సంపూర్ణ చానెల్ లోగో ఉన్న మైక్ పట్టుకుని విజిటర్స్ లాంజ్ లో కూర్చున్న మల్లికను చూసి ఇంకా షాకయ్యాడు.
ఈ స్కూటర్ రాణీకీ , సంపూర్ణ చానెల్ కీ ఏమిటి సంబంధం? మల్లిక దగ్గరకు నడిచాడతను.
"హాయ్ మల్లికా!"
"ఆమె అతని వేపు ఆశ్చర్యంగా చూసింది.
"హాయ్- మీరా!"
"యా! నేనే గానీ మీరిక్కడెం చేస్తున్నారు?"
"నేను నెంబర్ వన్ చానెల్ క్రియేటివ్ హెడ్ ని -"
"అంటే సంపూర్ణ టీవీ చానేలా?"
"యా! మీరు?"
"నేను నెంబర్ వన్ టీవీ చానెల్ సేఈఓని"
"నెంబర్ వన్నా! నెంబర్ వన్ చానెల్ మాది! మీదే చానెల్?"
"మాదీ నెంబర్ వన్నె-"
"ఏ చానెలది?"
"బృందావనం!"
"అది నెంబర్ వన్నా?" నవ్వాపుకుంటూ అడిగింది.
"అవును -- లాస్ట్ నుంచి నెంబర్ వన్-"
"ఆ చానెల్లో రోజా అనే ఆమె ఉండాలిగా?"
"ఉంది! ప్రస్తుతానికి మాత్రం నేనే ఇన్ చార్జ్ -"
"వావ్! అయితే మీరు దేనికొచ్చారిక్కడికి?"
"దివ్యాసేన్ ని స్పెషల్ ఇంటర్యూ చేయడానికి !"
మల్లిక షాకయింది.
"అదేంటి! ఈ రేప్ మేటర్ అసలు నా ఒక్కదానికీ తప్ప ఇంకెవరికీ తెలీదు కదా!"
"అలా అని పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళు చెప్పారా?"
"యస్! మాది నెంబర్ వన్ చానెల్ కాబట్టి మాకా ప్రివిలేజ్ ఉంటుంది -- అయినా గానీ మీ బృందావన్ చానెల్ కి దివ్యా సేన్ ఇంటర్యూ ఎలా ఇవ్వడానికి వప్పుకుంది ?"
'అదే ట్రేడ్ సీక్రెట్ డియర్-"
"నన్ను డియర్ అనవద్దని చెప్పాను కదా?"
"అది నా వీక్ నెస్ అని మా డాక్టర్ చెప్పాడు లే-"
అప్పుడే లోపల్నుంచీ ఆమె కెమెరా మెన్ బయటికొచ్చాడు .
అప్పుడే లోపల్నుంచీ ఆమె కెమెరా మేన్ బయటికొచ్చాడు.
"సారీ మేడమ్ - దివ్యాసేన్ మన చానెల్ కి ఇంటర్యూ ఇవ్వడానికి వప్పుకోవడం లేదు -"
మల్లిక ఆశ్చర్యపోయింది.
"వ్వాట్! నెంబర్ వన్ చానెల్ కి ఇంటర్యూ ఇవ్వనందా?"
"అవును -- ఆ చెత్త చానెల్ బృందావన్ కి ఇంటర్యూ ఇస్తానని కమిటయ్యిందట!"
భవానీ అతని భుజం తట్టాడు.
"ఒరేయ్ మంకీ! మొన్న మొన్నటి వరకూ మీ చానెల్ కూడా 'చెత్త' అని అందరూ అనే వాళ్లురా!"
అతను కంగారు పడ్డాడు.
మల్లిక భవానీ వైపు చిరునవ్వుతో చూసింది.
"యా! యూ ఆర్ రైట్ , నేను చేరిన ఆరునెలల్లో నెంబర్ వన్ చేశా! అంతకు ముందు అది కూడా చెత్తే-"
"అంతేకాదు - త్వరలో మళ్ళీ చేత్తో కేటగిరిలో కెళ్ళే చాన్సుంది-"
ఆమె పొగరుగా గర్వంగా చూసింది.
"నేనుండగానా?నోవే!"
లోలోపల చాలా సీరియస్ గా ఆలోచిస్తోంది మల్లిక! దివ్యా సేన్ ఇంటర్యూ చాలా ముఖ్యం తన చానెల్ కి! ఒకవేళ అది బృందావనం చానెల్ కి దొరికిందంటే జనమంతా బృందావనం చానెల్ చూస్తారు-
లక్కీగా తనకు రాకేష్ తో పరిచయం ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూ ని ఇద్దరూ షేర్ చేసుకుంటే?
"రాకేష్ ! ఈ ఇంటర్వ్యూ ని మనిద్దరం షెర్ చేసుకుందామా?"
భవానీ నవ్వాడు.
"సారీ! మా చెత్త చానెల్ నెంబర్ వన్ పక్కనుండటం మీకే ఇన్సల్ట్-"
"నేనలా అనికోవటం లేదు -"
"నేననుకుంటున్నా-"
"ఓకే - మీ కిష్టం లేనప్పుడు బలవంతం చేయటం నాకూ ఇష్టం లేదు - ఎన్నింటికి ఇంటర్వ్యూ?"
"భవానీ! టైమ్ చూసుకున్నాడు.
"ఇంకో అయిదు నిమిషాలకు అపాయింట్ మెంట్ ఉంది -"
"ఓకే - సీయూ-" అనేసి కెమెరామేన్ తో వెళ్ళి పోయిందామే.
అయిదు నిమిషాల తర్వాత భవానీ, అతని కెమెరా మెన్ దివ్యా సేన్ ఉన్న రూమ్ దగ్గర కెళ్ళే సరికి - బయట పోలీస్ అధికారి నిలబడి ఉన్నాడు.
"ఏం కావాలి?"
"దివ్యా సేన్ తో ఇంటర్వ్యూ ఉంది -"
"ఏ చానెల్ మీది?"
"బృందావనం -"
"అదేంటి బృందావనం చానెల్ మేడమ్ లోపల అల్ రెడీ ఇంటర్వ్యూ చేస్తోంది కదా!"
భవానీ షాకయ్యారు.
"వ్వాట్! బృందావన్ చానెల్ మేడమా? అలాంటి మేడమ్ లెవరూ లేరే మా చానెల్లో! నేనే బృందావనం చానెల్ తరపున వచ్చాను -"
"సారీ సార్ - ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు - ఆమె బయటి కొచ్చేవరకూ వెయిట్ చేయండి -"
భవానీ కర్ధమయింది -
"అదేమిటి సార్- మన చానెల్ పేరుతొ ఎవరేళ్ళారు లోపలకు?" కెమెరా మెన్ ఆశ్చర్యంగా అడిగాడు.
భవానీ మాట్లాడకుండా హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరకు పరుగెత్తాడు.
"సిస్టర్ రిమోట్ తో సంపూర్ణ చానెల్ సెలక్ట్ చేసింది.
బ్రేకింగ్ న్యూస్ కింద పెద్ద పెద్ద అక్షరాలతో వస్తోందా వార్త- ప్రముఖ మోడల్ దివ్యా సేన్ రేప్ - ఆమె బాయ్ ఫ్రెండ్, ప్రముఖ రాజకీయ నాయకుడు శరత్ రావ్ కొడుకు పార్టీ యూత్ లీడర్ విక్కీ కోసం పోలీసుల గాలింపు-
మరికాసేపట్లో దివ్యా సేన్ తో "సంపూర్ణ' చానెల్ ప్రత్యెక ఇంటర్యూ!"