ పక్కకు తిరిగి పడుకున్నాడు, చేత్తో తడిమాడు. మెత్తగా సన్నగా ఆమె ఊపిరి వెచ్చగా తగులుతోంది.
    అతను మరింత దగ్గరగా జరిగాడు.
    ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. కొత్తగా వింతగా నరాలు జివ్వున లాగేస్తూ, చేతులు అలవాటు ప్రకారం రీసెర్చ్ ప్రారంభించినాయి.
    ఆమె స్పర్శ నిలువునా నిప్పులా అంటుకుంటుంది.
    ఆమె నడుము తన మీదకు లాగబోతుంటే గుండె ఝాల్లుమంది. ఆ స్పర్శ ఆ వెచ్చదనం కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయ్.
    కాళ్ళు పాదాలను తాకినాయ్.
    అనుమానం బలపడిపోతోంది!
    ఆమె చలనం ప్రారంభమయింది. చేతులు గుండె దగ్గర ఆగిపోయినాయ్. ఇంకొద్ది క్షణాల్లో స్వర్గ సుఖాలు తెరచుకుంటాయ్. వేడి నిట్టూర్పులు, సెగలు.
    సురేష్ కి మతిపోయింది.
    "తులసీ......."
    ఆమె నెమ్మదిగా నవ్వింది.
    "తులసే కావాలా?"
    అదిరిపడ్డాడు "నువ్వు .......మీరు......."
    "ఇప్పుడు స్పృహ వచ్చిందా?" ఇంకా నవ్వుతూనే అంది.
    బాంబులు ఒకదాని తర్వాత ఒకటి పెలుతున్నట్లుంది.
    కొంప మునిగింది. తన పక్కన ఉన్నది తులసి కాదు. అయితే మరెవరు? అసలు తనేక్కడున్నాడు? ఎందుకున్నాడు ? ఇది పగలా? రాత్రా? టైమెంత?
    లేచి కూర్చోబోయాడు. ఆమె నడుముకి బంధం వేసింది.
    "ఎక్కడికి?"
    "లైటు వేస్తాను."
    "నాకేం తెలీడం లేదు"
    "ఏం తెలుసుకోవాలి?"
    "నువ్వు.......సారీ....మీరు....."
    "ఇప్పుడు అవసరమా అదీ?"
    "అవును"
    ఆమెను వదిలించుకుని మంచం దిగి గోడ తడమసాగాడు స్విచ్ కోసం. ఆమె నవ్వుతోంది బిగ్గరగా. ఎక్కడో విన్నాడు ఆ గొంతు..... తులసిది మాత్రం కాదు!
    "స్విచ్ ఎక్కడుందో తెలీదా?"
    "తెలుసు. కొన్ని రోజులు స్విచ్ ఆపరేటర్ గా రూమ్ మెట్ గా వున్నాను" వెతుకుతూనే అన్నాడు.
    చివరకు నెలకు అడుగు ఎత్తులో దొరికింది.
    ట్యూబ్ లైట్ మెరుపు కాంతిలో వెలిగింది.
    డబల్ బెడ్ మధ్యలో ముఖం మీద చేతులు కప్పుకుని , బోర్లా పడుకుని.
    గదంతా చూశాడు. "మైగాడ్! తను హోటల్ రూమ్ లో వున్నాడు నటాషా రూమ్.
    రూమ్ నెంబర్ 696 . అంటే మంచం మీద నటాషానా? ఆమె దగ్గరకు నడిచాడు.
    "నటాషా" ఆమె తుళ్ళి తుళ్ళి నవ్వుతోంది బోర్లా పసుకుని.
    బలవంతంగా వెల్లకిలా తిప్పాడు.
    ఇంకో షాక్...."
    రాజ్యలక్ష్మి - నటాషా కాదు.
    ఏం జరిగిందసలు? తనిక్కడ నటాషా రూమ్ లో రాజ్యలక్ష్మితో - నధింగ్ రాంగ్ సమ్ వేర్.
    "ఇప్పుడు తెలుసుకున్నారా?' చీర చుట్టుకుంటూ అంది.
    సురేష్ ఆతృతగా ఆమెకు సమీపంగా వెళ్ళాడు. "మన మధ్య ఏమైనా జరిగిందా?"
    ఆమె చిలిపిగా చూసింది. "మొద్దు స్వరూపం....."
    "ప్లీజ్ చెప్పండి"
    "ఎందుకు జరగదు? ఇది ఫస్ట్ టైమ్ నాకు.....ఇలాంటి ఎక్స్ పీరియన్స్! నాకో జరిగిన జోక్ గుర్తుకొస్తోంది.
    సురేష్ నిరాసపడిపోయాడు. కానీ ఇదంతా కావాలని చేసింది కాదు. తన తప్పేమీ లేదు.
    తులసి దగ్గర గిల్టీగా తలవంచుకొనవసరం లేదు.
    "ఏం జోక్ అది?" వుత్సాహంగా అడిగాడు.
    "మా చిన్నప్పుడు మాకు ట్యూషన్ చెప్పటానికో పంతులు వస్తుండేవాడు. ఆయనకు సంగీతం అంటే చచ్చేంత యిష్టం. మా పిన్ని అప్పుడు మాంచి యవ్వనంలో వుండేది. అద్భుతమైన గొంతు. ఆమె శ్రావ్యంగా పాటలు పాడేది. ఓ రోజు నేను అటాలాడుకుని ట్యూషన్ టైంకి ఇంటికి చేరుకునేసరికి మా బాత్ రూమ్ తలుపు కీ హోల్ దగ్గర మాష్టారు చెవి పెట్టి వింటున్నారు. లోపల మా పిన్ని స్నానం చేస్తూ పాడుతుంటే." విరగబడి నవ్వసాగిందామె.
    "ఇడియట్" అన్నాడు సురేష్ పళ్ళు కొరుకుతూ. "దృశ్య కావ్యానికీ, శ్రవ్య కావ్యానికీ తేడా తెలుసుకోలేని వాజమ్మ......."
    ఆమె జుట్టు సరిచేసుకుంటుంటే ఎదురుగ్గా నిలబడ్డాడు సురేష్.
    "అసలు ఎలా జరిగిందది? నవ్వండి. నాకేమీ తెలీడం లేదు. నేనిక్కడ కెప్పుడోచ్చాను? నటాషా ఏమైంది...? మనం ఇందులోకి ఎలా దిగాము?"
    "మధ్యాహ్నం రెండు గంటల కొచ్చారు. తలుపు తెరిచాను. లోపలి కొచ్చి మంచం మీద కూర్చున్నారు. బాగా 'అన్' లో వున్నారని తెలిసి పోయింది నాకు.

 Previous Page Next Page