Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 22


    ధారాళంగా ఉపన్యసిస్తున్నాడు. అధికారులను కామందులకీ, అవసరాలను కార్మికులకీ విడమర్చి చెప్పడంలో ఆరితేరిన దిట్ట. కామందుల అధికారులను కార్మికుల అవసరాలుగా అనువదించుడానికి అలవాటు పడ్డవాడు. సాంఘిక వాస్తవికత.
    ప్రదర్శనలు చెదిరిపోయే ముందుర దశాబ్దాలుగా చేస్తున్న ప్రసంగాలు.
    సెగీ చిన్న పొరపాటు చేస్తాడు.
    "సమ్మె వేతనం వాళ్ళ నుండి లాగడం సాధ్యపడలేదు. అయితే, అతి కష్టం మీద సగపాలు సాధించాం. తతిమ్మా సగాన్నీ అర్జించుకునే మార్గాలు లేకపోలేదు" అసమ్మతిగా ప్రజల్లోంచి హేళన.
    అల్పిష్టి సెగీ తన అల్పతంలో ఒంటరిఅయి బతిమాలుకుంటాడు " ----- మీ విషయం కాదనుకొండి. మీ విషయంలో ఓవర్ టైం చేసి గంటలను పోగు చేసుకునే ప్రసక్తి లేదు ........" అంటూ జనం ఈ మాటల్నీ లెక్క చెయ్యరు.
    బిలాంకూ వద్దంది. వీల్లెదంది. పోరాటాన్నే సాగిస్తామంది.
    ఇతర రెనో ఫ్యాక్టరీలు వద్డంటాయి. సిట్రోయెస్ వద్దంటుంది. బెర్లియే వద్దంటుంది. రోడియా సేటా వద్దంతుంది. ఎంచేత వీల్లెదంటే డబ్బు కూడా చాలదు. ఎంచేత నంటే ఫాక్టరీలు కాన్సేన్ ట్రేషన్ క్యాంపులు కాబట్టి. ఎందుకు వద్దంటే కార్మికులు తమ బలాన్ని గుర్తించారు కాబట్టి. అన్నింటికన్నా ముఖ్యంగా వారికి కావలసింది వేరు కాబట్టి.
    బిలాంకూలో వాళ్ళు పాడే పల్లవి"కార్మికుల ఐకమత్యం" అ రొదలో అతని మాటలు వినబడవు.
    పాట సెగీని మాట్లాడనీయ్యాదు. సార్జెంట్ సెగీ. పవిత్రమైన రాజీ విధానపు కర్మకాండల పెద్ద పూజారి. వీటి అర్ధం లొంగుబాట. ప్రస్తుత స్థితినీ , యధాతధ పరిస్థితినీ నగీకరించడం.
    వీల్లెందంతున్నారు వర్కర్లు. యూనియన్ల మాట వీళ్ళే ఎందుకు వినడం లేదు? ఒకటే కారణం .
    అంతులేని సంవత్సరాల తరబడిగా విప్లవం  గూర్చి (తక్కువతక్కువగా) మాట్లాడుతూ, లొంగిపోవడం గురించి (ఎక్కువ ఎక్కువగా) మాట్లాడడం వల్ల.
    కార్మికుల తీర్పును దేశం వింది.
    మధ్యాహ్న భోజన సమయం.
    పెద్ద పెద్ద భవనాలలో , పెద్ద పెద్ద భోజనాల బల్లల మీద, పనివాళ్ళు మచ్చలేని తెల్లగుద్దలు పరుస్తున్నారు.
    కార్మికులు రొట్తెల్ని చాకులతో కొస్తున్నారు.

