Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 21

 

    భవానీ అదిరిపడ్డాడు.
    "వ్వాట్! గవర్నమెంటా?"
    "అవున్సార్! డైరెక్ట్ గా ఈ బూతు ప్రోగ్రామ్స్ ని మీకు సమర్పిస్తున్నవారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఉండదు గానీ -- గవర్నమెంట్ రన్ చేస్తున్న ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అనేది సహ సమర్పణ చేస్తోంది - సార్-"
    "ఒండర్ పుల్ నారాయణా! గ్రేట్ ఎచీవ్ మెంట్! త్వరలో పరుపుల కంపెనీ లవాళ్ళూ, సబ్బుల కంపెనీల వాళ్ళూ కూడా యెంటరవుతారు ! వాళ్ళతో కూడా టచ్ లో ఉండండి-"
    "ఒకే సార్!"
    భవానీ హుషారుగా విజిల్ వేశాడు.
    "ఏంటి సార్ ఇలా వచ్చారు?" అడిగాడు భాస్కర్.
    "మీరు వెంటనే పెన్ కెమెరాలు, సెల్ కెమెరాలు, అన్నీ తీసుకుని రోడ్ల మీద పడండి. నెక్లెస్ రోడ్ లు, పార్క్ లు, కాలేజ్ కాంపస్ లూ , మాసేజ్ పార్లర్ లూ, గవర్నమెంట్ హాస్టల్స్ స్కూళ్ళూ గవర్నమెంట్ ఆఫీస్ లు అన్నీ తిరగండి! అక్కడ జరిగే సెక్స్ రాకెట్స్ అన్నీ వీడియో తీయండి! ఒకవేళ మీకేమీ దొరక్కపోతే అలాంటి సీక్రెట్ ప్రణయ కలాపాలు ఇంకెవరయినా వీడియోలు తీస్తే ఎంత డబ్బయినా ఇచ్చి కొనండి-"
    "ఓకే - సార్-"
    రాధా చమేలీ కోపంగా వచ్చింది భవానీ రూమ్ లోకి.
    "ఏంటి? నా సీరియల్స్ అన్నీ మార్చాలన్నారంట?" అడిగింది కోపంగా.
    "అవును మరి? ఈ చానెల్ పెట్టింది మీ కోసం కాదు రాధా జీ ! పబ్లిక్ చూడాలని!"
    'సీరియల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు-"
    "వాళ్ళు ఎక్కువమందుంటే మన సీరియల్స్ రేటింగ్ -- ఇంత నికృష్టంగా ఉండదు కదా-"
    రాధా చమేలీ కీ నోటమాట రాలేదు.
    "అయితే ఇప్పుడెం చేయాలి ?"
    "ప్రతి సీరియల్లో హీరోయిన్ కి ఇద్దరుండాలి- ఒకడు మొగుడు , రెండో వాడు ప్రియుడు , అలాగే హీరో క్కూడా ఇద్దరుండాలి. ఒకతే పెళ్ళాం- ఇంకోతె గిళ్ళాం! ఇవి గాక యూత్ లవ్ ట్రయాంగిల్స్ ఉండాలి! ఆ ట్రయాంగిల్ ప్రతి పది ఎపిసోడ్ కీ లవర్స్ మారిపొతుండాలి-"
    "అలాంటి సీరియల్స్ ఎవరూ చూడరు సార్-"
    "మీకు హిందీ వచ్చా?"
    "వచ్చు -"
    "అయితే హిందీ చానెల్స్ లో సీరియల్స్ చూసి నేర్చుకో-"
    "ఇంత అర్జంటుగా మార్పులు చేయాలంటే కష్టం సార్-"
    "అయితే ఇంటి కెళ్ళిపో - నీ డ్యూటీ మీ అసిస్టెంట్ శిల్ప చేస్తుంది -"
    "అహహ -- కష్టం అంటే కొంచెం టైమ్ పడుతుంది సార్-"
    "పట్టడానికి వీల్లేదు -- ఇప్పుడే ఆ రైటర్స్ ని పిలిచి కావలసిన మార్పులు చేయించి రేపు షూటింగ్ పెట్టండి !"
    "స్టోరీలో జెర్క్ లోస్తాయేమో సార్-"
    "లేకపోతే చానెల్ కి జెర్క్ లోస్తాయ్ -- ఆ తరువాత నీకు జెర్క్ వస్తుంది -"
    "ఓకే సార్-"
    ఆమె వెళ్ళిపోయింది.
    వెంటనే విజయ్ యాదవ్ కి ఫోన్ చేశాడు భవానీ-
    "హలో అన్నా -"
