Previous Page Next Page 
అభిలాష పేజి 20

    అతడు లేచేసరికి పట్టణం అంతా అట్టుడికినట్టూ వుడికిపోతూ ఉంటు౦దనీ, ఎవరినోట విన్నా ఈ హత్య సంగతే వినపడుతుందనీ అనుకున్నాడు. ఎవరూ దీన్ని గురించి మాట్లాడకపోవటంతో కంగారుపడి సర్వోత్తమరావుకి ఫోన్ చేసేడు.
   
    "ఇంకోరోజు పోనీ, అదీ మనమంచికే " అయన అన్నాడు. "అప్పటికీ తెలియకపొతే మనమే పోలీసులకి ఫోన్ చేద్దాం..... ఆకాశరామన్నగా" నవ్వేరు.

       
    "నిన్న అర్ధరాత్రి నేను మీ ఇంటికి వచ్చినట్టు అర్చానకి వుందిలే. రేపేగా తన ప్రయాణం."
   
                       *    *    *    *
   
    సాయంత్రం అరయింది.
   
    కార్లోనే కూర్చొని _నీటిమీద పడ్తూన్న ఎర్రటి సంధ్యని చూస్తూన్నారు. ఇద్దరూ _చిరంజీవి. అర్చనా.
   
    "మళ్ళీ తిరిగి రాక ఎప్పుడు?" చిరంజీవి అడిగేడు.
   
    "మూడు నలుగు నెలలు పట్టొచ్చు. ప్లాంట్ స్టడీ వుందిగా.... అందుకుని ఇంకో నేల ఆలస్యం అయినా అవ్వొచ్చు ." అంటూ అతడిని ఏడిపించడానికి నవ్వింది. ఆ నవ్వులో నలుగు నేలలపాటూ ఒకర్నొకరు చూడకుండా వుండగలరూ? అన్న చిలిపిదానం వుంది.

    "ప్రతి మూడ్రోజులకి ఒక ఉత్తరం వ్రాయాలి" అన్నాడు చిరంజీవి.
   
    "ఇంకా పాతకాలం ముసలమ్మాలా ఉత్తరం ఏమిటి? ఫోన్ చేస్తాను. రోజు విడిచి రోజు _ఇంటర్నేషనల్ కాల్."
   
    "నాకు ఫోన్ లేదుగా"
   
    ఆమె దెబ్బతిన్నట్టూ అతడివైపు చూసింది. "ఇంకా మీదీ, నాదీ ఏమిటి_ మ ఇంటికే వచ్చేయ్యండీ. రోజూ ప్రొద్దున్నే ఎనిమిదిన్నరకి చేస్తాను. ఆ టైమ్ కి సరిగ్గా ఫోన్ దగ్గర ఉండండి."
   
    "ఏయే రోజులు?"

     
    "ఇంగ్లీషు వారంలో 'యు' వున్న రోజులు" అంటూ నవ్వింది. అతడికి అర్ధంకాలేదు. 'అంటే' అన్నాడు.
   
    "ఆదివారం స్పెల్లింగ్ ఏమిటి?"
   
    "S -U -N -D -A -Y" అన్నాడు.
   
    "అందులో 'యూ' వుందా?"
   
    "ఉంది"
   
    "సోమవారం స్పెల్లింగ్ ?"
   
    చెప్పాడు.
   
    "అందులో 'యూ' వుందా?"
   
    "లేదు."
   
    "ట్యూస్ డేలో ?"
   
    "ఉంది."
   
    "రోజు విడిచి రోజు అంటే అదే ____స్పెల్లింగ్ లో 'యూ' ఉన్న రోజు చేస్తానన్నమాట."
   
    "ప్రాన్స్ వాళ్ళు వారాలకి కొత్తపేర్లు పెట్టారు తెలుసా?"
   
    ఆమె ఆశ్చర్యపడి "ఏమిటి" అని అడిగింది.
   
    "ప్రాన్స్ వెళ్తూ  ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా?"
   
    "అబ్బా, అలా కవ్వించకపొతే  చెప్పకూడదా ఏమిటి?" అందామె ఇంగ్లీషులో.

