Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 22
టాం టాం
నిన్ను
ఇంద్రుడవనీ, చంద్రుడవనీ
ఇంద్రుని సుతుడ వనీ
చంద్రుని హితుడ వని
ఇంద్రసుతుని హితుని మేనమామ వనీ
చంద్రహితుని సుతుని బావమరిది వనీ
కరి కరి భిత్
గిరి గిరి భిత్ - కబుర్లతో
కవులు పొగడడం మేం వి
న్నాం, వి
న్నాం
కాని నువ్వు
పురుగువనీ నురుగువనీ ఏమీ
ఎరుగవనీ
వొట్టి చేటపెయ్యవనీ
కొయ్యవనీ గుడ్డి గవ్వ
చెయ్యవనీ
గోడమీద నీడవనీ
చేతకాని వాడవనీ
పెద్ద లక్కబొమ్మవి వాజమ్మవనీ
మేధావద సాధారణ
గాధలు మేం నమ్మమనీ
కష్టం కావచ్చుగాని
స్పష్టంగానే మేం అం
టాం! అం
టాం.
- ప్రతిభ త్రైమాసిక సంపుటి 4 - 1940
Previous Page
Next Page