                                                  19

    కార్మిక సంఘాలు.
    (కర పత్రాలు)
    జనరల్ (డిగోల్) సంకల్పా నెదిరించే జనరల్ ( సామూహిక ) సంకల్పం (పోస్టర్)
    కార్మికుల నిరాకరణ సోర్భాన్ కు సంబరం కలిగిస్తుంది. ఎలేక్త్రిసిటీ కామ్రేడ్లు స్పష్టంగా తమ ఆగ్రహం ప్రదర్శిస్తారు. ఫారిస్ లో మాటిమాటికీ పవరు కట్ చేస్తారు.
    అది కార్ముకుల సరశక్తి సమనితమైన ప్రచండ బాహువు. కార్మికులిప్పుడు ప్రపంచాన్ని అంధకార బంధురం కావించగలరు. సి.జి.టి. రాక్షస బల్లి ఈ క్షణం వరకు ఈర్ష్యతో దాచి వుంచిన బాహువు.
    దేశం మంత్రి పూషే రహస్యయుదాల గిడ్డంగులంటూ మాటాడుతాడు ---------బహుశా కాల్పులు జరగవచ్చని సూచిస్తాడు --- జడిపిస్తాడు. స్టూడెంట్లూ , టీచర్లూ, యువ కార్మికులు; చైతన్యవంతులయిన యావన్మంది దేవదూతలూ , వర్కర్ల అధికారం కావాలనే వారూ, భావి వ్యవస్థను కలలు కనే యావన్మంది మిలిటెంట్లూ , "వీల్లేదు" శబ్దం ఇప్పుడు సరత్రాప్రతిధ్వనిస్తోంది కాబట్టి తక్షణ వర్తమానం గురించి, చేతి కందుబాటులో ఉన్న అధ్యతన భావి గురించి మాట్లాడుకోవాలి.
    ఇప్పటి దాకా యుద్దరంగంగా వున్నా లాటిన్ కార్టర్ చాలా దూరంగా సిటీ యూనివర్శిటీ లో నిషా ర్లేటీ స్టేడియం వద్ద శత్రువు రెచ్చగొడతాడు.
    ముందుగా నిర్ణయించిన కేంద్రాల వద్ద భక్తులంతా సభలకు హాజరు కావాలని సి.పి. (కమ్యునిస్టు పార్టీ) మద్దతుతో సి.జి.టి. పిలుపిస్తుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడే తరుణమాసన్నమయిందని సేనక కిప్పుడు తెలియజేస్తారు.
    ఫారిస్ నరాలు బిగపట్టుకుంది. కామందులు తమ్ము సి.కి.టీ . దగా చేసిందని భావిస్తున్నారు. ఆఖరికి తేరా తొలగిపోయింది. సమాజపు మృతకళేబరం దిగంబరంగా పడి వుంది. (బహుశా , సరైన క్షణాన, సరైన వేగంతో , కాల్పులు జరిపిస్తేనో? అహింసా మంత్రం జపించే కమ్యునిస్టు పార్టీ జనానీకాన్ని ఉద్యా,మానికి దూరంగా ఉంచినపుడు , ఉద్యమంలో చేరడానికి వారికి వ్యవధి లేనపుడు ----- ఆ పని చేస్తే ------)
    కాని ఇది పోలీసుల తర్కం . ప్రభుత్వమూ, దాని పోలీసులూ మూర్ఖులనీ , ప్రమాదకారులనీ కామందులకు తెలుసు. ఈ విప్లవం రావడానికి ఇంతగా విజ్రుంభించడానికి ప్రభుత్వమూ, దాని పోలీసులే ప్రధాన కారణమని కామందులకు తెలుసు.
    ఇక మిగిలిందొకటె దారి. ఏమైనా వ్యవధి ఉంటే హేతుబద్ద'మైనదారి. సి.జి.టి చూపించేదారి. ఈలోగా సి.జి.టి శిధిలమై పోకుంటే.
    కాఫీ సేవించడం ముగించుకుని, ప్రేసిడెంట్లూ, జనరల్ మేనేజర్లూ, గ్రహిస్తారు కమ్యునిస్టుల రాకకు గ్రంధం సిద్దం చేయవలసిన సమయమాసన్నమయిందని.
    చాలా కాలం వేచి వున్నారు. ఇప్పుడు చక్రాలను తిరిగేటట్లు చెయ్యడంలో తమ భాగం తీసుకోవలసిన అదను వచ్చింది.
    దాని అర్ధం రష్యాతో ఒడంబడికలు కావచ్చు. పరిస్థితి అంత చెడిపోయిందా? ఈ క్లిష్ట ప్రపంచంలో చాలాసార్లు పేర్లు మారకపోలేదు. మళ్ళీ మారుతాయికూడా. మరి కమ్యునిస్టులు సబబైన మనుష్యులే . అత్యంత దూరదృష్టి గల దేవదూతలలో కొందరు షార్లెతీ కి వెళ్ళరు. కమ్యునిస్టు మీటింగుకు వెళ్తారు. స్కౌట్లు.
    భూతభవిష్యత్తుల మధ్య కాలం భారంగా వేలాడుతోంది. నమ్మశక్యం కాకుండా.
    సమ్మె కమిటీలన్నింటినీ కార్మికుల కౌన్సిళ్ళుగా మార్చడానికి ప్పుడవకాశం ఉందా?
    తక్షణమే ముఖ్యమైన రవాణాసంస్థలనీ, అత్యవసరవస్తువుల - ఫ్యాక్టరీలనీ నడపవచ్చునా? - ఈ సాయంత్రమే. ఇంట్లోనే వేచి చూస్తూ బైటికి పోకుండా ఉండిపోయిన వారి గృహాలలో అప్పుడప్పుడు దీపాలారి పోతున్నాయి.
    ప్రత్యక్ష చర్య కమిటీలు చాలినంత చురుకుధనంతో పనిచేస్తున్నాయా?
    ఐశ్వర్యం అంచున ఉన్న ఖాళీ నివాసాలను , దారిద్ర్యం అంచున ఉన్న పాడు గుడిసెల జనానికి పంచి పెట్టగలవా? వీటికి వ్యవధి కావాలి. కార్మికుల కమీటీలకు వ్యవధి కావాలి. సజీవంగా ఉండడానికి, విస్తరించడానికీ వ్యవధి కావాలి. మిత్రులు యుద్ధం పాత్ర ధారులు కాని వారి కోక ప్లాస్టిక్ నేపధ్యం ఏర్పాటు చేసింది. ప్రధానమైన దాన్ని కప్పి పుచ్చడానికి అవాస్తవికత పదేపదే చేసే పునరుద్ఘాటన.
    ఫారిస్ గోడలు చెప్పనే చెప్పాయి- " భావనాశక్తికే అధికారం!"

 Previous Page Next Page