    "రేపు ఎల్లుండి మా బృందావనం చానెల్లో సీరియల్స్ అన్నీ చూడు. చూశాక ఆ మర్నాడు కొంతమంది లేడీస్ ని అద్దెకు తీసుకువచ్చి మొత్తం ఒక యాభయ్ మంది ఆ సీరియల్స్ లో భారత సంస్కృతిని అవమాన పరుస్తున్నారంటూ ప్లేకార్డ్స్ పట్టుకుని ఊరేగింపుగా వచ్చి మన చానెల్ ముందు ధర్నా చేయించు. కొంతమంది గూండాలను పట్టుకొచ్చి బస్ ల మీద రాళ్ళు వేసి ట్రాఫిక్ నిలిపేయండి -- అర్ధమయిందా?"
    "చాలా ఈజీ జాబన్నా! కానీ కనీసం పాతికవేలు ఖర్చవుతాయ్-"
    "రేపే నీ ఎకౌంట్స్ లో మనీ వేయిస్తాను -- తీసుకో -"
    "ఓకే బ్రదర్ -- థాంక్యూ-"
    ఫోన్ ఆఫ్ చేసేసరికి ఎదురుగ్గా జైరాజ్ కనిపించాడు.
    "నా ఫోన్ డైలాగ్స్ విన్నారా?" డౌటుగా అడిగాడు భవానీ.
    "ఎవరిదో ఎకౌంట్స్ లో డబ్బు వేయిస్తానని చెప్పటం విన్నాను -"
    "గుడ్! వినాల్సిన డైలాగే విన్నారు! అర్జంటుగా నాకో లక్ష కొట్టండి! మూడు నెలలు తర్వాత ఇచ్చేస్తాను -"
    వెంటనే చెక్ రాసిచ్చేసాడు జైరాజ్.
    "ఇగో రాకేష్! ఒక్కమాట చెప్పు ! నిజంగా మూడు నెలల్లో మనది నెంబర్ వన్ చానెల్ ఆవుదంటావా?"
    "నాకు విజయం ముఖ్యం కాదంకుల్! విజయం కోసం ప్రయత్నించటం ముఖ్యం-"
    "ఒకవేళ ఓడిపోతే 20 కోట్లు ఏడకెళ్ళి కడతావ్? మీ నాయన్నడుగుతావా?" ఎందుకంకుల్! సత్యం రామలింగరాజు ప్రాడ్ మనీ ఎక్కడి నుంచి కడతాడో నేనూ అక్కడి నుంచే కడతా-"
    "నీ యవ్వ -- మంచిగున్నావ్ రా భాయ్- పగలబడి నవ్వుతూ అన్నాడు.
    అదేరోజు సాయింత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది.
    ఒక ఫేమస్ రాజకీయనాయకుడి కొడుకు తనను రేప్ చేశాడంటూ దివ్యాసేన్ అనే అమ్మాయి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు ఆ కేస్ రిజిస్టర్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు అధికార పార్టీ సభ్యుడు. అయితే ఆ విషయం టీవీ చానెల్ కి చెప్తానని ఆమె బెదిరించేసరికి పోలీస్ అధికారులు కంగారు పడి కేస్ రిజిస్టర్ చేశారు.
    దివ్యసేన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించారు.
    ఆ మేటర్ వెంటనే సంపూర్ణ టీవీ చానెల్ కి ఫోన్ చేసి చెప్పాడు ఏసీపీ.
    అయితే దివ్యాసేన్ - రాకేష్ గాళ్ ఫ్రెండ్ మోనికాకు స్నేహితురాలు కావడంతో -- వెంటనే రాకేష్ భవానీకి ఫోన్ చేసి ఆ రేప్ కేస్ గురించి ఇన్ ఫర్మేషన్ ఇచ్చాడు.
    మోనిక, దివ్యా సేన్ ని రిక్వస్ట్ చేసి భవానీ కోసం దివ్యాసేన్ తో ఇంటర్యూ కూడా ఏర్పాటు చేసింది.
    భవానీ హడావుడిగా తయారయి కెమెరా మేన్ తో పాటు దివ్యా సేన్ ఉన్న హాస్పిటల్ చేరుకున్నాడు.
    అలాంటి హాట్ హాట్ న్యూస్ ఏ చానెల్ ముందు టెలికాస్ట్ చేస్తే ఆ చానెల్ వ్యూయర్ షిప్ ఆకాశాన్నంటుతుందని భవానీకి తెలుసు.
    తీరా హాస్పిటల్ ఆవరణలో నెంబర్ వన్ టీవీ చానెల్ సంపూర్ణ వాన్ కనిపించే సరికి షాకయ్యాడు.

 Previous Page Next Page