    "సోమవారం __మూన్ డే, బుధవారం _వుడ్ నేస్ డే " అంటూ అతడు పూర్తీ చెయ్యకుండానే ఆమెకి అర్ధమయినవ్వటం పారంభీంచింది. "తెలివి తేటలున్న అబ్బాయిల్ని అమ్మాయిలూ అమ్డంకన్నా ఎక్కువగా అభిమానిస్తారు. అయితే ఎక్కడా వాటిని ప్రదర్శించకుండా అమాయకంగా కనబడ్తూ, కేవలం తమ దగ్గరే ఆ తేలితేటల్ని  చూపించే అబ్బాయిల్ని మరింత ప్రేమిస్తారు."
   
    ఆమె నవ్వటం ఆపి__ దిగాలుగా, "నాకు వెళ్ళాలనిపించటంలేదు." అంది.
   
    "నాకూ అనిపించటంలేదు." అన్నాడు.
   
    "పోనీ ప్రయాణాన్ని కాన్సిల్ చేసుకోనా, తరువాత ఇద్దరం కలసేవెళ్ళొచ్చు."  అన్నది.
   
    చోరంజీవి బోల్డెంత ఆనందంతో "అంతకన్నానా" అన్నాడు ఆరాధనా పూర్వకంగా ఆమెవైపే చూస్తూ. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చి పక్కలో బాంబు పడ్డట్టూ అదిరిపడి "వద్దొద్దు" అన్నాడు.
   
    ఆమె ఇక్కడే వుంటే, తను అరెస్టయితే చూస్తూ వూరుయ్కోలేదు. తనని ఈ కేసులోమ్చి బైటకు రావడానికి పేరు మోసిన క్రిమినల్ లాయర్ అవసరమిలేదు. ఎచేట్టుకిమ్డ ప్లీదరయినా చాలు. ఆ సుశీల గురించి వాకబుచేసి, అ ఇంటిగలావాడ్నో_దారా సింగ్ నో__ ఓబులేసునో కోర్టుకి తీసుకొస్తే _దూది ఎగిరినట్టూ కేసు ఎగిరిపోతుంది. అదికాదుగా కావాల్సింది.
   
    "మనం వెళ్దామా యిక" అన్న అర్చన మాటల్తో ఆలోచనలోంచి తేరుకున్నాడు చిరంజీవి బగా చీకటిపడ్తూంది. వెళ్దామన్నట్టూ తలూపగానే ఆమె కారు రివర్స్ చేసింది. చేస్తూంటే, "హాల్లో గురూగారూ" అన్న అరుపు వినిపించి తలతిప్పి చూసేడు. దూరంనుంచి దారా సింగ్ పరుగెత్తుకు వస్తున్నాడు.
   
    పక్కలో బాంబు పడ్డట్టూ ఉలిక్కిపడబోయి, మాటమాటికీ పక్కలో బాంబు పడ్డట్టూ ఉలిక్కిపడితే బావోదని తమాయించుకున్నాడు. దారా సింగ్ దగ్గరకొచ్చి "శవం బావుందా సార్" అని అడిగేడు.
   
    అర్చన ఈ అర్ధంలేని వాక్య నిర్మాణానికి ఆశ్యర్యపోయింది. "ఇతడు నా క్లయింట్ ఓ కేసులో వాదించాను." అని పరిచయం చేసి, అతడివైపు తిరిగి స్టయిల్ గా "ఏవోయ్ , ఎలా ఉన్నావ్" అని అడిగేడు.
   
    "మీరిచ్చిన డబ్బుతో మూడు సీసాలూ, అరుకాయలూ"అన్నాడు దారాసింగ్ అర్చానకి మరింత మతిపోయింది. కేసు వాదించిన ప్లీడరు క్లయింట్ కి డబ్బు ఇవ్వటం ఏమిటి?
   
    మరి కొద్దిసేపు అతడు అక్కడుంటే ప్రమాదమని గ్రహించిన చిరంజీవి "సర్లే వెళ్ళిరావోయ్ __ మళ్ళీ కలువు" అన్నాడు. హుందాగా_ రాజు సైనుకుడికి చెప్పినట్టూ. 
   
    "కావాలంటే ఎప్పుడైనా రండి కోరలోనే వుంటాను." అన్నాడు దారసింగ్, చక్రవర్తి సామంతరాజుని ఆదేశించినట్టు, వింటున్న అర్చన పూర్తిగా మతిపోయింది.... "కోటలో ఉందటమేమిటి?" అని అడిగింది అయోమయంగా.

 Previous Page Next Page